Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#93
పొలిమేర - పార్ట్ 2
'పొలిమేర పార్ట్ 2/2' తెలుగు కథ
 
దద్దనాల్లో ఊరి నడింగల పెద్దేప్మాను కాడ ఊరి పెద్దలు పెద్దాడ్డి తిక్కాడ్డి బస్సిరెడ్డి చెల్లంనాయుడు తిమ్మానాయుడు కాటంరాయుడు మంచల్రాయుడు పెంటయ్య పెద్దబొట్లాచారి నామాలయ్య పోతురాజు అప్పల్రాజు సన్నన్న బుల్లెన్న సంటెన్న పాలన్న సాలన్న తలుపులన్న కొమర్రావు చిన్నారావు కన్నయ్య నల్లప్ప జాలప్ప ఆవులయ్య ఎద్దులప్పతో పాటు వూరి జనం గుమిగూడినారు.
బస్సిరెడ్డి ముందుగాల లేచి "అందరికి దండాలు. మనూర్లో ద్యావర జరిగి మూడేండ్లైతాంది. మూడేండ్ల కొకతూరి పెద్దమ్మ ద్యావర జరపడం ఆనవాయితీ. అమ్మోరి దయవొల్లా కరువుకాటకాలు ల్యాకుండా రోగంరోట్టా రాకుండా పైరు పచ్చలతో పిల్లాజల్లా చల్లంగా వుండాం. అందుగ్గాను ఈతూరి అమ్మోరి ద్యావర అందరూ కల్సికట్టుగా నిల్బడి వైబోగంగా సేచ్చాం. గాబట్టి ఎవరి వంతు వాళ్ళు పన్సేసి అమ్మోరికి కొతుకు రాకుండా జరపాల. యేదన్న వాటం (విధానం) దప్పుతే పెద్దమ్మతల్లి మాంతమైన దేవత. అన్ని ఇసయాల్లో మెల్కువగా వుండాల.
 
అన్నీసరే! అనిమెలోళ్ళు అమ్మోరి పొలి ఎత్తక పోవడానికి రావచ్చు. ఒగిసోలంతా జాగిరిగా ఉండాల. వాళ్ళ పొలి మనం ఎత్తకొచ్చినాంచి కరవుకాటకాల్తో అలమటిచ్చి అల్లాడి పోతాండరు. వాళ్ళు పొలి తీస్కక పోవడానికి తప్పక వొచ్చారు. ఓగన్నేసి వుండాల." అన్సేప్పి కుచ్చున్యాడు బస్సిరెడ్డి.
 
తిమ్మానాయుడు ఉషారుగా లేసి "ద్యావర గొప్పగా జరగాలంటే తీరువ ఈతూరి బారీగ ఏస్కోవాల! అన్నీ సరుకులు పిర్రమై పోయినై. తీరవలు రాబట్టే పని చెల్లంనాయుడికి ఒప్పగిచ్చాం. అమ్మోరికి పసుపు కుంకుమ గందోడి సాంబ్రాణి నిమ్మకాయలు టెంకాయలు నైద్యానికి సరుకులు అమ్మోరికి కొత్తగుడ్డలు అవుట్లు టపాకాయలు తెచ్చే బాద్యత కొమ్మర్రావుది. అమ్మోరి బొమ్మ సేసే బాద్యత కన్నయ్యది.
 
గుడి కట్టిచ్చే వంతు పెదబొట్లాచారికి. అమ్మోరి కత చెప్పే ఆసాదోళ్ళును తప్పెటోళ్ళను మెళాలోళ్ళను తుడుమోళ్ళను కొమ్మోళ్ళను దండోరోళ్ళను పురమాయించే పని అప్పల్రాజుకు. ఎక్కువ తక్కువలు బుల్లెన్న సూసుకుంటాడు. ఒగ్యాల అనిమెలోళ్ళు పొలెత్తక పోనీకి వొచ్చే కన్పెట్టడానికి కాటంరాయుడు పోతురాజోళ్ళు ఉంటారు." అన్నీ పూసగుచ్చినట్టు సెప్పి కూకున్యాడు తిమ్మానాయుడు.
 
