Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఇంకెంత సేపు
#78
"వాడికి నామీద కుళ్ళులేవే జానూ! నేను బలంగా వున్నానని ఎప్పుడు ఏడుస్తుంటాడు" చక్రాలను పరపరా నములుతూ అన్నాడు బుచ్చిబాబు.నవ్వి వూరుకున్నాడు శ్యాంప్రసాదు. పావుగంట వ్యవధిలో వి.జి.పి గోల్జెన్ బీచ్లో ఆగింది వ్యాను.అందరూ దిగారు. బుచ్చిబాబుకూడా మెల్లగా దిగాడు.టిక్కెట్లు తీసుకొని లోనికెళ్ళారు.క్యాంటీన్ వద్ద ఆగి పోయాడు బుచ్చిబాబు.

"ఏరా ఆగిపోయావ్ !తిరిగి చూడ్డానికి మాతో రావట్లేదా?"అడిగాడు శ్యాం ప్రసాదు.

"అక్కడేముందిరా బొంద.పిల్లల్ని తీసుకొని నువ్వెళ్ళిరా! నేనిక్కడ కూర్చొంటాను"అంటూ అక్కడున్న బెంచిమీద కూర్చొన్నాడు బుచ్చిబాబు.

'అయ్యోరామ'అంటూ తలమీద కొట్టుకొంది జానకి. నవ్వుకొంటూ ముందుకు నడిచారు అందరూ.

అటు క్యాంటీన్లోకి చూశాడు బుచ్చిబాబు.అక్కడ చాలామంది స్పెషల్ అనిపించుకొనే పెద్ద దోశెల్ను ముందుంచుకొని తింటున్మారు.నోట నీళ్ళూరాయి బుచ్చిబాబుకు.ఓ అర్థ గంటైన తరువాత అందరూ తిరుగు ముఖం పట్టి క్యాంటీన్ వద్దకొచ్చారు."టైమైంది పదరా! మహాబలిపురం వెళ్ళి తిరిగి చూసిన తరువాత భోంచేద్దాం"అన్నాడు శ్యాం ప్రసాదు.

శ్యాం ప్రసాదు మాటల్ని పట్టించుకోని బుచ్చిబాబు"ఒరేయ్ !అక్కడ రోలుగా చుట్టి ప్లేటులో వున్న ఆ దోశెను,దాన్ని నాలా బొద్దుగా వుండి తింటున్న ఆ పిల్లాడ్ని చూడు.అలాంటి దోశెను మీకు తినాలనిపించట్లేదా?" గుటకలు మింగుతూ అన్నాడు బుచ్చిబాబు.

"అయితే మీరిప్పుడు దోశె తినాలంటారు,అంతేగాండీ?"అంది జానకి.

"అవును.నాకొక్కడికే ఒక్క దోశ కావాలి"అని గట్టిగా తలూపాడు బుజ్జిబాబు.

"అయ్యోరామ.తప్పుతుందా పదండి"అంటూ లోనికి నడిచారు.నాలుగు దోశెలను తీసుకున్నారు.ఒకటి బుచ్చిబాబు ముందుంచి తతిమ్మా మూడు దోశెల్ను ఏడుగురు తిన్నారు. చెయ్యి కడుక్కొని వ్యానెక్కి కూర్చొన్నారు. కొంతదూరం వెళ్ళింది వ్యాను.

"ఇంకేమన్నా వున్నాయా తినటానికి?"ఉన్నట్టుండి అడిగాడు బుచ్చిబాబు భార్యను.

"అయ్యో రామ!ఇదిగో అన్ని వున్నై.అయితే ఇప్పుడు పెట్టను.భోజనాలైయ్యాకే!ఓ గంటసేపు ఆ నోటికి తాళం వెయ్యండి"అంటూ విసుక్కొంది జానకి.కిమ్మనకుండా కూర్చొన్నాడు బుచ్చిబాబు . కాస్సేపటికి మహాబలిపురమొచ్చింది. అందరూ దిగారు.బుచ్చి బాబు దిగి అక్కడ చెట్టుక్రింద వున్న బండమీద కూర్చొన్నాడు.

"ఏంట్రా?తిరిగి చూడ్డానికి నువ్వు రావట్లేదా?"అడిగాడు శ్యాంప్రసాద్ .

