Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#72
సెల్ తెచ్చిన తంటా
[Image: image-2025-04-23-180908833.png]

జీడిగుంట శ్రీనివాసరావు

[b]డిన్నర్ చేసి సాక్షి టీవిలో వార్తలు చూస్తున్న వాసుదేవ్ దగ్గరికి అతని భార్య సునీత వచ్చి, మెల్లగా అంది "ఏమండీ! అమ్మాయి గదిలో నుంచి ఒకటే నవ్వులు, మాటలు. హరిణి ఎవ్వరితోనో మాట్లుడుతోంది. బహుశా ఎవ్వరైనా మగపిల్లాడితో మాట్లాడుతోంది అని అనుమానం గా వుంది" అంది.
[/b]







టీవీ ఆపేసి, “తలుపు కొట్టి పిలిచి అడగలేకపోయావా” అన్నాడు. 







“అడిగాను, చదువుకుంటున్నా. అనవసరంగా ఎందుకమ్మా ఆటంకం పరుస్తావు” అంటూ తలుపు వేసుకుంది. తప్పంతా మీదే. పిల్లల గది అంటూ వాళ్ళని చిన్నప్పుటి నుంచి వేరుగా పడుకోపెట్టారు. యిప్పుడు వాళ్ళు మనల్ని వాళ్ళ గదిలోకి రానివ్వడం లేదు” అంది సునీత.. 







“తప్పు నాది అంటావేమిటి, దానికి ఫోన్ ఎందుకే అంటే విన్నావా?” 







“కాలేజీ కి వెళ్లే పిల్ల, ఎక్కడ వుందో ఏమిటో తెలుసుకోవడానికి ఫోన్ కొంటే, యిలా వికవికలు ఏమిటండి” అంది. 







“దాని ఫోన్ డబ్బా ఫోన్, వీడియో రాదు. భయపడక, రేపు ఉదయం అది స్నానానికి వెళ్ళినప్పుడు దాని ఫోన్లో కాల్ లిస్ట్ చూడు, అప్పుడు ఆలోచిద్దాం” అన్నాడు వాసుదేవ్.







ఉదయం హరిణి స్నానానికి వెళ్ళగానే బ్యాగ్ లో వెతికింది సునీత. తాము కొన్న డబ్బా ఫోన్ తప్ప ఏమీ కనిపించలేదు. కాల్ లిస్ట్ చూస్తే సునీత నెంబర్ కి వాసుదేవ్ నంబర్స్ వున్నాయి. ‘అమ్మయ్య.. పిల్ల దారిలోనే వుంది. అనవసరంగా అనుమానించాను’ అనుకుని భర్తకి విషయం చెప్పింది. కూతురు మీద జాలి కలిగి బ్రేక్ఫాస్ట్ పూరీకూర తయారుచేసింది. తల్లి హృదయం కదా.







యిల్లు వూడుస్తున్న పనిమనిషి మంగమ్మ, “అమ్మగారు.. పాపగారి దగ్గర మంచి ఫోన్ ఉందిగా, పాత ఫోన్ నాకివ్వండి అమ్మా, ఎప్పుడైనా పనికి రాకపోతే ఫోన్ చేసి చెప్పగలను” అంది. 







“పాప దగ్గర రెండు ఫోనులు ఎక్కడవే, ఒక్క ఫోను తోనే తలనొప్పిగా వుంటే” అంది సునీత. 







“అదేమిటమ్మా! పాప గారు స్నానం చేసి వస్తున్నప్పుడు చేతిలో కొత్త ఫోన్ పట్టుకుని వున్నారు” అంది మంగమ్మ. 







“నిజమా” అంటూ భర్త చెవిలో వూదింది. 







పుస్తకాల బ్యాగ్ పట్టుకుని “అమ్మా! టిఫిన్ పెట్టు త్వరగా, కాలేజీ కి వెళ్ళాలి” అంది డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి.







ప్లేటులో పూరీలు వేసి కూతురుకి యిచ్చింది సునీత భర్త వంక చూస్తో. బ్యాగ్ పక్కన కుర్చీలో పెట్టి టిఫిన్ తింటోంది హరిణి. వాసుదేవన్ హరిణి బ్యాగ్ తీసుకుని లోపల చూసాడు. కొత్త ఐ ఫోన్ ని బయటకు తీసాడు. టిఫిన్ తిని బ్యాగ్ కోసం చూసుకుని కంగారుగా అటూ యిటు చూసింది. తండ్రి చేతిలో బ్యాగ్, ఐ ఫోన్ ఉండటం చూసి భయం తో వణకటం మొదలుపెట్టింది.







“ఎక్కడిది ఫోన్ నీకు, నెలకు రెండు లక్షలు సంపాదించే నాకే ఐ ఫోన్ లేదు, నీకు ఈ ఫోన్ ఎలా వచ్చింది” అంటూ లాగి లెంపకాయ కొట్టాడు. 







“మీరు ఆగండి, నేను తెలుసుకుంటాను” అంటూ కూతురిని వేరే గదిలోకి తీసుకుని వెళ్లి, “నిజం చెప్పు, ఈ ఫోన్ ఎవ్వడు కొనిపెట్టాడు, ఎవ్వడిది ఈ ఫోటో” అంటూ జుట్టుపట్టుకుని గుంజింది. 







“మా ఫ్రెండ్ యిచ్చాడు అమ్మా, అతను లెక్కలలో ఫస్ట్ వస్తాడు, నాకు లెక్కలు హెల్ప్ చేస్తాను అని ఈ ఫోన్ లో వీడియో కాల్ చేసి నా డౌట్స్ తీరుస్తాడు” అంది ఏడుస్తూ హరిణి.







