28-04-2025, 02:42 PM
మళ్లీ వచ్చే దీపావళి - తన్నీరు శశికళ
![[Image: image-2025-04-28-143827193.png]](https://i.ibb.co/qLk4m5w1/image-2025-04-28-143827193.png)
"ఏమండీ,నాన్న ఫోన్ చేసారు" చెప్పింది కావ్య.
ఎడమకన్ను టపీ టపీ మని కొట్టుకుంది సూర్యానికి.
"బాగున్నారా మావయ్య" అడిగాడు.
"బాగున్నామోయ్! ఇక బయలుదేరి రండి మా ఇంటికి."అన్నాడు మావయ్య.
"దేనికి" టపటపా కొట్టుకుంటున్న ఎడమ కంటిని నులుముకుంటూ.
"దేనికేమిటోయ్.దీపావళికి.అమ్మాయికి నీకు పెళ్లి తరువాత ఫస్ట్ దీపావళి కదా. ఏలూరంతా మోత మోగిపోవాలి." చెప్పాడు మావయ్య.
"అల్లుడు గారండి మీరు,అమ్మాయి ఒక పదిరోజులు ముందుగా రావాలి." ప్రేమగా పిలిచారు అత్తగారు.
ఏదో ఒకటి చెప్పేలోగా గడప దాటబోయి తూలి పడ్డాడు....కెవ్వుమంటూ.
"ఏమిటి బాబు ఆ కేకలు?"భయంగా అంది అత్తగారు.
క్రింద పడిన సూర్యం చేతిలో నుండి ఫోన్ తీసుకొని "ఏమి కాలేదు లేమ్మా.మేము వస్తాము. మీరు ఏర్పాట్లు చూసుకోండి." చెప్పింది కావ్య.
**********
కారు ఊరు పొలిమేరలోకి రాగానే ఏదో ఊరేగింపు.
"ఏమిటిది?" అనుకుంటూ కార్ దిగాడు సూర్యం.అటు నుండి కావ్య దిగింది.
వెంటనే సర్ మంటు ఆకాశ చువ్వ పైకెగిరి "డాం" అంటూ పేలింది. ఉలిక్కిపడి గెంతాడు సూర్యం.
"అటు కాదు అల్లుడు ఇటు" లాగాడు మావయ్య.
సరిగ్గా సూర్యం నిలబడిన చోట పడింది ఆకాశచువ్వ కాలిన వెదురుకర్ర.
"నయం.మామగారు లాగకుంటే బుర్ర బొక్కపడిపోయేది." తల రుద్దుకుంటూ వెర్రి నవ్వు నవ్వాడు.
ఉన్నట్లుండి బ్యాండ్ మేళం మొదలు. ఎన్ని స్పీకర్ లు పెట్టారో మోత మోగిపోతుంది.
"ఏమిటిది?" అడిగాడు సూర్యం.
ఆ శబ్దాల్లో మావయ్య చెప్పేది వినబటంలేదు. ఉన్నట్లుండి మామగారు గజమాల అల్లుడి మెడలో వేసారు.
"ఈ జిల్లాలో ఈ మాలను మించిన మాల వేసుకున్న అల్లుడు లేడు."గర్వం గా అన్నాడు మావయ్య.
కావ్య ముసి ముసి నవ్వులు నవ్వుతుంది.
"సరే" మాల తీసేయ్యపోయాడు సూర్యం.
"ఏమిటి తీసేది అల్లుడుగారు.ఇంటికి వెళ్ళేదాకా ఉండాల్సిందే మెడలో మాల." చెపుతూ ఉంటే ఊరేగింపు ముందుకు నడిచింది.
మేళాలు,తాళాలు, టపాసుల మోతలు, వెనుక మాలలో మునిగిపోయిన సూర్యం తల. రెండు కిలోమీటర్లు నడిచేసరికి వీధి మొదులుకు వచ్చారు.వంగిపోయిన మెడని కొంచెం పైకెత్తి చూసాడు సూర్యం. మాల పూల సందుల్లోంచి దూరంగా అత్తగారిల్లు కనపడింది.
