Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
ఈశ్వర్ తన గదిని సమీపించి చూచాడు. తాళపు బుఱ్ఱ వ్రేలాడుతూ వుంది. ఆశ్చర్యపోయాడు. 
"అమ్మా!" పిలిచాడు. 



లావణ్య, ఊర్మిళలు అతన్ని సమీపించారు. 



"నెల్లురికి వెళ్ళబోయే ముందు నీవు నా గదికి తాళం వేశావా అమ్మా!.. అటు చూడు. "



ప్రక్కనే వున్న పనిమనిషి మంగ ముసిముసి నవ్వులతో తల దించుకొంది. లావణ్యకు, ఊర్మిళకు విషయం అర్థం అయింది. తన చేతిలో ఉన్న గది తాళాన్ని ఈశ్వర్ కంట పడకుండా లావణ్యకు అందించింది మంగ. 



"ఈశ్వర్! నీవు మీ నాన్నగారి గదికి వెళ్ళి ఫ్రెష్కా!"
"ఊర్మిళా! దీపు ఎక్కడ?"
"తను నీ గదివైపుకు వెళ్ళిందమ్మా!" చెప్పాడు ఈశ్వర్. 



"దార్లో దాన్ని ఏమీ అల్లరి చేయలేదు కదా!"
"కారు నెల్లురు దాటటంతోనే నాకు నిద్ర వస్తూవుందని నిద్రపోయింది. మన ఇంటి ముందుకు వచ్చాకే కళ్ళు తెరిచింది.. "



"అలాగా!" అంది ఊర్మిళ. 
"అవునత్తయా!.. నిజం.. "
"సరేలే అమ్మ చెప్పినట్లు చెయ్యి. "



ఈశ్వర్ వారిరువురినీ క్షణంసేపు చూచి తండ్రి గదివైపు నడిచాడు. 
హరికృష్ణ, శివరామకృష్ణలు హాల్లో కూర్చొని టీవీలో వస్తున్న శ్రీ కృష్ణపాండవీయం సినిమాను చూస్తున్నారు. 



లావణ్య, ఈశ్వర్ గది తలుపు తెరిచి.. మంచానికి చేసిన మల్లెపూల అలంకారం.. క్రమంగా అమర్చిన పళ్ళు.. స్వీట్లను చూచి.. 
"ఊర్మిళా!.. ప్రణవి వదిన డైరెక్షన్ అద్భుతం.. తాను ఎక్కడో కూర్చొని మన ఇంట్లో ఏర్పాట్లనన్నింటినీ ఎంత చక్కగా చేయించిందో చూడు" ఆనందంగా చెప్పింది లావణ్య. 



"అవును లావణ్యా!.. ప్రణవి మంచి పనిమంతురాలు. మహా సమర్థురాలు" నవ్వింది ఊర్మిళ. 



"అమ్మా!.. దాదాపు రెండు గంటలసేపు గదిలో నలుగురు ఆడవాళ్ళు పనిచేశారమ్మా!" ద్వారం దగ్గరకు చేతికర్ర సాయంతో వచ్చిన విష్ణు చెప్పాడు. 



"అలాగా!" అంది ఊర్మిళ. 



"అవునమ్మా!" విష్ణు జవాబు. 



లావణ్య, ఊర్మిళలు గదినుండి బయటికి వచ్చి తాళం బిగించారు. విష్ణు హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నారు. 
వారిరువురూ లావణ్య గదిలోనికి వెళ్లారు. 
దీప్తి మంచంపై పడుకొని నిద్రపోతూ వుంది. 
"దీపూ!" పిలిచింది లావణ్య. 



దీప్తిలో చలనంలేదు. 
"వదినా! ఇదేంటి సమయంలో ఇలా నిద్రపోతూ వుంది" అడిగింది లావణ్య. 



"ఇంతకాలం.. తనకు ఈశ్వర్తో వివాహం అవుతుందో లేదో అనే భయం, కలత తన మనస్సున వుండేది. అది ఇప్పుడు లేదుగా!.. అందుకే హాయిగా నిద్రపోతూ వుంది" నవ్వింది ఊర్మిళ. 



ఇరువురూ డైనింగ్ హాల్లో ప్రవేశించారు. టేబుల్పై వంటకాలన్నీ సిద్ధంగా వున్నాయి. 
"అంతా ప్రణవీ అమ్మగారు చెప్పినట్లే చేశానమ్మా" అంది మంగ. 



హాల్లోకి వచ్చిన లావణ్య "ఏమండీ! స్నానాలు చేసేస్తే భోజనం చేయవచ్చు. ప్రణవి వదిన మన మంగచేత అన్నీ చేయించింది. "



పావుగంటలో హరికృష్ణ, శివరామకృష్ణ స్నానం చేశారు. లావణ్య, దీప్తిని లేపింది. స్నానం చేసి వచ్చిన దీప్తికి తెల్ల బంగారు అంచు చీర, రవికను అందించింది లావణ్య. తలలో మల్లెపూలను సింగారించింది. 



అందరూ కలసి భోజనం చేశారు. సరదా కబుర్లతో, మగవారంతా హాల్లోకి వచ్చి కూర్చున్నారు. సమయం రాత్రి తొమ్మిదిన్నర. లావణ్య వెళ్ళి ఈశ్వర్ గది తలుపు తెరిచింది. హాల్లోకి వచ్చింది. 



"ఈశ్వరా!.. రేపు ఉదయం చెన్నై వెళ్ళాల్సిందేనా!" అడిగింది లావణ్య. 



"అవునమ్మా! ఎల్లుండి మిస్టర్ బ్రౌన్ లండన్ వెళ్ళిపోతారు. "



"సరే!.. నీ గదికి వెళ్ళు.. పడుకో" అంది లావణ్య. 



ఈశ్వర్ లేచి తన గది తలుపును తెరిచి చూచాడు. ఆశ్చర్యపోయాడు. గుర్తుకు వచ్చింది రాత్రికి తన జీవితంలో వున్న ప్రాముఖ్యత. చిరునవ్వుతో లోన ప్రవేశించి తలుపు మూశాడు. గడియ బిగించలేదు. 



పావుగంట తర్వాత.. తలుపు తెరుచుకుంది. చేతిలో పాలగ్లాసుతో దీప్తి ద్వారం ముందు నిలబడి వుండి. 
"దీపూ!.. లోనికి పో!" అంది వెనుక వున్న లావణ్య. 



దీప్తి గదిలో తలదించుకొని ప్రవేశించింది. 
మంచంపైన కూర్చొని వున్న ఈశ్వర్ లేచి ద్వారాన్ని సమీపించి గడియ బిగించాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 19 - by k3vv3 - 24-04-2025, 05:04 PM



Users browsing this thread: 1 Guest(s)