Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#88
ఇది పౌరాణిక కథ కాదు, జానపదం

పొలిమేర - పార్ట్ 1

[font=var(--ricos-font-family,unset)][Image: image-2025-05-05-171553712.png]
[font=var(--ricos-font-family,unset)]'[/font]పొలిమేర పార్ట్[font=var(--ricos-font-family,unset)] 1/2' [/font]తెలుగు కథ[/font]


రచన[font=var(--ricos-font-family,unset)] : [/font]కాశీవరపు వెంకటసుబ్బయ్య

రాయలసీమలోని రెండు గ్రామాలు అనిమెల, దద్దనాల.

చాలా కాలం క్రితం అనిమెల గ్రామంలో జాతర జరిపి, వేట ఇచ్చిన జంతువు తాలూకు రక్తాన్ని అన్నంలో కలిపి గ్రామ శివారులో, పొలాల్లో జల్లుతారు.

దీన్నే పొలి అంటారు.







దద్దానాల గ్రామం వాళ్ళు పొలిని ఒంటికి అంటించుకుని తమ గ్రామ సరిహద్దుల్లోకి వెళతారు. దీన్నే పొలిని ఎత్తుకొని వెళ్ళడమంటారు.







అప్పటినుండి అనిమెల గ్రామంలో కరువుకాటకాలు మొదలయ్యాయని గ్రామస్థులు భావిస్తారు. అది మూఢ నమ్మకమని చెప్పినా వినరు. దద్దానాల గ్రామం నుండి పొలిని తిరిగి తీసుకురావాలని నిర్ణయించి పనికి సుంకన్నను పంపుతారు.







ప్రయత్నంలో ఏం జరిగిందో రచయిత కాశీవరపు వెంకటసుబ్బయ్య గారు రాయలసీమ మాండలికంలో ఉద్విగ్నభరితంగా రచించారు. ఇక కథలోకి వెళదాం.

ఒరేయ్య! సుంకన్నా! ప్యాటకు పొయి గొడ్లకు తౌడు చెనిక్కాయచెక్క త్యాపోరాబ్బి! పచ్చిమ్యాత యాడా చేలల్లో ల్యాకపోయె. ఆటి మోగాన అయన్నా బేచ్చే ఇన్ని పాలిచ్చాయి. ఈకరువు కాలంలో అయ్యే మనకు ఆదరువు. బెర్రీన (తొందరగా) పోయిరాపో నాయిన! ఇంగో మాట. జమడక్కు పిల్లోడు మార్కట్టులో కనపడ్తే ఇత్తనాల లెక్కడుగు. పోయినేడు వానలు పడ్తే చేలల్లో ఇత్తు కుందామని ఇత్తనం గింజలు తెచ్చుకొంటిమి. వానలు పడకపోయె. ఇత్తనాలు మిగిలిపోయె.







జమ్మడక్కు పిల్లోడు ఆమనికి లెక్కిచ్చానని ఇత్తనాల గింజలు తీస్కపోయి వోల్ల చేలల్లో ఇత్తుకొని యేడాది కావచ్చాన్యా లెక్కైతే ఇంగా ఇయ్యకపోయె. ఇబ్బుడన్నా ఇచ్చాడేమో అడిగి తీస్కరాపో! యేడన్నా వానలు కురుచ్చే ఇత్తనం ఇత్తుకుందాం. గ్నాపకంగా అడుగి రప్పిన (త్వరగా) i ఎనక్కి తిర్కొని రాపో పాపోడా!" సుంకన్న అమ్మ తిరిపాలమ్మ నిరాస నిండిన గొంతుతో చెప్పుతాంది కొడుకుతో.







"పోయేచ్చగాని యనుములకు జొన్నచొప్పా, వరిచెత్తా, చెనిక్కాయకట్టె‌‌‌, పెసరపొట్టు రొంతరొంత వుంది. గాట్లో యేయ్యి. ఎద్దులకు జొన్నబియ్యం కడుగునీళ్ళు తాపి గాటికాడ కట్టేయ్. అయి గుడకా తింటయ్!" అన్సెప్పి ఎగాసగా పడి ఊరి నడుమ వున్న రాగిమానుకాడికి వచ్చినాడు సుంకన్న.







ఆడ పిచ్చయ్య తిప్పిరెడ్డి మరికొందరు ప్యాట (ప్రొద్దుటూరు)కు పోను ఆటో కోసరం ఎదురు సూచ్చా రాగిచెట్టు అరుగుమీద కుచ్చోండరు.







"ఏమోయ్ సుంకన్నా! నువ్వు గుడకా ప్యాటకు వచ్చాండవా?" పిచ్చయ్య పలకరించినాడు.







"ఔను మామా! బొత్తిగా పసులకు తిండిలేదు తౌడూ గానుగ చెక్కా తెచ్చామని ప్యాటకు పోతాండ మామా! పొలాల్లో యాడ సూసిన పచ్చగడ్డి మొలక మొల్చక పోయె. పచ్చిమ్యాత ల్యాకపోతే పసులెట్టా పాలిచ్చాయి. పాలీయకపొతే మనకెట్లా గడుచ్చాది. ఈగడ్డు పరిచితి నుంచి యెట్టా బయటపడాలో తెలిడం ల్యా. ఏం తిప్పిరెడ్డి మామా! ఊరక కుచ్చోనుండావ్! నువ్వన్నా రోంత దోవ చెప్పు రాదు!" సుంకన్న బాదంతా ఒలకబోసినాడు.







