Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#97
అందుకనే ఇక్కడ హనుమంతుడి భారీవిగ్రహం, ఆయన భుజస్కంధాలపై కూర్చున్న రామలక్ష్మణులు మనకు దర్శనమిస్తారు. ద్వాపరయుగంలో పాండవులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేశారని అంటారు. అందుకనే కొండని పాండవుల మెట్ట అని కూడా అందురు. 



మిశ్రితతీర్థం, దధీచి తపస్థలం—— 
దధీచి మహర్షి దానవసంహరణార్థం తన ఎముకలను ఇచ్చట ప్రాణత్యాగ మొనర్చి ఇచ్చిన ప్రదేశం. సమయమున సకల భూమండలములోని జలరాశులను
ఇచ్చటకి రప్పించి ఆయన పుణ్యస్నానాదులు నిర్వహించిన ప్రదేశము. దధీచిమహర్షి ఎముకలతో తయారు చేసిన వజ్రాయుధమే ఇంద్రుని ఆయుధము. ఆయన తపశ్శక్తి అంతయు అందులో నిక్షప్తమై యున్నది. 



ఇవే కాకుండా నైమిషారణ్యములో ప్రతి ఇల్లు ఒక దేవాలయము. ఇంకా ఎన్నో పుణ్య ప్రదేశాలున్నాయి. 
ఇదొక పవిత్ర స్థలము. కలిదోషం లేని భూమి మీద నడిస్తేనే మానవులు పాపాల నుండి విముక్తు
లవుతారని ప్రసిద్ది. 



నైమిషారణ్యమును చూసిన కిష్కింద జ్ఞాపకం వస్తుంది. అదేనండీ.. మన హనుమంతుల వారి బంధు పుత్ర మిత్ర సమేతంగా మనకు కనబడతారు. వానరాలు జాస్తి. ఒక్క మనిషుంటే పది వానరాలుంటాయి.



కానీ అవి మనని ఏమీ చేయవు. ప్రక్క నుంచి వెళ్ళిపోతూంటాయి. నాకు అలా స్వీయానుభవమైంది. 
మెట్లు దిగి వస్తుంటే నా అంత వానరము, నా ప్రక్కనుంచి దిగుకుంటూ వెళ్ళింది. 



మధ్యాహ్నము భోజనాలు కానిచ్చి చలో అయోధ్య- రామజన్మభూమి కి జైశ్రీరామ్, జైజైశ్రీరామ్‌”
అని నినాదాలు చేసుకుంటూ బయలుదేరాము. దాదాపు మూడు గంటల ప్రయాణం తరవాత అయోధ్య చేరుకున్నాము. 



రామమందిరము—— 



ప్రస్తుతం రామాలయ పనులు మొదటి దశ పనులు పూర్తి అయి, రెండవ దశ పనులు శరవేగముతో సాగుతున్నవి. 22. 01. 2024 నాడు శ్రీరాముడి మూలవిరాట్టు విగ్రహస్థాపన
జరగగలదని అక్కడి మహంతులు తెలిపారు. రామాలయ పునరుద్దరణ పనులను గుజరాత్ కి చెందిన సోమ్పురా ఫామిలీ చేపట్టింది. 



అయోధ్యలో రామమందిరం 2. 77 ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్థు నుంచి గర్భగుడి శిఖరం
వరకూ 161 అడుగుల ఎత్తులో, ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, 
ఒక్కో అంతస్తు 20 అడుగులతో, మొదట అంతస్తులో 160, రెండవ అంతస్తు లో 74 స్తంభాలతో నిర్మాణ పనులు దాదాపు పూర్తి యగుచున్నవి. 



