Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#95
గ్రహాంతరవాసి
[Image: image-2025-06-05-092728245.png]
రచన: G. S. S. కళ్యాణి



పట్నంలో ఉంటున్న కొడుకు రమేష్ దగ్గర కొన్ని వారాలు గడుపుదామని పల్లెటూరినుండీ వచ్చిన ఆనందరావు మొబైల్ ఫోను ఫయరింజిన్ సైరెన్ లాంటి శబ్దంతో గణగణమంటూ ఆగకుండామోగింది. ఆ అరుదైన రింగ్ టోన్ చేసిన చప్పుడుకి ఉయ్యాలలో ప్రశాంతంగా నిద్రపోతున్న తొమ్మిదినెలల అర్జున్ ఉలిక్కిపడి లేచి గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టాడు. 
"అదేమి రింగ్ టోన్ నాన్నా? గుండెల్లో దడపుట్టేటట్లుంది! ఇంకోదానికి మార్చుకోవచ్చు కదా?", అన్నాడు రమేష్ తన కొడుకు అర్జున్ ను ఎత్తుకుని ఊరుకోపెడుతూ.



"మీ నాన్నగారికి సరిగ్గా వినపడదు కదా?! అందుకే ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా వినపడేలా గట్టి రింగ్ టోన్ పెట్టుకున్నారు!", చిరాగ్గా ముఖం పెట్టిన అర్జున్ ని తన చేతుల్లోకి తీసుకుంటూ రమేష్ తో అంది ఆనందరావు భార్య పార్వతి.



పార్వతీ రమేష్ ల సంభాషణ పట్టించుకోకుండా, "హలో!" అంటూ ఫోన్ పట్టుకుని ఇంటి బయటకు వెళ్ళిపోయాడు ఆనందరావు.



"హలో ఆనందరావు గారూ! నేనూ! మీ ఎదురింటి రంగనాథం మాట్లాడుతున్నాను. మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలండీ", అన్నాడు రంగనాథం కంగారుగా.



"ఏమిటీ? ఏం జరిగిందీ?? కొంచెం వివరంగా చెప్తారా?", ఆందోళన చెందుతూ అడిగాడు ఆనందరావు.



"మీరు వార్తలు చూడలేదా? నిన్న రాత్రి మీ ఇంటి మేడ పైకి గ్రహాంతరవాసులు దిగారు!! వాళ్ళు మన ఊరిని ఏం చేస్తారో అని అందరూ భయపడిపోతున్నారు!", అసలు విషయం చెప్పాడు రంగనాథం.



ఆ మాటలు విన్న ఆనందరావు గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయ్. హడావుడిగా పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్ళి, బెడ్రూంలో ఉన్న సూట్ కేసులు ముందుగదిలోకి లాక్కుంటూ వచ్చి, "పార్వతీ! పద! తొందరగా మనింటికి వెళ్ళాలి!", అన్నాడు ఆయాసపడుతూ. ఎందుకన్నట్లు ఆనందరావు వంక ఆశ్చర్యంగా చూస్తూ ఏం మాట్లాడాలో తెలియక నిలబడిపోయింది పార్వతి.



"ఏమైంది నాన్నా? ఎందుకంత కంగారుగా ఉన్నావ్? ముందు నువ్వు కూర్చో", అంటూ మంచినీళ్ళు తీసుకురమ్మని తన భార్య విమలకు సైగ చేశాడు రమేష్.



"మన ఇంట్లోకి గ్రహాంతరవాసులొచ్చారటరా! వాళ్ళు ఏ పని మీదొచ్చారో మనకు ఏ హాని తలపెట్టారో ఏమో! తలుచుకుంటూ ఉంటే ఒణుకు పుడుతోంది", అన్నాడు ఆనందరావు తనకు పట్టిన చెమటలు కండువాతో తుడుచుకుంటూ.



