Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#99
రహస్య స్నేహితుడు!
రచన: ఉండవిల్లి.ఎమ్






నది ఒడ్డున నేను౼
 నన్ను చూడగానే నది ఉరకలేస్తూ పరుగెడుతూ ఒడ్డుకంటా వచ్చి నా కాళ్ళను తడిమి తడిమి నిమురుతుంది. నామీద దీనికెందుకింత పిచ్చి ప్రేమ, గల గలా నవ్వుతూ తరగలు తరగలుగా కదలి మెదిలి ఏదో చెప్పాలని చూస్తుంటుంది. 



నేను నది ఒడ్డున నడుస్తూ వెళుతుంటాను. ఏదో ఒక అలికిడి చేస్తూ, పరవళ్లు తొక్కుతూ నాతోపాటే వస్తుంది. నడుస్తూ నడుస్తూ నేనెళ్లిపోతాను. నా ఆనవాళ్లు కూడా కన్పించవు. మరెప్పటికీ తిరిగి రావేమో! 



అప్పుడు ఇదేం చేస్తుంది?నా జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ నిరీక్షణలతో, జన్మాఅంతం ఎదురుచూస్తుందా? జీవితకాలం నిలబడలేని అనుబంధాల్ని చూసి గుడ్డిగా కేరింతలు కొట్టడం.. నాకు నదిని చూసి జాలేసింది. మెయిల్ లోని మెసేజ్ చూసాక నాకు మనస్సంతా అదోలా అయిపోయింది. అసలు ఎప్పటికీ అర్ధం కాడు విశ్వం. ఎవరెస్టు శిఖరం లాంటి వాడతను. అతడొక స్పందన, ఇన్స్పిరేషన్. నిజంగానే! మాయం అయిపోయాడు. అతన్నుండి మెయిల్స్ రావడం మానేసాయి. మరేవిధమైన క్లూస్ లేవు. 



వెబ్ సైటులో మొదట పరిచయమైనపుడు నీ గురించి చెప్పు అన్నప్పుడు "నాపేరు విశ్వం, నాదొక ప్రైవేట్ కంపెనీ, పెళ్లయింది, పిల్లలు. అప్పుడప్పుడు ఏమీ తోచక గదిలో ఒంటరిగా వెబ్ సైటులోకి వస్తాను. చాటింగ్ చేస్తుంటాను. ఈరోజు నీతో చేస్తున్నట్లు" అన్నాడు. 



"నీకు పెళ్ళయిందా?"ఆశ్చర్యంగా అడిగాను. 



 "అయింది. అయితే ఫ్రెండ్షిప్ చేయవా? అయినా షార్ట్ టర్మ్ చేయాలనా, లాంగ్ టర్మ్ చేయాలనా? చాలా మంది ఇలాగ అడుగుతుంటారు. అందుకే నేనూ అడిగాను" అన్నాడు విశ్వం. 



"అలా అనికాదు. నువ్వు ఇంటెలిజెంట్ కాదు, నాకు ఇంటెలిజెంట్ కావాలి" అన్నాను. 



"అయితే నన్నొదిలేయ్, నేను ఇంటెలిజెంట్ కాదు" అన్నాడు.   కొన్ని రోజులు పోయిన తర్వాత నేనే మెయిల్ చేసాను. 
ఈలోపు విశ్వం నుంచి ఏమీ రాలేదు. సహజంగా ఈలోపు అబ్బాయిలు, అమ్మాయిల్ని ఆకర్షించడానికి రకరకాలుగా మెసేజెస్ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. కానీ ఇతను అలా అన్పించలేదు. కంటిన్యూ చేసి చూడాలని అన్పించింది. 



చాలా సెంటిమెంటల్ అతను. సామాజిక దృక్పధం ఉన్న మనిషిలా అన్పించాడు. రాను రాను చాలా విషయాల్లో నాలెడ్జి ఉన్న మనిషిలా కన్పించాడు. 



ఒకరోజు నేనడిగాను"లైఫ్ లో నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు?ఎవర్నైనా ప్రేమించావా?" అని. 



"నా లైఫ్ అన్ని దిశలకి స్ప్రెడ్ అయిపోయింది. నేనెరని ప్రేమించలేదు. సమయం లేదు. ఎవర్నైనా ప్రేమించాలని అనుకున్నా ఒకలాంటి భయం. ఎవర్నీ ప్రేమించలేకపోయాను. ఇప్పుడు ప్రేమించలేనంత బిజీబిజీగా జీవితం పరుగెడుతోంది. " అన్నాడు. 



"అయితే నీకు పెళ్లి కాలేదన్నమాట" అని అడిగాను. 



"అయింది"



"ఎవర్నీ ప్రేమించలేకపోతున్నానన్నావు?"అన్నాను. 



"కానీ, ఒకామె నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మాట పెళ్లయ్యాక చెప్పింది. బంధువుల అమ్మాయే. " అన్నాడు. 



"ఓహ్.. నువ్వు ఆశ్చర్యంగా ఉన్నావే" అని, మళ్ళీ నేనే చెప్పాను. "నేనొక అబ్బాయిని ప్రేమించాను. అతను చాలా జీనియస్, పాటలు బాగా పాడేవాడు. ఆల్బమ్ రిలీజ్ చేసాడు. కంప్యూటర్స్ లో టాప్. నన్ను బాగా ప్రేమించేవాడు. " అన్నాను. 



"అయితే, నాతో చాటింగులెందుకు?" అతనడిగాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - అమ్మ - by k3vv3 - 28-07-2025, 04:13 PM



Users browsing this thread: 1 Guest(s)