Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#98
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము- 



మదన్మోహన్ మాలవ్యా 1916 లో డా. అనీబెసెంట్ సహాయంతో ప్రారంభించారు. విశ్వవిద్యాలయానికి కాశీ నరేషుడు స్థలము కేటాయించాను. ఇది ఆసియా
లోనే అది పెద్ద విశ్వావిద్యాలయము. 1916లో స్థాపించబడినది. భారతదేశ జాతీయ ప్రాముఖ్యత కలిగిన
విశ్వవిద్యాలయము. 



1300 వందల ఎకరాల విస్తీర్ణంలో వారణాసి యొక్క దక్షిణ అంచున గంగా నది ఒడ్డున ఉన్నది. ప్రాంగణం మధ్యలో శ్రీవిశ్వనాథ మందిరము కలదు. 



తులసీమానసమందిర్‌—- ఇతర దేవాలయాల వలె అది పురాతనమైనది కాదు. 1964 లో నిర్మించబడినది. ఇది రాముడికి అంకితమగు చేయబడింది. మరియు తులసీదాస్రామచరితమానస్ రాసిన అదే స్థలంలో ఉంది. అవధి భాషలో వ్రాసిన రామచరితమనస్ యొక్క శ్లోకాలతో చెక్కబడిన తెల్లటి గోడలు మనకు దర్శనమిస్తాయి.. దీనిని తులసీ బిర్లా మానస మందిర్ అని కూడా పిలుస్తారు. 
ఇక్కడ తులసీదాస్ విగ్రహము, రామలక్ష్మణ, సీతా సమేతముగా హనుమంతుని అందమైన
చిత్రాలు కలవు. 



కాశీ క్షేత్ర మహిమ-
 కాశీ పుణ్యక్షేత్రం గురించి దాని వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. స్థలమహాత్యం గురించి సంపూర్ణంగా వివరించడంతో అంటే దేవతలకు కూడా సాధ్యం కాదేమో.. ?
సముద్రంలో నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం తెలియ జేయడం జరుగుతోంది. 



హిందువులు జీవితంలో ఒక్కసారైనా దివ్య క్షేత్రాన్ని దర్శించాలి. మా దంపతులు ఇది రెండవ సారి కాశీ
రావడము. క్షేత్రదర్శనం వలన బాహ్య సౌందర్య దృశ్యాల కంటే అంతర్ముఖ ప్రయాణానికి సోపానం అవు
తుంది. చిత్త శుద్దితో ఎవరైతే క్షేత్రాన్ని దర్శిస్తారో వారిలోపల అనేక మార్పులు కలిగి, ఆత్మజ్ఞానం
కలిగిస్తుంది. 



1. కాశీపట్టణం గొడుగు లాంటి పంచక్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది. కాశీ క్షేత్రం అనేది బ్రహ్మ దేవుని సృష్టిలోనిది కాదు. 
2. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న నగరం. శివుడు నిర్మించుకున్న ప్రత్యేక పుణ్యస్థలం. 
3. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృతిక నగరం. 
4. స్వయంగా శివుడు నివాసంగా ఉండే నగరం. 
5. ప్రపంచంలో మునులకి అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. 
6. కాశీ భువిపై వెలసిన సప్త మోక్షద్వారాలలో ఒకటి. ద్వాదశ జ్యోతిర్లంగాలలో కాశీ ఒకటి. 



మరునాడు ప్రాతఃకాలముననే లేచి స్నానాదులు కావించుకొని కాశీ విశ్వేశ్వర దర్శనం మరియు
అభిషేకం గురించి తెల్లవారు ఝామున 4. 30 గంటలకు క్యూలో నించున్నాము. 5. 30కల్లా స్పర్శ
దర్శనం కావించుకుని అభిషేకమునకు ఆలయ ఆవరణ లో కూర్చున్నాము. 



