Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
లక్ష్మణుడు ఆశ్రమమున వుంటాడు. హా సీత... హా లక్ష్మణా... అనే దీన స్వరాన్ని మారీచుడు (లేడీ రూపమున వున్న) పలుకగా, సీతామాత భయంతో, లక్ష్మణుని ఆశ్రమమును విడచి, శ్రీరామరక్షణకు వెళ్ళమంటుంది. తల్లీ.... అది రాక్షస మాయ, మా అన్నయ్యను ఎవరూ ఏమీ చేయలేరు. మీరు భయపడకండి అని జవాబు చెపుతాడు లక్ష్మణుడు. మనస్సున చెడ్డ ఉద్దేశ్యంతో నీవు ఆశ్రమమును వదలిపోనంటున్నావు. అన్నారు సీతామాత. లక్ష్మణుని హృదయంలో ఆవేదన. మాత అనుమానం తీరాలంటే తాను వెళ్ళక తప్పదని లక్ష్మణ గీతను ఆశ్రమం ముంగిట గీసి తల్లీ!.... ఎటువంటి పరిస్థితిలోనూ, మీరు గీతను దాటరాదు అని చెప్పి, లక్ష్మణుడు శ్రీరాముని కోసం వెళతాడు. 
సమయమున రావణుడు జంగం దేవర వేషంలో ఆశ్రమానికి వచ్చి భవతి భిక్షాందేహి అని యాచిస్తాడు. సీతామాత వారిని చూచింది. భిక్షను తీసుకొని, లక్ష్మణ రేఖను దాటకుండా రావణునికి ఇవ్వబోయింది. దురుద్దేశపు రావణుడు దానాన్ని అంగీకరించలేదు. గీతను దాటి వచ్చి తన జోలిలో వేయమంటాడు రావణుడు. 



యాచకునకు నిరాశ, అసంతృప్తి కలిగకూడదని మాత లక్ష్మణ రేఖను దాటుతుంది. వెంటనే రావణుడు సీతామాతను తన పుష్పక విమానాన్ని ఎక్కించి, లంకకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆశ్రమమునకు తిరిగి వచ్చిన శ్రీరామ లక్ష్మణులకు మాత కనిపించలేదు. నలువైపులా వెదికారు. కానీ... ప్రయోజనం శూన్యం విచారవదనంతో రామలక్ష్మణ సీతామాత అన్వేషణను అడవిలో ప్రారంభించారు. 



తరుణంలో శ్రీ హనుమంతుడు వారిని కలిశాడు. వారు, వారి దీన స్థితిని వాయునందనునికి తెలియజేశారు. హనుమ వారిని తన రాజైన సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్ళి పరిచయం చేశారు. సుగ్రీవుడు తన దుస్థితిని రాముల వారికి తెలియజేశాడు. వాలి, సుగ్రీవుల రూపురేఖలు ఒకేరీతిగా వుంటాయి. అన్యాయమార్గ వర్తనుడు అహంకారి అయిన వాలిని వధించి సుగ్రీవునకు పట్టాభిషేకం జరపాలని శ్రీరాముడు నిర్ణయించారు. సుగ్రీవుని సందేశంగా వాలిని ద్వంద యుద్ధానికి రావలెనని సందేశం పంపారు. 



వాలి యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడు. ఇరువురూ ఒకే పోలిక యున్నందువలన శ్రీరాముల వారు సుగ్రీవుని కంఠమునందు తామర పూలమాలను వేసి యుద్ధానికి దింపారు. వాలి రావణుడి కన్నా మహా బలశాలి. అతని ధాటికి సుగ్రీవుడు హడలిపోసాగాడు. వాలిని సుగ్రీవుడు గెలవలేడని గ్రహించిన శ్రీరాముడు తన బాణంతో వాలిని సంహరించాడు. సుగ్రివుడు రాజైనాడు. 