"హమ్మయ్య,ఈ నాలుగు అడుగులు వేసేస్తే చాలు.ఈ మాల బరువు పూర్తి అవుతుంది." అనుకోని వేగంగా అడుగెయ్యబోయాడు సూర్యం.
"డాం" అన్న శబ్దానికి ఉలిక్కిపడి వెనక్కి గెంతాడు. పూలమాల బరువుకి బ్యాలెన్స్ తప్పి మావయ్య మీద పడ్డాడు.
"అద్గది లెక్క.అల్లుడంటే అలా వీధి ఆదరాలి.నీ కోసం 20000 సరం తెప్పించాము అల్లుడు.గంట కాలుతుంది." మీసం మెలేస్తూ అన్నాడు మావయ్య.
"ఇంకో గంట దీనిని మెడలో మొయ్యాలా?" దిగులుగా అనుకున్నాడు సూర్యం.
కావ్య ఆనందం గా టపాసుల శబ్దం వింటూ వీధిలో వాళ్ళు అందరూ బయటకు వచ్చి చూస్తున్నారో లేదో గమనించింది.
"అందరూ వచ్చారు." నవ్వుకుంది.
మెల్లిగా మెడతో పాటు సూర్యం మోకాళ్ళు కూడా కుంగిపోతున్నాయి.
"పదండి అల్లుడుగారు" అన్నాడు మావయ్య.
ఇంటికి చేరి గుమ్మడికాయ దిష్టి,హారతి తీసేసరికి...
"ఏరి అల్లుడుగారు?" వెతికింది అత్త.
మెల్లిగా మాలతో సహా పాక్కుంటూ లోపలికి వెళ్లి మాల పక్కనపడేసి కుర్చీలో కూర్చున్నాడు సూర్యం.
"బాగున్నారా బాబు" పలకరించింది అత్తగారు.పక్కన పళ్ళాలలో 100 రకాల కూల్ డ్రింక్స్,కొబ్బరి నీళ్లు,మజ్జిగ,లస్సి.
"ఇవన్నీ వదలకుండా తాగాలి అల్లుడుగారు. మీ కోసమే మావయ్య తెప్పించారు."చెప్పింది అత్తగారు.
తల ఎత్తకుండా తల ఊపుతున్న అల్లుడిని చూసి "ఎంత గౌరవమో మా అల్లుడుగారికి." మురిసిపోయింది.
"ఏమిటి నాన్న అన్నీ ఆయనకేనా! నాకు లేవా?" అడిగింది కావ్య.
"నీకు కావాలంటే లోపలికి వెళ్లి త్రాగు.ఇవన్నీ అల్లుడుగారికే." చెప్పాడు మావయ్య.
కొంగ మెడలాగా జారిపోయిన తలని మెల్లిగా ఎత్తి చూసాడు సూర్యం. అన్ని కూల్ డ్రింక్స్ చూసేసరికి తల సర్రున వాలిపోయింది.
"అల్లుడు మోహమాటపడుతున్నారు.మీరే త్రాగించండి." వెండి గ్లాస్ లో కొబ్బరినీళ్లు ఇచ్చింది అత్తగారు.
"త్రాగండి అల్లుడుగారు."బలవంతంగా మెడ పైకి ఎత్తి నోటిలో పోసాడు మావగారు.
గింజుకుంటున్న సూర్యాన్ని"మోహమాటపడకండి.అన్నీ త్రాగాలి." మెల్లిగా ఒక్కొక్కటి నోట్లో
పోసారు.
అన్ని కలిసిన కడుపులో కథాకళి. ఒక్కసారిగా డొక్కున్నాడు. భళ్ళుమంటూ మావగారి నోట్లో పడింది. కెవ్వుమంటూ వెనక్కి జరిగాడు మామగారు.
"అయ్యో ఊరంతా దిష్టి పెట్టారు అల్లుడుగారికి." అత్తగారు పరిగెత్తుకెళ్లి గుప్పెడు మిరక్కాయలు తెచ్చి దిష్టి తీసి కుంపట్లో వేసింది.