ఎనక మంచాల్రాయుడు "అద్సరే! ద్యావర దున్నపోతు మూడేండ్లుగా చేలల్లోబడి ఎట్టిగా తిని ఆంబోతులా బోబల్చినాది. దాన్ని పట్టడానికీ ఎవని వొల్లాగాదు. అమ్మోరి ముందర దాన్ని నరికే మొగోడెవడో ముందది దేల్సండ్రి." అని గురుతు సేసినాడు.
 
నల్లప్ప నిల్బడి "ఇంగెవరూ మన పాలన్న సాలన్నలే. ఇరబైమందిని ఎంటేస్కొనిబోయి ద్యావర దున్నపోతును పట్టకొచ్చారు. అమ్మోరికి వోళ్ళే బలిచ్చారు." అనే నల్లప్ప.
 
జనమంతా "ఔనౌను, వోళ్ళైతేనే సరిగ్గా సరిపోతారు" చప్పట్లుగొట్టి జైకొట్టి బలపర్చినారు జనం.
 
అదే జనం మద్దినున్న యామయ్య పైకి లేచి " మీ ఎర్రికాకపోతే అమ్మోరికి ఆకలేమిట్రా! మీ అమాయకత్వం కూలా! పచ్చి సీయలు తినడానికి ఆమేమన్నా జంతువా? ఎందుకు జీవ హింస. ఇది మూడత్వంతో చేసే చేష్ట" అని అరిచి చెప్పినాడు. ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. ఆయన మాటలు గాల్లో కల్సిపోయినాయి.
 
* * *
 
యాన్మందికి సబండు కులాలకు తెలపడం ఏమనగా వొచ్చే మంగలారం మన దద్దనాల్లో పెద్దమ్మ ద్యావర జరుగుతాదని ఊరి పెద్దలు నిర్నయించినారు. అందుగ్గాను ఊరి జనమంతా యాటలు కాయకప్పూరం ద్యావరకు కావాల్సిన వన్నీ తెచ్చుకోవాల్సిందిగా తెలియజెప్పడమైందోహో!" అంటూ తప్పెట కొడ్తున్న పాపన్న చాటింపేసినాడు.
 
ఇన్నె ఇసయమైనా దండోర ఇనగానే జనంలో యెక్కడలేని ఉషార కమ్ముకున్యాది. పిల్లోల్లు పట్టరాని సంతోసంతో ఎగుల్లేచ్చాండరు.
 
ఎవరికీ వాళ్ళు ప్యాటకు పోయి గుడ్డలుగుసుర్లు ద్యావరకు కావాల్సిన వస్తువులు తెచ్చుకున్యారు. మైదుకూరు సంతకు బోయి పొట్టేల్లు మేకపోతులు కోడిపుంజులు తెచ్చుకున్యారు. ఇండ్లకు సున్నాలు రంగులు పూసుకున్యారు. ఇంటింటికి చుట్టాలుపక్కాలు పిల్చుకున్యారు. ఇండ్లకు పందిర్లు ఏసి ఇంటి ముంగిట ముగ్గులేసినారు. వూరంతా రంగురంగుల కాగితాలతో అలంకరించుకున్యారు. ఈదులన్నీ కరెంట్ లైట్లతో రాతిరి పూట గుడక పట్టపగులు తీర్న ఉండెట్టు సేసినారు. ఊరంతా సందడి సందడిగా ఉండాది.
 
