Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
సుశ్రవస
[Image: image-2025-07-30-121618171.png]

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



సునంద సార్వ భౌముల కుమారుడు జయత్సేనుడు. సునంద తన భర్త సార్వ భౌముని మనస్తత్వం ముందుగా తెలుసుకోలేక పోయినా, కాలం గడుస్తున్న కొద్దీ భర్త మనస్తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుంది. తన భర్తలో తనే సార్వ భౌముడుని అనే గర్వం కించిత్ కూడా లేదని గమనించింది. భర్త నిరాడంబర జీవితాన్ని చూసి తను చాలా అదృష్ట వంతురాలను అని అనుకుంది. శాంతి యుతమైన తన భర్త ప్రజా పరిపాలన ను చూసి సునంద మిక్కిలి సంతోషించింది. 



 సునంద సార్వ భౌములు ఇరువురు కలిసి తమకు పుట్టిన బిడ్డకు జయత్సేనుడు అని పేరు పెట్టారు. వారి కుల గురువు వశిష్ట మహర్షి కూడా జయత్సేనుని నామకరణ విషయం లో సునంద కే అధిక ప్రాధాన్యత ను ఇచ్చాడు. కుల గురువు వశిష్ట మహర్షి తనకిచ్చే ప్రాధాన్యతను కళ్ళార చూసే సునంద, తన జన్మకు సార్థకత లభించిందని మహదానంద పడింది. 



 జయత్సేనుడు, తల్లి సునంద ఆలనాపాలనలో అల్లారు ముద్దుగా పెరిగాడు. వయస్సు లో నేర్చు కోవలసిన విద్యలను వయస్సులో క్షుణ్ణంగా నేర్చు కున్నాడు. ఉత్తమ పురుషుడు గా ఎదిగాడు. మాతృ దేవోభవ అన్న ధర్మాన్ని మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా అనుసరించాడు. కుల గురువు వశిష్ట మహర్షి దగ్గర సమస్త వేద పురాణేతిహాస విద్యలను అభ్యసించాడు. తండ్రి సార్వ భౌముని దగ్గర యుద్ద విద్యలన్నిటిని నేర్చాడు. 



 సార్వ భౌముడు తన సామంత రాజులందరి వద్దకు జయత్సేనుని పంపాడు. వారి వారి దగ్గర ఉన్న ప్రత్యేక సమర విద్యలన్నిటిని కుమారునికి నేర్పించాడు. 



చిన్నా పెద్దా అనే తేడా లేకుండా జయత్సేనుడు నానా విధాల సమర విద్యల నిమిత్తం ప్రత్యేక సమర విద్యా నైపుణ్యం కల వారందరి వద్ద శిష్యరికం చేసాడు. 



 జయత్సేనుని వినయ విధేయతలను చూసిన సామంత రాజులు, యోధులు తదితరులందరు మహా మురిసి పోయారు. తలిదండ్రులకు తగిన బిడ్డ జయత్సేనుడు అని అనుకున్నారు.



 "ఇంద్రుని అంశలో నాలుగవ వంతు అంశ మంచి మహా రాజులో ఉంటుంది. మన జయత్సేనుని లో ఇంద్రుని అంశలో నాలుగవ అంశ మించి ఉంది. జయత్సేనుడు కారణ జన్ముడయిన మహారాజు "అని అందరూ అనుకున్నారు. 



 విదర్బ రాజ తనయ సుశ్రవస అందచందాల లోనూ, వినయ విధేయతలలోనూ, ఉన్నత విద్యల లోనూ ఆనాటి రాజ వంశాల యువరాణులలో మిన్న అన్న విషయం జయత్సేనుని చెవిన పడింది. ముఖ్యంగా యుగధర్మం బాగా తెలిసిన మహిళ సుశ్రవస అని జయత్సేనుడు తన గూఢచారుల ద్వారా సుశ్రవస గురించి తెలుసుకున్నాడు. 



