Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#74
డబ్బే అంతా కాదు
రచనతాత మోహనకృష్ణ



రామకృష్ణ హడావిడిగా బస్ స్టేషన్ కు బయల్దేరాడు. వెంటనే, విజయవాడ లో ఉన్న తన ఫ్రెండ్ ప్రసాద్ ని చూడడానికి వెళ్ళాలి. కొంతసేపటికి ముందు.. విజయవాడ నుంచి ఎవరో ఫోన్ చేసి ప్రసాద్ గురించి చెప్పారు. ప్రసాద్ ని హాస్పిటల్ లో జాయిన్ చేశారని, పరిస్థితి బాగోలేదని చెప్పారు



బస్సు లో కూర్చున్న రామకృష్ణ కు తన గతం గుర్తుకు వచ్చింది.. 



****
రామకృష్ణ, ప్రసాద్ ఒకే కాలేజ్ లో చదువుకునేవారు. ఒకరి అభిరుచులు ఒకరికి బాగా తెలుసు. రామకృష్ణ అత్యాశ లేని మనిషి. ఉన్న దానితో సంతృప్తి పడే స్వభావం. కానీ, ప్రసాద్ మాత్రం.. ప్రతీది ఎక్కువ కావాలని కోరుకునేవాడు. మిగిలిన విషయాలలో ఇద్దరు బానే ఉండేవారు. కొంతకాలానికి ఇద్దరి మధ్య స్నేహం బాగా బలపడింది. అదే ఊరిలో ఇద్దరు పదో తరగతి వరకు చదువుకున్నారు. 



రామకృష్ణ సిటీ కి వెళ్లి పెద్ద చదువులు చదవలేక.. అక్కడే తండ్రి తో పాటు కలిసి చిన్న వ్యాపారం చేసుకుని అక్కడే ఉండిపోయాడు. ప్రసాద్ మాత్రం సిటీ కి వెళ్లి గొప్పగా చదువుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాని కోసం తన ఫ్రెండ్ ని వదిలి వెళ్ళాడు. 



సిటీ లో డిగ్రీ వరకు చదువుకుని, మంచి వ్యాపారం మొదలుపెట్టాడు ప్రసాద్. కొద్ది సమయంలోనే.. వ్యాపారం లో బాగా కలిసి వచ్చి బాగా డబ్బు సంపాదించడం మొదలైంది. తన కన్నా, తన కొడుకులు ఇంకా పెద్ద చదువులు చదువుకోవాలని.. దానికి బాగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. 



బిజినెస్ కోసం.. రాత్రి పగలు కష్టపడేవాడు. బిజినెస్ ట్రిప్స్ కోసం ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవాడు. హడావిడిలో తిండి గురించి, నిద్ర గురించి అసలు పట్టించుకునే వాడే కాదు ప్రసాద్.. డబ్బు సంపాదించాలనే కోరిక తప్ప.. !



కొడుకులు పెరిగి పెద్దవారయ్యారు. మంచి కాలేజీ లో చేర్పించాడు ప్రసాద్. ఒక రోజు ప్రసాద్ తన విషయాలు ఫోన్ చేసి రామకృష్ణ తో చెబుతున్నప్పుడు.. బిజినెస్ లో డెవెలప్ అవడం కోసం ఆరోగ్యం పాడుచేసుకోవద్దని మందలించాడు రామకృష్ణ. 



తన గొప్ప స్థాయి ని చూసి.. అసూయ తో రామకృష్ణ అలా మాట్లాడుతున్నాడని అనుకుని.. అప్పటినుంచి రామకృష్ణ తో మాట్లాడడం మానేసాడు ప్రసాద్. అదే రామకృష్ణ ఆఖరుగా ప్రసాద్ తో మాట్లాడడం. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత.. విషయం తెలిసి.. ఫ్రెండ్ ని చూడడానికి బయల్దేరాడు. 



****



విజయవాడ చేరుకున్న రామకృష్ణ, హాస్పిటల్ అడ్రస్ తెలుసుకుని అక్కడకు వెళ్ళాడు. రిసెప్షన్ లో రూమ్ నెంబర్ తెలుసుకుని.. రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ తన ఫ్రెండ్ ప్రసాద్ మంచం పైన నిస్సహాయ స్థితిలో పడి ఉండడం చూసాడు. రామకృష్ణ పలకరించినా.. తిరిగి సమాధానం చెప్పడానికి ప్రసాద్ కు అవకాశం లేదు. 



చుట్టు పక్కల చూసాడు.. ప్రసాద్ తాలూక ఎవరూ అక్కడ లేరు. తనకి ఏమీ అర్ధం కాలేదు. ఫ్రెండ్ ని స్థితిలో చూడాల్సి వచ్చినందుకు చాలా బాధ పడ్డాడు. పంతం కొద్దీ.. తాను కూడా ఎప్పుడూ ప్రసాద్ ని కలవడానికి ప్రయత్నించలేదు. 



రామకృష్ణ డాక్టర్ ఛాంబర్ లోకి వెళ్ళాడు. అక్కడ ప్రసాద్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. 



"మీ ఫ్రెండ్ ప్రసాద్ కు పక్షవాతం వచ్చింది. దానితో కాళ్ళు, చేతులు పడిపోవడమే కాక.. మాట్లాడలేని స్థితి లో ఉన్నాడు.. యాం సారీ.. " అన్నాడు డాక్టర్.



"ఎంత డబ్బైనా పర్వాలేదు డాక్టర్.. మా ఫ్రెండ్ ని బతికించండి.. " అన్నాడు రామకృష్ణ.



"ఇదే మాట.. అతని బావమరిది కూడా నాతో అన్నాడు. అతను టైంకే రోజూ వస్తాడు. అతనితో మాట్లాడండి.. మీకు అన్ని విషయాలు తెలుస్తాయి" అని చెప్పి అర్జెంటు గా డాక్టర్ వెళ్ళిపోయాడు. 



కొంతసేపటికి డాక్టర్ చెప్పిన ప్రసాద్ బావమరిది అక్కడకు వచ్చాడు. డాక్టర్ ద్వారా రామకృష్ణ గురించి తెలిసి.. తనని కలిసాడు. 



"రామకృష్ణ గారంటే మీరేనా.. ? మా బావ మీ గురించి అప్పుడప్పుడు చెబుతుండేవారు. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని కూడా చెప్పేవారు. "



"అవును.. ఇంతకీ ప్రసాద్ కి ఏమైంది.. " అడిగాడు రామకృష్ణ.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - సెల్ తెచ్చిన తంటా - by k3vv3 - 30-04-2025, 01:44 PM



Users browsing this thread: