Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
ప్రస్తుత ఘాట్ను 1748 లో పేష్వాబాలాజీబాజీ రావు నిర్మించెను. మరల 1774 లో అహల్యాబాయి
హోల్కర్ పునర్మించారు. అక్కడ కూడా పుణ్యస్నానములాచరించి పంచగంగ ఘాట్కు బయలు
దేరాము. 



పంచగంగ ఘాట్‌— పంచగంగా ఘాట్ లేదా బిందుమాదవ్ ఘాట్ గంగానది ఒడ్డున కలదు. మరియు
ప్రదేశంలో సంగమించు ఐదు పవిత్రనదుల పేర్లు పెట్టబడింది. గంగా, సరస్వతి, ధూమపాప, యమునా మరియు కిరణ్. గంగా నది మాత్రమే కనబడి, మిగిలిన నాలుగు అతీంద్రియ వ్యక్తీకరణులుగా మారినట్లు భావిస్తున్నారు. మహాభారత కాలంలో భృగుమహర్షిచే నిర్మించబడిందని నమ్ముతారు. ఇచ్చట కూడా పుణ్యస్నానా లాచరించి మిట్యమధ్యాహ్నానికి మణికర్నికా ఘాట్కు బోట్లో
వెళ్ళాము. ఐదు ఘాట్ ప్రయాణమా బోట్లలోనే సాగినది. 



మణికర్ణికా ఘాట్‌—- గంగానదిపై ఉన్న పవిత్ర ఘాట్ల లో అత్యంత పవిత్రమైన శ్మశానవాటికలలో
ఒకటి. హిందూమతంలో మరణం అనేది ఒకరి కర్మ ఫలితం ద్వారా  గుర్తించడాన్ని మరొక జీవితానికి
ప్రవేశద్వారం గా పరిగణించబడుతుంది. మానవుల్ని ఆత్మ మోక్షాన్ని పొందుతుందని, అందువల్ల ఇక్కడ దహనం చేసినప్పుడు పునర్జన్మ చక్రాన్ని విచ్చిన్నం చేస్తుందని నమ్ముతారు. ఇక్కడ సతీదేవి చెవిపోగులు పడిన కారణంగా పేరు వచ్చింది. ఇది శక్తిపీఠం కూడా. 



ప్రతిరోజూ వందలాదిమంది మణికర్ణికా ఘాట్ వద్ద దహన సంస్కారాలు చూసేందుకు, మృతులకు నివాళులు అర్పించేందుకు వస్తూంటారు. ఇక్కడ కూడా పుణ్య స్నానాలాచరించి సత్రానికి తిరుగు ప్రయాణమైతిమి. 
సాయంత్రము రోజు అందరికీ విశ్రాంతి. షాపింగ్లకు వెళ్ళేవాళ్ళు షాపింగ్లకూ, దర్శనాల గురించి కొందరూ అందరూ తలో దోవన వెళ్ళాము. 



మరునాడు తెల్లవారుదాము రెండు గంటలకే బయలుదేరాము మూడు బస్సుల్లో గయకు. 
అక్కడ విష్ణుగయలో పితృదేవతలకు పిండప్రదానాలు, విష్ణుపాదాల దగ్గర పిండాలు వదలడం మరియు మాంగళ్యగౌరీ శక్తిపీఠం చూశాము. 



కాశీనుంచి ఏడు గంటల ప్రయాణము గయకు. అక్కడ స్నానాదులు కావించుకొని పితృదేవతల కార్య
క్రమములకు కూర్చున్నాము. 
గయయెక్క ప్రాముఖ్యము- కొండలతో చుట్టుముట్టబడిన గయా నగరం. ఫల్గు అనే పవిత్ర నది, నగరం నడిబొడ్డున కలదు. ఇక్కడ మత విశ్వాసాల ప్రకారం పిండప్రదానం( శ్రాద్దకర్మ) కోసం దైవికగమ్యం. రామలక్ష్మణులు, సీతామ్మవారితో కలిసి దశరథమహారాజుకు పిండప్రదానం చేశారని పురాణకథనం. నగరం చుట్టూ మూడు వైపులా చిన్న రాతి కొండలతో( మంగళగౌరి, శంగస్థాన్, 
రామ్శిల మరియు బ్రహ్మయోని) తూర్పు వైపున ఫల్గు నది కలదు. 



గయాసురుని అంత్యకాలంలో విష్ణుమూర్తిని ప్రార్థించగా, ఆయన కోరుకున్న వర ప్రభావంతో ఆయన తల, నాభి, పాదం ప్రాంతాల్లో గయాక్షేత్రాలు ఏర్పడ్డాయి. శిరోగయ మధ్యగా, పాదగయ గా పిలువబడే వీటిలో శిరస్సుకు సంబంధించినది గయాక్షేత్రం గాపిలువబడుచున్నది. 



