Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
ప్రజాపతి....
పాపాల భైరవుడు....
సాయంత్రం... వూరికి చేరాడు. మార్గమధ్యాన అతనికి విషయం తెలిసింది. ముఖంలో విజయగర్వం, పెదాలపై చిరునవ్వు.
ప్రజాపతిని ధిక్కరించి పాతికేళ్ళకే పరమపదించావు కదరా ఈశ్వర్! అని వికటంగా నవ్వాడు.
నవ్వుకు ప్రతిధ్వనిగా మరో నవ్వు.... అది... ఈశ్వర్ కంఠం....
"మామా!..."
ఉలిక్కిపడి ద్వారం వైపు చూచాడు ప్రజాపతి.
గెలిచావని సంతోషిస్తున్నావా!.... నీవు గెలవలేదు మామా!. అహంకారంతో పూర్తిగా పతనమైపోయావు వికటంగా ఈశ్వర్ నవ్వు.
ప్రజాపతి ఎదుట.... ఈశ్వర్ ఆకారం... 
ప్రజాపతి గుండె వేగం.... పెరిగింది.
పరుగున మేడపైకెక్కి తన గదిలో దూరి తలుపు బిగించుకొన్నాడు.
శరీరం నిండా భయంతో చెమట. కాళ్ళు చేతుల్లో ఒణుకు... కుర్చీలో కూర్చున్నాడు. కళ్ళు మూసుకొన్నాడు.
కొన్ని క్షణాల తర్వాత  మెల్లగా కళ్ళు తెరిచాడు.
ఎదుటి కుర్చీలో ఈశ్వర్... నవ్వుతున్నాడు.
ప్రజాపతికి భయం... గుండె దడ....
అద్దంలో తన ముఖాన్ని చూచుకొన్నాడు. ముఖం నిండా చెమట కారుతూ వుంది.
కొన్ని క్షణాల తర్వాత... తన ప్రతిబింబం స్థానంలో.... ఈశ్వర్!
"ఆఁ...." ఆశ్చర్యంతో హడలిపోయాడు ప్రజాపతి.
మామా! పలకరింపు. ఈశ్వర్ రూపం మాయమైంది. 
ఆందోళనతో గది నలువైపులా చూచాడు.
తలుపు తట్టిన శబ్దం....
బెదిరిపోయి తలుపు వైపు చూచాడు.
"అయ్యా!...."
"తన హితుని కంఠం"
"ఎవర్రా!" గర్జించాడు ప్రజాపతి.
"నేనయ్యా! వీర్రాజును"
వేగంగ వెళ్ళి తలుపు తెరిచాడు.
ఎదురుగా వీర్రాజు.
"అయ్యా!... మన ఫ్యాక్టరీ కాలి బూడిదైపోయింది"
"ఆఁ!...." ఆశ్చర్యం.
"అవునయ్యా!..." విచారంగా చెప్పాడు వీర్రాజు.
కొన్ని క్షణాల తర్వాత....
వీర్రాజు స్థానంలో ఈశ్వర్!...
"మామా!" విచిత్రంగా పలకరింపు.
భయంతో వెనక్కు నాలుగు అడుగులు వేశాడు ప్రజాపతి. ఈశ్వర్ నవ్వుతూ ప్రజాపతి వైపు నడిచాడు. 
సోఫాను తన్నుకొని ప్రజాపతి క్రింద పడ్డాడు. భయాందోళనలతో పైకి లేచాడు. టీపాయ్ పైన వున్న గ్లాసును తీసుకొని ఈశ్వర్పై విసిరాడు.
"అమ్మా!" గ్లాసు తలకు తగిలిన కారణంగా వీర్రాజు తల పట్టుకొన్నాడు.
"అయ్యా!... నన్ను ఎందుకు కొట్టారయ్యా!" దీనంగా అడిగాడు వీర్రాజు.
"ఆఁ..... నీవు,.... నీవు... ఈశ్వర్... ఈశ్వర్వు కదా!" ఆందోళనగా అడిగాడు ప్రజాపతి.
"అయ్యా!.... ఈశ్వర్ చచ్చిపోయాడు. వారి కారును లారీతో గుద్దించి యాక్సిడెంట్ చేయించింది మీరే కదయ్యా వారిని చంపింది!" వ్యంగ్యంగా నవ్వాడు వీర్రాజు.
"రేయ్ పెద్దగా అరవకు."
"నేను చిన్నగానే చెప్పానయ్యా!"
