Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
ఇల్లు మారిపొమ్మన్నాడు. నాకు మనసు శాంతిగా ఉండటం లేదంటే నిత్యం ఆచరించుకునే చిన్న చిన్న చిట్కాలు, పూజలు చెప్పాడు. క్రమక్రమంగా అతను నా జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయాడు. మొదట్లో ఒకసారి అడిగినప్పుడు చెప్పాను. 



నీతో షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్ మాత్రమే చేస్తానని, కానీ లాంగ్ టర్మ్ చేయాలనిపిస్తుంది. నాకు అతని మీద ధైర్యం వచ్చింది. నా సెల్ నంబరు చెప్పి కాల్ చేయమన్నాను. అతను కాల్ చేసాడు. 



మాటలు కలిశాక అతని మీద ఇంకా గురి ఏర్పడింది. మెల్ల మెల్లగా నా విషయాలు ఒక్కొక్కటీ చెప్పడం మొదలు పెట్టాను. 



'నా దాంపత్య జీవితం సరిగా లేదని, నీతో పిల్లల్ని కని, వాళ్ళని చూసుకుంటూ, పెంచుకుంటూ నా జీవితాన్ని కొనసాగిస్తానని', దయచేసి ఏమీ అనుకోకుండా అతని అభిప్రాయం చెప్పమని, అడిగాను. 



అతను నిర్ఘాంతపోయాడు. 



ఇన్ని రోజులు సెర్చింగ్ దేనికో అర్ధమైంది అతనికి. నాతో ఎలా చెప్పాలో కన్ఫ్యూజ్ అయినట్టుంది. 
 చాలా దీర్ఘంగా, దానివల్ల సమస్యలు, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కొక్కటీ వివరణగా చెబుతూ జీవితాన్ని ఎలా మలచుకోవాలో నాకు నూరిపోసాడు. 



అప్పటివరకూ ఇలాంటి ఆలోచన్లతో ఉన్న నాలో క్రమేపి మార్పు కనిపించి ఎలా లైఫ్ ని తీర్చిదిద్దుకోవాలో తెలియడం మొదలైంది. 



"అయితే నేను జాగ్రత్తగా ఉంటాను. నాకు జీవితకాలం స్నేహితుడుగా నువ్వుండి పొగలవా! ?" అని అడిగాను. 



"నీలో మార్పు రావడం వరకే నా అవసరం నీకుంటుంది. తరువాత నేను కనుమరుగైపోతాను"అనేవాడు.   ఒకరోజు మా అత్తగారి పోరు, ఇంట్లో గొడవలు అన్నీ ఎక్కువై నాకు చనిపోవాలనిపించింది. మధ్యాహ్నం రెండింటికి ముహూర్తం పెట్టుకున్నాను. 



అతన్ని కాల్ చేయవద్దని చెప్పాను. మెయిల్స్ రాయవద్దని మెసేజ్ ఇచ్చాను. 



అతన్నుండి స్ట్రాంగ్ మెయిల్ వచ్చింది. ఎందుకు బ్రతకాలో, ఎందుకు చావకూడదో విపులంగా, స్ఫూర్తిదాయకంగా ఉందది. 



లాస్టులో"నా నంబరు నాది కాదు, అది వైజాగ్ రైల్వే స్టేషన్లో దొరికిన సిమ్. దాన్ని రీఛార్జి చేసి వాడుకుంటున్నాను. నంబర్ ఎవరిదో తెలియదు. సిమ్ పట్టుకుంటే నేను దొరకను" అని చెప్పాడు. 



నేను ఆశ్చర్యపోయాను! ! ! చాటింగ్ చేస్తూ అన్నీ వివరంగా, విపులంగా చెబుతూ ప్రమాద పరిస్థితుల్లో దొరక్కుండా అతను పాటించే టెక్నిక్స్, పైగా మోసం చేయాలనుకుంటే ఎప్పుడో నన్ను మోసం చేయవచ్చు. కానీ అలాంటివాడు కాదతను.   చాలా రోజులు గడిచిపోయాయి. ఎన్ని మెయిల్స్ చేసినా అతన్నుండి రిప్లై రాలేదు. చాలా బతిమాలాను. కాళ్ళు పట్టుకుంటానన్నాను. పిల్లలు పుడితే నీ పేరు పెట్టుకుంటానన్నాను. 



