Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
3. పరశురాముడు: శ్రీ మహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది. త్రేత్రాయుగ ఆరంభంలో జరిగినది. మహావీరుడు. పరశురాముని తండ్రి జమదగ్ని, తల్లి రేణుకాదేవి. వీరికి నలుగురు మగపిల్లలు. చివరివాడు పరశురాముడు. అసాధారణమైన బలపరాక్రమశాలి. వీరి చరిత్ర చాలా విచిత్రమైనది. వీరి తాతగారు ఋచీకుడు, ఋషి. వారు గాధి రాజు వద్దకు వెళ్ళి రాజకుమారి సత్యవతిని తనకు ఇచ్చి వివాహం చేయమని కోరినారు. 



సత్యవతిదేవి గాధి మహారాజు ఏకైక పుత్రిక. ఆమె వివాహమును గాధి మహారాజు సర్వశక్తి సంపన్నుడైన మునిబిడ్డ రుచికునికి ఇచ్చి వివాహమును జరిపించెను. సత్యవతి తాను క్షత్రియకుల కాంత కావున, తనకు జన్మించే సంతానం కూడా క్షత్రియ బుద్ధులతో పుడతాడు. అది ముని అయిన తన భర్త వంశమునకు కీడు అని భావించి, రుచికునికి తనకు కేవలం సాత్విక గుణములు కలిగిన బిడ్డ కావలయునని విన్నవించెను. 



అలాగే, మగ సంతానములేని తన తల్లితండ్రులకు క్షత్రియ గుణములు కలిగిన బిడ్డను ప్రసాదించమని కోరెను. సత్యవతి కోరిక మేరకు, అత్తకు..... భార్యకు సంతతిని ఇవ్వదలచి రుచికుడు, యాగము చేసి రెండు కుండల్లో పరమాన్నమును నింపి, ఒకటి అత్తగారికి మరొకటి భార్యకు ఇచ్చి, ఎవరిది వారు భుజించవలయునని చెప్పెను. 



రుచికుడి ఉద్దేశ్యము, క్షత్రియకుల సతి అయిన గాధిరాజు భార్యకు (అత్తగారికి) క్షత్రియు గుణములు కల బిడ్డను, ముని భార్య అయిన సత్యవతికి సాత్విక గుణములు ఉండు ముని బాలుడు పుట్టవలెననే ఉద్దేశ్యము. కానీ... అల్లుడు రుచికుడి పైన అనుమానము కలిగిన సత్యవతి తల్లి, తనకు మంచిబిడ్డ పుట్టవలయునను ఉద్దేశ్యంతో, మునిరాజు తన భార్య కుండలో ఏవైనా గొప్ప శక్తులు నింపాడేమో అనుకొని, స్వార్థముతో సత్యవతికి ఇచ్చిన కుండలోని క్షీరాన్నమును తాను భుజించి, తనకు ఇచ్చిన కుండను సత్యవతికి ఇచ్చెను. 



అవి భుజించిన వారి గర్భములలో మారు బిడ్డలు పెరుగుచుండిరి. విషయమును గ్రహించిన రుచికుడు తన భార్యకు తాను మారు శిశువును మోయుచున్నట్లు చెప్పెను. అందుకు సత్యవతి భయంతో బిడ్డను తన కుటుంబ తరువాతి తరమునకు చెందిన తన కోడలి గర్భమునకు మార్చమని, రుచికుడిని కోరెను. 



రుచికుడు ఆమె కోరికను మన్నించి ఆమె ఆశయమును నెరవేర్చెను. అత్తకు, భార్యకు కూడా సాత్విక తత్వ సంతానములు కలిగిరి. గాధి తన బిడ్డకు విశ్వామిత్రుడు అని నామకరణము చేసెను. సత్యవతి తన బిడ్డకు జమదగ్ని అని నామకరణము చేసినది. ముని బిడ్డ జమదగ్ని క్రోద దేవతల ఆశీర్వాదంతో తనకు కోపము కలిగించిన వారిని తన క్రోదాగ్ని జ్వాలలతో భస్మము చేయగల శక్తి పొందెను. 



