02-05-2025, 06:35 PM
వారు సంతోషాంగా ఆమోదించారు. ఒకసారి పెళ్లి చూపులకు రమ్మన్నారు. పెళ్లి చూపులలో తెలిసిన విషయం ఏమిటంటే వారు బాగా చితికి పోయినప్పుడు అయినవాళ్లు కూడా ఆదుకోవడానికి నిరాకరిస్తే మా నాన్న చేయూత వల్ల వారు ఈరోజు ఇలా ఉన్నామని చెప్పి ఇవాళ వారింటికి పిల్లనిచ్చే భాగ్యo వచ్చినందుకు సంతోషపడ్డారు. పెద్దవాళ్లు ఎప్పుడో చేసిన పుణ్యం ఈరోజు నాకు ఉపయోగపడింది. మనసులోనే మా తండ్రికి పాదాభివందనం చేసుకున్నాను. వారిది అభిమానం.... మరి పిల్లకు ఆతర్వాత గొడవలు వద్దు అని ఆ అమ్మాయినే సూటిగా అడిగా. తనకు ఎటువంటి అభ్యంతరము లేదంది ...మావాడిని అడిగాను చిన్ని కోసం బలవంతంగా చేసుకోకని అది రేపు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కలకాలం వుండాల్సింది మీ ఇద్దరు కాబట్టి నచ్చితేనే చేసుకో లేకపోతె ఇంకా చూద్దాం అన్నాను. వాడు తనకు నిజంగానే నచ్చిందని చెప్పాడు ...ఆ మాట వినగానే నిర్జీవమైన ఈ శరీరంలోకి జీవం వచ్చిందనిపించింది. మావాడి పెళ్లి అనుకున్నట్టుగా కుదిరినందుకు చాల సంతోషంగా అనిపించింది. ఇదే సంతోషం అనుకుంటున్నంతలో అతనొచ్చి మా తమ్ముడు కూతురు కూడా పెళ్లీడు కొచ్చింది మీ చిన్నబాబు కు పెళ్లి చేసేట్టయితే చూస్తారా అని అడిగాడు. జాతకo ఇస్తానన్నాడు. ఏ జాతకము వద్దు పిల్ల ఉంటే ఇప్పుడే చూపించండి... ఇద్దరికి నచ్చితే అంతకన్నా ఏమికావాలి అన్నాను. చిన్నోడికి కూడా అదే చెప్పాను బలవంతం లేదని.. ఇద్దరికి ఇద్దరు నచ్చడం తో ఒకే వేదిక ఒకే ముహూర్తానికి పెళ్లిళ్లు జరిగిపోయాయి. శుభకార్యాల కరువుతో అల్లాడుతున్న మా ఇంట్లో కి ఒకే సారి వసంతం వచ్చినట్లు అనిపించింది. ఓ శుభ ముహుర్తాన అక్క చెల్లెల్లు కాపురానికి వచ్చారు. భగవంతుని దయవల్ల కోడళ్ళిద్దరు ఉత్తములు. చిన్నిని వారు కూడా చాల అపురూపంగా చూసుకుంటున్నారు... ఏ గొడవ లేకుండా అందరo ఒకే ఇంట్లో ..చిన్ని లేకపోతె ఇది సాధ్య పడేది కాదేమో. పెద్దోడింట్లో కొన్నిరోజు చిన్నోడినట్లు కొన్ని రోజులు ఉండాల్సివచ్చేది. చిన్ని వల్లే అక్కాచెల్లెళ్లు తోడికోడళ్లు ఇంక గొడవలేమి లేవు . ఒక శుభముహుర్తం లో ఇద్దరు నీళ్లు పోసుకున్నారు. ఇద్దరికి కొడుకులే. మళ్ళి నా ముగ్గురు బిడ్డల్లాగా వీళ్లు ముగ్గురు అదే ఆనందంగా . ..కాలం చాల వేగంగా తిరిగింది. మా ముగ్గురు పిల్లల్ని చూస్తు భాగ్య విషాదం నుండి అందరం పూర్తిగా కోలున్నాము. ముగ్గురు కాస్త ఐదు మందయ్యారు... పిల్లలిద్దరూ వద్దంటున్నా వారి తండ్రి ముగ్గురు భాగాలేసుకొని లంకంత ఇల్లు కట్టారు. ఒక శుభముహుర్తంలో అందరం కొత్తింటికి వెళ్ళిపోయాము. ఇల్లు ఖాళీచేస్తున్నప్పుడు నా కూతురు నన్ను వదిలి వెళ్లిపోతున్నారా! ! అని అడుగుతున్నట్టు అనిపించింది. ఎవ్వరితో, దేనితో ఎక్కువ అనుబంధం పెంచుకోకూడదు సంతోషం కన్నా వేదనే ఎక్కువ.. ఇల్లు నిజంగా చాల సౌకర్యంగా వుంది. మా పిల్లలిద్దరూ వద్దని చెప్పినా వినిపించుకోకుండా వంటమనిషి ని కూడా పెట్టేసారు . నిజమే ఎంత ఒద్దికగా వున్నా పని, డబ్బు ఈ మాయదారి టీవీ తోనే గొడవలు. అందరి రూములకు టీవీలు అందరు కల్సి చూడడానికి హల్లో మరో టీవీ. పని దగ్గర గొడవలేకుండా వంటమ్మాయి. ఇక పేచీ కి ఏ ఆస్కారం లేదు. ఇలా ఎవరి గదులవల్ల కాదు కానీ నిజంగా నాకోడళ్లు ఉత్తములు. ఈ కాలంలో ఎవరుంటారు అని నేను ఒకప్పుడు నొసలు చిట్లించినదానినే. నాకూతురు కాబట్టి వినయ విధేయతలు అని ఒకింత గర్వo కూడా. కానీ నిజానికి నాకూతురి కంటే ఓపికగల వాళ్ళు నా కోడళ్ళు. మునుపటి మనిషిని అయ్యుంటే కొంత పేచీ వచ్చేదేమో అమ్మమ్మ ను అమ్మ నయ్యాక నాలోనూ చాల మార్పు వచ్చింది జీవితానుభవం పరిణితిని పెంచింది. . సగం గొడవలు అత్తా కోడళ్ళకె.. చూస్తుండగాననే వారాలు నెలలయ్యాయి నెలలు ఏండ్లుయ్యాయి . చిన్ని పెద్దమనిషి పండుగ మేనమామలిద్దరు తండ్రి గాను మేనమామలుగాను రెండు భాద్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు. నా పిల్లలు ముగ్గిరిలాగ నా మానవoడ్లు మనవరాలు మధ్య కూడా అదే అనుబంధం అంతే కాదు అందరు చదువులో కూడా ఆణిముత్యాలు . చూస్తుండగానే కేసెట్ రిజల్ట్స్ వచ్చాయి. చిన్నికి చాలా మంచి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది . అందరి ఆనందానికి హద్దులు లేవు. అదీ బెంగళూరు లోనే ఇది మరింత సంతోషం. వారి తాత గారు తమ మనవరాలు మెడిసిన్ లో సీట్ తెచ్చుకున్నందుకు కాలేజికి వెళ్ళడానికి బండి కొనిచ్చాడు. పాపo ఇన్ని ఏండ్లు గడిచినా క్రమంతప్పక వచ్చి వెళ్తారు. ఆనవాయితీగా దసరా పండుగకు వారింటికి పిల్చుకెళ్తారు... వారి మానవరాలికి ఎక్కడా తక్కువ చేయలేదు. చిన్నికి తల్లి తండ్రి లేరన్నమాటే కానీ వాళ్ళున్నా ఇంతకన్నా గొప్పగా అయితే చూసేవారు కాదు. కానీ నేను ఇప్పుడప్పుడే బండి మీద వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ప్రతి రోజు రోడ్లమీద ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి అంత మాత్రానికే రోడ్డుమీదికెళ్ళము అంటే ఆలా అని అందరు నన్ను ఒప్పించారు అందులోనూ కాలేజ్ కూడా మరీ దూరమేమియు కాదు అందువల్ల నేను ఒప్పుకున్నాను. చూస్తుండగానే అది మెడిసిన్ నాలుగో సంవత్సరం లోకి వచ్చేసింది. మానవoడ్లు కూడా మంచి కొలేజిల్లో చేరారు. భగవంతుని దయ వల్ల రోజులు ప్రశాంతంగా గదుడుస్తున్నాయి. ఈ మధ్య నా వంట్లో కూడా బాగుండటంలేదు అందుకే మెడిసిన్ అవ్వగానే దాని పెళ్లి చేసేయాలి అని అనుకున్నా. కానీ మామాలిద్దరు అది చదివినంత చదవని పెళ్ళికి తొందర పెట్టొద్దు అని చెప్పేసారు. ఇన్నేళ్లు చూసుకున్నవాళ్ళు ఇకపై చూసుకోరా... వారిని అనుమానిస్తే దేవుడు కుడా నన్ను క్షమించడు అనిపించి నేను ఊరుకుండిపోయా. ఇవాళెందుకో మరీ నలతగా ఉండడంతో వెళ్లి పడుకుండిపోయా. బాగా నిద్ర పట్టేసింది. లేచి బయటికి వచ్చాను. హాల్లో గంభీరమైన వాతావరణం మళ్లి ఆ భయానకమైన రోజును గుర్తు చేస్తూ..... స్మశాన నిశబ్దం అక్కడే కూర్చుండిపోయా అర్థం అయ్యిoది ....