24-04-2025, 05:09 PM
"ఏం పండు?"
"జాంపండు"
ఇరువురూ ఆనందంగా గలగలా నవ్వుకొన్నారు.
ఆరోజు ఉదయం పదిన్నర సమయంలో మంచి ముహూర్తాన.. ప్రక్కన బాగుచేయించిన భవంతి ముందు రుక్మిణీ కైలాసపతి హాస్పిటల్ బోర్డును పూజా పునస్కారాలతో హరికృష్ణ, లావణ్య, శివరామకృష్ణ, ఊర్మిళలు ఆవిష్కరించారు. దీప్తి పరమానందంతో పొంగిపోయింది. తన బావ.. భర్త ఈశ్వర్ ప్రక్కన లేనందున మదిలో కొరత..
పగ.. ద్వేషం.. రాక్షస గుణాలు.. అవి వున్నవారికి తన మన అనే అభిమానం, వాత్సల్యం వుండవు. పైశాచిక చర్యలు చేస్తారు. తమ పంతం నెగ్గించుకొనేదానికి ఆ గెలుపు ’గెలుపు’ కాదని తమ తత్వం మంచిది కాదనే విచక్షణా జ్ఞానం వారికి వుండదు.
ఈశ్వర్ నడుపుతున్న కారు వెనకాలే ఓ లారీ.. అరగంట నుంచి ఫాలో చేస్తూ.. వస్తూ వుంది.
సమయం.. సాయంత్రం ఆరున్నర.. వేగంగా వచ్చిన ఆ లారీ ఈశ్వర్ కారును గుద్ది ముందుకు శరవేగంతో వెళ్ళిపోయింది. కారు.. రోడ్డుప్రక్కన దొర్లిపోయింది. ముందువైపు నుంచి వస్తున్న ఓ కారులోని ఇరువురు వ్యక్తులు.. అదృశ్యాన్ని చూచారు. రోడ్డు ప్రక్క పడివున్న కారును సమీపించి ఆపి దిగి.. వేగంగా ఆ కారువద్దకు వచ్చారు.
స్పృహ లేకుండా రక్తపు గాయంతో అచేతనంగా పడివున్న ఈశ్వర్, విష్ణులను చూచారు. బ్రతికి వున్నారా లేరా అనే సందేహంతో వంగి శ్వాసను గమనించారు. శ్వాస ఆడుతూ వున్న కారణంగా బ్రతికే వున్నారనే నిర్ణయానికి వచ్చి 102 నెంబర్కు ఫోన్ చేశారు.
అతికష్టం మీద డోర్లను తెరిచి ఇరువురినీ బయటికి తీశారు. మంచి మనస్సున్న మనుషులు వారు. ఎంతో ఆందోళన చెందారు. తన కారులో వున్న వాటర్ బాటిల్ను తెచ్చి ఇరువురి ముఖాలపై వున్న రక్తాన్ని కడిగి ముఖాలను చూచి వ్యక్తులను గుర్తుపట్టాలనే ప్రయత్నాన్ని చేశారు. కాని వారి ప్రయత్నం ఫలించలేదు. ఎవరనేది తెలుసుకోలేకపోయారు.
అంబులెన్స్ కోసం.. ఎదురుచూస్తూ ఈశ్వర్, విష్ణుల ప్రక్కన నిలబడ్డారు. రోడ్పై వెళ్ళే కొన్ని కార్లవారు, ఆపి యాక్సిడెంటుకు గురి అయిన ఈశ్వర్, విష్ణులను చూచారు. సంతాప వాక్యాలను పలుకుతూ వెళ్ళిపోయారు.
ఈశ్వర్ ఫోన్ మ్రోగింది. ఇరువురిలో ఒక వ్యక్తి పేరు నారాయణ. ఫోన్ చేతికి తీసుకున్నాడు. ఫోన్ చేసింది లావణ్య..
"ఈశ్వర్.. !"
ఆ వ్యక్తి అనుకొన్నాడు ’ఇరువురిలో ఒకరిపేరు ఈశ్వర్’
"అమ్మా మీరు?"
