Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఇంకెంత సేపు
#73
వంటాయన
[Image: image-2025-05-17-162959572.png]
రచన : జీడిగుంట శ్రీనివాసరావు



కంచంలో అన్నం పెడుతో, పది రోజులనుండి నడుము నమిలేస్తోంది. కింద పడ్డ పట్టకారు కూడా వొంగుని తీయలేకపోతున్నాను. మన డబ్బు పిల్లలకి వద్దన్నారు, కావాలంటే మేమే పంపుతాము, హాయిగా మీకు కావలిసినట్లు ఖర్చు పెట్టుకోండి, తీర్ధయాత్రలకి ఫ్లైట్ లో వెళ్ళండి అన్నారు గా, తీర్థయాత్రల సంగతి తరువాత, ముందు ఒక వంట మనిషి ని పెట్టండి అని గొడవ పెడుతోంది తను. 



" కరోనా కాలం లో వంటమనిషి ఎక్కడ దొరుకుతుంది, నేను బయటికి వెళ్ళి కరోనా అంటించుకోమంటావా" చెప్పు అన్నాడు రావు గారు. 



"మరి అయితే, నడుము నొప్పితోనే, మీకు, కందిపప్పు పచ్చళ్ళు, దూట కూరలు, వంకాయ బండ పచ్చడి చేస్తో, చచ్చిపోమంటా రా" అంటూ రావు గారు తింటున్న కంచం లో చారు పోసింది వర్ధనం. 



"నీ దుంపతెగా, నేను యింకా కూర కలుపుకోలేదు, చారు వడ్డించావేమిటే" దీని బట్టి నీకు నిజంగానే నడుము నొప్పి వుంది అన్నమాట అన్నాడు రావు గారు. 



"అంటే నిజంగా కాక నాటకాలు ఆడుతున్నా ననుకుంటున్నారా.. నడుము నొప్పి కంటే మీ మాటలే నన్ను ఎక్కువ బాధ పెడుతున్నాయి, చారుపోసిన కంచం పక్కన పెట్టి, కంచం లో కూర కలుపుకు తినండి అని వెళ్ళి మంచం మీద పడుకుంది వర్ధనం. 



"అన్నం తిని పడుకో, నడుము నొప్పికి మందు వంట మనిషి కాదు. సాయంత్రం హాస్పిటల్ కి తీసుకువెళ్తాను. తరువాత ఒక వంట మనిషి ని వెతికి పంపమని మా తమ్ముడికి చెప్తాలే. రా, వచ్చి అన్నం తిను అని భార్య ని పిలిచాడు. 



సాయంత్రం కారులో దగ్గరలో వున్న హాస్పిటల్ కి వెళ్లి, కారు తాళం పార్కింగ్ కుర్రాడుకి యిస్తోవుంటే, వాడు, "ఆఛ్ " అని ఒక తుమ్ము తుమ్మి, సారి సార్ అంటూ కీ తీసుకున్నాడు. రావు గారికి తుమ్ముతో మనసుకు ఎందుకో అపశకునంలాగా అనిపించింది. 



మొత్తానికి ఒక గంట తరువాత డాక్టర్ గారి పిలుపు వచ్చింది. ఆయన వర్ధనమ్మను  దూరం నుంచే చూసి, అక్కడే తలుపు దగ్గర స్టూల్ మీద కూర్చొని నేను అడిగిన వాటికి జవాబు చెప్పండి అని, దగ్గరికి రావటానికి కూడా బయపడి పోతో కొన్ని ప్రశ్నలు అడిగి, బరబరా ఆరు రకాల మందులు, ఒక రకం స్ప్రై రాసి, "యివి వాడి, పదిరోజుల తరువాత రండి”  అన్నాడు డాక్టర్. 



బయటకు వచ్చిన తరువాత "అదేంటి అండి, నొప్పి ఎక్కడో నొక్కి చూడలేదు, బీపీ చూడలేదు, సినిమా లో కదలని పాము వేసుకున్న శివుడిలాగా, మెళ్ళో సేతస్కోప్ వేసుకున్నాడు, దానితో పరీక్ష చేయకుండా" అంది రావు గారి భార్య. 



"సేతస్కోప్" వాడటం ఎప్పుడో మర్చిపోయారు, వాళ్ళు డాక్టర్స్ అని తెలుసుకోవటానికి మాత్రమే అది మెళ్ళో వేసుకుంటారు. అదిసరే, యిప్పుడు నీ నడుంనొప్పి ఎలా వుంది అన్నాడు రావు గారు. 



"ఎందుకు అలా అడుగుతున్నారు, మందులు కొనక్కర లేదనా " అంది భార్య. 



అదికాదు, డాక్టర్ ని చూడగానే సగం జబ్బు తగ్గింది అంటారు కదా, అందుకని, నీకు ఏమైనా కొద్దిగా తగ్గిందా అని అన్నాడు రావు గారు. 



నిజమే నండోయ్. కొద్దిగా బాగానే వున్నట్లుంది. మందులు అయిదు రోజులకే తీసుకోండి. కావాలంటే తరువాత కొందురు గాని అంది వర్ధనమ్మ. 



ఇంటికి చేరిన తరువాత, భార్య కి మందు ఎలా వేసుకోవాలో చెప్పి, రాత్రికి నేను టమోటా ఉప్మా చేస్తాను, నువ్వు కళ్ళు మూసుకొని పడుకో అని భార్య తో చెప్పి, రావు గారు ఉప్మా చెయ్యటానికి ఉపక్రమించారు. 



ముందుగా కొద్దిగా కేబేజి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నారు, తరువాత ఒకటి చిన్న బంగాళాదుంప, ఒక వంకాయి, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి ముక్కలు తరిగి పెట్టుకుని, స్టవ్ మీద మూకుడు పెట్టి, తగినంత నూని వేసి, బాగా కాగిన తరువాత, పోపు సామాను, ఒకటి గుప్పెడు జీడిపప్పు వేసి దోరగా వేయించుకుని, వాటిని ఒకటి ప్లేట్ లో వేసుకున్నాడు. 



తరువాత, యింకొద్దిగా నూని వేసి తరిగిన ముక్కలు వేసి సగం వేగిన తరువాత రెండు పెద్ద టమోటాలు బాగా నలిపి, సగం వేగిన ముక్కలలో వేసి, సరిపడ ఉప్పు వేసి సన్నటి సెగ మీద మగ్గ నిచ్చాడు. ఈలోపున బాగా వేగిన రెండు జీడిపప్పు పలుకులు నోట్లో వేసుకుని, భార్య దగ్గరికి వచ్చి యింకో అయిదు నిమిషాలలో ఉప్మా రెడీ అవుతుంది అన్నాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - దీపావళి విడుదల - by k3vv3 - 17-05-2025, 04:32 PM
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM



Users browsing this thread: 1 Guest(s)