"ఊరుకోండి నాన్నా! గ్రహాంతరవాసులేంటీ? మన ఇంటికి రావడమేంటీ? నీకెవరో అబద్ధం చెప్పినట్లున్నారు. అనవసరంగా కంగారు పడకు", అన్నాడు రమేష్.



"లేదురా! ఆ విషయం వార్తల్లో కూడా వచ్చిందని అంటూ ఉంటే అబద్ధం ఎలా అవుతుందీ?", విమల తెచ్చిన నీళ్ళు అందుకుంటూ అన్నాడు ఆనందరావు.



"ఏ ఛానెల్ వాళ్ళు చెప్పారూ?", అడిగాడు రమేష్.



"ఏమో! నాకదంతా తెలీదు. నేనైతే బయలుదేరుతున్నానురా. పార్వతీ! త్వరగా రా!", అన్నాడు ఆనందరావు. 



"గ్రహాంతరవాసులను ఇంతవరకూ చూసినవాళ్ళెవ్వరూ లేరట. ఇంతవరకూ వచ్చిన వార్తలన్నీ అనుమానాలేకానీ నిజమని నిరూపించిన దాఖలాలేవీ లేవు. నేను ఎంబ్రాయిడరీ క్లాసుల్లో చేరాను కదా! రేపటినుంచీ క్లాసులు మొదలవుతాయి. రమేష్ మొత్తం కోర్సుకు ఫీజు కట్టేశాడు. నేను క్లాసులకు వెళ్ళకపోతే డబ్బులన్నీ వృధా అయిపోతాయి. మరోసారి మీరు విన్నది నిజమో కాదో తెలుసుకోండి", అంది పార్వతి ఆనందరావుతో.



"అబ్బా! నువ్వూ నీ క్లాసుల గోలా! అవన్నీ కాలక్షేపం కోసమే తప్ప మనకు వాటివల్ల ఉపయోగమేమీ ఉండదు. నువ్వొచ్చినా రాకపోయినా నే వెడుతున్నా అంతే!", ఇక చర్చకు ఆస్కారం లేకుండా తేల్చి చెప్పేశాడు ఆనందరావు.



చేసేది లేక ఆనందరావుతో తమ ఊరికి బయలుదేరింది పార్వతి. ఆనందరావుకు అసలే హై బీపీ షుగరూ ఉన్నాయనీ, బస్సు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయేమోనని సందేహించిన రమేష్, పార్వతీఆనందరావులను తన కారులో పల్లెటూరికి తీసుకెళ్ళిపోవడానికి నిర్ణయించుకుని వారితో బయలుదేరాడు. రెండుగంటల కారు ప్రయాణం తర్వాత తమ ఇంటి పరిసరాలకు చేరుకున్నారు ఆనందరావు దంపతులు. ఆ సమయానికి తమ ఇంటి ఆవరణకు కొద్ది దూరంలో కొందరు గ్రామస్థులు గుమిగూడి ఏదో విషయం చర్చించుకుంటున్నారు. కారు దిగుతూనే ఆనందరావు వారి వద్దకు వెళ్ళాడు. ఆనందరావు వెంట రమేష్ కూడా వెళ్ళాడు.



ఆనందరావును చూస్తూనే పాలవ్యాపారి మల్లేశం, "రండి రండి! మీకోసమే అంతా ఎదురుచూస్తున్నారు! గ్రహాంతరవాసులు నిన్న రాత్రి మీ డాబాపైకి దిగారు", అని అన్నాడు.
"అవునయ్యగారూ! వాటిలో ఒక గ్రహాంతరవాసి మాకు సుస్పష్టంగా కనపడింది. అది గుండుగా ఉంది! దాన్నుండీ గుప్పుగుప్పుమని ఒకటే నల్లటి పొగలు", భయమూ, ఆశ్చర్యమూ కలగలిపిన కంఠంతో అంది ఆనందరావు పనిమనిషి మాణిక్యం.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - శ్రీమతి 2.O - by k3vv3 - 05-06-2025, 02:00 PM



Users browsing this thread: