Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#96
కాశీయాత్ర
[Image: image-2025-05-19-165037447.png]
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   
 
కాశీకి తీర్థయాత్ర హిందూమతంలో కాశీనగరానికి యాత్రను సూచిస్తుంది. హిందూమతం లోని అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటిగా పరిగణించబడుతున్న నగరానికి ముక్తి సాధించేందుకు వీలు కల్పిస్తారనే నమ్మకం కారణంగా యాత్రికులు వెళుతుంటారు.
 
తీర్థయాత్ర యొక్క ప్రాముఖ్యత స్కాందపురాణంలో వివరింబడినది. హిందూ సాహిత్యంలో కాశీ ఒక
ముఖ్యమైన తీర్థంగా పేర్కొనబడినది. నగరం లోని కాశీ విశ్వనాథ దేవాలయం శివునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటి. 



మేము మొత్తం 120 మందిమి కాశీ యాత్రకు బయలు దేరాము. సాయికృష్ణా ట్రావెల్స్ ధ్వారా 40 మందిమి మాత్రమే ఫ్లైట్ల్స్ లో వెళ్ళాము. మేము 18 తారీఖ నవంబర్ 2023 నాడు బయలుదేరి లక్నోకు వెళ్ళాము. ఉద్యమం 10. 30 కు చేరుకున్నాము. రైలు ప్రయాణీకులు రావటము ఆలస్యమగుట వలన బజారు లన్నీ 2, 3 గంటలు తిరిగాము. లోపున రైలు ప్రయాణీకులు కూడా మాతో కలిసారు. 



మొత్తం 120 మంది  3 బస్సులలో నైమిషారణ్యము బయలుదేరాము. మార్గమధ్యము లోనే మధ్యాహ్న భోజన కార్యక్రమాలు అయిపోయినవి. మా ట్రావెలర్స్ వారివెంట   ఎల్లప్పుడూ క్యాటరింగ్ వ్యాన్ ఉంటుంది. పూట కా పూటే వండి పెడతారు. మాకంటే ముందుగా వారు చేరుకుని మా సౌకర్యాలన్నీ వాళ్ళు చూస్తారు. 

సాయంత్రం చీకటి పడువేళకు మేము నైమిషారణ్యము చేరుకుంటిమి. రోజు సత్రాలలో బస చేసి
రాత్రి భోజన కార్యక్రమాలు యధావిధిగా నిర్వర్తించి, తెల్లవారు ఝామునే లేచి స్నానాదులు కావించుకుని
పుణ్యక్షేత్ర సందర్శనకు బయలుదేరాము. 



నైమిషారణ్య మహాత్యము.



నైమిషారణ్యం పవిత్ర తపోభూమి. ఎనభై ఎనిమిది వేలకుపైగా ఋషులు, ముునులు తపస్సు చేసిన
పుణ్యభూమి. నైమిషారణ్యము ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో గోమతి నది తీరానికి ఉంది. 



ప్రాచీన చరిత్ర, భూగోళ వివరాల ప్రకారం నైమిషారణ్యం పాంచాల రాజ్యానికి, కోయల రాజ్యానికి మధ్య
నున్న ప్రదేశం. 



ఉగ్రశ్రావశౌతి ముని మహాభారత కథను వేల శ్లోకాలతో రచించి ఏకబిగిన గానం చేసిన ప్రదేశం. అలాగే
శ్రీరామచంధుడు అశ్వమేధ యాగము చేసిన సమయంలో, లవకుశులు ఇక్కడకు వచ్చి, వాల్మీకి రామాయణం గానం చేసిన ప్రదేశమని కూడా ప్రసిద్ది. 



నైమిషారణ్యం ముల్లోకాలలోను ప్రఖ్యాతి గాంచిన ఉత్రమ పుణ్యతీర్థం. శివుడికి అత్యంత ప్రియమైన ప్రదేశం. మానవులు చేసే పాపాలన్నీ నాశనం చేసే ప్రదేశం. ఇక్కడ దానం, తపస్సు, శ్రాద్దకర్మలు, యజ్ఞాలు మొదలగునవి ఒకసారి చేసినా, ఏడు జన్మల పాపాలన్నీ పోతాయని అనేక పురాణాలు విశదీకరించాయి. 



చూసిన ప్రదేశాలు- వాటి మాహాత్యాలు:



నైమిషారణ్య చరిత్ర కలియుగం ప్రారంభమయ్యే ముందు ఋషులు, మునులు బ్రహ్మ గారి దగ్గరకి వెళ్ళి ప్రార్థించిరి.. మాకు కలియుగ ప్రభావము లేని ప్రదేశం చూపించండి. మేము అక్కడకి వెళ్ళి పూజలు, యజ్ఞాలు చేసి యత్యుత్తమ ఫలం ప్రాప్తించేలా చేయండి అని బ్రహ్మ గారిని వేడుకొనిరి.
 
