Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
దీపాల వెలుగులో వారణాసి ధగధగలు——
స్వర్గం దిగివచ్చిందా అన్నట్లు కాశీలో వైభవంగా దేవ్దీపావళి ఇరవైరెండు లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగాయి ఘాట్స్ అన్నీ. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి దీపాల వెలుగులో, గంగాతీరంలో ఆకాశం నుండి స్వర్గం దిగి వచ్చిం దా అన్నట్లు కనిపించాయి. ఆరోజు ఒక్క కాశీలోనే ఇరవై
రెండు లక్షల దీపాలు వెలిగించారు. ఒక్క చంద్రవంక ఘాట్లోనే పన్నెండు లక్షల పైన దీపాలు వెలిగించారు. 



వీటిలో లక్షదీపాలను ఆవుపేడతో తయారుచేశారు. పశ్చిమతీరంలోని ఘాట్స్లపై, తూర్పుతీరంలోని ఘాట్లపై దీపాలు వెలిగించారు. చెరువులు, కాశీసరస్సులు, గంగా- గోమతి ఒడ్డున ఉన్నఘాట్లలో లక్షలాదిగా దీపాలతో వెలిగిపోయాయి. ఇరవైరెండు లక్షల దీపాల కాంతితో కాశీ ప్రకాశవంతమైనది. అయోధ్య లోని రామాలయ రూపాన్ని కూడా తీర్చిదిద్దారు. పదకొండు వేల దీపాలతో
ఆకృతి చెక్కారు. రేజు దేవతలు కాశీలోకి దిగివస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. రామాలయ దృశ్యం
చూపరులందరినీ ఆకర్షించేలా ఉంది. 



కాశీలో అధ్బుతమైన దృశ్యం కనువిందు చేసింది. ఎనభైనాలుగు ఘాట్లపై ఇరవై రెండు లక్షలకు పైగా దీపాలు వెలిగించడంతో కాశీ స్వర్గాన్ని తలపింపజేసింది. కాశీలోకి అన్ని ఘాట్ అందాలు హృదయాన్ని
ఆహ్లాదపరచాయి. భక్తుల రద్దీ అసామాన్యము. మెరిసే దీపాల వెలుగులో స్నానమాచరించే ఘాట్లు చాలా అందంగా కనబడినాయి. కాశీ ఘాట్లపై వెలుగుతున్న దీపాలను చూస్తుంటే నేలపై నక్షత్రాల రేకులు విప్పినటుల అనిపిస్తుంది. అంతే కాకండా దీపాలతో వెలిగే పురాతన ఆలయాలవైభవం కూడా మనకు కనబడుతుంది. 



సారి దేవ్దీపావళి రోజున కాశీనుండి ప్రపంచం మొత్తానికి సనాతనీకులందరూ ఒకే వర్గం అనే సందేశాన్ని అందించారు. ఎనభైనాలుగువఘాట్ వద్ద జరిగే కార్యక్రమాల ధ్వారా ప్రపంచంలోని డెబ్బై దేశాల రాయబారుల ముందు ఏక్ భారత్, శ్రేష్ఠభారత్ స్వావలంబన భారత్, ధృడభారత్ రూపాన్ని ప్రదర్శించారు. 
కార్యక్రమముతో యాత్ర ముగిసినది. 



నేను యాత్ర గురించి రాసినది అణువంత- రాయవలసింది. ఆకాశమంత. 
చూసిన ప్రదేశాలు స్వల్పమే- చూడవలసినవి ఎన్నో, ఎన్నెన్నో కలవు. 
కాశీకి ఒకటి రెండు సార్లు వెళ్ళినంత మాత్రాన మనము అన్నీ చూడలేము. కనీసం అరడజను సార్లు వెళితే అప్పటికి మనము ముప్పైశాతం చూడగలము. చూసి తరించేవి, చూసి చూసి తరించేవి ఎన్నో ఎన్నెన్నో కలవు. 
———————————శుభంభూయాత్‌——————————————————-
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) - పొలిమేర - పార్ట్ 2 - by k3vv3 - 19-05-2025, 05:01 PM



Users browsing this thread: 1 Guest(s)