Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#77
మనసులు కలవడానికొక శుభతరుణం

రచన: పాండ్రంకి సుబ్రమణి






కృష్ణమూర్తి కేంద్ర ప్రభుత్వ ఉపాధి శాఖ నుండి ఉన్నత పదవిలో ఉద్యోగం చేసి పోయినేడాది అరవై యేళ్ల ప్రాయం వచ్చే టప్పటికి అధికారపూర్వక అనివార్య అంశంగా ఉద్యోగ విరమణ చేసాడు. సముచితమైన జీవన విధానం గల వాడవటం వల్ల మనిషి శరీర పటుత్వం సడలకుండా నిలకడగా నిటారుగానే ఉంటాడు; ఆత్మనిశ్చలతతో మనసు నిలకడగా నిబ్బరంగా ఉంటే శరీరమూ కుదురుగానే ఉంటుందంటారే రీతినన్నమాట. 



ఐతే- విదురుడైన(భార్యను కోల్పోయిన) కృష్ణమూర్తికి క్రమక్రమంగా ఒంటరితనం ఘాటుగా కౌగలించుకుంది; వంద్దంటే కూడా డబ్బు పదే పదే ప్రోగయినట్టు. అప్పటికీ అతను నిబ్బరాన్ని కోల్పోకుండా కాలాన్ని వృధాగా దొర్లి పోనివ్వకుండా గ్రంథ పఠనం తో బాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పడి ఉన్నట్టు కాక, భారత పర్యటన వెళ్ళివచ్చాడు. 



మాటకు మాటగా చెప్పుకుంటే కోడళ్ళిద్దరూ తనను పిల్వని పేరంటానికి వచ్చిన వాడిలా కాకుండా బాగానే చూసుకున్నారు. ఇకపైన ఒంటరిగా ఉండకుండా తమతోనే ఉండి పొమ్మన్నారు. మరి ఎటువంటి గ్రహపోటో గాని, అతడి మనసు మాత్రం ఎవరో మాంత్రిక శక్తితో లాగుతున్నట్టు పుట్టి పెరిగిన ప్రాంతం వేపే ఆలోచించేది. పుట్టినూరు గురించే తపించేది. కార్యాలయంతో ముఖ్యంగా సహోద్యోగులతో ముప్పై ఏండ్ల అనుబంధం ఆషామాషీ వ్యవహారం కాదు కదా! వాళ్ళను ఓమారు చూడాలని, చూసి మనసార పలకరించాలన్న తహతహ ఎలా ఉండకుండా ఉంటుంది? 



మర్రి చెట్టుని ఉన్నపాటున పెకలించి మరొక చోట ట్రాన్స్ ప్లాంట్ చేయడం అంటే మాటలా! అంతేనా తనతో ఏడడుగులు నడచి తన వారినందర్నీ విడిచి ముప్పై ఐదేండ్లపాటు తనతో కాపురం చేసిన శారద జ్ఞాపకాలను ఎలా చెరిపేసుకోగలడు- ఒకటి మాత్రం ఖాయం- బ్యాంకు బ్యాలెన్సు ఎంత బరువుగా ఉన్నా- ధన్వంతరి దీవెన వల్ల ఆరోగ్యం ఎంత ముమ్మరంగా శోభిల్లుతున్నా- శారద లేని జీవితం అలల చప్పుడే వినిపించని రష్యన్ తీరపు డెడ్ సీ వంటిదే! 
మనిషన్నవాడు అవసరం ఉన్నా లేకపోయినా చాలా మందితో మాట్లాడుతూ ఉంటాడు. కాని,ఎదురొచ్చిన వారందరితోనూ హృదయాంతరపు లోతుల్లో నుండి ఆత్యీయపు పన్నీటి జల్లుని కురిపిస్తూ మాట్లాడ లేడుగా! వివాహ బంధంతో ముడిపడి ఉన్న మహత్యం అదేగా! - మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా!అనే కళ్యాణ మంత్రంలో శోభిల్లే సహజీవన సౌరభాలకున్న విశిష్టత అదేగా! కృష్ణమూర్తి ఆలోచనల ముమ్మరం వలన కలిగిన అలస టతో రెండు చేతులూ కళ్లపైన ఉంచుకుని సోఫాలో కూర్చుండిపోయాడు. 



కాసేపు తరవాత తనను తను కుదుట పర్చుకుని లేచాడు. మనిషిన్నవాడికి జీవితంలో దు:ఖాన్ని మించిన బధ్ధశత్రువు మరొకటి లేదు- సాధ్యమైనంత మేర దానిని దగ్గరకు చేరని వ్వ కూడదు. ఎట్టకేలకు గుండెబరువుని మోస్తూ- తనను మోసుకుంటూ లేచాడతను. సంచీ తీసుకుని, జుబ్బా జేబులో డబ్బులు న్నాయో లేదో ఓసారి చూసుకుని అపార్టుమంటుకి తాళం వేస్తూ అసంకల్పితంగా తిరిగి చూసాడు. ఎదుటి అపార్టుమెంటు ముందు తెల్లని చుక్కల ముగ్గులు! అపార్టుమెంటు వాళ్ళకు కూడా రంగవళ్ళికలు వేసేంత తీరికా ఒడుపూ ఉంటాయేమిటి?