పరశురాముని తండ్రి జమదగ్ని, తల్లి రేణుకాదేవి. తోబుట్టువులు సుమస్వాన్, సుహోత్ర, వాసు, విశ్వవసు, భార్య ధరణ (లక్ష్మి). వీరికి పరమశివుడు, నేరస్థులను, చెడుగా ప్రవర్తించే వ్యక్తులను, తీవ్రవాదులను, రాక్షసులను మరియు గర్వంతో విర్రవీగుతున్న అంధుల బారినుండి భూమాతను విడిపించమని వారికి సలహా ఇచ్చాడు. 



వీరు వర్గీయులపై ఇరవై ఒక్కసార్లు (కొన్ని వంశములను విడిచి) నాశనం చేయడం ద్వారా విశ్వ సమతుల్యాన్ని సరిదిద్దారు. అతి పరాక్రమశాలి వీరుడు. ధీరుడు ధైర్యశాలి పిత్రువాక్య పరిపాలకుడు.



ఒకనాడు తల్లి రేణుకాదేవి గంగానదికి నీటికోసం వెళ్ళగా అక్కడ జలకాలాడుతున్న గంధర్వ కన్యలను చూచి పరవశంతో వర్తమానాన్ని మరచిపోయినది. ఎంతకూ తిరిగి ఇంటికిరాని ఇల్లాలిపై ఆగ్రహించి, తండ్రి జమదగ్ని, పరశురామునితో నీ తల్లి తల నరికి తెమ్ము అని ఆజ్ఞాపించెను. సత్వరము పరశురాముడు తల్లి వున్న స్థలమునకు ఏగి, తల్లి తలను నరికి తెచ్చి తండ్రికి సమర్పించెను. 



అంతటి కఠోర సంకల్పుడు పరశురాముడు. వీరు భీష్ములు. ద్రోణుడు, రుక్మి మరియు కర్ణులకు గురువు. వారు సమాజంలోని బ్రాహ్మణులు, పిల్లలు, మహిళలు, వృద్ధులు, ఇతర బలహీనవర్గాల పట్ల తన దయా దాక్షిణ్యాలను చూపారు. శ్రీ మహావిష్ణువు వరంతో చిరంజీవి అయినారు.
4. హనుమంతుల వారు:- వీరి తల్లి అంజన, తండ్రి కేసరి. వీరికి మరొక పేర్లు భజరంగబలి మరియు పవనసుత. వీరు అంజనాదేవుకి వాయువు వర ప్రసాదం. మహాజ్ఞానం, బలం, ధైర్యం, భక్తి మరియు స్వీయ క్రమశిక్షణ కలిగిన మహోన్నతులు, ఋష్యమూకాద్రి పర్వతరాజైన వాలి కొలువులోన వుండేవారు. 



అభిప్రాయభేదముల వలన వాలి తన సోదరుడైన సుగ్రీవుని, రాజ్యం నుంచి తరిమేశాడు. తరుణంలో ఆంజనేయులు ధర్మ మార్గవర్తి.... సుగ్రీవునకు అండగా వర్గంలో వుంటాడు. వీరి గురువులు సూర్యుడు, రావణుడు, అరణ్య వాసమునందు వున్న సీతామాత యొక్క అందాన్ని గురించి తన సోదరి శూర్పణక చెప్పిన మాటలు విని, రావణుడు మారిచుని మాయ బంగారు లేడి రూపంలో రామాశ్రమునకు పంపగా సీతామాత లేడి తనకు కావలెనని శ్రీరాముని కోరగా, రాముడు మాయా లేడిని పట్టుకొనుటకు వెళతాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - సుశ్రవస - by k3vv3 - 03-08-2025, 08:59 PM



Users browsing this thread: 1 Guest(s)