"సూచ్చాండవ్ కదోయ్! వాతావర్నం! మనం మోరలు పైకెత్తి ఎంత మోత్తుకున్నా! దేవుడు కనికరించడోయ్! మూడేండ్లాయ వానలు పడక. ఏరు పారక. చెరువుకు నీళ్ళు రాక. చేలల్లో ఊపచెత్త కుడక మొల్చక. చేలన్నీ వరుపొచ్చి బిసాంబరంగా (శూన్యంగా) కన్పడ్తాండయ్! జనం బతికి బట్టగట్టడం కట్టమేనోయ్!" తిప్పిరెడ్డి యాట్టపడుతా అన్యాడు.







పక్కనే కుచ్చున్న ఎర్రయ్య మాట కల్పుతా "ఊరంతా అలివిగాని వరుపెత్తుకుండాది. (వరుపు-కరువు)తిన్ను తిండిలేదు. పసువులకు మ్యాత లేదు. నీళ్ళు గుడకా ఏట్లో మనిస్సిలోతు చెలిమె తీస్కొని తెచ్చుకుంటా వుండారు. అయీ రేపోమాపో వొట్టిపోవొచ్చు. మడుస్సులంతా ఘోరెండలకు ఊసబెండ్లలా దోరి (బలహీన)పోతాండరు. ఏం బతుకు తీ మందీ " బాదంతా ఎల్లగక్కినాడు యర్రయ్య.







"ముసలయ్య తాతా! ఇరుగుపొరుగు వూర్లన్నీ అంతోయింతో బాగనే వుండయ్! మన వూరేందో ఇంత అద్దుమానంగా వుండాది. వూరికేందన్నా గాచారం పట్టు కుందంటావా తాతా!?" ఒగిసిలో పెద్దోడైనా ముసలయ్యను సుంకన్న అడుగుతుండంగానే అబ్బుడే అక్కడికొచ్చిన అంకాల్రాయుడు మాటందుకున్యాడు.







"ఊరికి నిజ్జంగానే చెడు గాలం దాపరించినాది. మూడేల్లాపొద్దు వూరిట్టా వుండేది కాదు. అందరాల మనమూ పాడిపంటల్తో కళకళాడ్తాండేవోళ్ళం. మూడేల్లా ఇరుబోగోళ్ళో (దరిదాపుల్లో) మన అనిమెల్లో పోలేరమ్మ ద్యావర జరిగినాది. ద్యావర్లో మన పొలిని దద్దనాలోళ్ళు మనల్ని ఆదమరింపించి ఎత్తక పోయినారు. ఆడికీ మన కుర్రోళ్ళు కత్తులు కటార్లు పట్టుకుని యంటబన్యారు. వాళ్ళు దొరకుండా పొలిమేర దాట్నారు. పొద్దునుంచి పరిచితి ఒనగూడినాది. మన పొలి మనం తెచ్చుకున్యా దాక మన బతుకులింతే. " అంకల్రాయుడి మాటల్లో యేదన ఉట్టిపన్యాది.







ఇంత లోపల ఆటో ప్యాట్నుంచి వొచ్చినాది. సుంకన్నతో పాటు అందరూ ఆదరబాదరమని ఆటో ఎక్కి కుచ్చున్యారు. ఆటో నిండు మనిసిలా కదిలి ప్యాటకు పోయినాది.

ప్యాట మార్కెట్లో గాయగూరలు, తిరువాతనూన్య (వంటనూనె), పసులకు బియ్యంతౌడు, చనిక్కాయచెక్క తీస్కొని మార్కెట్టు బయిటికి వచ్చేసరికి జమ్మడక్క (జమ్మలమడగు) పిల్లోడు బండెన్న రోడ్డు మీద పోతా కన్పించ్చినాడు. "రేయ్ బండెన్నా!" యని సుంకన్న పిల్చేటప్పటికి బండెన్న నిలబన్యాడు. I







"ఏంబ్బీ యేడాది ఐతాన్యా ఇత్తనం గింజల లెక్కీయ్యక పోతివి. ఇయనీకి బుద్ది పుట్టలేదా! అమ్మ 'ప్యాట్లో నువ్వు కనపడ్తే లెక్క ఇప్పిచ్చుకరా' అన్యాది. ఇబ్బుడన్నా ఇయబ్బీ. శాన కసాల (అవసరం) గా వుండాది. " అని అడిగినాడు సుంకన్న.






"యాడిదన్నా లెక్కా. ఇల్లు జరగడమే ఈదల మాదలగా వుండాది. మీరిచ్చిన ఇత్తనం గింజలు చేలో ఇత్తినాక వాన పడక న్యాల్లోనే కుళ్ళిపోనాయ్. పెల్లాం బిడ్డలకు కూడు కుడక పెట్టల్యాక పోతాండాను. పొలాలు వదిలేసి ప్యాటకు కూలి పన్లు చేయడానికి వొచ్చాండన్నా! బతకడానికి శాన ఇబ్బందులు పడ్తాండన్నా!" శాన ధీనంగా చెప్పకున్యాడు బండెన్న.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - ఏకలవ్యుడి కథ - by k3vv3 - 05-05-2025, 05:19 PM



Users browsing this thread: 1 Guest(s)