అతడికి ఆశ్చర్యంతో బాటు ఆనందం కూడా కలిగింది. షాపునుండి పాలసంచీలు తీసుకుని లిఫ్టు ద్వారా తన బ్లాక్ చేరి తన అపార్టుమెంటు వేపు వస్తూన్నప్పుడు ఎవరో మధ్య వయస్సులో ఉన్నఓ స్త్రీమూర్తి ఆదరాబాదరాగా తాళం వేసి చకచకe నడిచి వెళ్లిపోతూంది. ఆమెవరో గాని పిలిచి పలకరిస్తే బాగున్ననిపించింది కృష్ణమూర్తికి- ముఖ్యంగా చాలా రోజుల తరవాత బ్లాక్ లో మొదటిసారి కనిపించిన ముగ్గుల అంకరణ గురించి తలపోస్తూ. 



కాని అలా చకచకా వెళ్తూన్న ఆవిడ వంపుల సొంపుల ముగ్గుల్ని తనే వేసిందా- లేక పనిగత్తెవరితోనో వేయించి వెళ్లిందా-- ఎవరైతేనేమి- మెచ్చుకోవడం తన కనీస కర్తవ్యం మనిష న్నవాడికి కళా పోషణన్నది కూసింత ఉండవద్దూ! ఏది ఏమైతేనేమి- ఆమెతో మాట్లాడే అవకాశం అదే రోజు సాయంత్రం కృష్ణమూర్తికి లభించింది,తలవని తలంపుగా-- నిజానికి కృష్ణమూర్తికి ఆమెవరో తెలియదు. తెలుసుకోవలసిన అవసరమూ కలగలేదు. ఒకటి మాత్రం అతడి ఊహకు అందీ అందనట్లు అందింది. తనింట్లోలాగే ఆమెగారింట్లోనూ అలికిడి లేనట్లుంది. 



అంటే, తనలాగే పరిస్థితుల దృష్ట్యా ఒంటరిగా కాలం గడుపుతుందేమో! అంచేత మధ్యాహ్నం కోరియర్ బాయ్ తెచ్చిచ్చిన పార్సల్ని అందుకున్నాడు ఆమె తరపున సంతకం పెట్టి తీసుకుంటూ-- తోచుడుకి ఇది కూడా విధమైన నిర్మాణాత్మకమైన మార్గమేనే మో! ఎదురింటి బ్లాక్ అపార్టుమెంట్ మేడమ్ పేరు సూర్యప్రభ. ఇక రెండవ అంశంగా చేయవలసింది; మంచికో చెడుకో- రేపు దేనికైనా పనికొస్తుందేనే తలంపుతో ఆమెతో పరిచయం పెంచుకోవడం. అదే విధంగా ఆమె సాయంత్రం వచ్చి తలుపు తీస్తూన్న గరగర చపుడు వినిపించి కృష్ణమూర్తి బైటకు వచ్చి పార్సిల్ అందించాడు. వాటిని తీసుకుని అతణ్ణి ఎగాదిగా చూసి లోపలకు రివ్వున వెళ్ళిపోయింది గాని, సభ్యత కోసం చిన్నపాటి ధన్యవాదాలు చెప్పలేదు. కనీసం తిరిగి కూడా చూడలేదు నవ్వు ముఖం తో-- 



బహుశ: మిక్కిలి ఆస్తిపరురాలో లేక ఉన్నత ఉద్యోగంలో ఉన్న విద్యాధికురాలో అయుంటుంది. సూర్య ప్రభ ప్రవర్తనకు అతడి ముఖం మారింది. ఆమెకు ఆమెగా ఏదో ఊహించేసుకుంటూ గొప్పగా ఫీలవుతుండవచ్చు. కాని తను మాత్రం తక్కువ స్థాయిలోనా కొలువు చేసి గృహాభిముఖుడయాడూ! తను మాత్రం సీనియర్ క్యాడర్ ఆఫీసర్ పొజిషన్ లో కదూ రిటైర్ అయాడు- అప్పటికప్పుడు అతడు గట్టి తీర్మానానికి వచ్చేసాడు; ఇకపైన ఆమె వేపు తలెత్తి కూడా చూడకూడదని- ఆమె వేసే ముగ్గుల వేపు కూడా తలతిప్పి చూడకూడదని-- ఇంతకూ ఆవిడేమిటి చిన్న వయసులో ఉన్న చిన్నదా-  ఏబైకి పైమాటేగా! 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - డబ్బే అంతా కాదు - by k3vv3 - 08-05-2025, 01:46 PM



Users browsing this thread: 1 Guest(s)