Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#79
—‘అప్పిచ్చువాడు,వైద్యుడు,ఎప్పుడు నెడతెగక పారు నేరును,ద్విజుడున్ చొప్పడిన యూరు- కష్టకాలంలో ఉన్న తెలుగోడన్నవాడు సుమతీ శతక కారుడ్ని మరచి పోగలడా-- 
ఎటువంటి ఇగో లేకుండా సూర్యప్రభ వేడనీళ్లలో తడిపిన గుడ్డతో అతడి ముఖమండలం తుడిచి పీవర్ రేంజిని థర్మోమీ టర్ తో చూసి,బ్రెడ్ రోస్టు చేసిచ్చింది. తరవాత ఏవో రెండు మాత్రలు కూడా తినిపించి సోఫాలో హాయిగా కాలు చాపుకుని పడుకోమంది. 



అతడలా కాళ్ళ చాపుకుని కళ్ళు మూసుకున్నాడో లేదో- ఇదిగో! కాఫీ తాగండి. రిలేక్సుగా ఉంటుంది అంటూ కాఫీ కప్పు అందించి ఎదురుగా కూర్చుంది. 



ఆతడు లేచి కాఫీ రుచిని అనుభవిస్తూ తాగుతున్నప్పుడు ఆమె సంభాషణ ఉపక్రమిం చింది- నేను చెప్తుంటాను. మీరు శ్రమ పడకుండా అలవోకగా వింటూ సేదతీర్చుకోండి. సరేనా?



మాటతో కృష్ణమూర్త చప్పున సర్దుకున్నాడు; తను మరీ లిబర్టీ తీసుకోవడం బాగుండదేమోనని మనసున అనుకుంటూ



నాకు మాధవ పురం శివారున బంగ్లాటైపు ఇల్లుంది. ముగ్గరు సేవకులు ఉన్నారు. మరి నేనెందుకు ఇక్కడకి వచ్చి ఉంటున్నానంటే- ఎదుటి వారికిది పిచ్చి పిచ్చిగా కనిపించే అవకాశం ఉంది. నాకు నేను కావాలనే ఒంటరితనమూ నిశ్శబ్దమూ- అనే నేస్తాలను వెతుక్కుంటూ వచ్చాను. ఏదో ఒక రోజు ఒంటరితనం నన్ను వెతుక్కుంటూ వచ్చి నా రెక్కలు విరిచేయకముందే నేనుగా దానిని ఆశ్రయించడం మేలుకదా! ” 



మాటకతడు కనురెప్పలల్లార్చాడు. తలూపాలో లేదో తెలియక తేరిచూడసాగాడు. 
నాకు పెళ్ళయి శోభనం అక్కడే జరిగింది. నాకొక కూతురు కూడా అక్క డే పుట్టింది



ఈసారతడు పెదవి విప్పకుండా ఉండలేకపోయాడు- మరి మీ అమ్మాయి కనిపించదేం? పెళ్ళయి మెట్టింటికి వెళ్లి పోయిందా!



ఈసారి పెను కెరటం వంటి మౌనం పరచుకుంది. కళ్ల కొనల్లో తడి పేర్కుంది. లేదు. పెళ్ళి కాకముందే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. క్లీనిక్ పేరు కోకిల- పిల్లదే—“ 



కృష్ణమూర్తి మనసు అనంత వేగంతో బరువెక్కింది. ఎవరో వచ్చి గుండెను పిండినట్లనిపించింది. బిడ్డను కోల్పోవడమనే తీవ్ర మనోభావ స్రవంతిని బిడ్డను కన్నవాళ్ళకే తెలుస్తుంది కడుపు కోత! చిరు ప్రాయంలో కొడుకులకు చిన్నపాటి పడిసెం పట్తే చాలు శారద ఎంతలా అల్లల్లాడిపోయేది! తల్లీ బిడ్డల మధ్యన విలసిల్లే బంధాన్ని మాటలతో చెప్పతరమా! సారీ! మరి కోకిల తండ్రి కనిపించడేం? బిజినెస్ టూరులో ఉన్నాడా! ” 



`ఆమె ఈసారి గట్టిగా తలవిదిలించింది. అలా ఆమె తల విదిలిస్తున్నప్పుడు కళ్ళనుండి కన్నీటి చుక్కలు రాలి పడ్డాయి. 



