Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#85
ఏకలవ్యుడి కథ
విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ
[font=var(--ricos-font-family,unset)][Image: image-2025-04-29-160804057.png][/font]
రచన[font=var(--ricos-font-family,unset)] : [/font]కాశీవరపు వెంకటసుబ్బయ్య



యాదవ వంశంలో అంధక శాఖకు చెందిన రాజు శూరసేనుడు. శూరసేనుడు, మారిష దంపతులకు తొమ్మిది మంది కుమారులు, ఐదు మంది కుమార్తెలు. శూరసేనుడు మధరను పరిపాలిస్తుండేవాడు. కొంతకాలానికి శూరసేనుడు తన బావైన ఉగ్రసేనుడికి మధర పాలనా బాధ్యతలు అప్పగించి ఆవులు పెంపకం వృత్తి చేపడతాడు. ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు. కంసుడి చెల్లెలు దేవకి. శూరసేనుడి కొడుకులలో పెద్దవాడు వాసుదేవుడుకి కంసుడు తన చెల్లలైన దేవకిని ఇచ్చి వివాహం జరిపిస్తాడు.



వాసుదేవుడి దేవకి పుత్రులే బలరామకృష్ణులు. ఇక శూరసేనుడి కుమార్తెలలో శ్రుతదేవ ఒకతి. మరో కమార్తె వృంద. ఈమెను కుంతిభోజుడు పెంచడం వలన కుంతి అని పేరు వచ్చింది. ఈమె కుమారులే పాండవులు. కృష్ణుడి మేనత్తలు ఐదుగురు. అందులో కుంతి కుమారులు తప్ప మిగతా నలుగురు మేనత్తల కుమారులు కృష్ణుడికి శత్రువులు కావడం చిత్రమైన విశేషం.



శూరసేనుడు శ్రుతదేవని సూతరాజైన కేకయదేశరాజు కుంగేకయేశ్వరుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. కేకయరాజు సుక్షత్రియుడు కాదు. సూతకులస్తుడు. క్షత్రియుడికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన వారిని సూతులు అంటారు. సూతులకు క్షత్రియులకు సత్సంబంధాలు ఉండేవి.



క్షత్రియులు సూత కులస్తులను తమతో సమానంగా గౌరవించేవారు. పిల్లను ఇచ్చేవారు. పిల్లను చేసుకొనేవారు. సూతులు రథకారులుగా, సైన్యాధిపతులుగా, మంత్రులుగా, రాజ్యాలు ఏలే రాజులుగా ఉండేవారు. కుంతి తొలి చూలు కర్ణుడు కూడా సూతుల ఇంట పెరిగి అంగ రాజ్యాన్ని పాలించే రాజు అవుతాడు. ఒక సూతకన్యను, ఒక క్షత్రియకన్యను వివాహం చేసుకొన్నాడు.



అలాగే కేకయ రాజ్యాన్ని పాలించే రాజు కేకయుడు సూతులందరికి నాయకుడు. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య మాళవి. ఈమె కుమారుడు బాణుడు అను పేరుతో పుట్టి కీచకుడుగా ప్రసిద్ధి గాంచాడు. రెండవ భార్య శ్రుతదేవ. ఈమె కుమార్తె చిత్ర అను పేరుతో పుట్టి సుధేష్ణగా పెరిగి విరాటరాజును పెళ్లాడుతుంది.



శ్రుతదేవకు కేకయరాజైన కుంగేకయేశ్వరుడికి పుట్టినవాడు ఏకలవ్యుడు. ఇతనికి మొదట తల్లిదండ్రులు పెట్టిన పేరు శత్రుఘ్నుడు. ఇతడు జన్మించినప్పుడు దుశ్శకునాలు సంభవించాయి. పూర్వం రాజులకు కొడుకు జన్మించినప్పుడు దుశ్శకునాలు సంభవిస్తే కుల క్షయము, వంశ నాశనము జరుగుతుందనీ నమ్మకం బలంగా ఉండేది.



ఏకలవ్యుడు పుట్టినరోజు కూడా పురోహితులు బాలుడి వలన వంశనాశనం జరుగుతుందని చెప్పుతారు. దానితో బాలునిపై ఎంతో ప్రేమాభిమానాలు ఉన్న దేశశ్రేయస్సు కోసం, వంశక్షేమం కోసం మమకారాన్ని వదులుకుని నట్టడివిలో విడిచిపెట్టి వస్తారు. ఏకలవ్యుడి పుట్టుకను బట్టి కృష్ణుడికి బావమరిది వరస, పాండవులకు అన్నదమ్ముల వరుస అవుతాడు.



దుతరాష్ట్రుడికి దుర్యోధనుడు పుట్టినప్పుడు కూడా అనేక దుశ్శకునాలు కలిగాయి. అప్పుడు కూడా పురోహితులు. అతని వల్ల కలిగే కష్టనష్టాలు, దూషణ నాశనాలు వివరించి చెప్పి అతన్ని అడవుల్లో విడిచి రమ్మంటారు. అందుకు దుతరాష్ట్రుడు మొదటి కొడుకని పుత్రవ్యామోహముతో అడవిలో విడిచి రావడానికి అంగీకరించడు.



ఏకలవ్యుడిని అడివిలో విడిచిపెట్టి వచ్చాక ఆటవిక తెగల రాజైన అరణ్యధన్వుడు అతని భార్య సులేఖలకు దొరుకాడు. బాలుడిని పరమానందంగా తీసుకుని పోయి ఏకలవ్యుడు అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అరణ్యధన్వుడు ఏకలవ్యుడికి స్వయంగా విలు విద్యను నేర్పి వీరుడిగా తీర్చిదిద్దుతాడు.



ఏకలవ్యుడు అడివికి తిరుగులేని యువరాజు అయ్యాడు. అటవిక జాతులన్నిటినీ ఒక చత్రం క్రిందికి తెచ్చాడు. అందరికి చదువు, యుద్ధ విద్యలు నేర్చుకునే ఏర్పాటు చేశాడు. పక్షులు, జంతువులు, కౄరమృగాలు అన్నింటనీ అదుపాజ్ఝలో ఉంచుకున్నాడు. అటవీ తెగల ప్రజలు సేకరించిన అటవీ ఉత్పత్తులను సంతలు ఏర్పాటు చేసి అమ్ముకునే వీలు కల్పించాడు. అడవిలో ఉండే మైదాన ప్రాంతాలను వ్యవసాయ భూములుగా మార్చి ప్రజల చేత వ్యవసాయం చేయించాడు.



అటవికుల సంస్కృతి సంప్రదాయాలు అంతరించి పోకుండా అటవికుల నృత్యం, అటవికుల సంగీత వాయిద్యాలు వాయించడం నేర్చుకోవడం కోసం, ప్రదర్శించడం కోసం ఒక సాంస్కృతిక భవనం నిర్మించి ప్రోత్సహిస్తాడు. అటవీ జనానికి ఇష్టుడు, ఆప్తుడు అయ్యాడు ఏకలవ్యుడు. ఏకలవ్యుడంటే తెగల ప్రజలందరికీ అపారమైన ప్రేమ అభిమానం.



అరణ్యధన్వుడు అటవి తెగలకు రాజే కాదు మగద చక్రవర్తి అయిన జరాసంధుడికి సామంతుడు, సర్వసైన్యాధ్యక్షుడు కూడా. అరణ్యధన్వుడి చెల్లెలు కాంతార. కాంతార కూతురు వనజ.



వనజ అడివికే అందం, చూడు చక్కని రూపవతి, అడవి మల్లె తీగలా ఉంటుంది. ఆమెకు ఆరడుగుల ఎత్తు ఉండి, అపురూపమైన అందం కలిగిన, బలాడ్యుడైన ఏకలవ్యుడంటే అమితమైన ప్రేమ, ప్రాణాధికం. అతడిని చూడందే ప్రొద్దు పోదు. ఆమెకు అతడిదే లోకం. ఏకలవ్యుడికి కూడా వనజంటే వల్లమాలిన అభిమానం,



కొండలు కోనలు, పర్వత సానువులు, లోయలు, జలపాతాలు, సెలయేర్లు, పచ్చిక బయల్లు అన్నీ వీరి విహారస్థలాలే. కోతికొమ్మచ్చులు, జలకాలాటలు, వేట, ఏనుగుల సవారీలు, గుర్రపు స్వారీలు వీరి విహారాలలో భాగాలు. పొదరిల్లులు, గుహలు వీరి విశ్రాంతి ప్రదేశాలు. కనులు పండుగగా ఉండే జంటకు తెగల పెద్దలు వివాహం జరిపించాలని ఎప్పుడో నిర్ణయించారు.



దినం అరణ్యధన్వుడు ఏకలవ్యుడిని పిలిచి " నాయనా ఏకలవ్యా! నాకు వార్డక్యం పైబడుతున్నది. నా బాధ్యతలు నీవు చేపట్టవలసి ఉన్నది. దానికి ముందు నీవు సద్గురువును ఆశ్రయించి మరిన్ని గొప్ప యుద్ధ విద్యలను అభ్యసించి తిరుగులేని మహావీరుడుగా తిరిగి రావాలి" అని కర్తవ్యాన్ని సూచించాడు.



తండ్రి మాట అనుసరించి ఏకలవ్యుడు విశేష ప్రతిభావంతమైన విద్యల కోసం ద్రోణాచార్యుడి దగ్గరకు పోయి తనను శిష్యుడిగా చేర్చుకోని క్షాత్ర విద్యలను నేర్పమని కోరుతాడు.



ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి ముఖ వర్చస్సును తీక్షణంగా గమనించి ఇతనికి క్రోదావేషాలు అధికమని, భవిష్యత్తులో దుష్టులతో కలుస్తాడని దుర్మార్గులకు సహాయంగా నిలుస్తాడని తన యోగశక్తితో గ్రహించి "నేను క్షత్రియులకు తప్ప ఇతరులకు శస్త్రాస్త్రాలు నేర్పను " అని చెప్పి వెనక్కి పంపి వేస్తాడు.



తిరిగి వచ్చిన ఏకలవ్యుడు సమున్నతమైన స్థానంలో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని బంక మట్టితో తయారు చేసుకుని, విగ్రహమే గురువుగా భావించి, విగ్రహం ముందు శస్త్రాస్త్రాలను దీక్షతో అధ్యయనం చేసి అభ్యాసం చేస్తాడు. కఠోరమైన సాధనతో అస్త్రప్రయోగ ఉపసంహరణాది సమస్తంలో ప్రావీణ్యం సంపాదిస్తాడు ఏకలవ్యుడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - కార్తవీర్యార్జునుడి కథ - by k3vv3 - 29-04-2025, 04:09 PM



Users browsing this thread: 1 Guest(s)