ఋషుల అభ్యర్థన మన్నించి, బ్రహ్మగారు మనసు ద్వారా ఒక చక్రాన్ని ( మనోచక్రం). నిర్మించి , చక్రాన్ని విసిరి, ఇలా చెప్పెను చక్రం యొక్క ఇరుసు(నేమి) ఎక్కడ పడుతుందో ప్రదేశం పరమ పవిత్ర మవుతుంది. అక్కడకు వెళ్ళండి. అని.



 బ్రహ్మగారి మనోమయ చక్రం బ్రహ్మాండం నుంచి భూమి ని చుట్టుతూ అరణ్యానికి వచ్చింది. బ్రహ్మగారి మనోమయ చక్రం యొక్క ఇరుసు ( నేమి) ఇక్కడ పడింది కనక అరణ్యానికి నేమి ( ఇరుసు) +శీర్ష( పడిన)+ అరణ్య =
నైమిషారణ్యం అని పేరు వచ్చింది. 



చక్రతీర్థం——- బ్బహ్మగారు పంపిన మనోమయ చక్రం ఎక్కడ భూమి మీద పడిందో అక్కడ పరమ
పావనమయిన పుష్కరిణి. (లోతైనచెరువు ) నిర్మించబడినది. దానినే చక్రతీర్థం అందురు. 
మేమందరం పుణ్యస్నానాలని ఆచరించాము. చక్రతీర్థలో స్నానం, ఆచమనం, దానం, ధర్మకార్యాలు
మొదలైనవి చేసినచో, వాటన్నింటికీ విశేషమైన ఫలితం లభిస్తుంది. 



లలితాదేవి—— దక్షప్రజాపతి కూతురు సతీదేవి తండ్రి చేత అవమానింపబడి, దక్షయజ్ఞానికే తన దేహాన్ని ఆహుతి ఇచ్చేసింది. శివుణి గణాలు అప్పుడు యజ్ఞాన్ని విధ్వంసం చేసాయి. ఇదంతా తెలుసుకుని శివుడు యజ్ఞవాటికకు వచ్చి, సతీదేవి శరీరాన్ని చూసి దుఃఖితుడై మృత కళేబరం చేత బట్టి, తిరుగుతూ తిరుగుతూ తన పనులన్నిటిమీద విరక్తి చెందాడు. దాంతో సృష్టి సంహార క్రియ ఆగిపోయింది. సృష్టి యంతా అస్తవ్యస్తం అయిపోయింది. 



అప్పుడు జగత్ కళ్యాణ కారకుడైన విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని 108 ముక్కలుగా నరికి భూమండలమంతా విసిరెను. ఎక్కడైతే భాగాలు పడ్డాయో ప్రదేశాలన్నీ శక్తి పీఠాలయ్యాయి. 



నైమిషారణ్యంలో సతీదేవి యొక్క హృదయభాగం పడింది. అందుచేత శక్తీపీఠం లలితాదేవిగా
పిలువబడింది. 



సూతగద్ది:
ప్రదేశంలో సూతమహర్షి ఎనభై ఎనిమిది వేల ఋషులకు శ్రీమధ్బాగవతము, ఇంకా అనేక పురాణాలు వుపదేశించారు. మనం తరచుగా చేసుకునే సత్యనారాయణ వ్రతం కూడా సుత, శౌనకాది మహామునులు శిష్యులకు వుపదేశించిన స్థలం ఇదే. 



శౌనకగద్ది:
శౌనక మహర్షి మొదలైన మహా ఋషులందరూ లోకహితం, లోక కళ్యాణార్థం, స్వర్గప్రాప్తి కొరకు వేల సంవత్సరములు తపస్సు చేసి జ్ఞానసిద్ది పొందిన ప్రదేశం. 



హనుమాన్ గడీ, పాండవుల మెట్ట——-



రామారావణ యుద్దం జరుగుతున్న సమయంలో మాయావి అయిన అహిరావణుడు శ్రీరామడిని, లక్ష్మణుని మాయోపాయముచే అపహరించెను. హనుమంతుడు అది గ్రహించి అహిరావణుడితో యుద్దం చేసి మాయావిని చంపి, రామలక్ష్మణులను విడిపించి, తన భుజస్కంధాలపై కూర్చోపెట్టకుని మొదటిగా నైమిషారణ్యములో అడుగుపెట్టెను. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) - కాశీయాత్ర - by k3vv3 - 19-05-2025, 04:51 PM



Users browsing this thread: