Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#84
అక్క చెప్పిన లక్షణాలను బట్టి ఇది ఒక సైకలాజికల్ డిసార్డర్ అని అనుకున్నాడు. స్చిజోఫ్రీనియా కి సంబంధించిన మందులు కూడా వాడింది అని తెలియగానే, ఇది మానసిక సమస్య కాదని, అర్థం అయ్యింది. తనలో తానె తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టాడు అతీత్.



" ఇంటిలో ముగ్గురు వున్నారు, అందులో పనిమనిషికి పెద్దగా ఏమి ఎఫెక్ట్స్ లేవు/ ఎందుకంటె ఆమె ఇక్కడకు ఎక్కువ రాదు. వొచ్చినా వెంటనే వెళ్ళిపోతుంది. ఇంకా ఇషా, అక్క సుభద్ర..
ఇషా కూడా ఎక్కువ సేపు గదిలో ఉండదు, తాను రోజు కాలేజ్ కి వెళ్ళిపోతుంది ఎక్కువ సేపు బయటే ఉంటుంది. ఇంకా అక్క సుభద్ర మాత్రం ఇక్కడే ఉంటుంది, గదిలోనే "



పనిమనిషి ని పిలిచి, గ్యాస్ గీజర్ ఆఫ్ చెయ్యి, అసలే గ్యాస్ ధర పెరిగిపోయింది అన్నాడు. 



అశోక్ గారు.. గ్యాస్ గీజర్, అమ్మగారి బాత్రూమ్ లో  పైన పెట్టించారు. ఎప్పుడూ వేడినీళ్లు రావాలని గీజర్ కు స్విచ్ పెట్టించలేదు" అని చెప్పింది. 



అతీత్ కి, అది కొంత ఆశ్చర్యం కలిగించింది. బావ మరీను, యెంత ప్రేమ ఉంటే మాత్రం మరీ ఇలా 24 లు వేడి నీళ్లు రావాలని స్విచ్ లేకుండా చేస్తాడా ? అని ఆలోచిస్తూ వుండగానే అతనికి ఒక విషయం తట్టింది. 
అదే " గ్యాస్, గ్యాస్ లీక్.. "



వెంటనే అక్కకి ఫోన్ చేసాడు, " అక్కా నీకు COHgb టెస్ట్ చేశారా ? " అని అడిగాడు. 



" COHgb ? అదేంటి.. ఇంకా అంతా డిటైల్డ్ గా చూడలేదు, ఇప్పుడే రిపోర్ట్స్ వొచ్చాయి.. చాలా పేజీలు ఉంటే ముఖ్యమైనవి మాత్రమే చూసా "



" ఒకే. చేయక పొతే వెంటనే చెయ్యమని చెప్పు, నేను అన్ని వివరంగా చెపుతా" అన్నాడు.
వెంటనే, తాను, ఇంటి వెనక అమర్చిన గ్యాస్ గీజర్ వున్న చోటికి వెళ్లి, పైపులను గమనించసాగాడు. పైపులను వెంబడించగా, సరిగ్గా బాత్రూం కిటికీ దగ్గర ఒక జాయింట్ చుట్టూ పసుపు మరకలు ఉండటం గమనించాడు. 



వెంటనే పనిమనిషికి ఫోన్ చేసి, గీజర్ బాగు చేసేవాడిని, రమ్మని చెప్పాడు. 
ఇంతలో, సుభద్ర దగ్గరనుండి ఫోన్.. 



" నువ్వు చెప్పాక COHgb టెస్ట్ చేశారురా.. , 12 % అని చూపిస్తోంది "



"నార్మల్ యెంత ?"



“2% కంటే తక్కువ అంది సుభద్ర షాక్ లోనే. 



"ఇక్కడ గీజర్ లీక్ అవుతోంది, అందులోనుండి కార్బన్ మోనాక్సైడ్ మెల్లిగా లీక్ అవుతోంది. అందువలనే నీకు ఇదంతా . వెళ్లి డాక్టర్ ని కలువు, నేను ఇది బాగుచేయిస్తా " అని ఫోన్ పెట్టేసాడు. 



ప్లంబర్ తో, పైప్ రిపేర్ చేపించి, కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్ ని అక్కడ ఏర్పాటు చేయించాడు. 
సుభద్ర డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. 



"డాక్టర్, COHgb లెవెల్స్ బాగా ఎక్కువ వున్నాయి.. అరౌండ్ 12 % అని "



మాట వినగానే డాక్టర్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. 
“12 %..  ఇది చాలా ఎక్కువ.. అన్నాడు డాక్టర్ ఆశ్చర్యంగా. 



"ఏమో డాక్టర్.  కొంతకాలంగా మా ఇంట్లో గ్యాస్ లీక్ అవుతోందట. ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు, మాకు అస్సలు తెలియలేదు "



"ఓహ్ అవునా.. కార్బన్ మోనాక్సైడ్ కి రంగు వాసన ఏమి ఉండదు, ఇది చాలా కాలంగా మీ ఇంటిలో నుండి లీక్ అవుతోంది. ఎందుకైనా మంచిది ఇషా కు కూడా టెస్ట్ చేద్దాం. మీరు చాలా అదృష్టవంతులు, తొందరగా తెలుసుకున్నారు. లేకపోతె మరి కొన్ని వారాల్లో మీరు చనిపోయేవారు". 



విషయం తెలుసుకున్న అశోక్, వెంటనే తన పని ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. అతీత్, దగ్గరుండి సుభద్ర ని, ఇషా ని చూసుకోసాగాడు. 



 అనుకున్నట్టుగానే, ఇషా శరీరంలో కూడా రక్తం లో కూడా కొంత మేర కార్బన్ మోనాక్సయిడ్ ఛాయలు, కనపడటం తో, ఇద్దరినీ కొంతకాలం హాస్పిటల్ లో ఉంచి వారి శరీరం నుంచి విష వాయువును పూర్తిగా తొలగించారు. క్రమంలో డాక్టర్, అతీత్ అనుమానాలను ధృవీకరించారు. కార్బన్ మోనాక్సైడ్ కు ఎక్సపోజ్ అవటం వలన వల్ల భ్రాంతులు అదే హాలోజినేషన్స్, గందరగోళం ఇంకా ఊపిరి అందకపోవటం లాంటివి జరుగుతాయని చెప్పాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మనసులు కలవడానికొక శుభతరుణం - by k3vv3 - 14-05-2025, 01:57 PM



Users browsing this thread: 1 Guest(s)