Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
యాక్సిడెంట్ వార్త వినగానే లావణ్య మూర్చబోయింది. దీప్తి భోరున ఏడ్వసాగింది. హరికృష్ణకు గుండెదడ ప్రారంభమయింది. జీవితంలో మంచిచెడ్డల ప్రభావాన్ని పూర్తిగా అనుభవించిన శివరామకృష్ణకు వార్త కరెంటు షాక్లా తగిలింది. ఊర్మిళ.. అయోమయ స్థితికి లోనైంది. 
కొన్ని నిముషాలకు తేరుకొన్న శివరామకృష్ణ.. నారాయణ రెండవ ఫోన్ కాల్ను విన్నాడు. నలుగురికీ ధైర్యం చెప్పాడు. ఎంతో ఆవేదనతో హరికృష్ణ.. లావణ్య.. శివరామకృష్ణ.. ఊర్మిళ.. దీప్తి కార్లో చెన్నైకి బయలుదేరారు. 



వూరి బయట వున్న ప్రజాపతి ఆయిల్ ఫ్యాక్టరీ తగలబడి.. సెగలు, పొగలు పైకి లేవడాన్ని చూచారు. 
"బావా!.. పాపం.. మన ప్రజా ఫ్యాక్టరీ తగలబడి పోతూ వుంది. చూడు!" ఆందోళనతో అన్నాడు హరికృష్ణ. 



"వాడు మన హృదయాలకు రగిల్చిన అగ్నికి ప్రతీకారంగా వాడికి మాత్రం శాస్తి జరుగవలసిందేరా!" ఆవేశంగా అన్నాడు శివరామకృష్ణ. 



నారాయణ మాట ప్రకారం.. జి. హెచ్కి వచ్చిన డాక్టర్ కిరీటి ఈశ్వర్, విష్ణులను చూచి.. 
క్యాజువాలిటీ చీఫ్ డాక్టర్ మురారికి ఫోన్ చేసి రప్పించాడు. వారు ఇరువురినీ . సి. యూలో వుంచి చికిత్స ప్రారంభించారు. 
ఈశ్వర్, విష్ణు, ఇరువురిలో.. 
డాక్టర్లు తేల్చారు.. ఈశ్వర్ పరిస్థితి.. శ్వాస ఆడేది కొన్ని నిముషాలేనని. పగిలిన కారు అద్దం ఈశ్వర్ గుండెల్లో దిగబడింది. 



స్పృహ వచ్చింది ఈశ్వర్కు. 
మెల్లగా కళ్ళు తెరిచాడు. ప్రక్కకు చూచాడు. 



"నా దీప్తి.. అమ్మా, నాన్నా వచ్చారా సార్!" అతి కష్టం మీద అడిగాడు. 
"వారు రాలేదు" చెప్పాడు డాక్టర్ మురారి. 



"డాక్టర్.. విష్ణు.. విష్ణు.. "
"హి ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్!" 



ఈశ్వర్ పెదవులపై చిరునవ్వు.. 
"డాక్టర్ బ్రౌన్!" ఎంతో కష్టంతో పలికాడు ఈశ్వర్. 



"చెప్పండి. "
"డాక్టర్ బ్రౌన్"
" స్పెషలిస్టు.. శంకర నేత్రాలయంలో వున్నారని విన్నాను" అన్నాడు డాక్టర్ మురారి. 



"వారికేనా.. పేరు చెప్పండి.. నా నేత్రాలను మా విష్ణుకు మా.. మా.. విష్ణువుకు" ఈశ్వర్ మాట ఆగిపోయింది. 
తల ఒరిగిపోయింది. 



డాక్టర్ మురారి.. కిరీటి.. విచారంగా నిట్టూర్చారు. 
కిరీటి.. నర్స్ వైపు చూశాడు విచారంగా. 
విచార వదనంతో నర్స్ ఈశ్వర్పై తెల్లవస్త్రాన్ని కప్పింది. డాక్టర్.. కిరీటి.. నారాయణను సమీపించాడు. 



"ఒరేయ్!.. నారాయణ!.. నీ ప్రయత్నం ఈశ్వర్ విషయంలో ఫలించలేదా!" విచారంగా కిరీటి. 
కిరీటి డాక్టర్ బ్రౌన్కు ఫోన్ చేశాడు. బ్రౌన్ జి. హెచ్ కి వచ్చాడు. ఈశ్వర్ నేత్రాలను జాగ్రత్తగా బయటికి తీశారు. ఫ్రిజర్వ్ చేశారు. 



"రేపు విష్ణుకు నేత్రాలను అమర్చుతాను" ఆమాట చెప్పి డాక్టర్ బ్రౌన్ వెళ్ళిపోయారు. విష్ణుకు స్పృహ వచ్చింది. 



"నీవు త్వరలో ఇంతవరకూ చూడని.. నీవారినందరినీ సర్వేశ్వరుడు సృష్టించిన యావత్ ప్రపంచాన్ని చూడబోతున్నావు. ఒక మహానుభావుడు తాను, స్వర్గానికి పోతూ తన నేత్రాలను నీకు దానం చేశాడు" చెప్పాడు డాక్టర్ కిరీటి. 



"ఎవరు సార్!.. మహాదాత?"
"ఈశ్వర్"



"ఈశ్వర్!!!" ఆశ్చర్యంతో అడిగాడు విష్ణు. 
"అవును.. వారి కీర్తిశేషులు" అన్నాడు డాక్టర్ కిరీటి. 
విష్ణు భోరున ఏడ్చాడు. 



ఈశ్వర్ కాయం.. మార్చూరీకి పంపబడింది. 
తర్వాత ఒకటిన్నర గంటలకు హరికృష్ణ, లావణ్య, శివరామకృష్ణ, ఊర్మిళ, దీప్తిలు చెన్నై జి. హెచ్కి వచ్చారు. విషయాన్ని విని.. వారు గుండెలు బాదుకొంటూ కంటికి మింటికి ఏకధారగా ఏడ్చారు. దీప్తి స్పృహ కోల్పోయి నేలకు ఒరిగింది. 



====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 19 - by k3vv3 - 24-04-2025, 05:10 PM



Users browsing this thread: