26-05-2025, 06:02 PM
అక్కడ నా పని ఎం లేనందు వలన అంతకు ముందు పల్లవిని తన ఫ్రెండ్స్ తో ఉన్నామన్న రూమ్ వైపుకు వెళ్లాను , నా కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లు ముగ్గురు రెడీ గా ఉన్నారు.
"ఎవరు వచ్చారు ? లొంగి పొండి అని మైక్ లో వినబడుతుంది ఎం జరుగుతుంది ఇక్కడ" అంది పల్లవి నన్ను చూడగానే.
అన్నీ వివరంగా దార్లో చెప్తాను , ముందు మీరు బయలు దేరండి అంటూ హాల్ లొంచి ఇంకో రూమ్ లోకి తీసుకొని వెళ్లాను , అక్కడ నుంచి ఓ చిన్న కారిడార్ ఉంది ఆ కరిడార్ చివర ఓ బ్లాక్ డోర్ ఉంది నా దగ్గర ఉన్నా కీ కార్డు తో ఆ డోర్ ఓపెన్ చేసి వాళ్ళతో పాటు అక్కడ ఉన్న స్టెప్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ లోని ఓ రూమ్ లోకి వెళ్ళాము.
హాల్ లో ఉన్నప్పుడే తెలిసింది స్వామీజీ ధ్యాన మందిరం లో ఏకాంతంగా ఉన్నారు అని.
మేము వచ్చిన రూమ్ కి కార్నర్ లో ఓ పెద్ద బీరువా ఉంది , వాళ్ళ సాయంతో ఆ బీరువాని పక్కకు నెట్టగా దాని వెనుక ఓ ద్వారం ఉంది , దాని ఓపెన్ చేసి ,బీరువాను యధా విధిగా తన స్తానం లోకి నెట్టి లోపల నుంచి డోర్ ని క్లోజ్ చేసి టార్చ్ లైట్ వెలుతురులో వాళ్ళను ముందుకు నడిపించాను.
రావుా గారు ఇక్కడ నుంచి హైదరాబాదుకు వెళ్ళాక ముందు రోజు ఈ రహస్య మార్గం గురించి చెప్పాడు , ఏదైనా అత్యవసరం అయితే స్వామీ ఈ రూట్ ని ఉపయోగించు కొంటాడు , అయన వాడకుండా చేయాలి అంటే దాన్ని లోపల నుంచి లాక్ చేస్తే ఆశ్రమం లొంచి ఓపెన్ చేయడానికి ఉండదు అని. వాడికి టైం ఉంటె తప్పకుండా ఈ రూట్ వాడుకొని ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అందుకే ఆ ఛాన్స్ ఇవ్వకుండా దానిని లాక్ చేసేసాను వాడికి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు.
ఓ 10 నిమిషాలు నడిచిన తరువాత ఆశ్రమం వెనుక వైపున అడివిలోకి తీసుకెళ్లింది ఆ రహస్య మార్గం. ముగ్గురం అక్కడా నుంచి పైకి వచ్చాకా వాళ్ళను కొద్దీ దూరం నడిపించుకుని వచ్చాను రోడ్డు వైపుకు, నా బైక్ కి ఆక్కడికి కొద్దీ దూరం లో నే పార్క్ చేసి ఉంచాను.
బైక్ మీద సర్దుకొని కూచోండి టౌన్ లోకి వెళ్ళాలి అని చెప్పి నేను ముందుకు సర్దుకొని కూచొగా మిగిలిన ముగ్గురు నా వెనుక సర్దుకొని కూచోన్నారు, చిన్నగా బైక్ మీద టౌన్ కి వచ్చాము అప్పటికి టైం దాదాపు 9 కావస్తు ఉంది.
బైక్ ని రోడ్డు పక్కన ఓ బిల్డింగ్ దగ్గర వదిలి పక్కనే ఉన్న బస్సు స్టాప్ లో నిలబడ్డాము కొద్దిసేపు సరిగ్గా ఆ టైం లో ఆ టౌన్ మీదుగా కేరళకు వెళ్లే ఓ ప్రైవేట్ బస్సు లో ముందుగా 4 సీట్లు రిజర్వు చేసి ఉంచాను. మేము నిలబడ్డ ఓ 10 నిమిషాలకు ఆ బస్సు వచ్చింది బస్సులోకి ఎక్కి మాకు కేటాయించిన సీట్లల్లో కూచొగా బస్సు బయలు దేరింది.
"ఇంతకూ నువ్వు ఎవరు , ఎక్కడికి వెళుతున్నాము ఈ బస్సులో , మమ్మల్ని సిటీ కి తీసుకొని వెళ్లకుండా ఎక్కడికి తీసుకొని వెళుతున్నావు" అంది పల్లవి.
"తొందర వద్దు, కొద్దీ సేపు అగు అన్నీ చెప్తాను"
మేము ఎక్కింది 2x2 స్లీపర్ , మేము ఎడం వైపు సీట్లు , మాకు కుడివైపు సీట్లు అక్క చెల్లెల్లు ఇద్దరు ఆక్రమించుకున్నారు. మేము ఎక్కినా 30 నిమిషాలకు రోడ్డు పక్కన దాబా లో బస్సు అపి 20 నిమిషాలు బస్సు ఆగుతుంది , డిన్నర్ చేయాల్సిన వాళ్ళు డిన్నర్ చేయండి అని డ్రైవర్ చెప్పగా ముగ్గురితో కలిసి దాబాలో ఓ కార్నెర్ సీట్ లో కూచొని ఫుడ్ ఆర్డర్ చేసి , జరిగింది అంతా వాళ్లకు చెప్పాను.
"మరి ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వెళుతున్నావు" అన్నారు అక్కా చెల్లెళ్లలో ఒకరు.
"ఇప్పుడు మీరున్న పరిస్థిలో మీ ఇంటికి వెళితే మీకె కాకుండా మీ ఇంట్లో వాళ్లకు కూడా ఇబ్బందే , మిమ్మల్ని ఓకే నేచర్ క్యూర్ సెంటర్ కి తీసుకొని వెళుతున్నాను , అక్కడికి మీ పేరెంట్స్ వస్తారు , మీరు అక్కడ ఓ నెల ఉంది ఆ తరువాత మీ ఇంటికి వెళ్ళవచ్చు"
మేము మాట్లాడుతూ ఉండగా ఫుడ్ వచ్చింది , తిని బస్సు ఎక్కాము. మాకు పై సీట్లు వచ్చాయి, మేము చేరే సరికి రేపు ఉదయం 8 గంటలు ఆవుతుంది ఆ ప్లేస్ కి.