28-07-2025, 04:22 PM
(This post was last modified: 28-07-2025, 04:23 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
అప్పు తీర్చిన అప్పారావు! - పద్మావతి దివాకర్ల
![[Image: image-2025-07-28-114950582.png]](https://i.ibb.co/g1zBRqd/image-2025-07-28-114950582.png)
"అప్పారావ్! అప్పు తీర్చుతానని చెప్పి నాలుగేళ్ళనుండి మమ్మల్నందర్నీ నీ వెంట తిప్పుతున్నావు. ఇంకెన్నాళ్ళు తిప్పుతావయ్యా?" శంకర్రావు గట్టిగా అడిగాడు.
"అలాగే నా నాలుగేళ్ళ ఇంటి అద్దె బాకీ కూడా ఎప్పుడు తీరుస్తావు అప్పారావూ?" అడిగాడు ఇంటి ఓనర్ పురుషోత్తం అప్పారావుని నిలదీస్తూ.
"నా వద్ద తీసుకున్న సరుకల బాకీ సంగతో?" అన్నాడు రామేశం.
"మరి నా హొటల్‌లో పద్దు మాటేమిటి?" కడిగేయసాగాడు కామేశం.
అప్పారావుని ముప్పేట దాడి చేయసాగారు అతనికి అప్పులిచ్చినవాళ్ళు. అప్పారావు ఇంటిముందు గుమిగూడిన అప్పులాళ్ళందరూ అప్పారావుని ఇలా స్త్రోత్ర పాఠాలతో ముంచెత్తసాగారు.
వాతావరణ హెచ్చరిక లేకుండా వచ్చిన సునామిలాగా అప్పులాళ్ళందరూ అప్పారావుని చుట్టుముట్టినా కొంచెంకూడా బెదరకుండా నిమ్మకు నీరెత్తినట్లు నిలబడ్డాడు అప్పారావు. అతని సంగతి అందరికీ తెలిసిందే కదా మరి! ఎప్పుడూ ఏదో సాకు చెప్పి అప్పటికప్పుడు తప్పించుకోవడం అతనికి అప్పుతో పుట్టిన విద్య మరి!
“అసలు అప్పు తీసుకోవడమే కానీ తీర్చడం ఎప్పుడైనా చేసావా ఏమిటి? అసలు అప్పుతీర్చడం నీ చరిత్రలోనే లేదే? ఈ సారి తాడో పేడో తేల్చుకోవాలి. నీతో ఇలా కాదు, ఈసారి కోర్ట్‌కి వెళ్ళాల్సిందే, మరి తప్పేట్టు లేదు." అన్నాడు బాగా మండిన సుందర్రావు.
"ఉరుకోరా నాయనా! అప్పారావుతో తగువు పెట్టుకోకు, అసలుకే మోసం వస్తుంది చూసుకో!" అంటూ వెనక్కు లాగేడు కామేశం.
సుందర్రావు మాటలు చెవికెక్కించుకున్న అప్పారావు, "ఏమిటి తొందర్రావూ! సారీ, సుందర్రావూ, నిజం చెప్పు, గుండెలమీద చెయ్యేసి మరీ చెప్పు? నేనెప్పుడూ అప్పు తీర్చలేదా? నాలుగేళ్ళ కిందటి సంగతి గుర్తు లేదా ఏంటి??" అన్నాడు.
అప్పుడు అందరికీ సినిమా రీళ్లలాగ నాలుగేళ్ళ క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. అప్పుడూ ఇలాగే అప్పారావు అందరి అప్పు తీరుస్తానని తన ఇంటికి పిలిపించుకున్నాడు. 'అప్పారావేంటి అప్పుతీర్చడమేమిటి? మన భ్రమ కాకపోతే?' అనుకుంటూనే అప్పారావు ఇంటిముందు గుమిగూడారు. అయితే అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేస్తూ, ఆ రోజు అందరూ తెల్లబోయేలా అప్పారావు తన బ్రీఫ్ కేస్ తెరిచి అందరికి వాళ్ళ వాళ్ళ అప్పులు తీర్చాడు. అది కలో, వైష్ణవ మాయో అర్ధం కాలేదు అప్పులాళ్ళందరికీ.
అయితే, అప్పు తీర్చే ముందు అప్పారావు అందరివద్దనుండి లిఖితమైన హామీ తీసుకున్నాడు. అదేమిటంటే, మళ్ళీ ఎప్పుడైనా తనకి అప్పు కావలసి వస్తే మాత్రం తప్పకుండా అప్పు ఇచ్చేట్లు పత్రం రాయించుకున్నాడు. ఏమైతే అయింది, ముందు పాత బాకీ వసూలైతే చాలని, అందరూ కళ్ళు మూసుకొని హామీ పత్రం మీద సంతకం చేసి వాళ్ళవాళ్ళ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత తెలిసిందేమిటంటే, అవన్నీ ఆ రోజే ప్రభుత్వం ద్వారా రద్దైన వెయ్యి, అయిదువందల రూపాయల నోట్లు. అప్పారావుకి ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేక, మరేం చేయలేక, ఆ నోట్లు పట్టుకొని నెలల తరబడి బ్యాంక్ వద్ద క్యూలో నిలబడి మార్చుకున్నారు పాపం. ఆ దృశ్యాలన్నీ కళ్ళముందు మెదిలి అందరికీ ఆ నవంబర్ నెల చలిలో కూడా చెమట్లు పట్టాయి.
