03-05-2025, 05:00 PM
ఆంతర్యం - P.L.N. మంగారత్నం
![[Image: image-2025-05-03-165927608.png]](https://i.ibb.co/KzRhPSrv/image-2025-05-03-165927608.png)
ఆ రోజు పేపర్లో వచ్చిన ‘మాట్రిమొనీ’ కాలం పరిశీలిస్తున్నాడు నచికేత్.
వయసు వచ్చినప్పటి నుంచీ అమ్మానాన్నా చూపించిన పెళ్ళి సంబందాని కల్లా వెళ్లి వస్తున్నాడే గాని ఒక్కటీ కుదరడం లేదు.
వీళ్ళకి పిల్ల నచ్చడం అనే మాట అలా ఉంచి .. అవతలివాళ్ళకే తన ఉద్యోగం నచ్చకుండా పోవడం ఓ వింత అయిపొయింది. గవర్నమెంటు ఆఫీసులో ‘అటెండరు’ అయినా ఫర్వాలేదు. గాల్లో దీపం లాంటి ‘సాఫ్ట్వేర్’ ఉద్యోగం ఎందుకు? అనడంతో.
తను మాత్రం ఏం చెయ్యగలడు? .. చదువుకున్న ఇంజనీరింగు చదువుకి వచ్చిన కొలువు అది.
అలా అని జరిగే కాలం ఆగుతుందా? అప్పుడే వయస్సు ముప్పై ఏళ్ళుకి వచ్చి .. జుట్టు పలచబడడమే కాదు అక్కడక్కడా తెల్లబడుతుంది కూడా.
అలా ఓ ప్రకటన చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు.
అప్పుడే మనవడి కోసం కాపీ గ్లాసుతో .. వచ్చిన బామ్మకు మనవడు పేపర్లో పెళ్ళిపందిరి ప్రకటనలు చూసి నవ్వుకోవడం కంటపడింది.
“ ఏరా! పిచ్చి సన్నాసీ, పేపరు చూస్తూ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. ఎవరైనా పిల్ల దొరికిందా? ఏమిటీ? కనీసం నువ్వు‘ ఇలా ‘అయినా ఓ ఇంటి వాడివి అయితే చూసి పోవాలని ఉందిరా! ”
“ పొదువు గాని లేవే. పోకుండా ఇక్కడే ఉట్టి కట్టుకుని ఉండిపోయేవాళ్ళు ఎవరు? ఈ ప్రకటన చూస్తే నవ్వు వచ్చింది. నువ్వూ ఓసారి చూసి తరించు ” అంటూ కాఫీ గ్లాసు అందుకుని, పేపరు బామ్మ చేతిలో పెట్టాడు. బాక్స్ లో వేసిన ప్రకటనను చూపిస్తూ.
కళ్ళజోడు సవరించుకుంటూ సోఫాలో కూలబడి .. పైకే చదవసాగింది బామ్మ “ ఉద్యోగం చేస్తూ, వంటావార్పూ తెలిసి .. పిల్లల్ని చూడగలిగే వరుడు కావలెను “ అని.
“ మా యమ్మే! ఇక నీకు పెళ్లెందుకే తల్లీ. ముందు ముందు పిల్లల్ని అయినా కంటావా? లేదా!” అంటూ బుగ్గలు నొక్కుకుంది.
బామ్మ వాలకానికి నచికేత నవ్వుకుంటుంటే ..
ఆ మాటలకి ప్రక్కగదిలోనే ఉన్న కోడలు సింధూరి గుమ్మం వరకూ వచ్చి “ ఏమిటి? అత్తయ్యా! అప్పుడే ‘పిల్లల్ని కనడం’ అంటున్నారు .. ముందు వాడికి పెళ్ళి రాత ఉందో! లేదో! కదా! మొన్ననే ‘ ఇరవైనాలుగో ’ పెళ్ళి చూపులకు కూడా వెళ్లి వచ్చామాయే. వీడి తరువాతి వాడు ‘నితిన్’ అప్పుడే ప్రేమా.. దోమా అంటూ తొందర పడుతుంటే, వాడి తరువాతి పిల్ల ‘ తేజస్విని ’ కీ పెళ్ళికి ఎదిగింది. అప్పుడే సెల్ఫోన్ చాటింగులతో బిజీ అయిపోతుంది. అక్కడ బ్రేకులు వేద్దామనుకున్నా .. ఇక్కడేమో విషయం కదలకుండా ఉంది “ అంది కాస్త స్వగతంలా ,, మరి కాస్త నిష్టూరంగా.
హాలులో ఉండి .. పేపరు చదువుతున్నట్లు దాన్ని ముఖానికి అడ్డం పెట్టుకుని, అన్నీ వింటున్నాడు నచికేత్ తండ్రి పరమశివం.
కాస్సేపటికి ఏమనుకుందో గాని బామ్మ..
