Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - అత్తగారు ఆవకాయ
#14
బామ్మ మాట
[Image: image-2025-06-08-190718680.png]


Sita Rambabu Chennuri
 మాట   జ్ఞాపకాలు   బామ్మా 
నాకెందుకో మా బామ్మంటే కోపంగా ఉండేది చిన్నప్పుడు
బహుశః ఆవిడ మా అమ్మను సాధిస్తుండటం వలన కావొచ్చు..అలాగని ఆవిడ చెడ్డదేమీకాదు.అదొక ఆధిపత్య పోరాటంలో ఉండే అభద్రత అని చాలాకాలం తర్వాత తెలిసింది.మా అమ్మను కమాండ్ చేయాలని చూసింది కానీ మేమంటే ప్రేమగా ఉండేది..కొన్ని గుర్తుండి పోయే జ్ఞాపకాలే ఉన్నాయి నాకు ముఖ్యంగా
 
ఆవిడని పురాణం కోసమని గుడికి తీసుకుని వెళ్ళే బాధ్యత నాదే..అందుకుగాను ఒక ఐదు పైసలు నాకిచ్చేదావిడ.ఐదుపైసలా అని ఆశ్చర్యపోకండి.ఆరోజుల్లో ఒక చాక్లెట్ వచ్చేది.ఆవిడ నెమలీకల్లా ముఖమల్ క్లాత్ ముక్కలు దాచుకునేది.అందులో రూపాయి నోట్లు పెట్టుకునేది.మా బామ్మకు వాళ్ళు మారింది పిల్లలు సంవత్సరానికి జాతిని కౌలు డబ్బులు తెచ్చిచ్చేవారు.కొంతమా నాన్నగారికిచ్చి మిగిలినది దాచుకునేది.ఎప్పుడైనా రూపాయిచ్చేది.సంక్రాంతి పండుగకి గాలిపటాలు కొనటానికి అక్కరకొచ్చేది.
 
ఆవిడ తిండి పుష్టి ఆశ్చర్యంగా ఉండేది.ఆవిడ కంచం ఆవిడ కడుక్కునేది.తెల్లచీరని ముసుగుతో కట్టుకునేది.చిన్నప్పుడు కాలేజ్ నుంచి ఇంటికి వస్తే స్నానం చేస్తే కాని లోపలికి రానిచ్చేదికాదు.ఆవిడ నోటిధాటికి మా అమ్మ కూడా భయపడిపోయేది.
 
కాలం ఒక్కలాఉండదుకదా.మా డిగ్రీ,పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాకా ఉద్యోగం కోసం ఊరెళ్ళుతుంటే కళ్ళమట నీళ్ళు పెట్టుకుంది.నన్ను పక్కకి పిలిచి చెప్పిన మాటలను ఎప్పుడూ మరిచిపోలేను.
'ఒరే రామం మీ అమ్మను తిట్టేదాన్నని మీఅందరికీ కోపమని నాకు తెలుసురా.నేను తిట్టడం వల్లే మీ అమ్మను బాగా చూసుకునేవారు.అది మీ అమ్మకూ తెలుసు.ఇక నాకు బెంగలేదురా'
ఈమాట చెప్పి కళ్ళు తుడుచుకుని తను.
ఈవిడకి ఎలా తెలిసింది మా మనసులోనిమాట అని ఆశ్చర్యపోయి సిగ్గుపడ్డాను.
'సారీ బామ్మా ఏమీ అనుకోకు..అలా మాకు కోపము ఉండేదని.అది అప్పుడే పోయిందిలే 'అని నవ్వేశాను
అంతే తర్వాత నేనావిడతో మాట్లాడలేదు..
అది జరిగిన కొద్దిరోజులకే ఆవిడ లోకాన్నించి శాశ్వతంగా నిష్క్రమించింది..కేవలం ఈమాట చెప్పుకుని ఊరటపొందటానికే అక్కడదాకా ప్రాణం నిలుపుకుందేమో అని నాలో నేను తర్జనభర్జన పడుతుంటాను ఈనాటికీ..
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - బామ్మ - by k3vv3 - 08-06-2025, 11:38 PM



Users browsing this thread: 1 Guest(s)