Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#94
"కళాజొగో" అంటా జనమంతా బూమి ‌‌ద్దరిల్లేటట్టూ అర్చినారు. ఔట్లు టపాకులు కాల్చినారు. తప్పెట్లు కొట్టినారు. తుడుం వాంచినారు. కొమ్ము ఊదినారు. చిందులోళ్ళు చిందేసినారు. ఆసాదోళ్ళు అమ్మోరి కత చెప్పుకుంటా సాగినారు. యంటే కన్నయ్యా అమ్మోరితో ఎలబారినాడు. వారెనుకే జనం నడిసినారు. ఊరి నడుమున ఏర్పాటు సేసుకున్న గుల్లో అమ్మోరిని నిల్పినాడు కన్నయ్య.
 
పూజారి సంటెన్న అమ్మారి సుట్టూ యాప్మండలు పర్చి అమ్మోరి ముందర పెద్ద ఇస్తరేసి కుంభాకూడు అందులో కుమ్మరించి గుండ్రంగా ముద్దగా సేసినాడు. గండదీపం ఎలిగించి సాంబ్రాణి, దూపం నిప్పులపై ఏసి ఊతకడ్డీలు ముట్టించినాడు. అమ్మోరి దగ్గిర గటం (సారాయి) బెట్టినాడు. టేంకాయల్గొట్టి నిమ్మకాయలుకోసి అమ్మోరిని పూలమాలల్తో పూజించి "పెద్దమ్మ తల్లో! సల్లంగా సూడమ్మ తల్లో!" అని గెట్టిగా అరిచి మొక్కినాడు. జనంగూడ దిక్కులకు ఇన్పడేట్టు అరిచి మొక్కినారు.
 
ఆసోదోళ్ళు అమ్మోరి కత పాడుతున్నారు. తప్పెట్లు తుడుములు కొమ్ములు మారుమోగు తున్నాయి. టపాసులు ఔట్లు పేల్తాండాయి. చిందోళ్ళు చిందేచ్చాండరు. పులేషగాళ్ళు అడులేచ్చాండరు. కట్టె తప్పేటోళ్ళు తిప్పుతాండరు. జనం ఇరగబడి సూచ్చాండరు. ఊరంతా రద్దూ రాయబరంగా వుండాది. నడి రాతిరి ఒంటి గంట నుంచి యాటలు ఆగతీయడం మొదలైతాయి.
 
* * *
 
అనిమెల్లో సుంకన్న నిండు కడవ నీళ్ళు పోసుకున్యాడు. ఉతికిన గుడ్డలు ఏసుకున్యాడు. కుటుంబంతో కల్సి బువ్వ తిన్యాడు. ఊరి జనం ఎనకమ్మడి రాగా పోలేరమ్మ గుడికి బోయినాడు. పోలేరమ్మకు పూల్దండేసి టెంకాయ కొట్టి కప్పూరం ఎల్గించి అమ్మోరికి ఆరతిచ్చినాడు. అనుకున్న కార్యం అనుకున్నట్టు జర్గాలని మనసారా మొక్కినాడు. ఎనక్కిదిరిగి అందరి దిట్టూ సూసి దండం బెట్టినాడు. అమ్మానాయినలకు దయిర్యం సెప్పినాడు. తమ్ముడ్ని చెల్లెల్ని గుండెలకు అత్తుకొని బాగ చదువుకొని అమ్మానాయినలకు మంచి పేరు త్యావాలని బుద్దిమాటలు సెప్పినాడు.
 
అమ్మానాయినలు తమ్ముడూ చెల్లెలు కుమిలికుమిలి ఏడ్చినారు. ఎవరికీ కన్నీళ్లు ఆగలేదు. సుంకన్నకు యేం కాకూర్దని అందరూ ఎయ్యి దేవుల్లను ఏడుకున్యారు. ఒగ చనగాలం పగిడాలలో వుండే మేనత్త అక్కమ్మ కూతురు నేరేలమ్మ మతికొచ్చి మన్సులోనే తనుకులాడినాడు (బాధపడాడు).
 
"ఆమెకు పొలి తెచ్చే ఇసయం తెల్సింటే గిమగిమాంటే ( ససేమిరా) వినుకొనుండేది కాదు. సపిచ్చే (ససేమిరా) పొలిత్యాను పోనిచ్చేది కాదు" అనుకున్యాడు.
 
పెద ముత్తైదులు సుంకన్నకు కుంకుమ బొట్టుబెట్టి అరతిచ్చినాక దద్దనాల దిట్టు కదిల్నాడు సుంకన్న. యువకులంతా నానారకాల ఆయుదాలతో సుంకన్నను అనుసరించినారు.



అనిమెల పొలిమేర సేర్నాక -



"సుంకన్నా! దయిర్యంగా పోయిరా! నువ్వు పొలెత్తుకొని రాంగానే నీ యంటబడొచ్చిన దద్దనాలోళ్ళను మేం ఆయుదాల్తో ఎదుర్కుంటాం. నీకు పోలేరమ్మ తోడుంటాది." అని దమ్ముగా సెప్పినారు అనిమెల యవకులు.



"సరే జాగర్తగా ఇక్కడే వుండండి" అని సెప్పి తానొక్కడే ఎలబారిబోయి దద్దనాల్లో ద్యావర జరిగే గుంపులో కల్సిబోయినాడు సుంకన్న.



