24-04-2025, 05:06 PM
దీప్తి మంచాన్ని సమీపించింది. వెనుదిరిగి చూచింది. చేరువలో ఈశ్వర్ నవ్వుతూ దీప్తిని ప్రీతిగా చూస్తూ వున్నాడు.
ఆ చూపుల తాకిడికి దీప్తి నయనాలు క్రిందికి వాలాయి. సిగ్గుతో తలదించుకొని గ్లాసును ఈశ్వర్ వైపుకు చూపింది.
"ముందు మంచం మీద కూర్చో దీపు!"
దీప్తి మంచంపై కూర్చుంది. తల దించుకొనే వుంది.
తన చేతితో దీప్తి చుబుకాన్ని పట్టుకొని తలను పైకెత్తాడు ఈశ్వర్. ఆమె కళ్ళల్లో కన్నీరు.. చూచి ఆశ్చర్యపోయాడు ఈశ్వర్.
"దీపూ! ఏమిటా కన్నీళ్ళు?" ఆందోళనగా అడిగాడు.
"ఇవి కన్నీరు కాదు బావా! నాలోని అంతులేని ఆనందానికి నిదర్శనం.. ఆనందభాష్పాలు.. పాలు త్రాగండి" గ్లాసును ఈశ్వర్కు అందించింది.
చిరునవ్వుతో తన కుడిచేతిని దీప్తి భుజంపై వేశాడు ఈశ్వర్. గ్లాసులోని సగంపాలు త్రాగి దాన్ని దీప్తి పెదవుల ముందు వుంచాడు.
దీప్తి కనురెప్పలను పైకెత్తి పరవశంతో నవ్వుతూ ఈశ్వర్ ముఖంలోకి చూచింది. ఆ చూపుల్లో అంతులేని ప్రేమ, అనురాగం, అభిమానం గోచరించాయి ఈశ్వర్కు.
"దీపూ!.. పాలు త్రాగు!" మెల్లగా చెప్పాడు.
ఈశ్వర్ చేతిపై తన చేతిని వుంచి.. గ్లాసులోని పాలను తాగింది దీప్తి.
గ్లాసును తన చేతిలోనికి తీసుకొని మంచం ప్రక్కన వున్న టీపాయ్పై వుంచింది. కళ్ళుమూసుకుంది చిరునవ్వుతో. ఆ భంగిమలో దీప్తిలో ఎంతో ఆకర్షణ.. ముఖంలో ప్రశాంతత.
ఈశ్వర్ చిరునవ్వుతో తన అధరాలను దీప్తికి దగ్గరగా చేర్చి.. "దీపూ!.. " అన్నాడు.
కళ్ళు తెరువకనే "ఆఁ.. " పరవశంతో అంది దీప్తి.
"కళ్ళు తెరు.. "
"బావా!"
"కళ్ళు తెరిచి మాట్లాడు!"
"ఇది కలా!.. నిజమా!"
"నీకు ఎలా అనిపిస్తుంది?"
"అయితే నేనే చెప్పాలంటావా"
"అవును బావా!"
ఈశ్వర్.. తన రెండు చేతులను దీప్తి చెక్కిళ్ళపై వుంచాడు. దీప్తిని తనవైపుకు లాక్కున్నాడు. ఇరువురి అధరాలు కలిశాయి. ఇరువురి తనువుల్లో జలదరింపు.. పులకింత..
ఈశ్వర్ నవ్వుతూ.. "దీపూ!.. ఇది నిజం.. నీవు నా దానివి. నేను నీవాడను. మనం నీవు కోరుకున్నట్లు.. ఇప్పుడు భార్యాభర్తలం. ఇది మన తొలిరేయి.. " దీప్తిని తన హృదయానికి హత్తుకొన్నాడు. తన్మయత్వంతో దీప్తి.. పందిరిని అల్లుకొన్న జాజితీగలా తన చేతులతో ఈశ్వర్ను చుట్టేసింది.
మరునాటి ఉదయం ఆరున్నరకు ఈశ్వర్, విష్ణు చెన్నైకి బయలుదేరారు. మూడుగంటల్లో వారు కార్లో చెన్నై చేరారు. శంకర నేత్రాలయా హాస్పిటల్ల్లో వారు డాక్టర్ బ్రౌన్ను కలిశారు. బ్రౌన్ విష్ణు కళ్ళను పరీక్షించాడు. గంట తర్వాత ఈశ్వర్ను పిలిచి ఎవరైనా నేత్రదానం చేస్తే విష్ణుకు చూపు వస్తుందని.. నేత్రాలు కాక ట్రీట్మెంటుకు దాదాపు మూడు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. చికిత్స నిమిత్తం మీరు నేత్రాలను.. డబ్బును రడీ చేసుకొని నాకు ఫోన్ చేస్తే లండన్ నుంచి వచ్చి చికిత్స చేయగలనని చెప్పాడు. ఆ విషయాన్ని విన్న ఈశ్వర్ సంతోషించాడు. కానీ ఆ సంతోషం అతని మనస్సున ఎక్కువసేపు నిలువలేదు. నేత్రాలను ఎవరు దానం చేస్తారనే ప్రశ్న గుర్తుకు రాగానే!..
ఆ విషయాన్ని విష్ణుకు చెప్పాడు ఈశ్వర్.
"బ్రతికివున్న వారు ఎవరైనా నేత్రాలు దానం చేస్తారా బావా! డాక్టర్ గారు చెప్పింది వినేదానికి బాగుంది. కానీ దాన్ని ప్రాక్టికల్గా చూస్తే.. అసంభవం అనిపించడం లేదా బావా!" చిరునవ్వుతో అడిగాడు విష్ణు.
ఇరువురూ గూడురుకు కార్లో బయలుదేరారు.
"విష్ణు!.. నిరాశపడకు. డాక్టర్గారు చెప్పారుగా నేత్రాలు లభిస్తే నీకు చూపు వస్తుందని. ప్రయత్నిస్తాను. ఇకపై నీవు ఎప్పుడూ నాతోనే వుంటావుగా.. నేను చూచిన వాటిని గురించి నీకు వివరంగా చెబుతాను. నా నేత్రాలు నీవనుకో.. నీ అదృష్టం బాగుంటే ఏదైనా యాక్సిటెండ్లో చనిపోయే దానికి చివరిదశలో వున్న వ్యక్తిగాని, క్యాన్సర్ లాంటి వ్యాధి లాస్ట్ స్టేజ్లో వుండేవారు గాని.. నేత్రాలను నీకు దానంచేసే దానికి ముందుకు రావచ్చునేమో!.. చూద్దాం.. విచారిద్దాం.. బాధపడకు.. నీకు దృష్టి ప్రాప్తి వుంటే అలాంటివారు తప్పక మనకు తారసపడతారు. " అనునయంగా సాలోచనగా చెప్పాడు ఈశ్వర్.
"బావా!.. నన్ను వూరడించే దానికి అలా చెప్పావు కానీ అది సంభవం కాదని.. నీకూ.. నాకూ తెలుసు. చిన్న వయసులో బాధపడేవాణ్ణి.. ఇప్పుడు నాకు ఏ బాధా లేదు. నాలాంటివారు సమాజంలో కొందరున్నారు కదా. "
"నీ నమ్మకమే నీకు జయం.. అన్నారు మన పెద్దలు విన్నావా ఈ మాటను" అడిగాడు ఈశ్వర్.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