లేడు. మా నాన్న వత్తాసుతో కెనడా వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు; ప్రసిధ్ధ వైద్యుడిగా పేరు సంపాదించుకుని” 



 “నువ్వు కూడా అక్కడకి వెళ్ళి పోవచ్చుకదా! కూతురు పోయి నువ్వెందుకు ఒంటరిగా ఇక్కడ కష్టపడటం—“



 “నేనా.. వెళ్లనన్నాను! ఒకే ఒరలో రెండు కత్తులు ఒదుగుతాయా? అతగాడికి మెరుపుతో తేజరిల్లే తెల్ల స్త్రీ కావాలి. అంచేత అక్కడ నించే నాకు విడాకులిచ్చి అక్కడి తెల్లమ్మాయిని మరుమనువాడాడు. నేనంటే ఇష్టం లేని వాడితో అనునిత్యం దేబరిస్తూ ఆత్మ న్యూనతను పెంచుకుంటూ వెంట పడమంటారా! నా చూపులో ఇది కూడా అంత పెద్ద ఇస్యూ కాదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కన్నకూతూర్ని చూసేందుకు కూడా అతగాడికి తీరిక చిక్కలేదు. అటువంటి వాడితో మనసున్న ఏస్త్రీఐనా మనసా వాచా కర్మణ: కాపురం చేయగలదా!
ఆమాటకతడు కన్నార్ప కుండా చూస్తుండిపోయాడు. సన్యాసులకు ముని పుంగలకు తప్ప మామూలు మనిషన్న ప్రతి వాడికి స్వార్ధం ఉంటుంది. కాని ఇంతలాగా! ఈసారి కంటతడి సూర్యప్రభ పెట్టలేదు ఆరడుగుల ఆజాను బావుడైన కృష్ణ మూర్తి పెట్టాడు. ఆమె లేచి వచ్చి అతడి కళ్లు తన చీరచెంగుతో తుడిచింది. 



తుడుస్తూ ఆమె కొనసా గించింది. అందుకే అక్కడ నేను అనునిత్యమూ పెల్లుబుకే ఆక్రోశాన్ని ఆవేశాన్ని కోపాగ్నినీ తట్టుకోలేక దాదాపు పిచ్చిదానిలా మారక ముందే నేను గతకాల వలయం నుండి తప్పుకుని ఇక్కడకు వచ్చేసాను. నేను సున్నితత్వం గల ఆడదానిని. అనునిత్యమూ అగ్నికీలల వంటి తలంపుల్ని సూదుల్లాంటి ఆలోచనల్ని ఎన్నాళ్ళుఅనుభవిస్తూ ఉండగలను? అసలు నీరవ నిశ్శబ్దంలో నేను నా దు:ఖపు తెరల్ని ఎవరి ముందు విప్పుకోను? ఇంకానయం నాకప్పుడు సుళువుగా ఆత్మహత్య చేసుకునే పథకం నాకు తెలియలేదు. లేకపోతే ఈపాటికి ధరమ్ కరమ్ రోడ్డులో చేసి చూపించిన సోఫ్ట్ వేర్ ఇంజనీరులా నైట్రోజన్ గ్యాసుని కవరులో నింపుకుని దానిని నా ముఖం నిండా కప్పుకుని ఊపిరాడకు తన్నుకుంటూ ప్రాణం వదిలేసే దానిని.



అటూ ఇటుగా అవన్నీ మరచిపోవడానికే నేను క్లీనిక్ ని వ్యాపింప చేసి మరికొందరి జూనియర్ డాక్టర్లకు అవకాశం ఇచ్చిబ్రతుకు బండి ని ఈడ్చుకోస్తున్నాను. ఇక మేటర్ కి వస్తున్నాను. చెప్పేదా? లేక మీకు నీరసం తగ్గుముఖం పెట్టిన తరవాత చెప్పేదా?



అప్పుడతడు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ ముందుకు సాగమన్నాడు. మొదట్లో మీతో చాలా ముభావంగా ఉండేదానిని. నేను కావాలనే మీకు కోపం వచ్చేటట్టు అలక్ష్యంగా ప్రవర్తించే దానిని. సహాయం తీసుకుని థేంక్స్ కూడా చెప్ప కుండా విసురుగా పెడసరంగా చూస్తూ వెళ్లిపోయేదానిని. అదంతా గుర్తుంది కదూ! ” 



ఆమాట విన్నంతనే అతడు దిగ్గున కదలి ఆమెకు సమీపంగా వచ్చి కూర్చున్నాడు. గుర్తుంది. ఐతే దీనికి బదులియ్యి- అదంతా కావాలనే చేసావన్నమాట. బట్ వై ? ” 



చెప్తాను. కాని మొదట నన్ను క్షమించానని చెప్పండి
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - డబ్బే అంతా కాదు - by k3vv3 - 08-05-2025, 01:50 PM



Users browsing this thread: 1 Guest(s)