Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#93
శ్రీమతి 2.O
రచన: తాత మోహనకృష్ణ






రాజేశ్వరి కి పెళ్ళయి ఇరవై సంవత్సరాలు దాటింది. భర్త తో హ్యాపీ గానే ఉంది. పిల్లలు చదువుకోసం ఫారిన్ వెళ్లారు. ఇంట్లో ఉన్నది తను, భర్త రామారావు మాత్రమే. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలను చూస్తే, వాళ్ళు లైఫ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో.. అని తెగ ఫీల్ అయ్యేది రాజేశ్వరి. నేటి జనరేషన్ స్పీడ్ ని చూసి.. తను కుడా స్పీడ్ ని అందుకోవాలని అనుకుంది రాజేశ్వరి. పెళ్ళైన కొత్తలో.. ఇంత ఎంజాయ్ చెయ్యడానికి లేదు తనకి.. రోజులే వేరు కదా.. ! అని తన గతం గుర్తు చేసుకుంది.. 



*****
"మన అమ్మాయి రాజేశ్వరికి మంచి సంబంధం వచ్చింది.. " అన్నాడు భార్య తో రాజీవ్.
 
"అబ్బాయి ఏం చేస్తున్నాడండీ.. ?". 



"గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు.. "



"అమ్మాయిని కుడా ఒక మాట అడగండి.. " అంది భార్య.
 
"అమ్మాయి రాజేశ్వరి నా మాట ఎప్పుడూ కాదనదు. అయినా, మనకన్నా బాగా ఎవరు ఆలోచిస్తారు చెప్పు.. !" అని సమర్దించుకున్నాడు రాజీవ్.



అప్పట్లో.. రాజేశ్వరికి ఒక్క మాట కుడా చెప్పకుండా, పెళ్ళి ఖాయం చేసేసారు. రామారావు కు మాత్రం అమ్మాయి బాగా నచ్చింది.. ఒప్పుకున్నాడు. తండ్రి మాటకు విలువ ఇచ్చి పెళ్ళి చేసుకుంది రాజేశ్వరి. భర్త ఎప్పుడూ ఆఫీస్ తో బిజీ గా ఉండేవాడు. ఇంట్లో వంట, ఇంటి పని చేసుకోవడం.. అత్తగారికి, మావగారికి సేవలు చెయ్యడం.. తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన భర్త కు సేవలు చెయ్యడం.. ఇలాగే రాజేశ్వరి జీవితం సాగిపోయేది. ఎప్పుడైనా.. ఒక సినిమాకి తీసుకుని వెళ్ళేవాడు రామారావు. తర్వాత పిల్లలు పుట్టేసారు. వాళ్ళని పెంచి, పెద్ద చెయ్యడానికే సరిపోయింది ఇన్ని సంవత్సరాలూ.. 



కొన్నాళ్ళకి అత్తగారికి ఒంట్లో బాగోలేకపోవడం.. ఆమెకి దగ్గరుండి.. మంచం పైనే అన్ని సేవలు చేసేది రాజేశ్వరి. తర్వాత కొంత కాలానికి అత్తగారు కాలం చేసారు. తర్వాత మావగారి వంతు. ఆయనకీ సేవలు చేసింది రాజేశ్వరి. ఆయన కాలం చేసిన తర్వాత.. రాజేశ్వరి కి నలభై దాటేసాయి. ఇప్పుడు పిల్లలు పెద్దవారు అయ్యారు.. చదువుకోసం ఫారిన్ వెళ్లారు. ఇప్పుడు కొంచం తీరిక ఉన్నా.. వయసు లేదు.. ఓపిక తగ్గింది. 



*****
అప్పుడే.. రోబో సినిమా చూసింది రాజేశ్వరి.. నా చిన్నప్పుడు ఉన్న సినిమాలే వేరు అనుకుంది రాజేశ్వరి.. తర్వాత రోబో శ్రీమతి 2. O వచ్చింది. సడన్ గా ఒక ఆలోచన వచ్చింది. 
'నేను ఎందుకు మారకూడదు.. ? ఇప్పుడు లైఫ్ ని ఇప్పుడు ఎందుకు ఎంజాయ్ చెయ్యకూడదు.. ? ఎవరు ఏమనుకుంటే నాకేంటి.. ? శ్రీమతి నుంచి శ్రీమతి 2.O గా మారతాను' అని డిసైడ్ చేసుకుంది రాజేశ్వరి.. 



రోజు సాయంత్రం.. నీట్ గా రెడీ అయి.. భర్త కోసం వెయిట్ చేస్తోంది రాజేశ్వరి.. 