“అంటే ఐ ఫోన్ నీకు యిచ్చి సహాయం చేసే గొప్పవాడు అని అనుకుంటున్నావా, చిన్న పిల్లలకి చాక్లెట్ యిచ్చి ఎత్తుకెళ్లినట్టే నిన్ను ఈ ఫోన్ యిచ్చి ఎత్తుకెళ్తాడు. చేసింది తప్పు అని తెలిసిందా లేదా” అని అరిచింది సునీత. 







“ఈ రోజు ఫోన్ తిరిగి యిచ్చేస్తాను, యిహ అతనితో మాట్లాడాను, నన్ను నమ్ము అమ్మా’ అంది హరిణి. 



“నువ్వు ఇవ్వక్కరలేదు, కాలేజీ కి కూడా రెండు రోజులు వెళ్లకు వాడి సంగతి తేలేవరకు” అంటూ ఫోన్ తీసుకుని వెళ్లి భర్త చేతికి యిచ్చి “మీరు ఒకసారి కాలేజీ కి వెళ్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడి ఆ కుర్రాడిని బెదిరించండి. ఎంతవరకు యింట్లో నామీద అరవడం కాదు, మీ ప్రతాపం వాడి మీద చూపించండి” అంది.







ఫోన్ చేతిలోకి తీసుకున్న వాసుదేవ్, “యిదిగో మంగమ్మా.. నీకు ఫోన్ కావాలి అన్నావుగా, ఈ ఫోన్ తీసుకో” అన్నాడు. 







“నాకెందుకు బాబు అంత పెద్దఫోన్, ఏదో మామూలు ఫోన్ చాలు” అంది. 







“తీసుకో మంగమ్మా” అంటూ ఫోన్ యిచ్చేసాడు. 







“అదేమిటి, ఆ అబ్బాయి కి ఫోన్ యిచ్చేసి నాలుగు చివాట్లు పెట్టమంటే మంగమ్మ కి యిచ్చేసారు” అంది మంగమ్మ వెళ్లిన తరువాత. 







“ఆ పిల్లాడికి యిస్తే ఈ ఫోన్ తో యింకో అమ్మాయిని వలలో పడేస్తాడు, వాడి సంగతి మీ తమ్ముడు రికవరీ ఆఫీసర్ గా చేస్తున్నాడుగా.. వాడిని పంపించి బెదిరించమందాం” అన్నాడు.







సునీత తన తమ్ముడు వెంకట్ కి ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పి, “నువ్వు నీ రికవరీ ఏజెంట్స్ ని పంపి ప్రిన్సిపాల్ తో మాట్లాడి, ఆపిల్లాడి తల్లిదండ్రులని హెచ్చరించి పుణ్యం కట్టుకోరా, మీ బావగారు నన్నూ, దానిని చంపేసేడట్లున్నారు” అంది. 







“నీకెందుకు అక్కయ్య, నేను చూసుకుంటా, వీలుంటే ఆ కుర్రాడి కాళ్ళు విరగకొట్టి రమ్మంటాను” అన్నాడు. 







“ఒరేయ్ అంత పని చెయ్యకు, భయపెట్టి రండి చాలు, వాడూ చిన్నపిల్లాడే గా” అంది సునీత.







రెండవ రోజు పనిమనిషి మంగమ్మ వాచిపోయిన మొఖం తో పనికి వచ్చి, “అమ్మా! మీకు, మీ ఫోన్ కి ఒక నమస్కారం. మా పెనిమిటి నీకు ఈ ఫోన్ ఎక్కడిది, దొంగతనం చేసావా అని తిట్టిపోశాడు. మీరు యిచ్చారు అన్న తరువాత ఫోన్ తీసుకుని చూసి ఫోన్ లో వున్న కుర్రాడి ఫోటో ఎవ్వరిది” అంటూ అనుమానం తో విరగకోట్టాడు అమ్మా. ఫోన్ అంటే మాట్లాడుకోవచ్చు అనుకున్నాను కాని యిలా దెబ్బలు, అపార్దాలు కూడా వస్తాయి అనుకోలేదు” అంటూ ఫోన్ బల్లమీద పెట్టేసింది.







సునీత తమ్ముడు వెంకట్ తన రికవరీ ఏజెంట్స్ ని తీసుకుని కాలేజి కి వెళ్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడి, ఆ కుర్రాడిని అతని తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్లి జరిగింది చెప్పాడు.






[b]“ఒరేయ్! చదువుకోమని పంపితే నువ్వు చేసే అని యిదా? అసలు నువ్వు ఐ ఫోన్ ఎలా కొన్నావు? అంటే ఆ నాడు నేను బ్యాంకు నుంచి ఖర్చులు కోసం తెచ్చిన యాభై వేలు నా జేబులోనుంచి కొట్టేసింది నువ్వా, బ్యాంకు నుంచివస్తోవుంటే ఏ జేబుదొంగో కొట్టేసాడు అనుకున్నాను. వేంకట్ గారూ! మా అబ్బాయి మీ అమ్మాయి వంక చూడకుండా నేను ట్రీట్మెంట్ యిస్తాను, మీరు యిహ ప్రశాంతంగా వెళ్ళండి” అని చెప్పి, కొడుకుని బెల్ట్ తో నాలుగు దెబ్బలు వేసి “యిహ సరిగ్గా చదువుకోకుండా ఫోన్లో చాటింగ్ చేస్తో కనిపించినా, తెలిసినా చదువు మానిపించి ఆటో కొని యిస్తాను, డ్రైవర్ గా బతకాలి జాగ్రత్తగా వుండు” అన్నాడు.[/b]
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - నరకం నుండి స్వర్గానికి - by k3vv3 - 23-04-2025, 06:10 PM



Users browsing this thread: 1 Guest(s)