Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
కొంత కాలం తర్వాత మహా శివుని కోరిక మేరకు విష్ణుమూర్తి అశ్వ రూపంలో బడబ ను కలిసాడు. బడబ తపస్సు ఉన్నత స్థాయికి చేరింది అనుకున్నాడు. 



ప్రకృతి పరవశించింది. కొండకోనలు ప్రశాంతంగా ఉన్నాయి. పర్ణశాల ల్లో లేళ్ళు కుందేళ్ళు చెంగు చెంగున ఎగిరెగిరి గంతులు వేస్తున్నాయి. రతీమన్మథులు రస విహారం చేస్తున్నారు. అశ్వ రూపంలో ఉన్న విష్ణు మూర్తి, బడబ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ని చూసాడు. 
 
ఒక శుభ ముహూర్తాన లక్ష్మీ దేవికి విష్ణు మూర్తి కి ఒక దివ్య మగ శిశువు జన్మించాడు. భూమి మీద జన్మించిన దివ్య శిశువు భూమి మీద జీవిస్తేనే బాగుంటుంది అని బడబ రూపంలో ఉన్న లక్ష్మీదేవి అంది. దివ్య శిశువు ను పెంచగల పుణ్యాత్ముడు ఎవరు? అని విష్ణుమూర్తి ఆలోచించాడు. అతనికి యదు మహారాజు గుర్తుకు వచ్చాడు.
 
విష్ణుమూర్తి శిశువు ను సంతానం కోసం తపస్సు చేస్తున్న యయాతి మహారాజు కుమారుడు యదు మహారాజు కు ఇచ్చాడు. అంత విష్ణు మూర్తి " యదు మహారాజ! నీ తండ్రి యయాతి మహారాజు ఆవేశంలో యాదవులకు రాజ్యార్హత లేదు అని శపించాడు. సృష్టి లో లోక కల్యాణం కొరకు ఇచ్చే శాపాలు జరుగుతాయి కానీ స్వార్థం కోసం ఇచ్చే శాపాలు జరగవు. ఎందరెందరో యాదవ మహా రాజులను కాల చక్రం చూస్తుంది." అని విష్ణుమూర్తి యదు మహారాజు ను ఆశీర్వదించాడు. 



యదు మహారాజు మగ శిశువు కు జాతకాదుల ను చూపించి ఏకవీరుడు అని పేరు పెట్టాడు. ఏకవీరుని కొందరు హైహయుడు అని కూడా అంటారు. 



 హైహయుని కుమారుడే కృతవీర్యుడు. ఇతని భార్య పద్మిని. పద్మినీ కృతవీర్యులకు పుట్టిన కుమార్తె భానుమతి. 



 కృతవీర్యుని భార్య పద్మిని దత్తాత్రేయ స్వామి భక్తురాలు. దత్తాత్రేయ స్వామి ని పూజించని దే ముద్ద కూడా ముట్టదు. భానుమతి కి కూడా భక్తి విషయంలో తల్లి పోలికలే వచ్చాయి. " ఓం నమో దత్తాత్రేయాయ" అని భానుమతి అష్టాక్షరీ మంత్రాన్ని అను నిత్యం జపిస్తుంది. 



 పద్మిని కి చాలా కాలం వరకు సంతానం కలగ లేదు. అప్పుడు పద్మిని అత్రి మహర్షి భార్య అనసూయ దేవిని కలిసి పుత్ర సంతానం కలిగే మార్గాన్ని చెప్పమని ప్రార్థించింది. పద్మిని ప్రార్థనకు చలించిన అనసూయ, మంచి పుత్రుడు పుట్టేందుకు తపస్సు చేయవలసిన పంచమి, సప్తమి, నవమి, ఏకాదశి వంటి తిథుల గురించి సవివరంగా చెప్పింది. 



 పద్మిని, అనసూయ చెప్పిన రీతిన తన భర్త కృతవీర్యుని తో కలిసి తపస్సు చేసింది. వారి తపస్సు మహా జ్ఞాన వంతంగా మారింది. వారి తపస్సు కు మెచ్చిన దత్తాత్రేయ స్వామి వారి ముందు ప్రత్యక్ష మయ్యాడు. 



 దత్తాత్రేయ స్వామి తో కృతవీర్యుడు, " స్వామి నువ్వు తప్ప మరెవరూ ఓడించలేని, సమస్త ప్రపంచాన్ని పాలించే కొడుకు మాకు కావాలి. " అని అన్నాడు. 



 దత్తాత్రేయ స్వామి కృతవీర్యుని కోరికను విని చిన్నగా నవ్వుకున్నాడు. " భూమి మీద జన్మించిన సురులవైన, నరులవైన, అసురులవైన మరెవరివైన కోరికలు మాత్రం మహా విచిత్రం గా ఉంటాయి." అని మనసులో అనుకున్నాడు. అనంతరం కృతవీర్యుని 
కోరికను మన్నించి " తథాస్తు" అన్నాడు. 
 కొంత కాలానికి పద్మిని పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువుకు వేయి చేతులు ఉన్నాయి. శిశువును చూసి, అందరూ శిశువు కారణ జన్ముడు అని అనుకున్నారు. 



 కృతవీర్యుడు మగ శిశువు కు కార్తవీర్యార్జునుడు అని పేరు పెట్టాడు. ఇతనికి వేయి చేతులు ఉండటం చేత ఇతనిని సహస్ర బాహు అర్జునుడు అని కూడ అనేవారు. ఆపై పద్మిని మరి కొంత మంది మగ సంతానానికి జన్మనిచ్చింది. ఆపై భానుమతి కి జన్మనిచ్చింది. 



 పద్మినీ కృతవీర్యుల సంతానంలో చదువు సంధ్యలలో తదితర విషయాల్లో కార్తవీర్యార్జునుడు, భానుమతి మంచి పేరు ప్రతిష్టలను తెచ్చుకున్నారు. 



 భానుమతి అనునిత్యం సూర్య భగవానుని, దత్తాత్రేయ స్వామి ని పూజించేది. వారి కరుణాకటాక్ష వీక్షణలకై అనుక్షణం తపించేది. 



 తమ వంశ మూల తేజంలో శ్రీ సూర్య నారాయణ ప్రస్తావన కూడా ఉందని తెలుసుకున్న పద్మిని తన కుమార్తె భానుమతి సూర్య భగవానుని, దత్తాత్రేయ స్వామి ని పూజించడం చూసి మహా మురిసిపోయేది. 



కుమార్తె పూజకు తను అందించగలిగినంత సహాయం అందించేది. త్రివర్ణ పుష్పాలను, త్రిముఖ పుష్పాలను భానుమతి పూజ కోసం పద్మిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసేది. 
 సూర్య భగవానుని కృప భానుమతి ని మహోన్నత తేజస్విని చేసింది. మహా తేజస్విని అయిన భానుమతి తన తండ్రి కృతవీర్యుడు దత్తాత్రేయ స్వామి ని సంతానం నిమిత్తం కోరిన కోరికను తల్లి పద్మిని ద్వారా తెలుసుకుంది. 



అంత తల్లి పద్మిని తో భానుమతి "భగవంతుని అనుగ్రహం అందరికి లభించదు. అది లభించిందంటే వారు మహా అదృష్టవంతులు అనే చెప్పాలి. ఇక దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అంటే త్రిమూర్తుల అనుగ్రహం లభించింది అనే అర్థం. భగవంతుని భక్తులు ఇల పై మంచి పేరు ప్రతిష్టలను తెచ్చుకునే సంతానం కావాలని కోరుకోవాలి గానీ నా సంతానానికి మరణం ఉండరాదని లేదా అందరిని చంపే సంతానం కావలని ఇలా గొంతెమ్మ కోరికలు కోరుకోరాదు. భగవంతుడు ప్రసాదించిన శక్తిని సవినయంగా స్వీకరించాలి. శక్తితో సాధ్యమైనంతగా లోకానికి మేలు చేయాలి. " అని అంది. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) కథలు - తులసీదాసు - by k3vv3 - 11-06-2025, 12:31 AM



Users browsing this thread: 1 Guest(s)