అభిషేక మహాత్మ్యము-



విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేక ప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారలతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు. అందువలన శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది



జలం పంచభూతాలలోనూ, శివుని అష్టమూర్తులలోనూ ఒకటి. అప ఏవ ససర్జాదౌ అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాన్నే సృజించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే. 
మంత్రపుష్పంలోని యోపా మాయతనంవేద ఇత్యాది మంత్రాలలో నీటి యొక్క ప్రాముఖ్యం విశదీకరింపబడింది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. 



భగవంతుని పదహారు ఉపచారాలతో పూజిస్తారు. ఇతర ఉపచారాల కంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది. 



ప్రజాపాన్ శతరుద్రీయా అభిషేకం సమాచరేత్‌’ అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయా పటిస్తూ
అభిషేకం చెయ్యాలి. పూజయా అభికేహేమో హోమోత్తర్పణ ముత్తమ్మా - తర్పణాఛ్చ జపః శ్రేష్టో హ్యాభిహేకః పరో జపాత్‌’ 



పూజ కంటే హోమము- హోమము కంటే తర్పణమ్- తర్పణం కంటే జపము- జపంకంటే అభిషేకం శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెబుతారు. 



మేము పంచామృతాలతోనూ, జలం తోనూ అభిషేకించు జలమును తీసుకువెళ్ళి విశ్వనాథ లింగం మీద పోసి మరల స్వామి వారిని దర్శించుకుని బయటకు వచ్చాము. 



కాశీ అనగా( మెరుస్తున్న) అని అర్థం. ప్రస్తుత నిర్మాణాన్ని 1780 లో ఇండోర్ కు చెందిన మరాఠా రాణి అహల్యాబాయి నిర్మించారు. కాళీవిశ్వనాథ్, గంగానది మధ్య దూరంను సరళతరం చేయడానికి కారిడార్ నిర్మించారు. దానిని నడవా యందురు. ఆలయ వైశాల్యం యాభైవేల చదరపుమీటర్లు
పెంచారు. నలభైకి పైగా శిథిల దేవాలయాలను పునర్నిర్మించారు. యాత్రికుల సౌకర్యార్థం ఇరవై
మూడు కొత్త భవనాలు నిర్మించారు. 



మందిరం లోని ప్రధాన దేవతాలింగం అరవై సెంటీమీటర్ల పొడవు, తొంభై సెంటీమీటర్ల చుట్టుకొలతలో వెండి పానవట్టం లో ఉంది. ప్రధాన దేవాలయం చతుర్భుజాకారంలో తుట్టె ఇతర దేవతా మూర్తుల ఆలయాలతో ఉంటుంది. 



లోపలి గర్భగృహ లేదా గర్భాలయానికి దారితీసా సభాగృహం ఉంది. జ్యోతిర్లింగం ఒక ముదురు గోధుమరంగు శిల. ఇది గర్భగుడిలో ప్రతిష్టించబడి, వెండి పానవట్టం పై ఉంటుంది. మందిర నిర్మాణం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి దానిలో ఆలయం పై ఒక శిఖరం ఉంటుంది. రెండవది
బంగారు గోపురం, మూడవది జెండా త్రిశూలాలతో కూడిన బంగారు శిఖరం. 



ఆలయానికి సంబంధించిన 15. 5 మీటర్ల ఎత్తైన బంగారు శిఖరం, బంగారు ఉల్లిపాయ గోపురం ఉన్నాయి. 1835 లో మహారాజా రంజిత్సింగ్ ఇచ్చిన మూడు గోపురాలు స్వచ్చమైన బంగారంతో చేయబడ్డాయి. 



కాశీవిశ్వనాథ్ ఆలయానికి, మణికర్ణిక ఘాట్కు మధ్య గంగానది వెంబడి శ్రీకాశీవిశ్వనాథ్ ధామ్ కారిడార్ ను నిర్మించారు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) - పొలిమేర - పార్ట్ 2 - by k3vv3 - 19-05-2025, 04:55 PM



Users browsing this thread: 1 Guest(s)