ఇల్లంతా "ఖళ్లు"మంటూ దగ్గులు.మధ్యలో ఎలాగో బెడ్ రూమ్ లోకి జారుకున్నాడు సూర్యం.
**********
"ఏమండీ,అమ్మవాళ్ళు భోజనానికి పిలుస్తున్నారు." మెల్లిగా సూర్యం మెడ నిమురుతూ చెప్పింది కావ్య.
కాస్త భార్య స్పర్శతో మెడ కుదుటపడి మెల్లిగా నవ్వాడు సూర్యం.
"ఏమండీ,ఇందాక ఏమి త్రాగలేదు. ఇప్పుడైనా కొంచెం బాగా తినండి. వాళ్ళకి గౌరవం కదా!" మెల్లిగా అంది.
సరే అన్నట్లు తల ఊపాడు.
కావ్య ముందు నడిచింది.
"ఇదేమిటి భోజనాల బల్ల ఇటు కదా?" అన్నాడు సూర్యం.
"అది మాకు.కొత్త అల్లుడికి వేరే ఉంది." నవ్వుతూ హాల్ లోకి తీసుకొని వెళ్ళింది కావ్య.
హాల్ లో పది బల్లలు కలిపి మంచి క్లాత్ వేసి పూలతో డెకరేషన్ చేసి ఉన్నారు. మొత్తం వెయ్యి రకాల పైనే వంటకాలు పెద్ద వెండి ఆకు చుట్టూ ఉన్నాయి.
"కూర్చోండి అల్లుడుగారు.మీరు ఒక్కటి కూడా వదలకుండా అన్నీ తినాలి.ఇవన్నీ నెల రోజుల నుండి చేయించారు మీ మామగారు." ప్రేమగా వడ్డించింది అత్తయ్య.
భార్య వైపు దీనంగా చూసాడు సూర్యం. అంతకన్నా దీనంగా చూసి తినమన్నట్లు సైగ చేసింది కావ్య.
"సరే కొంచెం పులిహార పెట్టండి."అడిగాడు సూర్యం.
"ఏ పులిహోర? నిమ్నకాయ,చింతాపండా,దబ్బకాయా, మామిడి కాయా,దానిమ్మ కాయా?" ఇరవై రకాల పేర్లు చదువుతూ కొంచెం వడ్డించింది అత్తగారు.
"ఇదిగోండి మీకోసం స్పెషల్ గా చేయించారు పనసకాయ పులిహోర." వడ్డించింది.
"పనసకాయ?" ఉలిక్కిపడ్డాడు.
"అది ఆవపెట్టి చేస్తారు కదా?"అడిగాడు సూర్యం.
"అయ్యో అది పాత మోడల్.ఐపొడు దానితో బిర్యానీ,మంచూరియా,పులిహోర,తద్దోజనం ఇంకా పనసపండు పాయసం కూడా చేయించాము."గర్వంగా అన్నాడు మావగారు.
మెల్లిగా వడ్డన మొదలు అయింది.పది మంది ఆ చివర నుండి ఈ చివరకు తిరుగుతూ వడ్డిస్తూనే ఉన్నారు.
"ఇంకొంచెం ఇంకొంచెం" అనే మాట తప్ప వేరేమాట లేదు. కడుపు ఉబ్బిపోయి కంచం కనపడటం లేదు సూర్యానికి. భార్యకు సైగ చేసి స్పృహ తప్పి పడిపోయాడు సూర్యం.
*********
మెల్లిగా కళ్ళు తెరిచేసరికి బయటి నుండి మావగారి మాటలు వినపడుతూ ఉన్నాయి.
"ఏమి అల్లుడొ.పట్టుమని పదహారు రకాలు తినేసరికి పటాసులాగా పగిలిపోయాడు. ఇక టపాసులు ఏమి కాలుస్తాడు? ఈ ఏడాది ఇక ఇంతే.ఈసారి ఏడాది అన్నా వేయి వంటకాలతో కొత్త పండుగ చేయుస్తాను." అంటున్నాడు.
"దేవుడా" మళ్లీ స్పృహ తప్పిపోయింది సూర్యానికి.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