“ ఓ సారి ఫోన్ కలిపి ఇవ్వరా! మాట్లాడతాను. ఏ పుట్టలో ఏ పాము ఉందో! ఓ రాయేసి చూస్తే పోయేదేముంది? ” అనడంతో ఫోన్ కలిపి ఇచ్చాడు నచికేత్. తను చెయ్యాలనుకున్న పనికి .. బామ్మ పూనుకోవడంతో సంబరంగా.
ముందు కాస్త ఆషామాషీగానే మాట్లాడిన బామ్మ కాస్సేపటికి “ అలాగా బాబూ! అలాగా! మా మనవడు సాఫ్ట్వేర్ అయినా ఫర్వాలేదా? ఈ హైదరాబాదే కదా! మీ ఇంటి ఎడ్రస్సు లొకేషను పెట్టండి. మంచిరోజు చూసుకుని వస్తాంలెండి” అంటూ పెట్టేయ్యడంతో అంతా నోరెళ్ళబెట్టుకుని చూసారు.
పిల్ల తండ్రికి కొడుకు ఉద్యోగం మీద అభ్యంతరాలు లేకపోవడం సంతోషించింది సింధూరి.
***
అది ..
ఊరిలొ పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయిన భాను ప్రకాష్ గారి ఇల్లు. అందం, ఐశ్వర్యం కలబోసినట్లు ఉంది కాబోయే పెళ్ళికూతురు ‘ అభిజ్న ’
అందరికీ నచ్చింది పిల్ల.
పిల్లకు ,, పిల్లాడి ఉద్యోగమూ, వంటల కబుర్లూ కూడా నచ్చేయ్యడం .. కలలో జరిగినట్లు జరిగి పోయింది పెళ్ళి. తనకు లైను క్లియర్ అయినందుకు సంతోషపడ్డారు నితిన్, తేజస్వినిలు.
అభిజ్ఞా .. నచికేత్ అనుకున్నా, నచికేత్ .. అభిజ్ఞా అనుకున్నా జంట బాగానే ఉంది.
అయినా నచికేత్ ఆ ‘కల’ నుంచి .. ఇల లోనికి అంత త్వరగా రాలేకపోతున్నాడు.
అభిజ్నను కళ్ళలోనే నింపుకుని ఉద్యోగానికి వెళ్లి వస్తున్నా .. మనసులో సందేహాలు అలానే ఉండి పోయాయి. నేనెక్కడ? తనెక్కడ? అన్నట్లు.
నెల తరువాత .. తన ప్రమేయం లేకుండా నచికేత్ మకాం ఓ కొత్త ఇంటికి మారిపోయింది.
***
అక్కడ .. ఇద్దరూ ఆడుతూ పాడుతూ పనులు పంచుకుని ఉద్యోగాలకు వెళ్లి వస్తున్నా నచికేత్ మనసు ఆలోచిస్తూనే ఉంది.
ఎన్నాళ్ళీ ముసుగులో గుద్దులాట అనుకుంటూ ఓ రోజు అడిగేసాడు.
“ నేను ఏం ఉద్యోగం చేస్తున్నానో! మీకు సరిగా తెలీదా?” అడిగింది అభిజ్న ఆశ్చర్యంగా.
“ మీ నాన్న కంపెనీ లోనేగా ”
“ అవును. మా నాన్న కంపెనీ లోనే .. ఇప్పటికి క్లార్కునే. ఒక్కతే కూతుర్ని కావడంతో .. ముందు ముందు కంపెనీ పగ్గాలు కూడా నావే. దీని కోసం ‘ అమెరికా’ వెళ్లి కూడా బిజినెస్ మనేజిమెంటు కోర్సు కూడా నేర్చుకున్నాను. ఎన్ని చేసినా చివరికి ఆడది కోరుకునేది .. సుఖ సంసారం. అందుకే, భవిష్యత్తులో ఏ ఇబ్బందీ రాకూడదని, నేను చూసుకోలేక పోయినా .. ఇంటినీ, పిల్లల భాధ్యతనీ తీసుకునే వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలని .. నేనే అలా ప్రకటన ఇచ్చాను” చెప్పింది అభిజ్న.
“ మరి అలాంటపుడు .. ఉద్యోగం చేస్తూ ఉండేవాడే కావాలన్నావు కదా! ఇన్ని పనులు ఒక్కడే ఎవరైనా చెయ్యగలరా? “ అన్నాడు బుంగమూతి పెడుతూ.
“ అన్నాను. ఉద్యోగం పురుష లక్షణం .. కాబట్టి. చిన్నదో! పెద్దదో! ఎదో పని అంటూ ఉండాలికదా అని. ఖాళీగా ఉండేవాడి బుర్ర డెవిల్స్ ఖార్ఖానా లాంటిదని, చేతి నిండా పని ఉంటే అనవసరపు ఆలోచనలు రావు కదా! అని ” చెప్పింది అభిజ్న నవ్వుతూ.
పైకి మాత్రం ఉడుక్కున్నా .. లోలోన భార్య దూరద్రుష్టికి సంతోష పడ్డాడు నచికేత్.
మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా!

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