ఎంతగా ఏడ్చానో తెలియదు. అలా రాసి రాసి రిప్లై రాదనుకునే సమయంలో అతన్నుండి మెయిల్ వచ్చింది. 



నది గురించి నేను రాసిన మెసేజ్ చదువుకో, ఎప్పుడైనా అదే జరుగుతుంది. సమాజంలో నువ్వు ఒకరితో, నేనొకరితోనూ ఫిక్స్ అయిఉంటున్నాం. వేరు వేరుగా మనిద్దరం ఇలా చేసినా సమాజం ఒప్పుకోదు. దురదృష్టవశాత్తు మనిద్దరం ఇలా కలిసాం. మరోరకంగా కలిసుంటే మున్ముందుకు స్నేహం సాగిపోయేదేమో తెలియదు. 



రోజుల తరబడి, గంటల తరబడి నీ తెలివితేటల్ని ఇలా వృధాగా పోనీయకు. నువ్వొక గుర్తింపుగా, ఆదర్శంగా ముందుకు సాగిపో. అన్యాయం అయిపోతున్న ఇలాంటి ఆడవాళ్లకి అండగా నిలబడి అవసరమైతే చైతన్యపరచు.. "



దీని తర్వాత మళ్ళీ మెయిల్స్ రాలేదు. దాని ముందు మాత్రం'కెమెరామెన్ గంగతో రాంబాబు'సినిమాలో తమన్నా డ్రింకింగ్ గురించి గంటసేపు లెక్చర్ ఇచ్చాడు. అతన్నుండి కమ్యూనికేషన్ కట్ అయింది.  

నెల రోజుల తర్వాత అతన్నుండి మెయిల్ వచ్చింది. 



"ఏమీ అనుకోకు నీలా, ఇదే ఆఖరి మెయిల్. మరెప్పుడూ మెయిల్స్ చేయకు. నన్ను వెదకాలని చూడకు. నీకో నిజం చెప్పి నిష్క్రమించాలని మెయిల్ చేస్తున్నాను. నిజానికి నేను మగవాడ్ని కాదు. మగ గొంతుకతో మొబైల్ లో వాయిస్ మార్చి మాట్లాడిన ఆడదాన్ని, నీలాగే చాటింగ్ చేసి మోసపోయి, జీవితంలో గొప్ప గుణపాఠాన్ని నేర్చుకున్నదాన్ని, నన్ను క్షమించు. నీలాంటి వాళ్ళని కొంత మందినైనా చైతన్య పరచాలనే కాంక్షతోనే నేను పని చేసాను. ఇక ఉంటా". 



మెయిల్ చదివి నేను షాకయ్యాను. నేను ఊహించలేదు. మాత్రం అనుమానం రాకుండా చివరికంటా తీసుకువచ్చింది. 



 గ్రేట్ అనిపించింది. 



తెరలు తెరలుగా నా ఆలోచనలన్నిటికీ ఆకృతి ఏర్పడి జవాబులుగా విడిపోవడం మొదలు పెట్టాయి. ఏదొక వ్యామోహంలో పడి చాటింగులమ్మట నేను చేస్తున్న సమయాలు, చాలా రోజులుగా నా తీరు చూసుకుంటే భయమేసింది. మరెప్పుడూ టైమ్ వృధా చేసుకుంటూ, చాటింగ్ జోలికి పోలేదు..  



ఆగని చైతన్యంతో విశ్వం మాత్రం ఎప్పటిలాగే తన పని తను చేసుకుపోతున్నాడు.  

సమాప్తం. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - అమ్మ - by k3vv3 - 28-07-2025, 04:16 PM



Users browsing this thread: 1 Guest(s)