"ఏమండీ! రోజు ఎందుకు ఇంత లేట్ అయ్యింది.. ?"
"ఎవరండీ మీరు.. ? నేను పొరపాటున వేరే ఇంటికి వచ్చినట్టున్నాను.. సారీ.. " అని చెప్పి వెళ్ళబోయాడు రామారావు.. 
"నేనేనండీ.. మీ శ్రీమతి రాజేశ్వరి.. "
"అవును.. గుర్తుపట్టనేలేదు.. ఎంత మారిపోయావు.. హెయిర్ స్టైల్ మార్చావు.. ఎప్పుడూ చీరకట్టే నువ్వు.. డ్రెస్ లో మెరిసిపోతున్నావు.. "
"అట్టే.. పొగడకండీ.. ! ఇదేమి చూసారు. నేను పెళ్ళైన కొత్తలో ఎంజాయ్ చేద్దాం అనుకున్నవన్నీ.. లేటెస్ట్ గా ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను.. "
"ఏమిటో.. అవి.. ?"
"మీరు రేపటి నుంచి.. నన్ను 'డార్లింగ్' అని అనాలి.. నేను మిమల్ని 'రామ్' అంటాను.. "
"అదేమిటి.. ?"
"ఇప్పుడు అమ్మాయిలు అందరూ ఇలానే భర్తలను పిలుస్తారు.. "
"ఇప్పుడు మీరు నన్ను ఎత్తుకుని.. గిరి గిర తిప్పాలి.. సినిమా లో హీరో చేసినట్టుగా.. మొన్న కొత్తగా పెళ్ళైన రాధ ని వాళ్ళాయన తిప్పడం చూసాను రామ్"
"పెళ్ళైన కొత్తలో.. అయితే చాలా స్లిమ్ గా ఉండేదానివి. ఇప్పుడు ఏమో రుబ్బు రోలు లాగ ఉన్నావు.. ఎలా తిప్పను.. ? నా నడుము పడిపోతుందే.. !"
"నొప్పికి మందు రాస్తాను లెండి.. తిప్పండీ!.. పెళ్ళైన కొత్తలో అడగలేకపోయాను.. "
"అంతే అంటావా మరి.. !"
"అంతే.. !!!"



మొత్తానికి రామ్ కష్టపడి.. శ్రీమతి కోరిక తీర్చడానికి ప్రయత్నించగా.. నడుము పట్టేసింది. చెప్పిన ప్రకారమే.. రాజేశ్వరి మందు పూసింది.. తన కోరిక ఒకటి తీరినందుకు చాలా హ్యాపీ అయింది రాజేశ్వరి. 



"ఇప్పుడు నొప్పి తగ్గిందా రామ్.. ?"
"ఇప్పుడు బాగానే ఉందిలే.. "



"నెక్స్ట్ మన పెళ్ళిరోజు వస్తోంది కదండీ! రోజు సూపర్ గా ప్లాన్ చేస్తున్నాను. ఒకప్పుడు, ఎప్పుడూ ఇంట్లోనే ఉండే నా లైఫ్ ని.. ఇప్పుడు కొత్త గా లేటెస్ట్ గా ఉండాలని అనుకుంటున్నాను.. "
"దానికి నేను ఇంకా ఏమిటి చెయ్యాలో.. ?"
"మీకు మాత్రం ఎంజాయ్ చెయ్యాలని ఉండదా చెప్పండీ.. ! రేపు మనం ఉదయం సినిమా కు వెళ్ళాలి.. మర్చిపోకండీ.. ! కార్నెర్ సీట్స్ బుక్ చెయ్యండి. తర్వాత.. ఏం చెయ్యాలో మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు.. అంతే.. ! ప్రిపేర్ అయిపోండి. తర్వాత మంచి హోటల్ లో ఫుడ్ తిని.. ఎంజాయ్ చేద్దాం "
"తప్పదా.. రాజేశ్వరి.. ?"
"ఇప్పట్లో భర్తలు.. ఇంకా చాలా చేస్తున్నారు.. నా కోసం మాత్రం చెయ్యలేరూ రామ్.. ? " అని బుగ్గ గిల్లింది రాజేశ్వరి 
"ఇలా ఒక్కసారిగా అన్నీ అడిగితే.. ఎలాగే రాజేశ్వరి.. "
"రాజేశ్వరి కాదు.. మర్చిపోతున్నారు.. "
".. అదే.. డార్లింగ్.. ఎలా చెప్పు.. ?"
"తప్పదు రామ్.. "
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - గది - by k3vv3 - 23-05-2025, 11:58 AM



Users browsing this thread: 1 Guest(s)