"మీరెవరు?"
"నా కొడుకు ఈశ్వర్ ఫోన్ మీ చేతికి ఎలా వచ్చింది?" ఆత్రంగా అడిగింది లావణ్య.
ఆ తల్లి గొంతులో ఆతృతను గమనించిన నారాయణ వెంటనే ఆమెకు జవాబు చెప్పలేకపోయాడు.
తల్లి.. కన్నతల్లి.. తన కొడుకు స్థితిని విని తట్టుకోగలదా!.. విషయాన్ని చెప్పాలా వద్దా! ఆందోళనతో నారాయణ.
"ఏమండీ మాట్లాడరు?" లావణ్య ప్రశ్న.
"అమ్మా!.. " యాంత్రికంగా సంధిగ్దావస్తలో అన్నాడు నారాయణ.
"జవాబు చెప్పండి!" ఆవేశంగా అడిగింది లావణ్య.
ఆలస్యం చేసేకొద్దీ అక్కడ ఆమెకు టెన్షన్.. ఇక్కడ నాకు టెన్షన్.. భరించడం కష్టం. విషయాన్ని చెప్పేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చిన నారాయణ ఎంతో సౌమ్యంగా..
"వారి కారుకు యాక్సిడెంట్ జరిగింది. గాయాలు తగిలాయి. చెన్నై వైపు వెళుతున్న నేను ఆ దృశ్యాన్ని చూచాను. నా కారును ఆపి వారిని సమీపించాను. అంబులెన్స్ కు ఫోన్ చేశాను. పావుగంటలో రావచ్చు. నాపేరు నారాయణ. ఇక్కడికి చెన్నై దగ్గర కాబట్టి వారిని హాస్పిటల్లో చేర్చి మీకు ఫోన్ చేస్తానమ్మా! భయపడకండి" నారాయణ ఫోన్ కట్ చేశాడు.
అరగంటలో అంబులెన్స్ వచ్చింది. ఈశ్వర్, విష్ణులను దానిలో ఎక్కించారు. అది చెన్నై వైపుకు బయలుదేరింది. నారాయణ అతని బావమరిది శశి ఆ అంబులెన్స్ ను ఫాలో అయ్యారు.
నలభై నిముషాల్లో అంబులెన్స్ సెంట్రల్ ముందున్న జి. హెచ్. కు చేరింది.
స్ట్రెక్చర్ మీదకు ఈశ్వర్, విష్ణులను చేర్చి.. ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొని వెళ్ళారు.
నారాయణ మామయ్య కిరిటీ ఆ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్.. ఆ క్రిందటి రోజు రాత్రి ప్రజాపతి తన ప్రియురాలు నిలయం చేరాడు. మందు.. విందు.. పొందులో మునిగిపోయాడు.
అహంకారానికి, స్వాతిశయానికి, ఆవేశానికి, తన మన అనే విచక్షణ వుండదు. దానికి నిదర్శనం.. ద్వాపర యుగ రారాజు దుర్యోధనుడు. ఈ కలియుగ ప్రజాపతి.. ఆ కోవకు చెందినవాడే.
డ్యూటీలో లేని తన మామయ్య కిరీటికి నారాయణ ఫోన్ చేసి వెంటనే జి. హెచ్కి రావలసిందిగా కోరాడు. అదే మంచి మానవత్వం..
లావణ్యకు ఫోన్ చేసి ఇరువురినీ హాస్పిటల్లో చేర్చానని.. మీరు వచ్చేవరకూ నేను ఇక్కడే వుంటానని చెప్పాడు నారాయణ.
ఆమె అతని మాటలను విన్నదో లేదో.. ఫోన్ కట్ అయిపోయింది.
నారాయణ.. మరోసారి ఫోన్ చేశాడు అనుమానంతో ఫోన్ కట్ అయినందున..
శివరామకృష్ణ..
"హలో!" నీరసంగా అన్నాడు.
నారాయణ విషయాన్ని వారికి చెప్పాడు.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