ద్యావర జరిగే తావున తప్పెట్లు తుడుం కొమ్ము చిందుల చప్పుల్లతో రవరవమంటూ రవద్ధూలి లేసిపోతాండది. దద్దనాలకు సుట్టుండే ఇరవై నాల్గు పల్లెలు ద్యావరకు రావడంతో జన సముద్దరం లాగుండాది వూరంతా.
ఇంటియింటి నుంచి బోనాలు పొట్టేల్లు మేకపోతుల్తో మేళతాళాల్తో ఊరేగింపుగా చిందు తొక్కుకుంటా అమ్మోరి అంచుకొచ్చి పూజారి సంటెన్నకు బోనాలిచ్చి పొట్టేన్లు మేకపోతుల్ను చెట్లకు మాన్లకు కట్టేచ్చాండరు జనం.



సంటెన్న వోల్ల దగ్గిర్నుంచి బోనాలు కాయకప్పూరం నిమ్మకాయలు పస్పుకుంకుమ పూల్దండలు తీస్కుంటుండాడు.



రాతిరి నడిజాము దాటి ఒంటి గంటైనాది. యాటలు బలీయడం మొదులు బెట్నారు. యాటకొడవళ్ళు కనుమాటి గంగమ్మ ద్యావర్లో కొనకొచ్చినారు. యాటకొడళ్ళు మాంచి పదున్తో వుండాయి.



ముందు మొక్కుబడి బస్సిరెడ్డిది. ఆయప్ప యాటనే నరికినారు. ఆయప్పెనుక తిమ్మనాయుడిది. ఆతరువాత మంచాల్రాయుడు చిన్నయ్య పోతురాజు జాలప్ప సన్నన్న బుల్లారావు వొర్సగా వోళ్ళ వోళ్ళ యాటల్ని నరికినాక వూరందరియీ ఒకటెనుక ఒకటి యాటల్ని నరుక్కుంటా వుండారు. యాటను నరికేబ్బుడు జనం"కోబలి" అని ఆకాసం అంటేలా అరుచ్చాండరు. సంటెన్న యెవరి యాటను నరకినబ్బుడు వోళ్ళ టెంకాయగొట్టి వోళ్ళ బోనం కూడు అమ్మోరికి పెట్టి మిగతాది వోళ్ళకే ఇచ్చాండడు.
 
ఊరందరీ యాటలై పోయేసరికి నెత్తురు కాల్వలై పారినాది. యక్కడ్సూసిన రనారగతం. నరికిన యాటల్ని కొందరు దగ్గిరలోని చెట్లకు యాలదీసి చర్మాల్ని ఒలిచి కడుపులో బండారం (లివర కిడ్నీలు హర్ట్ లంగ్స్ బోటి) తీసి కసురు కడిగి దట్యాలను (చర్మం తీసిన కళేభరాలు) యింటికి తీస్కపోతాండరు. అప్పటికి తెల్లార్జాం నాలుగైంది. ఇంగ పొలిబలిచ్చినాక ఆసాదోడు కుంభాకూడు రగతం చాటలో కల్పి ఊరిసుట్టూ పొలి సల్లాల. పొలి సల్లేబ్బుడు పక్కూరోళ్ళు పొలి ఎత్తక పోకుండా ఆయప్పకు కాపలాగా పక్క వూరోళ్ళు పొలి ఎత్తక పోకుండా యంటంబడి కుర్రోళ్ళంతా ఈటెలు యాటకొడవళ్ళు గండ్రగొడ్డెళ్ళు తీస్కొని కోబలీకొబలీ యని అర్చుకుంటా పరిగెత్తి పోతారు. అమ్మోరిని తెల్లారక తలికే వూరి పొలిమేరలో ఇడిచిపెట్టి రావాల!



సాలన్న పాలన్న ఇరవై మంది దున్నపోతును పట్టకొచ్చినారు. దున్నపోతు బుస్సలు కొడ్తాంది. కోమ్ముల్తో కుమ్ముతాంది. దున్నపోతును అమ్మోరి దగ్గిరికి తీస్కొచ్చి ముందర పదిమంది యనక పదిమంది ఇరగ బట్టుకున్యారు. పాలన్న పదునైన బారీ యాటకొడవలి తీస్కొని దున్నపోతును నరకడానికి సిద్దంగా నిలబన్యాడు. అన్న సాలన్న తమ్ముడు పాలన్నకు నరికే వాటం సెబుతాండడు.

"దున్నపోతు మెడమీద ఇక్కడ నరుకుతే సులబంగా తెగిపడ్తాది" అని ఏలుబెట్టి చూపినాడు."సరే"నని పాలన్న నరకడానికి యాటకొడవలి పైకెత్తి బిర్రుగా బలంగా పట్టుకున్యాడు. పాలన్న కండ్లు ఎర్రబడి భీకరంగా కన్పడ్తాండడు. అబ్బుడు సీమ చిటుక్కుమంటే ఇనబడేట్టు సప్పిడి సేయకుండా ఉండారు జనం. అందరిలోనూ ఏమైతుందో ఎలావుతుందోనని జనం బిర్రాబిగిచ్చుకొని నోటమాటరాక ఊరక సూచ్చాండరు. అంత పెద్ద జీవాన్ని నరకడమంటే మాటలు కాదని జనం బయం.



తమ్ముడు యెక్కడ తప్పోతాడో యని సాలన్న మల్లొక తూరి "ఇక్కడ.. ఇక్కడ.. సరిగ్గా ఇక్కడ నరకు" అని తన తలను దగ్గిరికి సాపి ఆత్రంగా సూపబోయాడు. అన్న అట్టా మల్లా సెబుతాడని తెలీక అబ్బుడే పాలన్న ఉషారుగా చురుగ్గా ఉద్రేకంగా ఒక్కయేటున నరిక్యాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) - పొలిమేర - పార్ట్ 1 - by k3vv3 - 13-05-2025, 01:45 PM



Users browsing this thread: 1 Guest(s)