నిర్మాణపనులు చాలా చురుకుగా కొనసాగుచున్నవి. శిల్పకళానైపుణ్యము అనన్యం, అసమానము, 
శిల్పుల చేతిలో గండ్రశిలలు సయితం వెన్నముద్దల వలె జాలువారుతున్నాయా అన్నట్లు గా యున్నవి. 
సీతారసోయ్ఘర్, హనుమాన్గఢీ దర్శించుకుని సాయంకాలమునకు సరయూ నదికి చేరుకున్నాము. 
రామ చరిత్రకు సజీవ సాక్ష్యం- గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి మొదలైన పుణ్యనదులు మన దేశంలో ఉన్నాయి. ఇవి అన్ని విధాలుగా ప్రసిద్ది చెందిన నదులు. అయితే యావత్ భారతమంతయూ భక్తి శ్రద్దలతో, ప్రేమాభిమానాలతో పూజించుదునే ఒక అవతార పురుషుల్ని జీవితంలో ప్రగాఢంగా పెనవేసుకున్న అరుదైన చరిత్ర నదులకు లేదు. అటువంటి మహధ్బాగ్యం
పట్టిన నది కేవలం సరయూ నది ఒక్కటే. 



అక్కడ కొంతమంది పుణ్యస్నానాలు చేశారు. అక్కడ నుండి హరహరమహదేవ్ అనుకుంటూ కాశీకి పయనమయ్యాము. దాదాపు అర్దరాత్రికి కాశీ పట్టణ ప్రవేశము జరిగింది. అస్లీఘాట్ దగ్గరలో కల మార్వాడా సేవా సంఘ్‌” సత్రములో బస
చేసితిమి. కాశీలో ఉన్నన్ని రోజులు అక్కడే. సకల సదుపాయాలతో ఉన్నదా సత్రం. మంచి వెలుతురు, 
ధారాళమైన స్వచ్చమైన గాలి, సూర్యకిరణాలు మొదలగు వన్నియూ పరిశుభ్రమైన పరిసరాలతో కూడు
కొన్నదా సత్రం. 



కాశీ క్షేత్ర విశేషాలు. ————



మొదటి రోజు వ్యాసకాశీ, సంకటమోచన హనుమాన్ మందిర్, తులసీ మానస మందిర్, దుర్గామందిర్, గవ్వలమ్మ, సారనాథ్, బిర్లామందిర్+ బెనారస్ హిందూ యూనివర్సిటి
మొదలగునవి దర్శించాము. 



సారనాథ్ స్థూపం- సారంగనాథ్, ఇసిపట్టన, ఋషిపట్టణ, మిగదయ లేదా మృగదన అని కూడా పిలుస్తారు. వారణాసికి ఈశాన్యంగా పది కిలోమీటర్ల దూరంలో, గంగా మరియు వరుణ నదుల సంగమానికి సమీపంలో ఉన్న ప్రదేశం. 
పురాతన మలగండి కుటీ విహార శిథిలాలు నేటికి మనకు అగుపడుచుండును. 



సుమారు 528బిసిఈ నాటి సారనాథ్, 35 సంవత్సరాల వయస్సులో గౌతమబుద్దుడు జ్ఞానోదయం పొందిన తరువాత బోధ్ గయలో తన మొదటి ప్రవచనమును బోధించెను. అతని మొదటి ఐదుగురు శిష్యులు కౌండిన్య, అస్సాజీ, భద్దియా, వస్సా, మహానామా. 



జ్ఞానోదయం ఫలితంగా బౌధ్దసంఘం మొదట ఉనికిలోకి వచ్చింది. మహాపరినిబ్బన సూత్రం( దిఘా నికాయ యొక్క సూత్రం- 16) ప్రకారం, బుద్దుడు సారనాధ్ ను తన భక్త అనుచరులు సందర్శించి, భక్తి భావాలతో చూడవలసిన నాలుగు తీర్థ ప్రదేశాలలో ఒకటిగా పేర్కొన్నాడు. ఇతర మూడు ప్రదేశాలు లుంబినీ( బుద్దుని జన్మస్థలం,) భోద్గయ( బుద్దుడు జ్ఞానము పొందిన ప్రదేశము ) మరియు కుశినగర్ బుద్దుడు పరినిర్వాణం పొందిన ప్రదేశం).
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) - పొలిమేర - పార్ట్ 2 - by k3vv3 - 19-05-2025, 04:53 PM



Users browsing this thread: 1 Guest(s)