పాదగయను పిఠాపురం గా వ్యవహరిస్తున్నారు. శ్రాద్దకర్మ కార్యక్రమము ముగిసిన తరువాత పిండాలు తీసుకుని వెళ్ళి విష్ణు పాదాల దగ్గర వదులుతారు. 
పిదప మధ్యాహ్న భోజన కార్యక్రమాలు ముగిసిన పిదప మాంగళ్యగౌరీ దర్శనానికి బయలుదేరాము. 
మంగళ గౌరీ దేవాలయము—— ఇక్కడ మా సతీదేవి వక్షోజాలు పడినందువలన, ఆలయం పోషణకు చిహ్నం గా భావిస్తారు. ఎవరైతే తన దగ్గరకి కోరికలు మరియు వరాలకై అమ్మ దగ్గరకి వస్తారో, వారి సకల కోరికల తీరి విజయవంతంగా తిరిగి వెళతారని ప్రగాఢ నమ్మకం. 



మరల తిరుగు ప్రయాణం కాశీకి. దాదాపు అర్దరాత్రి దాటినది. 
మరుసటిరోజు మన బస చేసిన సత్రములోనే సహస్రలింగార్చన పూజలు జరిగినవి. వచ్చిన బృంద
సభ్యులంతా పాల్గొనిరి. ఆడువారందరూ కుంకుమార్చన పూజలు చేసిరి. 



సహస్రలింగార్చన—— కార్తీకమాసానికి సమానమైనది ఏది లేదు. గంగా నది మించి ఇతర నదేది లేదు. కాశీక్షేత్రము వంటిది భూమండలం మీద ఏదీ లేదు. 



కనుక కార్తీకమాసంలో శివలింగార్చన చేయటం భక్తి ముక్తి దాయకాలుగా మనయొక్క పురాణాలు మనకు చెబుతున్నాయి. మరి భక్తులు ఎటువంటి శివలింగాన్ని అర్చన చేయవచ్చు అనగా వల్మీకము అనగా పుట్టమన్నుతో చేసిన శివలింగము కలియుగమున విశేషమని చెప్పబడినది. శాస్త్రంలో మనకు వల్మీకము నకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటిని అనేక వైదిక కార్యక్రమాలలో వినియోగిస్తారు. కనుకనే పుట్టమన్నును పవిత్రమైనదిగా శాస్త్రం చెబుతుంది. ఇక శాస్త్ర సంబంధ విషయానికి వస్తే పుట్టమన్నుతో శివలింగము చేసి అర్చించటం సత్వర విశేషఫలితం ఇస్తుంది. 



పరమేశ్వరునకు కంఠము నందు అలంకారం అయిన నాగేంద్రుడికి నివాసస్థలం అయిన పుట్ట శివుడికి ఎంతో ప్రీతిని కలిగించును. 



మృత్తికల హనమే పాపం యన్మయా దుష్కూృతాం కృతం అన్న వేదవాక్యం మనకు మృత్తిక స్పర్శనంవల్ల చేతనే, మనయొక్క చెడు స్వభావం, స్వయంకృత పాదములు తొలుగునని పురాణములు చెబుచున్నవి. 



అందుకనేనపుట్టమన్ను పవిత్రమైనది. 
పుట్టమన్ను శివలింగ రూపముగా మట్టిముద్దను చేసిన, అర్చన, అభిషేకం చేయటం సాధారణం, 
సులభమైన మార్గము. మహాలింగార్చన లో 365 లింగములను ఒక క్రమ పద్దతి లో వేద మంత్రము
లతో కైలాస మహా యంత్ర రూపముగా అమర్చి శివలింగాకృతిని ఏర్పరచి మహాన్యాసముతో దేహ ఇంద్రియశుద్ది చేసుకొని నమక చమకములతోనఅభిషేకం చేస్తారు. 



ప్రకారం సంవత్సరంలో ఒక్కసారి చేసినను, ప్రతిరోజు అభిషేకం చేసిన ఫలితం పొందగలరు. ఇక సర్వోత్కృష్టమైన సహస్ర లింగార్చనా వేదమంత్రములతో పదహారు దశలలో ( ఆవరణములు) 1128 లింగములని ఒకదాని తరువాత ఒకటి శివప్రోక్తకైలాస రహస్య మహా యంత్ర ప్రకరణం ప్రకారంగా ఏర్పరుస్తూ చేయటం ఒక మహా అద్భుతం. 



హైదరాబాద్ నుంచి వచ్చిన వేదభ్రాహ్మణులు మాతో కార్యక్రమము చేయించారు. 1128 లింగములు
చేసి ప్రొద్దున సంకల్పము, పూజా విధులు నిర్వహించాము. ఆడవారందరూ లలితా పారాయణ చేస్తూ
కుంకుమార్చన చేశారు. లక్ష పారాయణము చేశారు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) - పొలిమేర - పార్ట్ 2 - by k3vv3 - 19-05-2025, 04:57 PM



Users browsing this thread: 1 Guest(s)