Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#86
అస్త్రవేగంపై నియంత్రణ సాధిస్తాడు. శబ్ధభేధి విద్యను అభ్యసించి కైవసం చేసుకుంటాడు. విల్లు విద్యలో అర్జునుడికి సరిసాటిగా ఎదుగుతాడు.



ఒకరోజు ఏకలవ్యుడుండే అడివికి ద్రోణాచార్యుడు తన శిష్యులైన కౌరవులు పాండవులతో వేటకుక్కలతో వేటకు వస్తాడు. ఒక కుక్క ఏకలవ్యుడు విలువిద్య సాధన చేస్తున్న వైపుగా వస్తుంది. ఏకలవ్యుడి విచిత్ర వేషధారణ చూసి మొరిగి చికాగు పరుస్తుంది. ఏకలవ్యుడు కుక్క నోరు తెరిచి మూసేంతలో కుక్క నోటిలో ఏడు బాణాలు దెబ్బ తగలకుండా రక్తం రాకుండా వెస్తాడు. కుక్క నోటినిండా బాణాలతో ద్రోణుడి దగ్గరకు పోతుంది..



ఇంతటి నైపుణ్యంగా బాణాలు ప్రయోగించిన విలుకాడు ఎవరూ? అనుకుంటూ ద్రోణుడు శిష్యులతో కలిసి కుక్క వెంట ఏకలవ్యుడిని సమీపించాడు. గురువు ద్రోణుడిని చూసిన ఏకలవ్యుడు భక్తిశ్రద్ధలతో మేళతాళాలతో ఘనంగా స్వాగతించాడు. ద్రోణాచార్యుడిని ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి, మెడలో పూలమాల వేసి, పాదక్షాళన జేసీ, పాదాలపై పూలు జల్లి, నీళ్ళు తలపై చల్లుకుంటాడు. కార్యక్రమంలో తెగల ప్రజలందరూ అత్యుత్సాహంగా పాల్గొన్నారు.



సంతుష్టుడైన ద్రోణుడు, "ఏకలవ్యా! నీవు అస్త్రవిద్యలను అభ్యసించడానికి నావద్దకు వచ్చినప్పుడు నేను నేర్పును అన్నాను కదా! మరి విలువిద్యా నైపుణ్యం ఎలా సాధించావూ?" అని ఏకలవ్యుడిని అడిగాడు.



"గురువర్యా! మీరే నా గురువులు. మీరు కాదన్నాక నేను తిరిగి వచ్చి మీ మూర్తిని విగ్రహంగా మొలుచుకొని, విగ్రహమే త్రికరణ శుద్ధిగా గురువుగా భావించి, తదేక దీక్షతో విలువిద్య సాధన చేశాను. తమరి దయవల్ల ధనుర్విద్యా ప్రపూర్ణుడను అయ్యాను గురుదేవా!" నిష్కపటంగా విన్నవించాడు.



ద్రోణుడు ఆలోచించాడు. కుక్క మొరిగిందనే చిన్న కారణానికే కోపంతో దాని నోరును బాణాలతో నింపాడు అంటే ఇతనికి కోపము అదుపులో ఉండదని, ఇలాంటి వ్యక్తి దగ్గర ఇంతటి గొప్ప విలువిద్యలు ఉంటే భవిష్యత్తులో ఇతని వలన సమాజానికి, దేశానికి హాని జరగవచ్చని మనసులో అనుకున్నాడు.



" ఏకలవ్యా! నీవు నన్ను గురువుగా భావిస్తున్నావు కదా! మరి గురుదక్షిణ ఇవ్వలేదేమీ?" అడిగాడు ద్రోణుడు కపటం కడుపు దాచుకుని.



"గురువర్యా! ఏమి కావాలనో నిర్మొహమాటంగా సెలవియ్యండి గురుదేవా! నిరభ్యంతరంగా నిస్సంకోచంగా సమర్పించుకుంటాను" విన్నవించాడు నిష్కల్మషమైన హృదయంతో ఏకలవ్యుడు.



"అయితే ఏకలవ్యా! నీ కుడిచెయ్యి బొటనవ్రేలు ఇమ్ము" అంటాడు నిర్దయుడైన ద్రోణుడు.



ద్రోణుడి వాక్కులు విన్న ప్రజలు హాహాకారాలు చేశారు. అన్యాయం అక్రమం దుర్మార్గం" అని విలపించారు. వనజ బోరున గుండెలవిసేలా ఏర్చింది.



అరణ్యధన్వుడు " ఏమయ్యా బాపడూ! నువ్వేమైనా విద్య నేర్పావా! గురు దక్షిణ ఎలా అడుగుతున్నావు, అర్హత ఉంది నీకు. ఎవరైనా ధన కనక వాస్తు వాహనాలు గురుదక్షిణగా అడుగుతారు. నీవేంటి బొటనవ్రేలు అడుగుతున్నావు? అంటే మావాడు విలువిద్యలో రాణించ కూడదనే కుబుద్ధితో అడుగుతున్నావు.