జయత్సేనుడు సుశ్రవస యుగ ధర్మ నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి మారు వేషంలో విదర్భ రాజ్యానికి వెళ్ళాలి అనుకున్నాడు. కుల గురువు వశిష్ట మహర్షి కి, తలిదండ్రులకు తన మనసులోని మాటను చెప్పాడు.
 
"యుగ ధర్మ దేవత భూమి మీద ఆవిర్భవిస్తే, ఎలా ఉంటుందో సుశ్రవస అలా ఉంటుందని అందరూ అంటారు. సుర నర కిన్నెరాదులు కూడా అదే మాట అంటారు. అందుకే నీ చిత్ర పటాన్ని విదర్భ రాజు కు పంపాను. సుశ్రవసకు చూపించి ఆమె మనోభిప్రాయం కనుగొనమన్నాను" అని కుల గురువు వశిష్ట మహర్షి జయత్సేనుడితో అన్నాడు. 



"అన్నీ మంచి శకునములే " అని జయత్సేనుడు మనసులో అనుకున్నాడు. 



సుశ్రవస- మునులు, ఋషులు, మహర్షులు, రాజర్షులు మహానుభావులందరి ఆశీర్వాదాలను తీసుకుంది. అనంతరం చెలికత్తెలందరితో కలిసి ప్రజల దగ్గరకు వెళ్ళింది. యుగ ధర్మాన్ని అనుసరించవలసిన రీతిని వారికి తెలియచేసింది. సత్తెకాలపు మనుషులను చైతన్య పరిచింది. కలికాలపు మనుషుల కర్కశత్వాన్ని కాలరాసింది. యుగ ధర్మ జీవన విధానం లోని ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందరికీ తెలియ చేసింది. 



యుగ ధర్మాన్ని మనం అనుసరిస్తే, యుగ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పింది. 



 సుశ్రవస 26 కలి పురుషుని లక్షణాలను ప్రజలకు తెలియ చేసింది. కలి యుగం లో మానవుడు ఆలోచించే రీతిని తెలియచేసింది. కలియుగంలో తలిదండ్రులు బిడ్డలను ఎంత నిర్లక్ష్యంగా పెంచుతారో తెలియచేసింది. అలాగే బిడ్డలు తలిదండ్రులను ఎంత కౄరంగా శిక్షిస్తారో తెలియ చేసింది. 



కలియుగం లో మనిషి ఆలోచనలు, ఆశలు ఎలా శృతిమించి ఆకాశాన్ని అంటుతాయో తెలియచేసింది. కలి యుగం వచ్చే సరికి భౌగోళిక సంపద ఎలా తరిగిపోతుందో జనభా సమస్య ఎలా చెలరేగి పోతుందో తెలియ చేసింది. ప్రకృతి ఎంత కాలుష్యమైపోతుందో తెలియ చేసింది. 



సుశ్రవస 26 కలి యుగం లో జరిగిన అనేకమంది వృత్తాంతాల మాటున ఉన్న రాక్షసత్వాన్ని మించిన కౄరత్వాన్ని ప్రజలకు తెలియ చేసింది. 



 సుశ్రవస ప్రజలకు బోధించే విషయాలను మారు వేషంలో ఉన్న జయత్సేనుడు విన్నాడు.. మనసుకు హత్తుకునేటట్లు ఆమె చెప్పే మాటలను విన్నాడు. 



సుశ్రవస చెప్పే కలి పురుష లక్షణాలు జయత్సేనుని మనసును బాగా ఆకర్షించాయి. యుగ ధర్మం ప్రకారం నడుచుకునే మానవుడే మాధవుడు అవుతాడు అని అనుకున్నాడు. అన్ని ధర్మాల కన్నా యుగ ధర్మం మిన్న అని అనుకున్నాడు. అదే సమయంలో కలి పురుషుడు సుశ్రవసను చూసాడు. సుశ్రవసను తన స్వంతం చేసుకుంటే మిగతా మూడు యుగాల ముక్కు పిండి కదిలే కాల చక్రం లో తను ముందుగానే ప్రవేశించ వచ్చును అనుకున్నాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - సునంద - by k3vv3 - 30-07-2025, 04:50 PM



Users browsing this thread: 1 Guest(s)