"ఏముందక్కడ బొంద!?మీరెళ్ళి చూసిరండి"అయాసపడుతూ అన్నాడు బుచ్చిబాబు.

"ఇక్కడే కూర్చొని వుండు.ఓ గంటలో తిరిగొస్తాం .ఇదిగో!అకలౌతోందని ఆ పల్లీలు, ,బొండాలు, బజ్జీలని తిని కడుపును పాడు చేసుకోకండి.మీరు పదండన్నయ్యగారూ!"అంటూ ముందుకు నడిచింది జానకి.

'అక్కడికి వీడేదో పుడ్డు విషయంలో కంట్రోలుగా వున్నట్టు.ఆ బోండాలు,బజ్జీలను తినకపోతే సరి'అని మనసులో అనుకొని నవ్వుకొంటూ"పదండి...పదండి"అంటూ వాళ్ళను వెంబడించాడు శ్యాం ప్రసాదు.

"వొదినా !నాకు తెలీకడుగుతున్నాను.మీ వారు ఎప్పుడూ ఇంతేనా?కడుపుకు తినడం ఓ పనిగా చేసుకొన్నారు.అలా తింటే ఊబకాయం రాక సన్నబడతారా?అందునా షుగర్ పేషంటని చెపుతున్నారాయే.పార్కులో కూడా ఒక్క రౌండుకూడా నడవరట.అర్థగంటో లేక నలభై నిముషాలో మా వారు నడిచేవరకూ వీరు బల్లమీద పడుకొని నిద్రపోతారట.అలా అయితే ఆరోగ్యం కుంటు పడదూ?"అంది శ్యాం ప్రసాదు భార్య సుందరి.

"ఏమిటోలేమ్మా!అది నా ఖర్మనుకొంటున్నాను.మరి కన్నానుగా వారికి ఇద్దరు పిల్లల్ని" ముఖం మూడు వంకలు తిప్పుతూ అంది జానకి.

"అమ్మాయ్ !మాట్లాడకుండా రావా!ఇప్పుడు నీకు వాడి సంగతి అవసరమా!నోరుమూసుకొని పద"మందలించినట్టు అన్నాడు భార్య సుందరిని శ్యాం ప్రసాదు.

"వదినమ్మగారు వున్నదే అడిగారు అన్నయ్యగారూ!అది నా ఖర్మేగా మరి.ఆయనంతే! ఒక్కోసారి నేనే ఆయన్ను తినటానికే పుట్టాడేమోననుకొంటా"ముక్కు చీదింది జానకి పిల్లలతో నడుస్తూ.

వాళ్ళటు కనుమరుగౌతూనే రెండు బజ్జీలు,రెండు బోండాలు ,బాటిల్ నీళ్ళను కొనుక్కొని శుభ్రంగా తిని నీళ్ళు తాగి వెళ్ళిన వాళ్ళకోసం ఎదురు చూస్తూ కూర్చొన్నాడు బుచ్చిబాబు.

మధ్యాహ్నం వరకూ తిరిగి చూసి రెండు గంటల ప్రాంతంలో బుచ్చిబాబు దగ్గరకు వచ్చారు. చెట్టుక్రింద దుప్పటి పరిచి అందరూ కూర్చొన్నారు బచ్చిబాబు తప్ప.ఎందుకంటే తను క్రింద కూర్చొంటే లేవలేడు పాపం.

రెండిళ్ళలో నుంచి తెచ్చిన పులిహోరా,పెరుగన్నం,దుంప వేపుడు,ఆవకాయతో డ్రయివరుతో పాటు అందరూ భోంచేశారు. పళ్ళు,చక్రాలు,చకోడీలను కూడా కాజేశారు.గంట రెస్టు తీసుకొని బ్యాక్ టు హోమని ముడున్నర గంటలకు కదిలారు.ఏటూ దారిలో క్రొకడైల్ పార్కును కూడా చూడాలిగా మరి.