ఈసారి ఏమిటో ఎవరో కూడా తెలుసుకోవాలనిపించలేదు. చిన్నాడు కారు తీసుకొని వచ్చాడు. అందరం కలిసి హాస్పిటల్ కు వెళ్ళాము. అసలేమీ జరిగిందో తెలుసుకోవాలనిపించలేదు. పెద్దోడొచ్చి ఇరవైనాలుగు ఘంటలు గడిస్తే కానీ చెప్పలేమన్నారు డాక్టరు అన్నాడు. ఈలోపు మానవoడ్లు వచ్చారు... ఆంటే చిన్ని చిన్ని కేమైనట్టు. అడగాలనుకుంటున్న మాట పెగలట్లేదు దేవుడా! !! మళ్ళి ఆక్సిడెంట్ రూపంలో హతవిధీ!!! అని అనుకున్న. ఐసీయూలో ఉంది. ఎవ్వరిని పంపించటంలేదు అని చెప్పాడు... ఈలోపు సెక్యూరిటీ ఆఫీసర్లు పంచానామాకొచ్చారు. ఏదో సీరియస్ గా మాటలు నడుస్తున్నాయి. కాసేపటికి వారు డాక్టర్ తో మాట్లాడి వెళ్లిపోయారు. ఈ గొడవలో గమనించనేలేదు చాల మంది తన క్లాసుమేట్స్ వున్నారు. అందులో ఒక అబ్బాయితో మా పెద్దాడు చిన్నాడు ఇద్దరు కలిసి చాల కోపం తో మాట్లాడుతున్నారు. ఓహో ఆ అబ్బాయే ఆక్సిడెంట్ కు కారణం కాబోలు.... కావాలని చేసుండడు కదా మన గ్రహపాటు. ఇంకా వాడితో మాటలు తెగలేదు అంటే కొంపదీసి ఆసిడ్ దాడిలాంటిది. ... మనసు కు చాల భయం వేసింది. అప్పుడడిగా చిన్నికేమైంది అని. మావారు ఇచ్చిన సమాధానంతో కళ్ళు బేర్లు కమ్మి కళ్ళుతిరిగి పడిపోయా. మెలుకువ వచ్చి చుసేపాటికి ఆసుపత్రి బెడ్డు మీదున్న. డాక్టర్లు మారెo పర్వాలేదు అని చెప్పివెళ్లిపోయారు. ఈలోపు పెద్దవాడు వచ్చి అమ్మ నీవేమి బాధపడకు చిన్ని కి ప్రణాపాయo లేదని డాక్టర్లు చెప్పారు అని సంతోషంగా చెప్పాడు. నేను చిన్నిని చూడకుండానే ఇంటికి వచ్చేసాను. వారo తర్వాత చిన్ని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. ఈ వారం లో కనీస ఒక్కసారి కూడా చిన్ని ని చూడడానికి వెళ్ళలేదు. పాపం కోడళ్ళిద్దరు చాల చక్కగా చూసుకున్నారు. అది ఇంటికి వస్తూనే ఏమిటి అమ్మమ్మ నీవు ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాలేదు అని గారాలు పోతూ అడుగుతుంటే ఆ చంపా ఈ చంప చళ్ళు మని వాయిoచా!!!!... నా చర్యకు అందరు విస్తుపోయారు. చిన్నోడు పెద్దోడు కంగారుగా నా దగ్గరకు పరుగెత్తుకొచ్చారు. చిన్ని కూడా ఏడుపు కండ్లతో నా వైపే చూస్తోంది. . జీవితంలో మొదటిసారి అదంటే నాకు చాల అసహ్యమేసింది. నాకంటిముందుoటే చంపేస్తాను నాముందునుండి వెళ్ళిపో అని గట్టిగా అరిచాను అందరు జడుసుకున్నారు. దాన్ని నన్ను కోర్చుపెట్టారు. నాకు కోపం పిచ్చి స్థాయిలో వుంది. అది అడుగుతోంది ఎందుకు అమ్మమ్మ అంత కోపంగా వున్నావు అని లేచొచ్చి మళ్లి చెంప చళ్ళు మనిపించా . కాలు కింద పెడితే కాలు అరుగుతుందేమోనన్నట్లు పెంచితే నీవు చేసిన నిర్వాకమేమిటి . వాడెవడో నీ ప్రేమను కాదన్నాడని మనస్తాపమ్ చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటావా. మీ అమ్మవాళ్లతో నీవు పోయినా బాగుండేది. మృతుంజయురాలు అంటే ఎంత సంతోషపడ్డానో తెలుసా. అమ్మమ్మ వయసులో నీకు అమ్మనయ్యా నీకు అమ్మ లేని లోటు తెలియకూడదని కంటికి పాప లాగ కాపాడుకున్నా . మీ తాత!!! చేత కాకపోయినా పాపం ఎంతో చేశారు నీకోసం. మీ నాయనమ్మ వాళ్ళు వారి కొడుకును నీలో చూసుకున్నారు....మీ మామయ్యలు నిన్ను కాదన్న సంభంధం ఎంత మంచిదైనా కాదన్నారు. నిన్ను ఒప్పుకున్నవాళ్ళ నే పెళ్లి చేసుకుంటామని పెళ్లీడు అయిపోవస్తున్నా అలాగే వున్నారు కానీ నిన్ను కాదన్న వాళ్ళను చేసుకోనేలేదు. మా అందరికి నీతో రక్త సంభంధం వుంది కానీ మీ అత్తయ్యలకు ఏమి సంభందం!!!
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