"ఆఁ...."
"అవును"
వీర్రాజును విచిత్రంగా చూచాడు ప్రజాపతి.
"మామా!" వీర్రాజు స్థానంలో ఈశ్వర్.
ప్రజాపతి కళ్ళు బయర్లు కమ్మాయి. చిత్తభ్రమ.... ఎదురుగా వున్నది ఈశ్వర్ అనే భావన. భయం, ఆవేశం, తత్తరపాటు.`` GZzz
వేగంగా వెళ్ళి దిండు క్రింద వున్న తుపాకీని చేతికి తీసుకొని వీర్రాజుకు గురిపెట్టి కాల్చాడు.
రెండురోజుల క్రితం పడక గదిని శుభ్రం చేస్తున్న ప్రణవి తుపాకిని చూచి అందులోని గుండ్లను బయటికి తీసి దాచేసింది. తన భర్త ఆవేశంతో ఎవరినీ కాల్చకూడదు అని.
ప్రజాపతి తుపాకి ట్రిగ్గర్ను నొక్కాడు. గుండ్లు లేని కారణంగా అతని ఆశ నిరాశయింది. ప్రజాపతి చేష్టలకు వీర్రాజుకు భయం కలిగింది. అతనికి మతి చలించిందనే నిర్ణయానికి వచ్చాడు.
"రేయ్!.... ఈశ్వర్ నిన్ను గొంతు పిసికి చంపుతా!" కసిగా వీర్రాజు పైకి దూకాడు ప్రజాపతి.
తన పేరుకు బదులుగా ఈశ్వర్.... ఈశ్వర్... అనే కలవరంతో ఆవేశపడుతున్న ప్రజాపతికి పిచ్చి పట్టిందని చెబుతూ తన ఇంటికి వెళ్ళిపోయాడు వీర్రాజు.
అరగంటలో గాలి వార్త వూరంతా వ్యాపించింది. జనం.... ప్రజాపతికి పిచ్చి పట్టిందని, కొందరు అయ్యో పాపం అని, కొందరు ఆయనగారు చేసిన పాపాలు పండాయని తీర్మానించేశారు. 
వార్త.... హరికృష్ణ ఇంటి వారి చెవికీ సోకింది. ప్రజాపతి ఎంత చెడ్డా... ప్రణవి భార్య కాబట్టి... సీతాపతి కొడుకు కాబట్టి అతన్ని చూచేదానికి వచ్చారు.
"అయ్యా!... మీరు చెప్పిన రెండు పనులు ఖచ్చితంగా ముగించినా!.... ఫ్యాక్టరీ కాలిపోయిందానికి మీకు ఇన్సూరెన్స్ వస్తది. ఈశ్వర్ బాబు చచ్చిపోయాడు కాబట్టి దీపమ్మ మీ ఇంటికి వస్తది. మీరు ఆమెను పరంజ్యోతి సార్ కొడుకు దివాకర్ బాబుకు ఇచ్చి మీ ఇష్టప్రకారం పెళ్ళి చేయొచ్చు. నాకు పాతికవేలు అడ్వాన్స్ ఇచ్చిండ్రు. మిగతా డైబ్బై అయిదు వేలు ఇస్తే నాదారిన నేను పోతా. ఇక మీ కంటబడ."
ప్రజాపతి తన ఆఫీస్ గదిలో కూర్చొని ఉన్నాడు. ఎదుట నిలబడి పై మాటలు చెప్పి చేతులు జోడించాడు రౌడీ కోటేసు.
ఇంట్లో ప్రవేశించిన ప్రణవి... సీతాపతులు వ్యక్తి చెప్పిన మాటలను పూర్తిగా విన్నారు.
"మామా!"
ప్రజాపతి ఉలిక్కిపడి చూచాడు.
తన ఎదుట నిలబడి వున్న వ్యక్తి స్థానంలో ఈశ్వర్...!
"ఈశ్వర్ నీవా!" ఆశ్వర్యంతో, ఆగ్రహంతో ప్రజాపతి కుర్చీనుండి లేచి.
"సార్!.... నేను ఈశ్వర్ బాబును కాను. ఆయన చచ్చిపోయుండుగా!.... నేను కోటేసును... నా డబ్బును యియ్యండి. ఎల్లిపోతా!"
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 20 - by k3vv3 - 01-05-2025, 04:49 PM



Users browsing this thread: 1 Guest(s)