సీతామాత అన్వేషణకు వానర ప్రముఖులను సుగ్రీవుడు అష్టదిక్కులకు తనవారిని పంపినాడు. ఆగ్నేయమూలకు శ్రీ ఆంజనేయుడు వెడలినాడు. లంకా రాక్షసిని చంపి లంకలో ప్రవేశించి అశోకవనమున సీతామాతను సందర్శించినారు. శ్రీరాములు ఇచ్చిన అంగిళీయకమును మాతకు చూపించి తాను శ్రీరామ దూతననే గుర్తింపును పొంది మాతను ఓదార్చి త్వరలో మా వానర సమూహం శ్రీరామ లక్ష్మణ సమేతంగా లంకకు వచ్చి, రావణుని వధించి మిమ్ములను తీసుకొని పోయెదమని సీతామాతను ఓదార్చినాడు. 



అశోకవనమును ధ్వంసం చేసి, రావణ వన రక్షకులను చంపి, ఇంద్రజిత్ (రావణ కుమారుడు) బ్రహ్మస్త్రమున వారికి బంధీగా దొరికి రావణుని దర్బారున ప్రవేశించినారు. దూతకు ఆసనమును ఏర్పాటుచేయలేదు రావణుడు. అతన్ని పరుష భాషణలతో అవమానించాడు. 



హనుమంతులవారు వాలమును కాయమును పెంచి, వాలమును ఎత్తైన (రావణుని ఆసనము కన్న) ఆసనముగా అమర్చి దానిపై కూర్చొని శ్రీరామ సందేశాన్ని రావణునకు వినిపించాడు వాయునందన. ఆగ్రహావేశాలతో రావణుడు వానరవాలమునకు గుడ్డలు చుట్టి రసాయనాన్ని పోసి వాలమునకు నిప్పును అంటింపచేశాడు రావణుడు. అగ్ని శిఖలు చెలరేగుతున్న వాలముతో పవతనయులు లంకానగర సౌధములన్నింటికీ నిప్పును అంటించాడు. లంకానగరం అగ్ని జ్వాలలకు ఆహుతి అయినది. 



వాలమును సాగరమున ముంచి అగ్నిని చల్లార్చుకొని, సీతా మాతను కలిసి ఆమె ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా తీసుకొని శ్రీరాముల సన్నిధికి తిరిగివచ్చి, మాతను చూచితిని, మాట్లాడితిని. తల్లి క్షేమం. ఇదిగో మాత ఇచ్చిన ఆనవాలు, అని చూడామణిని (తలలో ధరించు బంగారు ఆభరణము) శ్రీరాముల వారి చేతికి అందించినాడు హనుమంతుడు. సాగరముపై రాళ్ళపై శ్రీరామ నామమును వ్రాసి విసరగా అవి నీటిపై తేలి వారధి/ సేతువుగా వెలసెను. వానర సైన్యంతో సుగ్రీవ అంగద జాంబవంత హనుమంతులతో శ్రీ రామలక్ష్మణులు లంకకు చేరి, రావణ పరివారమును అంతం చేశాడు. 



రావణుని సోదరుడు సద్గుణ సంపన్నుడు విభీషణుడు, రావణునకు హిత వచనములను చెప్పి, సీతామాతను శ్రీరాములకు అప్పగించమని వేడెను. అహంకారి దుర్మార్గుడు అయిన రావణుడు, సోదరిని వచనములను పెడచెవిన పెట్టి విభీషణుని దుర్భాషలాడినాడు. ఫలితముగా సుగ్రీవుడు లంకను, రావణుని వదలి శ్రీరాముల వారిని కలిసి శరణు వేడినాడు. శ్రీరాములు అతనికి అభయమిచ్చినాడు. వారు శ్రీరాముల వారికి రావణ ప్రాణ రహస్యను తెలిపినాడు. భయంకరంగా రామ రావణ యుద్దం జరిగినది. లక్ష్మణుడు మూర్ఛ చెందినాడు. 



శ్రీ హనుమంతుడు హిమాలయ పర్వతమునకు ఏగి మృత సంజీవిని తెచ్చి లక్ష్మణుని కాపాడినాడు. యుద్ధములో రావణుని సోదరులు, సుతులు అందరూ మరణించినారు. చివరగా పది తలల రావణుడు రామబాణానికి హతుడైనాడు. పరవాని పంచన వుండిన సీతామాతకు రాముడు అగ్ని పరీక్ష పెట్టినాడు. మాత పరీక్ష యందు నెగ్గి అగ్ని పునీతగా నిలిచినది. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - సుశ్రవస - by k3vv3 - 03-08-2025, 09:00 PM



Users browsing this thread: 1 Guest(s)