Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
శ్రీ రామలక్ష్మణులు సీతామాత సుగ్రీవ అంగద జావంతాదులందరూ అయోధ్య నగరమునకు చేరినారు. కులగురువు వసిష్టుల వారి నిర్ణయమైన శుభముహూర్తాన శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవము కనుల పండుగగా జరిగినది. శ్రీరాముడు అంజనాసుతుని ఆలింగనము చేసికొని.... చిరంజీవివై వర్ధిల్లు హనుమా! అని దీవించినారు. రీతిగా.... మహోన్నత శివ అంశ అంజనా కేసరి తనయుడు చిరంజీవి అయినాడు.



5. విభీషణుల వారు: శ్రీరాముల వారియందు అపరిమిత భక్తి శ్రద్ధలు, గౌరవము వున్న విభీషణునకు శ్రీరాముడు లంకా రాజ్య పట్టాభిషేకం ఘనంగా జరిపించినాడు. వీరి తల్లి కైకేసి, తండ్రి విశ్రవఋషి. లంకలో సన్మార్గులు అందరూ కడు సంతసించారు. విభీషణుడు తన రాజ్య ప్రజలను కన్న బిడ్డలవలే అభిమానించి, గౌరవించి, వారికి సర్వ సౌకర్యములను ప్రసాదించినాడు. కారణముగా శ్రీ రాముడు మహదానందంతో, విభీషణునకు చిరంజీవి వరాన్ని ప్రసాదించారు. 



6. కృపాచార్యులవారు: వీరు ఆందీరస ఋష వంశస్థులు. వీరిని తను రాజు దత్తు తీసికొన్నారు. వీరు హస్తినాపురమునకు రాజ పూజారులు. వీరి భార్య జనపది. వీరు శతానంద మహర్షి మనుమడు. వీరి సోదరి కృషి ద్రోణాచార్యుల వారి ఇల్లాలు. వీరు కౌరవపాండవులకు ఆదిగురువు. వీరు మహాజ్ఞాని. పండితుడు. మాట పట్టింపుగల గొప్ప వ్యక్తి. ద్రోణాచార్యులు వీరి బావమరిది. కౌరవ పాండవుల యుద్ధం ముగిసిన తరువాత వీరు అర్జునుని మనుమడు పరీక్షకు గురైనారు. వీరికి సామర్థ్యానికి, నీతి నియమాలకు మెచ్చి, శ్రీ కృష్ణ పరమాత్మ వీరికి చిరంజీవిగా వరమిచ్చారు.



7. అశ్వత్దామ వారు: వీరు ద్రొణాచార్యుల కుమారులు. వీరి తల్లి కృపాచార్యుల సోదరి కృషి. తండ్రి వద్ద మామ కృపాచార్యుల వద్ద అశ్వత్దామ అన్నివిద్యలూ, యుద్ధ నైపుణ్యాలను నేర్చుకొన్నారు. తపసంపన్నుడు. కురుయువరాజు రారాజు దుర్యోధనునకు గొప్ప మిత్రుడు. యుద్ధంలో కౌరవులు వారి సర్వ సైన్యం దుర్యోధన సోదరులు అందరూ చనిపోయారు. 



కక్షతో పంచ పాండవులు ఐదుగురు సంతతి ఉప పాండవులను రాత్రి సమయంలో గుడారంలో ప్రవేశించి ఐదుగురు వుప పాండవులను హతమార్చాడు. అంతేకాకుండా అభిమన్యుని ఇల్లాలు ఉత్తర గర్భమునందున్న శిశువును కూడా చంప బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. విషయాన్ని గ్రహించిన శ్రీ కృష్ణ పరమాత్మ ఉత్తర గర్భమునందున్న శిశువు (పరీక్షిత్)ను రక్షించినాడు.
 
ఆశ్వత్థామకు రక్తశిక్తమైన రణ (గాయాలు) పూరిత శరీరంలో దుర్గంధంతో కలియుగాంతం వరకు చిరంజీవిగా నరకయాతనలను అనుభవిస్తూ బ్రతకమని శపించారు శ్రీ కృష్ణ పరమాత్మ. 
 
రితిగా అనుచిత కార్యాలు చేసినందుకు శ్రీకృష్ణ శాపంతో అశ్వథామ చిరంజీవి అయినాడు.
యధార్థంగా పై ఏడుమంది ఒకరిని మించిన మహనీయులు ఒకరు. కొందరు సత్వగుణ ప్రధానులు (బలిచక్రవర్తి, వ్యాసుల వారు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యులు) కోవకు చెందినవారు. పరశురాముడు అశ్వత్థామ రజోగుణ ప్రభావితులు.



వీరందరికీ అంతటి మహత్తర శక్తులు. నైపుణ్యం, నేర్పరితనం సిద్ధించినది, వారు గురువులను గౌరవించి విద్యలను అభ్యసించిన రీతి, మనస్సున దీక్ష, పట్టుదల, పెద్దల యందున గౌరవం, ధ్యానం తపం, యోగ విద్యల సాధన వలన వారు అంతటి గొప్ప వారు కాగలిగారు. కోట్ల ప్రజానీకపు నోట కొనియాడబడ్డారు. దైవ దృష్టిలో ధర్మానికి రక్షణ, అధర్మానికి శిక్షణ ఎలాంటి వారికైనా తప్పదు మారదు. కారణం జగత్కర్త సదా నిస్పక్షపాతి ధర్మమూర్తి.



పైవారు వారి వర్తమాన కాలంలో ఇంకా ఎన్నెన్నో ఘనకార్యాలు చేశారు. చరిత్ర నాయకులై మన భారతజాతి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు.



ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో పాటించవలసినది సత్వగుణం. సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ, న్యాయం, మానవత్వం, రజోగుణ తత్వాలు రాక్షస చర్యలు. వాటికి దూరంగా వుంటూ, దైవం పట్ల విశ్వాసం, నమ్మకం, సాటివారి పట్ల ప్రేమాభిమానాలు కలిగి వర్తించినవారు ఉత్తములు. పురుషోత్తములని సాటివారి చేత పిలువబడుతారు. గౌరవించబడతారు.
*
సూచన : ప్రపంచ చరిత్రలో మన హైందవ సనాతన ఋషి పరంపర వేదాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు మానవ మనుగడ ఆదర్శప్రాయంగా సాగేదానికి మార్గ దర్శకాలు. పై సప్త మహనీయుల మూలంగా కొత మంచిని వ్రాయకలిగాను. విన్నవారు, చదివినవారు కొన్ని నిముషాలైనా మనం ఎవరం?... మన యధార్థ వునికి ఏమిటి?... ఎలా సమాజంలో నడుస్తున్నాము!... ఎలా నడుచుకోవాలి? అని ఆలోచించి ధర్మపధ వర్తనులుగా భావిలో వర్తించగలరని ఆశిస్తున్నాను. 
మన భరత వాసులంతా సఖ్యతతో ఒకటిగా వర్తించి మన భారత దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తలమాణక్యంగా ఆదర్శప్రాయంగా వెలుగొందేలా చేయడం మన అందరి కర్తవ్యం, విధి, ధర్మం.



సర్వేజనా సుగుణోభవంతు జై జై జయహో భారతావని... జయహో!!!



సమాప్తి
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - సుశ్రవస - by k3vv3 - 03-08-2025, 09:01 PM



Users browsing this thread: 1 Guest(s)