Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
సాయంత్రం పంచామృతాలు, ఫలోదకములు, భస్మము, పసుపు, కుంకుమది సుగంధ ద్రవ్యములతో
అభిషేకము కనులపండుగగా, వైభవోపేతముగా, నిర్విఘ్నముగా చేసాము. 



రుద్రం దావయతీతి రుద్రం శంకరోతీతి శంకరః
రుద్రం అనగా ఏడుపు. బాధ. దుఃఖం. వీటిని మననుంచి ద్రవించ చేయగలిగినది, కడిగివేయ గలిగివది రుద్రము. శం అనగా శుభము. మనకు శుభములను ప్రసాదించగలిగిన వాడు శంకరుడు. 



మేము పవిత్ర కార్తీకమాసములో వారణాసి పట్టణంలో గంగానది ఒడ్డున శివ అర్చన, అభిషేకములు
అతి ఘనంగా ఆరాధనగా పూర్వకంగా చేసితిమి. 
—————————————————————-
మరునాడు ప్రాతఃకాలముననే అనగా ఉదయం నాలుగు గంటలకే మూడు బస్సులలో వారణాసి నుండి బయలుదేరాము. కాశీనుండి ప్రయాగ దూరం వంద కిలోమీటర్లు. వాస్తవంగా దీనిని త్రివేణిసంగమం అని కూడా అంటారు. గంగా, యమున మరియు సరస్వతీ నదుల సంగమమే ఈప్రయాగ. 



పన్నెండు ఏళ్ళ కొకసారి కుంభమేళా జరుగును. శాక్తేయులు అత్యధికంగా ఆరాధించే పుణ్యక్షేత్రాల్లో అలహాబాద్ శక్తిపీఠం ఒకటి. సతీదేవి వేలు పడిన దివ్యక్షేత్రమని విశ్వసించబడుచున్నది. 
అమ్మవారిని మాధవేశ్వరిగను, పరమశివుడిని కాలభైరవుడుగా ఆరాధిస్తూంటారు. ఈమెను అలోపి/ లలితా దేవి అని పిలుస్తుంటారు. అలోపి అంటే అదృశ్యమైన వ్యక్తి. ప్రతి ఆలయంలో కనీసం ఒక విగ్రహం లేదా చిహ్నం అమ్మవారిని పూజించడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విగ్రహం లేదు, చిహ్నం లేదు. చెక్క డోలీపై దేవత ఉందని మనము ఊహించుకోవాలి. అలోపి మాత కొత్తగా పెళ్ళయిన వదువు. దొంగలు వివాహబృందంపై దాడిచేసినప్పుడు ఆమె పల్లకి నుండి అదృశ్యమయింది. వధువు ఆశ్చర్యకరంగా కనిపించకుండా పోవడంతో ఆమెను అలోపి మాతగా
పూజిస్తారు. 



మొదటగా త్రివేణిసంగమంలో పుణ్యస్నానలాచరించి అమ్మవారిని దర్శించుకున్నాము. ఇక్కడ నుండి బయలుదేరి బడే హనుమాన్ మందిరము నకు వెళ్ళాము. హనుమాన్జీ నిద్రిస్తున్న స్థితిలో నున్న ఏకైక ఆలయం ఇది. 
ఆలయం లోపల శయన భంగిమలోన ఉన్న హనుమంతుని దక్షిణాభిముఖ విగ్రహం ఉన్న గర్భగుడి. 



మరియు సగభాగం నీటిలో మునిగి ఉండును. తల ఉత్తరాభిముఖుడై పాదములు దక్షిణవైపుగా తొమ్మిది అడుగుల వెడల్పులో ఉండును. వీరముద్ర ఆకారములో ఉండును. విశాలమైన తల, మోకాళ్ళ వరకూ చేతులు విశాలమైన వక్షఃస్థలము, తొడలు- మొత్తము మూడు అంతస్తులలో ఉండును స్వామి వారి విగ్రహము.
 
ఇక్కడ నుండి బయలుదేరి సీతామర్హి కి వెళ్ళాము. సీతమ్మవారు ఇక్కడ దొరికిన ప్రదేశము. 
జనకమహారాజు నాగలితో భూమిని దున్నుతుండగా లభించిన ప్రదేశము. జిల్లా. నేపాల్కు సరిహద్దులో ఉంది. చుట్టూ హలేశ్వర్ స్థాన్, జానకీమందిర్ కలవు. ఎంతో శోభాయమానంగా, చుట్టూ పచ్చని వాతావరణముతో చూపరులకు మంత్రముగ్దులను చేసే విధంగా ఆలయ సముదాయముకలవు. 



సీతమ్మవారు తన అవతార పరిసమాప్తి అనగా భూగర్బంలోకి వెళ్ళిపోయిన ప్రదేశముగా కూడా ఇక్కడే. 
ఇక్కడ  తిరుగు ప్రయాణము వారణాసికి బయలుదేరాము. రాత్రి పది గంటలు దాటింది సత్రము చేరే సరికి. 
————-
మరునాడు ఆదిదంపతులైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవము ఎంతో కనుల పండుగగా, రమణీయంగా, శోభాయమానంగా జరిగింది. 