సమయం నాలుగు గంటలు.వ్యాను వేగంగా వెళుతోంది.అందరూ అలా కన్ను మూశారు జానకితో పాటు.అమె ప్రక్కన కూర్చొన్న బుచ్చిబాబుకు స్టమక్ అప్ సెట్టయ్యిందేమో కడుపు పట్టుకొని కళ్ళు మూసుకొని ఇబ్బంది పడుతూ మెలికలు తిరిగి పోతున్నాడు.అప్పటికే తనకు ముచ్చెమటలు పోసి మైకం వచ్చేట్టువుంది.ఇక లాభం లేదనుకొన్న బుచ్చిబాబు మెల్లగా భార్యను గిల్లాడు.

"ఏమైందండీ?"అని టక్కున మేల్కొని అడిగింది జానకి.

"స్టమక్ అప్సెట్ అయినట్టుంది జానూ!.వీపరీతమైన నొప్పి .షుగర్ , బి.పిలు రైజై మైకం వచ్చేట్టు వుంది.దగ్గర్లో ఆసుపత్రి వుంటే వెళదాం"అన్నాడు ఇబ్బంది పడుతూ బుచ్చిబాబు.

జానక్కి ఏమీ పాలు పోలేదు.ఆమెకు భయం పట్టుకొంది.వెంటనే "అన్నయ్యగారూ!వీరు అదోలా అయిపోతున్నారు.ఆసుపత్రికి తీసుకెళ్ళాలి"అంది శ్యాం ప్రసాదుతో.శ్యాం ప్రసాదు

గూగుల్ మ్యాప్లో ఆసుపత్రిని వెతికాడు.కిలో మీటరుకవతల ఓ మల్డీ స్పెసాలిటీ హాస్పిటల్ వున్నట్టు గుర్తించి డ్రయివర్తో చెప్పి అక్కడికి వెళ్ళ మన్నాడు.పాపం బుచ్చిబాబు పిల్లలు ఏడ్పులంఖించుకున్నారు.జానకి కళ్ళనుంచి కన్నీళ్ళు కారుతూనే వున్నాయ్ !
కాసువాలిటీకి తీసుకు వెళ్ళారు బుజ్జిబాబును. డాక్టరుగారు పరిశీలించిన తరువాత స్ట్రెచ్చర్లో తీసుకెళ్ళి బెడ్డు మీద పడుకోబెట్టి ఇ.సి.జి.తీశారు.బి.పి.చూశారు. బ్లెడ్ టెస్టు చేశారు. అర్థగంటలో అన్ని రిపోర్టులు డాక్టరు వద్దకొచ్చాయి.అన్నిటిని పరిశీలనగా చూసి మెల్లగా నవ్వాడు డాక్టర్.ఈ లోపు రెండు సూదులు వేసి,సెలైన్ ఎక్కిస్తున్నారు బుచ్చిబాబుకు.

"ఏం భయపడకండి.మరో మూడు గంటల్లో తను బాగా కోలుకొంటాడు.ఏదో పనికిరాని పుడ్డును మితిమీరి తిన్నందున అది కాస్తా పాయిజనై స్టమక్ అప్ సెట్ అయ్యింది.ఇక పర్వాలేదు.పల్స్ రేట్ ,హార్టు బీటింగ్ క్రమంగానే వున్నాయి.కాని బి.పి.,షుగరు అంతగా కంట్రోల్లో లేవు. ఆ విషయంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి.ముఖ్యంగా తను తినే డైట్ కంట్రోల్గా వుండాలి" అన్నాడు డాక్టరు.

"అడుగో!కదులు తున్నాడు,అందర్ని చూస్తున్నాడు. ఇప్పుడు మామూలుగా వుందేమో!ఆ సంగతి వాడికే చెప్పండి డాక్టరుగారూ!"అన్నాడు శ్యాంప్రసాదు.

తండ్రి కదలికలను చూస్తూనే పిల్లలు శోకాలు పెట్టటం ఆపేశారు.డాక్టరు మాటలు జానక్కి ధైర్యాన్నిచ్చాయి.

"మీ పేరేమిటండీ?"డాక్టురుగారు బుచ్చిబాబును అడిగాడు.

"బుచ్చిబాబు సార్ "దీనంగా చెప్పాడు.

ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - కామెడీ దెయ్యాలు - by k3vv3 - 21-06-2025, 01:59 PM
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM



Users browsing this thread: 1 Guest(s)