Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
పర్ణశాలలోని రకరకాల పళ్ళను పక్షులు రుచి చూసాక వాటిని సునంద సార్వ భౌమునికి ఇచ్చింది. సునంద ఇచ్చిన పళ్ళన్నిటిని సార్వ భౌముడు మనఃపూర్వకముగా ఆరగించాడు. సార్వ భౌముడు రకరకాల వ్యవసాయ పంటల దిగుబడి గురించి, చిరు ధాన్యాలు గురించి సునందను అడిగి తెలుసుకున్నాడు. సునంద వ్యవసాయం మీద సార్వ భౌమునికి ఉన్న ఆసక్తిని గమనించింది. 

సార్వ భౌముని మనసు సునంద మీదకు మళ్ళింది. 
నాలుగు రోజుల అనంతరం అదే విషయాన్ని సార్వ భౌముడు కేకయ మహారాజు కు చెప్పాడు. తన కుమార్తె కు ఇష్టమైతే తమని అల్లునిగా చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కేకయ మహారాజు సార్వ భౌమునితో అన్నాడు. 

సార్వ భౌముడు, "రాజ! బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రజాపత్య, అసుర, గంధర్వ, రాక్షస, రాక్షసి, పైశాచిక " అని వివాహాలు అనేక పద్దతులు ఉన్నాయి. మీరు వివాహాన్ని ఆమోదిస్తారు?" అని కేకయ మహారాజు ని అడిగాడు. 

సార్వ భౌముని మాటలను విన్న కేకయ మహారాజు, "రాజ! మా రాజ్యం లో అనేక బ్రహ్మ వివాహాలు సాంప్రదాయ బద్దంగా జరిగాయి. కట్న కానుకలకు అతీతంగా పెద్దలందరి అంగీకారం తో వధూవరులు ఒకటవ్వడం బ్రహ్మ వివాహం. ఇవి ఇప్పటికీ యథేచ్ఛగా జరుగుతున్నాయి. 

ఇక మా రాజ్యం లో దైవ వివాహాలు కూడా కొన్ని జరిగాయి. వివాహం లో తండ్రి తన కుమార్తెను దక్షిణ రూపంలో ముందుగా పురోహితునికి ఇస్తాడు. ఆపై స్త్రీని మరొక వ్యక్తి మనువాడతాడు. 

మా రాజ్యం లో దైవ వివాహాలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. వర్ణ అహంకారం వలన మార్పు వచ్చింది. పురోహితులు తమ ఉదర పోషణార్థం సంప్రదాయాన్ని పెట్టారు. తర్వాత తర్వాత సమాజంలో వచ్చిన మార్పు వర్ణ అహంకారం పద్దతి నశించడానికి కారణం అయింది. 

ఇక అర్ష వివాహం కూడా మా రాజ్యం లో నేడు పూర్తిగా తగ్గిపోయింది అనే చెప్పాలి. అర్ష వివాహం లో వధువు తండ్రి తన కుమార్తెను ముందుగా ఒక ఋషికి ఇవ్వవలసి ఉంటుంది. ఆపై రెండు తక్కువ కాకుండా ఆవులను ఋషికి ఇచ్చి వధువును తీసుకోవలసి ఉంటుంది. ఋషులు తమ జీవనాధారం కోసం పద్దతిని ప్రవేశ పెట్టారు. అయితే సంప్రదాయం నేడు పూర్తిగా తగ్గు ముఖం పట్టింది. 

పురోహితులు, ఋషులు చేసే ధర్మ కార్యాలకు కావల్సిన సమస్తం రాజులమైన మేమే చూస్తున్నాం. అయినా అక్కడక్కడ కొందరు స్వార్థ పరులైన పురోహితులు, ఋషులు సంప్రదాయాల పేరుతో కొందరు మనుషులను మోసం చేస్తూనే ఉన్నారు. వారి గురించి మాకు తెలిసిన వెంటనే మేము వారిని కఠినంగా శిక్షిస్తున్నాము. 

ఇక కన్యాదానం లేని ప్రజాపత్య వివాహం మా రాజ్యం లోని అధిక శాతం మంది జనం ఆచరిస్తారు. అయితే ఇందులోని అనాచారాలను తొలగించి అనుసరిస్తారు. 