అంబర చుంబిత మహా సంబరం.. 
అధ్బుతం పరమాధ్బుతం..: ఆనందం.. మహానందం
మహాదేవుడు అందరి మనస్సున కొలువైన క్షణమది..
భక్తుల మనోఫలకాలలో ఫాలనేత్రుని ; దివ్యరూపం రూపుదిద్దుకున్న క్షణమది.. 



మహారుద్రాభిషేకానికి .. రుద్ర స్వరూపుడు కైలాసగిరిన ..
ఆనందనర్తనం చేసిన అపురూప క్షణమది.. 
ప్రమదగణాలు ..మహాదేవుని దివ్యకళ్యాణాన్ని చూసి మురిసిన క్షణమది



మహాదేవుడు నీలకంఠునిగా..దిగివచ్చిన శుభలక్షణమది..
అధ్బుతం .. పరమాధ్బుతం..
ఆనందం.. మహదానందం



శ్రీశివపార్వతుల కళ్యాణంతో ఆధ్యాత్మిక నగరి వారణాసి పులకించిపోయింది. భక్తకోటి జయజయధ్వానాల మధ్య ఆదిదంపతుల కళ్యాణం తో సత్రములో సరికొత్త శోభను సంతరించుకుంది. అశేష జనవాహిని కరతాళధ్వనుల మధ్య శ్రీశివపార్వతుల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కల వారణాసి ఆదిశంకరులా నివాసస్థలము కూడా. ప్రణవభూమిగా కూడా
విరాజిల్లుతున్న నగరం. 



పరమశివునికి ఎంతో ప్రీతికరమైన శంఖానాదంతో తొలిఅడుగు వేయడం ఆనవాయితీ. శంఖానాదంతో
మహాదేవుని కళ్యాణఘట్టం ప్రారంభమైంది. విశ్వకళాస్ఫూర్తి పరమేశ్వరుడు, నటరాజును స్తుతిస్తూ
భజనలు, కీర్తనలు మరియు పెక్కు సాంస్కృతిక కార్యక్రమాలు రసరమ్యంగా కొనసాగాయి. 
హైదరాబాద్ నుంచి వచ్చిన ఋత్విక్కులతో వేదమంత్రములతో దాదాపు. రెండు గంటల సేపు సభా
ప్రాంగణం హోరెత్తిపోయింది. భక్తులు ఉపిరి బిగియపట్టి హరహరమహాదేవ్ అని నినదిస్తుండగా నిరాటంకంగా. కొనసాగింది. ఒకవైపు వేదనాదం, మరొకవైపు ఢమరుకనాధంతో కొనసాగిన కళ్యాణఘట్టం రోమాంచితమైంది. అనేకగొంతులు శివపంచాక్షరీ పఠిస్తుండగా ప్రమధగణాలే కైలాసనాథుడిని
అర్చిస్తున్నట్టుగా అనిపిపించింది. 



ప్రమదగణాలతో పరమశివుడు వెలసిన పరమపవిత్ర నగరం వారణాసి. ముక్కోటి దేవతలు దేవలోకమై మనందరి ముందు సాక్షాత్కరించిన భూకైలాలం వారణాసి. ఉఛ్వాస నిశ్వాసాలలో శివనామం ఉప్పొంగిన మహాసాగరమం.. వారణాసి. 



ఇక శ్రీశివపార్వతుల కళ్యాణోత్సవ ఘట్టం అధ్బుతం.. మహాధ్బుతం. సాక్షాత్తు కైలాసమే అగు
వారణాసిలో మహాదేవుడు - శైలజాదేవి చేయందుకొనే కమనీయ క్షణాలని వర్ణిస్తూ ఆదిదంపతుల
కళ్యాణవిశేషాలని వివరిస్తూ సాగింది. సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలమైనా మన హైందవధర్మ
విశేషాలను చక్కగా ఋత్వికులు వివరించి కళ్యాణోత్సవానికి మరింత శోభను తెచ్చారు. 
మరునాడు శ్రీసత్యనారాయణస్వామి వ్రతమును మేము బస చేసిన సత్రములోనే జరిగింది. 



ప్రాముఖ్యత—— హిందూ మత విశ్వాసాల ప్రకారం సత్యనారాయణస్వామి వ్రతం వినడం, ఆచరించడం, చదవడం వలన ఇంటిలోన ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. 
ఆరోజు సాయంత్రం కార్తీకపౌర్ణమి కావున గంగాహారతి చూచుటకు ఘాట్లకు బయలుదేరాము. 
ముందుగానే పడవలు బుకింగ్ లన్నీ చేశారు మా టూరిస్ట్ వాళ్ళు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) - పొలిమేర - పార్ట్ 2 - by k3vv3 - 19-05-2025, 04:59 PM



Users browsing this thread: 1 Guest(s)