అందరికన్న ముకుందరావే ముందుగా తేరుకున్నాడు.
"గుర్తులేకపోవడమేమిటి? భేషుగ్గా గుర్తుంది! తీర్చకతీర్చక అప్పు పెద్ద నోట్ల రద్దు సమయంలో తీర్చావు. అన్నీ రద్దైన ఐదువందలు, వెయ్యరూపాయల నోట్లు ఇచ్చావు మరి. పోనీ అప్పు వసులైందే చాలని అవి పుచ్చుకొని చచ్చేము. ఆ నోట్లు మార్చుకోవడానికి బ్యాంక్‌క్యూలో ఇంటిల్లపాదీ నెలలతరబడి నిలబడ్డాము. బ్యాంక్‌ఖాతాలో జమ చేసినందుకు ఆదాయపు పన్ను శాఖ అధికార్లనుండి శ్రీముఖాలు కూడా అందాయి. వాళ్ళబారినుండి తప్పించుకొనేసరికి మా తలప్రాణం తోకకొచ్చింది. మా బుద్ధి గడ్డితిని మళ్ళీ నీకు అప్పు ఇచ్చేం!" అన్నాడు అప్పటివరకు నోరు విప్పని ముకుందరావు ఆ పాత దృశ్యాలు గుర్తుకుతెచ్చుకొని బెంబేలెత్తిపోతూ.
"మరి గుర్తుందికదా! ఏమైతేనేమి అప్పు తీర్చానా లేదా అన్నదే పాయింట్! మరి నాకు మాటిచ్చినట్లు మళ్ళీ అప్పు ఇస్తిరే! ఈ సారి కూడా నేను కచ్చితంగా అప్పు తీర్చబోతున్నాను. సరిగ్గా వినండి. వచ్చే నెల ఎనిమిదో తారీఖున మీ అందరి అప్పు తీర్చడానికి మంచి ముహూర్తం నిశ్చయించాను. ఆ రోజు అందరూ కట్ట కట్టుకొని రండి. మీ అందరి బాకీ అణాపైసలతో సహా చెల్లించకపోతే అప్పుడు నన్నడగండి." అన్నాడు అప్పారావు జంకు గొంకు లేకుండా.
అంత నిబ్బరంగా అప్పారావు మాట ఇచ్చేసరికి అక్కడ గుమిగూడిన అప్పులాళ్ళందరూ ఖంగు తిన్నారు. కొందరికి నిజంగానే మతులు పోయినై!
'కొంపతీసి మళ్ళీ పెద్దనోట్లు రద్దుగానీ ప్రభుత్వం ప్రకటించలేదు కదా. అసలే ఇంట్లో వాళ్ళు ఎడతెరిపిలేకుండా సీరియల్సు చూడటంవల్ల మనకి వార్తలు కూడా వినడానికి వీలు కావడం లేదుకదా!' స్వగతంగా కామేశం అనుకున్నా పైకి వినబడనే వినబడింది.
అయితే అందరికీ ఈ అనుమానమే కలిగింది కూడా. అయితే ఇవాళ అలాంటి వార్తేమీ లేదే! ఏమో ఈ ఎనిమిదో తారీఖన మళ్ళీ పెద్ద నోట్లు రద్దవుతాయేమో? అప్పుడప్పుడు పనీపాటా లేనివాళ్ళు సామాజిక మాధ్యమాల్లో పుకార్లు లేవదీస్తున్నారు కదామరి అవి నిజమవుతాయేమో? కొంపదీసి మన అప్పారావుకి దివ్యదృష్టి గానీ ఉందేమో? ఇలా పరిపరి విధాల పోయాయి వారివారి ఆలోచనలు.
అయితే నోరు మెదపడానికి జంకారందరూ. 'ఏమో ఎవరు చెప్పొచ్చారు, తము నిత్యం మొక్కే ముక్కొటి దేవతల్లో ఏ దేముడో మన అప్పారావుకి సద్బుద్ధి గానీ ప్రసాదించారేమో?' అనుకున్నాడు రామేశం. అక్కడున్న వాళ్ళందరూ ఇంచుమించు అలాగే అనుకున్నారు మనసులో.
అందరూ నిశ్శబ్దంగా ఉండటం చూసి, "మౌనం పూర్ణ అంగీకారమంటారు కదా! అందరూ క్షేమంగా వెళ్ళి వచ్చే నెల ఎనిమిదో తారీఖకల్లా వచ్చేయండి. మీమీ బాకీలు ఆ రోజు వసూలు చేద్దురుగాని." అన్నాడు అప్పారావు.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