Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#99
అన్నపూర్ణ మందిరము- 
ప్రస్తుత ఆలయాన్ని పదునెనిమదవ శతాబ్దంలో మరాఠా మొదటి పీష్వా బాజీరావ్ నిర్మించెను. పెద్ద స్తంభాల వాకిలితో గర్భగుడి ఉంటుంది. ఆలయంలో అన్నపూర్ణ దేవీ
చిత్రపటం ఉంటుంది. ఆలయంలో దేవత రెండు విగ్రహాలు ఉంటాయి. ఒకటి బంగారంతో, మరొకటి ఇత్తడితో.



 ఇత్తడి విగ్రహం రోజువారీ దర్శనం కోసం అందుబాటులో ఉంది. బంగారు విగ్రహాన్ని సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే చూడవచ్చు. అన్నకూట్ రోజున. అమ్మవారి ఎదురుగా కొంచం ప్రక్కగా ఆడవాళ్ళందరూ కుంకుమార్చన చేశారు లలితా పారాయణంచేస్తూ. 
ఒకసారి శివుడు ప్రపంచం మొత్తం అంతా మాయ ( భ్రమ) అని వ్యాఖ్యానించెను. ఆహారదేవత అయిన పార్వతీదేవి కి రూపం వచ్చి, భూమిపై ఉన్న మొత్తం ఆహారాన్ని అదృశ్యం చేయడం ద్వారా ఆహారం ప్రాముఖ్యతని ప్రదర్శించారని నిర్ణియించుకుంది. ప్రపంచం మొత్తం ఆకలితో నకనక లాడుతూ బాధపడటం ప్రారంభించింది. శివుడు చివరకు ఆహార ప్రాముఖ్యతను గుర్తించి, ఆమె వాకిట వద్దకు
వచ్చి ఆహారం కోసం వేడుకొన్నాడు. పార్వతిదేవి సంతసించి, శివుడికి తన చేతులతో ఆహారాన్ని సమర్పించి, తన భక్తులకోసం వారణాసిలో వంటగదిని తయారు చేసింది. 
అక్కడి అన్నప్రసాదశాలలో ఆరోజు అన్నప్రసాదాన్ని స్వీకరించాము. 



విశాలాక్షి ఆలయం- 
వారణాసి జంక్షన్ నుండి ఐదు కి. మీ. దూరంలో శ్రీకాశీవిశాలాక్షి ఆలయం గంగానది ఒడ్డున మీర్ఘాట్ వద్ద ఉన్నది. పురాణాల ప్రకారం 52 శక్తిపీఠాలలో విశాలాక్షి మణికర్ణిక ఒకటి. సతీదేవి కర్ణకుండలం( చెవిపోగు) ఇక్కడ పడిపోయిందని చెబుతారు. అందుకే మణికర్ణిక అని ఆమె పేరు పెట్టారు. కళ్ళు కూడా ఇక్కడే పడిపోయాయి కాబట్టి విశాలాక్షి అని కూడా పిలుస్తారు. నల్లరాయితో చెక్కబడిన అద్భుతమైన మూర్తి అమ్మవారిది. ఆమె కుడిచేయి అరచేతిలా కమలాన్ని కలిగి ఉంది. అయితే ఆమె క్రిందటికి తిరిగిన ఎడమ చేయి అరచేతి ఖాళీగా దూరంగా చూస్తోంది. అమ్మ వారిని భక్తి ప్రపత్తులతో దర్శించుకుని
కాలభైరవ ఆలయమునకు బయలుదేరాము. 
కాలభైరవ ఆలయం- ఆలయం పాత నగరంలో, కాశీవిశ్వనాథుని ప్రధాన ఆలయానికి మరియు ఘాట్లకు కొద్ది దూరంలో ఉంది. 



సంప్రదాయాల ప్రకారం శివుడు రూపంలో భయాన్ని పోగొడతాడు. అఘోరాలు మరియు తాంత్రికుల ప్రార్థన కేంద్రంగా ప్రసిద్ది చెందిన కాలభైరవ మందిరం అపారమైన మతపరమైనా విలువలను కలిగి ఉందని నమ్ముతారు. శతాబ్దాలుగా వెలుగుతూ పవిత్రమైన అఖండ దీపం మందిరంలో ఆకర్షణీయమైన అంశం. 



దీపం యొక్క నూనెలో ఔషద విలువలు గల గుణాలు ఉన్నాయని భావిస్తారు. కాలభైరవ ఆలయం అద్భుతమైన శిల్పకళను కలిగి ఉంది. ఆలయానికి ముందు భాగంలో కాలభైరవుడి గుడి రక్షణగా ఒక ప్రవేశద్వారం ఉంటుంది. ఆలయం లోపల సుందరమైన ప్రాంగణం ఉంది. ప్రధాన ఆలయం ప్రాంగణం మధ్యలో ఉంది. కాలభైరవుని విగ్రహం వెండి రంగులో ఉంటుంది. 



విగ్రహం కుక్క విగ్రహంపై అమర్చబడి, త్రిశూలం కలిగి ఉంది. ఆలయాల దర్శనం కానిచ్చుకుని మా సత్రమునకు బయలుదేరాము. 



సాయంత్రం గంగా హారతిని దర్శించుకున్నాము. ఎంతో వైభవోపేతంగా, కనులపండుగగా, కాశీపట్టణం
జ్యోతులతో వెలిగిపోతూ ఉంది. 
పరమ పవిత్రమైన వారణాసి నగరంలో ఎటు చూసినా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజూ సాయంత్రం వేళ గంగానదికి నిర్వహించే హారతి యాత్రికులు, భక్తులకు కన్నుల పండుగలా
అనిపిస్తుంది. 



ప్రకాశవంతమైన వెలుగులతో గంగానది అధ్బుతమైన దృశ్యాలను ఆవిష్కరించే గంగా హారతి మనలో
, మన చుట్టూ ఉన్న గొప్ప దైవత్వాన్ని అనుభవించేలా చేస్తుంది. యుగాల నుండి పవిత్ర గంగానదిని
ఆరాధించకుండా రోజూ గడిచిపోలేదు. ప్రతి యాత్రికుడు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన, తమ
ప్రయాణాల జాబితాలో తప్పక చేర్చుకోవాలిసిన కార్యకలాపాల్లో ఇది ఒకటి. ప్రత్యేకమైన గంగా హారతిని
చూడాలనే కోరికతో వారణాసి నగరానికి అన్ని వర్గాల ప్రజలు వస్తూంటారు. 



గంగా హారతిని నిర్వహించే పూజారుల వస్త్రధారణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారు ధోతీ, కుర్తాతోపాటు పొడవైన గంచా( తువ్వాలు) ధరిస్తారు. ఐదు ఎత్తైన పలకలతో కూడిన ఒక ఇత్తడి దీపం, గంగాదేవి విగ్రహం, పూలు, ధూపంవంటి ఇతర పూజా సామగ్రిని హారతి కార్యక్రమం కోసం సిద్దం చేస్తారు. 



వారు నిర్వహించే అపురూప దృశ్యాన్ని చూడటానికి ఆసక్తి గల భక్తులు నగరం నలుమూలలనుండే కాకుండా దేశంలోనూ, బయటి దేశాలనుంచి వస్తూంటారు. చాలామంది దృశ్యాన్ని వీక్షించేందుకు దశాశ్వమేధఘాట్ ఒడ్డున పడవలు ఆపి ఉంచుతారు. చక్కని హారతి దృశ్యాన్ని. తిలకించి సత్రానికి చేరుకున్నాము. 



మరునాడు పంచగంగా స్నానానికి వెళ్ళాము. కాశీమహాక్షేత్రంలో గంగానది తీరాన 64ఘాట్లు ఉన్నప్ప
ట్టికి అందులో ప్రధానమైనవి ఐదు మాత్రమే. వాటిలో అస్సీ, కేదార్, దశాశ్వమేధ, పంచగంగ మరియు మణికర్ణిక ఘాట్లు ఉన్నాయి. 



అస్సీఘాట్‌—  దుర్గాదేవి శుంభ-నిశంభ రాక్షసులను చంపిన తరువాత, తన ఖడ్గాన్ని నదిలో( అస్సి
అని పిలుస్తారు) విసిరిందని పురాణాల ప్రకారం. ఘాట్కు ఆపేరు వచ్చింది. అక్కడ స్నానం చేసి
కేదార్ ఘాట్కు బయలుదేరాము.
 
కేదార్ఘాట్‌—- గౌరీ కేదారేశ్వరాలయానికి నిలయమైన కేదార్ఘాట్ వారణాసిలోకి ఐదు పవిత్ర
ఘాట్ లో ఒకటి. కాశీ భారతదేశ భక్తి మండలిని విశ్వసించినట్లే, కేదారాన్ని కాశీ- కేదార్ ఖండం
యొక్క మండలిని నమ్ముతారు. కేదార్ఘాట్ లో గౌరీ కేదారేశ్వరాలయం గౌరీకుండ్ ఉన్నాయి. కేదార్టఘాట్కు ఆదిమర్ణిక అని నమ్ముతారు. ఘాట్లో కూడా స్నానమాచరించి తదుపరి ఘాట్ దశాశ్వమేధకు బయలుదేరాము. 



దశాశ్వమేధ ఘాట్‌— గంగానది పై ఉన్న వారణాసిలోకి ఒక ప్రధాన ఘాట్. ఇది విశ్వనాధఆలయానికి సమీపంలో ఉంది. ఘాట్కు సంబంధించిన రెండు ఇతిహాసాలు ఉన్నాయి. ఒకటి- శివుడిని స్వాగతించడానికి బ్రహ్మ దీనిని సృజించెను. మరియు మరియు మరొక కథనం ప్రకారం బ్రహ్మ ఇచ్చట
పది అశ్వమేధ యాగాలు చేశారని ప్రతీతి. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) - పొలిమేర - పార్ట్ 2 - by k3vv3 - 19-05-2025, 04:56 PM



Users browsing this thread: 1 Guest(s)