సాలన్న పాలన్న ఇద్దరూ అన్నదమ్ములు వూరికి ఎగుదాల బూమల్లో చల్లాటకం (ఆనందంగా ఎగురుట) ఆడ్తా మేచ్చాండే దున్నపోతును పట్టకరాను ఇరవైమంది కుర్రోళ్ళను ఎంటేసుకోని బోయినారు. దున్నపోతు బాగా బల్సీ కొమ్మలు దిరిగి వుండాది. మడుస్సుల్ని సూచ్చానే ముందర్కాళ్ళు నేలకు రాచ్చా కొమ్ముల్తో మార్కున్యాది. జనాన్ని చెలిగి పారేచ్చాంది. అందరూ తలాదిక్కు ఎడంగా పరిగెత్తినారు.
 
పాలన్న పగ్గాన్నీ ఉరిగా సేసీ దూరం నుంచే దాని మెడకు పడేట్టూ ఇసిరేసినాడు. అది కొమ్ముల్ని దాటుకొని మెడకు బిగిచ్చుకున్యాది. అంతలోపల సాలన్న ఎనక నుంచి తోక బట్టుకొని యాలబన్యాడు. పాలన్న ముందుపక్క సాలన్న ఎనకపక్క బిర్రుగా (గట్టిగా) పట్టుకోవడం వొల్ల దున్నపోతు ఎటూ కదల్లేక బుస్సులు కొడ్తా నిలబన్యాది. ఎడంగా జరిగినోలందరూ వొచ్చి తలాదిక్కు పట్టుకొని కిందేసినారు. దున్నపోతును గుదిగాళ్ళుగట్టి గుదిగాళ్ళ మద్దిన పొడుగాటి బడెను దూర్చి బడెకు అట్ట పదిమంది ఇట్ట పదిమంది బుజాలకు ఎత్తుకొని మోసుక బోయినారు. వూరికి నడుమున్న పెద్దేప్మానుకు కట్టేసినారు. జనం కోలాఅలంగా ఉచ్చొహంగా సూడ్నీకి వొచ్చినారు.
 
కన్నయ్య మరికొందరు జంగమెట్టకు బోయి కుమ్మర మట్టిని తెచ్చి ఊరేలపల బొమ్మల్సత్రం బయల్న కుచ్చోని పెద్దమ్మ అమ్మోరి బొమ్మను సేసినారు. అమ్మోరి ఇగ్రహం అద్దుబుతంగా కుదిరిన్యాది. అమ్మోరిని ఎత్తైన పీటెపై నిల్పి పానపతిట్ట సేసి పట్టు చీరేగట్టి బంగారు నగలు అలంకరించ్చినాడు కన్నయ్య.
 
పెద్దబొట్లాచారి ఊర్లో నాల్దోవల కూడల్లో నాలగుదిట్లా నాల్గుంజలు పాతి నాల్గుంజల్ను కల్పుతూ ఎదురుకట్టెల్తో గుడి కట్నాడు. గుడికి కప్పులా కొత్త తెల్లటి సైన్ గుడ్డలు గప్పి తూర్పు దిట్టు వాకిలి బెట్టి రంగుకాగితాల్తో పూలదండల్తో అలంకరించినాడు.
 
అమ్మోరిని గుడిలో నిల్పడానికి ఊరిపెద్దలు, జనం మేళతాళాల్తో బొమ్మల్సత్రం కాడికి అమ్మోరిని త్యాను బయల్దేరినారు..
 
కన్నయ్య అమ్మోరి మోగానికి పస్పు రాసి కుంకుమ బొట్లుబెట్టి నిమ్మకాయల దండ, పూల్దండ అమ్మోరి మెల్లో ఏసి టెంకాయలు గొట్టి నిమ్మకాయలు గోసి బలిపోతును "కోబలీ" అని బలిచ్చి పీటెపై వున్న అమ్మోరిని పీటెతో సహ నన్నెత్తి పైకి ఎత్తుకొని వూరిదిట్టు కదిలినాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) - పొలిమేర - పార్ట్ 2 - by k3vv3 - 13-05-2025, 01:43 PM



Users browsing this thread: 1 Guest(s)