మావాళ్ళు ఎదగ కూడదని, మిమ్మల్ని మించి పోకూడదని కుట్రతో, అగ్రవర్ణ దురహంకారంతో అడుగుతున్నావు. నీ కోరికలో న్యాయం లేదు కాబట్టి గురుదక్షిణ ఇవ్వడు పో!" అంటూ గద్దించాడు.



"ఆమాటే ఏకలవ్యుడిని చెప్పమనండి. ఇక్కడి నుండి తక్షణమే వెళ్లి పోతాను" అన్నాడు ద్రోణుడు ఏకలవ్యుడి వాగ్దానంపై నమ్మకంతో.



ఏకలవ్యుడు " నాన్నా! మాట తప్పడం వీర లక్షణం కాదు. మాట తప్పి చరిత్రహీనుడను కాలేను. ఎంత కష్టమైన ఎంత నష్టమైనా వాగ్ధానం నెరవేర్చుకోవడమే నీతివంతుని విధానం. కాబట్టి వాగ్ధానం నెరవేర్చడంలో అడ్డు తగలవద్దు నాన్నా! అని చెప్పి తన నడుముకు ఉన్న సురకత్తిని తీసుకుని కుడిచేతి బొటన వ్రేలిని తటాలున ఖండించి ద్రోణుడి పాదాలు చెంత పెట్టాడు. చర్యతో అక్కడ ఉన్న అందరూ దిగ్భ్రాంతి కి గురైనారు. ద్రోణుడు కూడా చలించి పోయాడు.



"శభాష్ మహావీరా! నీ యశస్సు దిగంతాలకు వ్యాపిస్తుంది. నీ కీర్తి ఆచంద్రార్కం నిలుస్తుంది. నీను సమస్త లోకాలు ప్రశంసిస్తాయి. నీకు శుభం కలుగు గాక" అని పలికి ద్రోణుడు తన శిష్యులతో కలిసి వెళ్ళిపోయాడు. ఏకలవ్యుడి జనమంతా శోక సముద్రంలో మునిగి పోయారు.



తరువాత కూడా ఏకలవ్యుడి అస్త్రవిద్యా సాధన నిరాటంకంగా సాగింది. అటు కొంత కాలానికి వనజకు ఏకలవ్యుడికి వివాహం అత్యంత వైభవంగా జరిపించాడు అరణ్యధన్వుడు. వివాహానికి మగధ చక్రవర్తి జరాసంధుడు, అతని స్నేహితుడు చఏదఇరఆజ్య భూపాలుడైన శిశుపాలుడు, పూండ్రవాసుదేవుడు, సామంతరాజులు, మిత్రరాజులు పాల్గొన్నారు. ఏకలవ్యుడి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. కాలక్రమంలో దంపతులకు ఇద్దరు మగ సంతానం కలిగింది.



జరాసంధుడు చేసిన ఒకానొక యుద్ధంలో సర్వ సైన్యాధ్యక్షుడిగా పాల్గొని యుద్ధంలో మరణించాడు అరణ్యధన్వుడు. తండ్రి మరణాంతరం ఆటవిక తెగల, జాతుల నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది ఏకలవ్యుడికి. తండ్రి వారసత్వంగా వచ్చిన మగధ సామ్రాజ్య సైన్యాధ్యక్ష పదవిని కూడా స్వీకరించాల్సి వచ్చింది. ద్రోణుడు తలంచి నట్లుగానే దుష్టులైన జరాసంధుడితోను, శిశుపాలుడితోను, పౌండ్రక వాసుదేవుడితోను కలిశాడు ఏకలవ్యుడు.



శిశుపాలుడి తరుపున భీష్మకునితో రాయబారం నెరపి రుక్మిణీని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు ఏకలవ్యుడు. మగద రాజ్య సైన్యం, చేది రాజ్య సైన్యం, పుండ్ర రాజ్య సైన్యమును కలిపి మహా సైన్యం తయారు చేశాడు ఏకలవ్యుడు. కృష్ణుడిపై జరాసంధుడు చేసిన పద్దెనిమిది దండయాత్రలలో సర్వసైన్యాధ్యక్షుడిగా ముందుండి సైన్యాన్ని నడిపించాడు. శస్త్రాస్త్రాల ప్రయోగంలోను యుద్దపాటవంలోను నైపుణ్యాన్ని పరాక్రమాన్ని ప్రదర్శించి ప్రశంసలు పొందుతాడు ఏకలవ్యుడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - కార్తవీర్యార్జునుడి కథ - by k3vv3 - 29-04-2025, 04:10 PM



Users browsing this thread: 1 Guest(s)