Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
పద్మిని తన కుమార్తె భానుమతి సదాలోచనలను విని మహదానందపడింది. 



 శ్రీ సూర్య నారాయణ తేజస్సు తో, దత్తాత్రేయ స్వామి దరహాసం తో ప్రకాశించే భానుమతి ని చూడగానే కొంతమంది ప్రజల చర్మ వ్యాధులు మటుమాయం అయ్యేవి. మరి కొందరి మంద బుద్ధి నశించేది. ఇంకొందరి శారీరక శక్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగేది. 



 వరాంగి సంయాతి పుత్రుడు అహంయాతి. 
వశిష్ట మహర్షి దగ్గర అహంయాతి సమస్త విద్యలను అభ్యసించాడు. సమరంలో తనకు తానే సాటి అన్నంత పేరు ప్రతిష్టలను తెచ్చుకున్నాడు. అహంయాతి తన కండ బలం తో కొండలను పిండి చేయగలడు అని పుర ప్రజలందరూ అనుకునేవారు. అయితే అహంయాతి తలిదండ్రుల వద్ద వినయ విధేయతలను ప్రదర్శించేవాడు కానీ పరుల దగ్గర మాత్రం కొంచెం అహంకారాన్ని ప్రదర్శించేవాడు. తను కాబోయే రాజును అన్న అహంకారం అహంయాతి లో ఉండేది. 



 కుమారుడు అహంయాతి తత్వాన్ని పసిగట్టిన వరాంగి కుమారుని పై బాధ్యత పెరిగితే గానీ అహం కారం తగ్గదనే భావనకు వచ్చింది. అదే విషయాన్ని కుల గురువు వశిష్ట మహర్షి కి చెప్పింది. 



 వశిష్ట మహర్షి కి వరాంగి సూచన బాగా నచ్చింది. 
వశిష్ట మహర్షి అహంయాతి ని పిలిచి యజ్ఞ శాలలను సంరక్షించే బాధ్యత ను అహంయాతి కి అప్పగించాడు. 
అహంయాతి కుల గురువు వశిష్ట మహర్షి మాటలను కాదనలేక యజ్ఞ సంరక్షణ బాధ్యత లను స్వీకరించాడు. 
వశిష్టాది మహర్షుల మీద ఉన్న గౌరవంతో తన బాధ్యత లను సక్రమంగా నిర్వహించాడు. 



 అహంయాతి యజ్ఞ సంరక్షణ బాధ్యతను  నిర్వహిస్తూ, ఋషుల, మహర్షుల ప్రవర్తనా సరళిని గమనించసాగాడు. వారి ఆద్యాత్మిక ప్రసంగాల వలన, వారి శాంతియుత ఆలోచనల వలన అహంయాతి లో ఉన్న అహం నెమ్మది నెమ్మదిగా తగ్గిపోసాగింది. 



 కర్కోటక నాగుడనే నాగ జాతికి చెందిన రాజు కృతవీర్యుని సంపదను చూసి సహించలేక కృతవీర్యుని మీద యుద్దం ప్రకటించాడు. కృతవీర్యుని, అతని సోదరులను, పుత్రులను సమస్తం మట్టు పెట్టాలనే నిర్ణయానికి కర్కోటక నాగుడు వచ్చాడు. కాలకూట విషంతో కూడిన అస్త్రాలను కృతవీర్యుని మీద, కార్తవీర్యార్జునుడు మీద ప్రయోగించాలని కర్కోటక నాగుడు నిశ్చయించుకున్నాడు. కాలకూట అస్త్రాలను అనేకం తయారు చేయించాడు. 



 ఇది తెలిసిన భానుమతి సూర్య భగవానుని అనుగ్రహం తో సూర్య కిరణ అస్త్రాలను తయారు చేసింది. అస్త్రాలను ప్రయోగించే రీతి పది మందికి నేర్పింది. వాటిని సమరంలో కర్కోటక నాగుని సైన్యం మీద ప్రయోగించింది. 



 భానుమతి ప్రయోగిస్తూ, ప్రయోగింప చేసే సూర్య కిరణ అస్త్రాలకు, కార్తవీర్యార్జునుడు ఒకేసారి వేయి చేతులతో ప్రయోగించే అస్త్రాల ధాటికి కర్కోటక నాగుని సైన్యం తట్టుకోలేక పోయింది. అయినప్పటికి పట్టిన పట్టును వదలకుండా కర్కోటక నాగుడు అధర్మ యుద్దం లో కృత వీర్యుని బంధు వర్గం సమస్తాన్ని, కృతవీర్యుడే ప్రాణం అనుకునే సైన్యాన్ని ఎక్కడికక్కడ సంహరించాలనే దృఢ నిర్ణయం తో రాక్షస యుద్దం చేయసాగాడు.
 
 వరాంగి సంయాతి లకు వశిష్ట మహర్షి ద్వారా కర్కోటక నాగుని అధర్మ రాక్షస యుద్దం గురించి తెలిసింది. వెంటనే కృతవీర్యునికి, కార్తవీర్యార్జునునికి యుద్దంలో సహాయపడమని అహంయాతి ని పంపారు. 



 అహంయాతి మహా సైన్యం తో ఆహవ రంగాన కాలు పెట్టాడు అహంయాతి సైన్యం కర్కోటక నాగుని సైన్యం ను ఊచకోత కోయడం చూచిన కృతవీర్యుడు రథంలో నుండే అహంయాతి కి నమస్కరించాడు. అహంయాతి ని చూచిన భానుమతి, కార్తవీర్యార్జునులు కూడా అహంయాతి కి కృతజ్ఞతా భావంతో నమస్కరించారు. అహంయాతి సమర కౌశల్యాన్ని చూసిన కర్కోటక నాగుడు సమరంలో తనకు ఇక అపజయం తప్పదు అనుకున్నాడు. 



 కర్కోటక నాగునికి కార్తవీర్యార్జునునికి జరిగిన భయంకర యుద్ధంలో కర్కోటక నాగుడు మరణించాడు. ఆతని మహిష్మతి పట్టణం కార్తవీర్యార్జునుని వశం అయ్యింది. 
 సమర అనంతరం వరాంగి బంధు వర్గం, కృతవీర్యుని బంధు వర్గం విందు వినోదాలలో మునిగి తేలారు. విందు వినోదాలలోనే భానుమతి అహంయాతి అంగీకారం తో వారిద్దరికి వివాహం చేయాలని ఇరు వర్గాల పెద్దలు అనుకున్నారు. 



 వరాంగి సంయాతి లు అహంయాతి కి ముందుగా పట్టాభిషేకం చేసారు. పట్టాభిషేకానికి భానుమతి బంధువర్గం సమస్తం వచ్చింది. 



 భానుమతి అహంయాతి లు ఒంటరిగా కలుసుకున్నారు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. మనల్ని ఆవహించిన రతీమన్మథులు మన చెప్పు చేతల్లో ఉండాలి కానీ వారి చెప్పు చేతల్లోకి మనం వెళ్ళకూడదు. ఎక్కడైనా ఎప్పుడైనా అతి సర్వత్ర వర్జయేత్ అనుకున్నారు. 



 ఋషులు, మహర్షులు, రాజర్షులు, జ్యోతిష్య పండితులు రెండు రాజ కుటుంబాల మాటలను అనుసరించి భానుమతి అహంయాతి వివాహానికి మంచి శుభ ముహూర్తాన్ని నిర్ణయించారు. శుభ ముహూర్తాన భానుమతి అహంయాతి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. వేడుకకు అనేక దేశాల రాజులు, సామంతులు, తదితరులందరూ వచ్చారు. వశిష్ట మహర్షి, గర్గ మహర్షి వంటి మహర్షులు వధూవరులతో అనేకానేక పరిణయ యాగాలు చేయించారు. 

 భానుమతి వివాహం జరిగిన కొద్దిరోజులకే అనారోగ్య కారణంగా కృతవీర్యుడు మరణించాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - తులసీదాసు - by k3vv3 - 11-06-2025, 12:35 AM



Users browsing this thread: