Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఇంకెంత సేపు
#67
బాంబు పేలింది - జీడిగుంట నరసింహ మూర్తి
[Image: image-2025-04-22-134119443.png]
"నువ్వు ఖాళీగా ఉంటే ఒకసారి నాతో  వస్తావా ? నువ్వు నా పక్కన ఉంటే నేను వెళ్ళిన పని దిగ్విజయంగా జరుగుతుందని  నా నమ్మకం " అన్నాడు గోపాలం తమ్ముడు నారాయణకు ఫోన్ చేసి.

“ఇప్పుడా ఏమిటి సడన్ గా ? “ అనుమానంగా అడిగాడు నారాయణ .

" అదేలే. మన  మాధవికి ఎవరో ఒక సంబంధం చెపితే  వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాను. నువ్వు ఓకే అంటే   ఇద్దరం కలిసి వెళ్దాం " అన్నాడు  మళ్ళీ.

“నో  ప్రాబ్లం. అయితే  రేపు పండగ ఉంది కదా ఈ రోజు సాయంత్రం వీళ్ళ దగ్గర చుట్టాల వాళ్ళింటికి వెళ్తున్నాం. మళ్ళీ ఎల్లుండికల్లా ఇంటికొచ్చేస్తాం. అప్పుడు నేను ఖాళీనే. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నీతో ఎంత టైమ్ గడపడానికైనా  సిద్దం. “  అన్నాడు నారాయణ హడావిడిగా మాట్లాడుతూ.

“ఆదేలే. నేను కూడా అడ్వాన్స్ గా చెపుదామని ఫోన్ చేశాను .మాక్కూడా రేపు పండగేగా ! పండగ అయ్యాక విషయమే నేను మాట్లాడేది. .. అయితే  వెళ్ళే ముందు మీ ఇంటికి వచ్చి తీసుకునే వెళతాను సరేనా.. అంటూ ఫోన్ పెట్టేశాడు గోపాలం.

గోపాలం చాలా కాలంగా తన పెద్ద కూతురు మాధవికి  పెళ్లి చేయాలని ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం తో విసుగెత్తిపోయాడు. సంబంధం కుదిరినట్టే కుదిరి  వెనక్కి వెళ్ళి వెళ్ళిపోతూ ఉండటం అతనిలో రోజు  రోజుకు నైరాశ్యం పెరుగుతూ వచ్చింది. పిల్లకు పెళ్లి చేయలేకపోతున్నాననే అపరాధ భావం అతన్ని వెంటాడసాగింది. పెళ్ళికి ఎదిగిన పిల్ల రోజూ  కళ్ల ముందు తచ్చాడుతూ ఉంటే  చూడలేక  బేషిజాలు పక్కన పెట్టి  ఏదో ఒక సంబంధం  తన స్టేటస్ కు తగిన వాళ్ళు కాకపోయినా ముడిపెట్టేయ్యాలని  ఒక నిర్ణయానికొచ్చేశాడు.  .

పెళ్లి కొడుకు తండ్రి ఇచ్చిన అడ్రసు వెతుక్కుంటూ అన్నదమ్ములిద్దరూ  లోపలకు జొరపడ్డారు .ఇంతకు ముందు ఎన్నో సంబంధాలు చూడటానికి వెళ్ళాడు కానీ ఈ సారి మాత్రం ఏదో అవక్తమైన బెదురూ, నీరసం ఆవహించాయి.

వీళ్ళు వస్తున్నట్టు ముందే తెలిసిన ఆ ఇంట్లో ఒక  ఒక నడివయసు ఆవిడ  రెండు స్టీలు  గ్లాసులలో  ఏదో ద్రవ పదార్ధంతో  అక్కడ నిలబడి ఉంది.

"ఎండన పడి వచ్చారు. ముందు ఆ నిమ్మకాయ నీళ్ళు తాగండి మాష్టారు. . తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం .." అంటున్నాడు అప్పుడే లోపల నుండి బయటకు వచ్చిన  ఒక అరవై ఏళ్ల పెద్ద మనిషి భుజంమీద టవల్ కప్పుకుంటూ . ఆయనే పెళ్లి కొడుకు తండ్రి అని తెలుస్తూనే ఉంది.  

ఇంతలో ఎవరో చామన ఛాయగా , పొట్టిగా లావుగా ఉన్న వ్యక్తి మొహం నిండా జిడ్డోడిపోతూ ఉసూరుమంటూ  బయట నుండి లోపలకు వచ్చాడు.

" నువ్వు ఇంత ఆలస్యంగా వస్తే ఎలా రా అబ్బాయి  ? కాస్త దొడ్డి దారిన వచ్చి ఉంటే బాగుండేది.  వీళ్ళు నిన్ను చూసుకోవడానికి వచ్చారు. . కాస్త బాత్ రూమ్లోకి వెళ్ళి మొహం కడుక్కుని పౌడర్ బాగా పట్టించుకుని  రా ..." అన్నాడు ఆయన ఆ వ్యక్తికి మాత్రమే వినపడేటట్టుగా సైగలు చేస్తూ.

ఒక అరగంట తర్వాత ఆయన  కలిపించుకుంటూ "వీడేనండీ మా అబ్బాయి సుధాకర్ .. ఈ వూళ్లోనే ఒక ప్రైవేట్ కాలేజీలో తెలుగు  తెలుగు లెక్చరర్ గా చేస్తున్నాడు . ...ఈ రోజు కాలేజీకు సెలవు అని బయటకు వెళ్ళి వచ్చాడు .. నా కొడుకు అని కాదు కానీ చాలా అణుకువ , పెద్దలంటే గౌరవం వీడిలో ఉట్టి పడుతూ ఉంటాయి. “అంటూ గర్వంగా కొడుకు వైపు చూస్తూ పరిచయం చేశాడు. .

గోపాలం మొహంలో రంగులు మారుతున్నాయి క్రమం క్రమంగా. సుధాకర్ని చూడగానే మొహం చిట్లించాడు

పెళ్లి కొడుకు మొహంలో ఎక్కడా కళ , కాంతులు కనిపించడం లేదు. జుట్టు కూడా  చాలా వరకు పైకి వెళ్ళి పోయింది.

ఆ క్షణంలో పెళ్లి కొడుకును చూడగానే అంతకు ముందు ఇక నుండి ఎవరి దగ్గరా తన స్టేటస్ ప్రదర్శించకూడదు అని గట్టిగా తీర్మానించుకున్న గోపాలం ఆ విషయం ఆ క్షణంలో పూర్తిగా  మర్చిపోయి "ఏమిటీ మీ అబ్బాయి తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నాడా ? మరి  మా అమ్మాయి ప్రభుత్వ కళాశాలలో ఆంగ్లంలో ఉన్నత ఉన్నత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది కదా ! ఇద్దరికీ ఎలా మ్యాచ్ అవుతుంది ? తెలుగు టీచర్లను అవమానించడం కాదు కానీ, ఎందుకో మా అమ్మాయి వాళ్ళను  చేసుకోవడానికి ససేమిరా ఇష్టపడటం లేదు . . ఇంతకుముందు ఇలాంటి సంబంధాలు ఎన్నో తిరగగొట్టింది. ఏమైనా చివరి ఛాన్స్ గా మా అమ్మాయికి ఒకసారి చెప్పి చూస్తాను. ఇక అంతా  ఆమె ఇష్టం. తన మనోభావాలను నేను ఎటువంటి పరిస్తితుఆలోనూ కించపర్చ దల్చుకోలేదు. ..... " అంటూ అసహనంగా లేచాడు గోపాలం. . నిజానికి గోపాలం కూతురికి అటువంటి అభిప్రాయం లేదు. తండ్రి ఏదో ఒక సంబంధాన్ని వెతికి త్వరగా పెళ్లి చూపుల వరకు తీసుకెళతాడని చాలా కాలం నుండి ఎదురుచూస్తోంది.

కానీ గోపాలం లోని అహంభావం, అతిశయం  అతడిని ఎప్పుడూ అవతలి వాడి కన్నా అధికం అని అనిపించుకునేలా  చేస్తూ ఉంటుంది. .

కనీసం పెళ్లి కొడుకు తండ్రి ఏదో చెప్పబోతున్నా వినకుండా అక్కడ నుండి కోపంగా లేచి పోయాడు గోపాలం.

  మనం ఈ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం లెండి. కనీసం ఆ నిమ్మకాయ రసం అయినా తాగండి మాకు సంతృప్తిగా ఉంటుంది “ అని పెళ్లి కొడుకు తండ్రి  అన్నాడు కానీ డోకు వచ్చేటట్టుగా వేళ్ళు పెట్టి తీసుకొచ్చిన నిమ్మకాయ రసం గ్లాసులు అన్నదమ్ములిద్దరిలో  ఎవరూ తాగడానికి సాహసించకపోవడంతో ఆ నడి వయసు ఆవిడ అవకాశం దొరికింది కదా అని పక్కకు వెళ్ళి గటగటా తాగేసింది.

గోపాలం అక్కడనుండి లేచి పోయి బయటకు వచ్చేసి అప్పటికప్పుడు సంబంధం గురించి కూతురుకు ఫోన్ చేయడం మొదలు పెట్టాడు.

నారాయణ మాత్రం ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు.

" సార్. మీరేమీ అనుకోక పోతే నాకు కూడా ఒక అమ్మాయి ఉంది. ఇదిగో ఈ ఫోటోలో ఉన్నదే మా అమ్మాయి. మా అన్నయ్యకు  మీ అబ్బాయి నచ్చకపోతే నచ్చకపోయాడు. నాకు బాగా నచ్చాడు. మా అన్నయ్య  తన తొందరపాటు చర్యలతో ఎన్నో సంబంధాలు చెడగొట్టుకున్నాడు.   నేను మా అమ్మాయికి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాను. దయచేసి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచండి.  ఒక రెండు రోజులలో మా ఇంట్లో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాను. మీరు అడిగిన కట్నం అంతా కూడా  ఇస్తాను..." అని  నారాయణ పెళ్లి కొడుకు తండ్రి రెండు చేతులు పట్టుకుని బ్రతిమాలడంతో ఆయన కూడా సుముఖంగా చేతులు కలిపాడు.

తన అన్నగారు ఎన్నో సంబంధాలు వెతుకుతూ ఉండటం, ఒక్క సంబంధం కూడా కుదరకపోవడం కళ్ళారా చూస్తున్న నారాయణ తను తన కూతురు విషయంలో  అవే పొరపాట్లు చేయడం ఇష్టం లేక  అన్నగారి కోసం వచ్చిన సంబంధాన్ని తన తెలివి తేటలతో సులువుగా చేజిక్కించుకుంటే , ఎన్నో సంబంధాలు వచ్చినా తన కొడుకు అందచందాలు చూసి  పెదవి విరిచేసి వెళ్ళి పోతున్న పెళ్లి కొడుకు  సుధాకర్ తండ్రికి కష్టపడకుండానే కొడుక్కి పెళ్లి కుదరడంతో  నెత్తి మీద పాలు పోసినట్లయ్యింది.

నారాయణ ఇంట్లో పెళ్లి చూపులలో సుధాకర్ని, అతని తండ్రిని చూసిన గోపాలం ,అంతకు ముందు  తనకు తోడుగా వచ్చిన తన తమ్ముడు నారాయణ  తెలివిగా, చాకచక్యంగా  తన కూతురు కోసం చూడటానికి వెళ్ళిన  సంబంధాన్ని కాప్చర్  చేసుకోవడం చూశాక  తన అతి తెలివితేటలతో, మూర్ఖత్వంతో ఎన్నో సంబంధాలు చేచేతులా చెడగొట్టుకుంటున్నానన్న  పశ్చాత్తాపం గోపాలంలో అనువణువూ ఆవరించింది.

తన బాబాయి కూతురికి పెళ్లి సంబంధం తనకన్నా ముందే కుదిరిపోయిందని తెలుసుకున్న గోపాలం కూతురు  మాధవి ఒక రోజు రాత్రి తీవ్ర కోపంతో మండిపడుతూ  "నువ్వు నీ జీవితంలో ఎప్పటికైనా నాకు పెళ్లి చెయ్యగలవా ? లేదంటే  నా  దారి నన్ను చూసుకోమంటావా ?" అని బెదిరించడంతో గోపాలం వణికిపోతూ  చూస్తూ “ అలాగే తల్లీ నాదేముంది ఏ అనామకుడినో  , వెర్రివాడినో ఇచ్చి వారం రోజుల్లో పెళ్లి చేసేస్తాను . ఇక నీ ఖర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది.  “ అంటూ  అక్కడ నుండి మనస్తాపంతో వెళ్ళి పోయాడు.
తండ్రి మాట మీద ఏ మాత్రం నమ్మకం లేని గోపాలం కూతురు కొన్నాళ్ళకు  తను  కాలేజీలో తనని బాగా ఇష్టపడుతూ వచ్చిన  తన స్తాయి కన్నా తక్కువైన ఒక  తెలుగు డిమానిస్ట్రేటర్ని పెళ్లి చేసుకుని జీవితంలో హాయిగా  స్తిరపడిపోయింది. ..
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - Thread Modes Comedy హాస్య కథలు - దీపావళి మజా - by k3vv3 - 22-04-2025, 01:42 PM
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM



Users browsing this thread: 1 Guest(s)