ఇక కన్యను కొనుగోలు చేసే అసుర వివాహం, కామం నుంచి పుట్టిన గాంధర్వ వివాహం, వధువును అపహరించి వివాహం చేసుకునే రాక్షస వివాహం, వరుని అపహరించి వివాహం చేసుకునే రాక్షసి వివాహం, మగువ, మత్తులో ఉన్నప్పుడు ఆమెను అత్యాచారం చేసి వివాహం చేసుకునే పైశాచిక వివాహం లు అప్పుడప్పుడు మా రాజ్యంలో జరుగుతూనే ఉంటాయి. 

అందరి బుద్ది ఒకే విధంగా ఉండదు కదా? అందుకే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలా వివాహం చేసుకున్నవారికి ఇక్కడ కఠిన శిక్షలు కూడా ఉన్నాయి. " అని అన్నాడు. 

సార్వ భౌముడు కేకయ మహారాజు అభిప్రాయం తీసుకున్న పిమ్మట తన మనసులోని మాటను సునందకు చెప్పాడు. సునంద సార్వ భౌముని ప్రేమను తిరస్కరించింది. అందుకు ప్రధాన కారణం సార్వ భౌమునికి తనే సార్వ భౌముడుని అనే అహంకారం అధికంగా ఉందన్నట్లు తనకు అనిపించింది అంది. అది నిజం కాదని సార్వ భౌముడు సునందతో అన్నాడు. అయినా సునంద సార్వ భౌముని నమ్మలేదు. 

సార్వ భౌముడు సునంద మనసులోని మాటను కేకయ మహారాజు కు చెప్పాడు. కేకయ మహారాజు బాగా ఆలోచించి తన తోటలోని తులసి చెట్టు తో సార్వ భౌముని వివాహం జరిపించాడు. అనంతరం సార్వ భౌముని తో, "రాజ, సార్వ భౌమ! మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా నేను నీకు తులసి చెట్టు ను ఇచ్చి వివాహం చేసాను. ఇక నువ్వు నా కుమార్తె సునందను రాక్షస వివాహం చేసుకున్నను తప్పులేదు. అయితే నా కుమార్తె మీద పైశాచికత్వం ప్రదర్శించమాకు" అని అన్నాడు. 
 కేకయ మహారాజు మాటలను విన్న సార్వ భౌముడు చిరునవ్వుతో సునంద పర్ణశాలకు వెళ్ళాడు. తన మనసులోని మాటను సునందకు చెప్పాడు. సునంద సార్వ భౌముని మాటను మన్నించలేదు. సార్వ భౌముడు సునందను పలు విధాలుగా బతిమిలాడాడు. 

"నీమనసులో ఇంకవరన్నా ఉన్నారా? వారిని తీసుకు వచ్చి నీ చరణాల ఉంచుతాను" అని సునందను సార్వ భౌముడు అడిగాడు. 

"నా మనసులో ఎవరూ లేరు " అని సునంద అంది. 

సార్వ భౌముడు బలవంతంగా సునందను తన రథం లో ఎక్కించుకున్నాడు. సార్వ భౌముడు సునందను తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి బలవంతంగా రాక్షస వివాహం చేసుకున్నాడు. 

భానుమతి అహంయాతులు సునందను దగ్గరకు తీసుకున్నారు. ఆమె ఆవేశాన్ని తగ్గించారు. తన కుమారుని పేరు సార్వ భౌముడు యే కాని అతనిలో నేనే సార్వ భౌముడు ని అనే అహంకారం అణుమాత్రం కూడా లేదన్నారు. కొంత కాలం ఓపిక పట్టి నిజం తెలుసుకో అన్నారు . సునంద మనసు సార్వ భౌముని మీదకు మళ్ళేటట్లు చేసారు. 

కాలం గడుస్తున్న కొద్దీ సునందలో మార్పు వచ్చింది. సార్వ భౌముని లోని మంచిని గమనించింది. రాజకీయ విషయాలలో కూడా సునంద సార్వ భౌమునికి సహాయ పడసాగింది. వారిరువురికి పుట్టిన సంతానమే జయత్సేనుడు.
 
సర్వే జనాః సుఖినోభవంతు
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - భానుమతి - అహంయాతి - by k3vv3 - 24-06-2025, 01:45 PM



Users browsing this thread: