Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 20



లావణ్య పనిమనిషి ఆసరాతో, దీప్తిని కన్నతల్లి ప్రణవి తన స్నేహితురాండ్ర సాయంతో తన ఇంట్లో జరుగవలసిన దీప్తి, ఈశ్వర్ల తొలిరేయి.. భర్త ప్రజాపతి కారణంగా ఏర్పాట్లను హరికృష్ణ ఇంట్లో చేయించింది. 



సీతాపతి నెల్లూరులో కారు దిగగానే ఈశ్వర్ను సమీపించి.. 
"బావా!.. మాట!"



"చెప్పు సీతా!"



"మీ మాట ప్రకారం ఏదో నా చేతనైంది చేశాను. లోపాలేమైనా వుంటే క్షమించండి. అక్క.. నా అక్క చాలా అమాయకురాలు. చిన్నప్పటి నుంచీ మీరంటే తనకు ఎంతో ప్రాణం. 
అప్పుడప్పుడూ నన్ను అడిగేది ఒరేయ్! బావ నన్ను పెండ్లి చేసుకొంటాడా అని. తప్పక చేసుకొంటాడక్కా అనేవాణ్ణి. క్షణంలో ఆమె ముఖంలో ఎంతో ఆనందాన్ని చూచేదాన్ని. ఆనందాన్ని చాలాకాలం తర్వాత నా అక్క ముఖంలో ఈరోజు చూచాను. దానికి కారణం మీరు. బావా! నా అక్కను జాగ్రత్తగా చూచుకోండి" కన్నీటితో సీతాపతి ఈశ్వర్ చేతులు పట్టుకొన్నాడు. 



కొన్ని క్షణాల తర్వాత "బావా!.. మా నాన్న మనస్తత్వంలో మార్పు వస్తుందో రాదో నా ఊహకు అందని విషయం. కానీ మా అమ్మకు మీరంటే ఎంతో ప్రేమ, అభిమానం. నేను ఇంట్లో వుండగా చూచేవాణ్ణి. ఆమె ప్రతినిత్యం పూజ చేసే సమయంలో మీరు తన అల్లుడు కావాలని దేవుణ్ణి కోరుకొనేది. అమ్మ ఆశయం మంచిది. ఆమె కోర్కెను దేవుడు తీర్చాడు. ఊర్లో జనం అనుకొంటుంటే విన్నాను. 
మన తాతలు.. నానమ్మల హాయంలో మన కుటుంబాలు, వ్యక్తుల మధ్య సఖ్యత ఊరంతటికీ ఆదర్శం అని, మన తండ్రుల హాయంలో పేరుకు బూజు పట్టింది. మన హాయంలో బూజును దులిపి మన కుటుంబాల మధ్యన వుండిన పూర్వపు సఖ్యతను తాతల హాయంలోలా వుండేలా చేయాలని నా కోరిక.. స్వార్థంతో బంధుత్వాలు తెగిపోయి పగద్వేషాలు పెరగకూడదు. రెండు గుణాలు ఆశాంతికి కారణాలౌతాయి. స్థితి ఎవరికీ రాకూడదు. 



మా నాన్నకు వచ్చింది. అది ఆయన వరకే పరిమితం కావాలి. మనం మన జీవితాంతం కలిసిమెలసి ఉండాలి. బావా! శార్వరి అంటే నాకు ఇష్టం. తనకూ నేనంటే ఇష్టమేనని నా అభిప్రాయం. మా విషయంలో మీరు ఏమి నిర్ణయించినా అది నాకు సమ్మతమే!" చెప్పడం ముగించి చిరునవ్వుతో ఈశ్వర్ ముఖంలో చూచాడు సీతాపతి. 



"సీతూ!.. దీపుతో నా వివాహం దైవ నిర్ణయంగా భావిస్తున్నాను. నీ విషయంలో పరంధాముని నిర్ణయం ఎలా వుందో!.. నీ కోర్కె నెరవేరాలని నేను సర్వేశ్వరుని కోరుతాను. బాగా చదువు. నీ కాళ్ళ మీద నీవు నిలబడు. అమ్మను, అంటే మా అత్తయ్యను జాగ్రత్తగా చూచుకో. ఆమె అమాయకురాలు. మీ వల్లనే ఆమెకు ఆనందం" అనునయంగా చెప్పాడు ఈశ్వర్. 



"అలాగే బావా!"



అందరూ వచ్చిన రీతిగానే కార్లలో కూర్చున్నారు. అవి కదిలాయి. టాటా చెప్పి సీతాపతి స్నేహితులు రైల్వేస్టేషన్ వైపు నడిచారు. 
కార్లు హరికృష్ణ పోర్టికోలో ఒకదాని వెనుక ఒకటి ఆగాయి. ముందరి వ్యాగినార్ నుండి హరికృష్ణ, లావణ్య.. శివరామకృష్ణ.. ఊర్మిళ, మాధవయ్య దిగారు. 
లావణ్య వేగంగా ఇంట్లోకి వెళ్ళి రెండు నిముషాల్లో.. ఎర్రని తట్టతో వచ్చి ఈశ్వర్, దీప్తిలకు దిష్టి తీసింది. 



"పదండి ఇంట్లోకి" అంది. 



ఆమె సెల్ మ్రోగింది. 
"హలో!.. "



"వదినా!.. వచ్చారా!"



"వచ్చాము ప్రణవీ"



"బాగా జరిగిందా?"



"దివ్యంగా జరిగింది. అన్ని ఏర్పాట్లు చేసింది నా అల్లుడు సీతాపతే!" చిరునవ్వుతో చెప్పింది లావణ్య. 



హరికృష్ణ నవ్వుతూ భార్య ముఖంలోకి చూచాడు. 
"ఒరేయ్ హరీ!.. మాటకామాట చెప్పుకోవాలిరా!.. నా చిన్నకొడుకు సీతాపతి వాళ్ళ మాదిరి కాదురా! బంగారం, ఎంత వినయం, ఎంత విధేయత ఏమంయావ్?" అడిగాడు శివరామకృష్ణ. 



"అవును బావా! సీతూ.. " భార్య ముఖంలోకి చూచాడు హరికృష్ణ. 



"చెప్పండి.. సందేహం దేనికి?.. అన్నయ్యా!.. సీతూ చాలా మంచియోగ్యుడు. వాడి తండ్రిమాదిరి కాదు. అవునాండీ!"



"ఆఁ.. అవునవును.. అంతా మేనత్త పోలిక" నవ్వాడు హరికృష్ణ. 



"అవునమ్మా!.. లావణ్య!.. నీ పోలికలు వాడిలో చాలా వున్నాయి" అన్నాడు శివరామకృష్ణ. 
లావణ్య నవ్వింది ఆనందంగా. 



"వదినా!" ఫోన్లో పిలిచింది ప్రణవి. 



".. .. చెప్పు వదినా!"



"మీ పనిమనిషి మంగ నా స్నేహితురాండ్ర సాయంతో మన పిల్లల తొలిరేయికి కావలసిన ఏర్పాట్లన్నీ మన ఇంట్లో చేయించాను. లోనికి వెళ్ళి చూచి నాకు ఫోన్ చెయ్యి" అంది ప్రణవి. 
"అలాగే వదినా!" సెల్ కట్ చేసింది లావణ్య. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 19 - by k3vv3 - 24-04-2025, 05:03 PM



Users browsing this thread: 1 Guest(s)