Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#70
నరకం నుండి స్వర్గానికి
రచనL. V. జయ






బెంగుళూరు లో వున్న తన ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి  బై చెప్పి చెన్నై బయలుదేరింది జాగృతి. చెన్నై లో తన క్లాస్ మేట్ రజిని పేయింగ్ గెస్ట్ గా వున్న చోటకి వెళ్ళింది.



జాగృతిని చూసి చాలా ఆనందపడింది రజిని. "ఎలా వున్నావ్? ఎన్నాళ్ళు అయ్యింది మనం కలిసి. యూఎస్ నుండి ఎప్పుడు వచ్చావ్ ? యూఎస్ ఎలా వుందిలో లైఫ్ ? బెంగుళూరు లో కదా చేస్తున్నావ్? ఇప్పుడు చెన్నై ఏంటి?" గలా గలా మాట్లాడుతుంది రజిని .



"ఆగు. ఆగు. అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేస్తే ఎలా?" అని అన్నిటికి సమాధాం చెప్పింది జాగృతి. "వన్ మంత్ అయ్యింది యూఎస్ నుండి వచ్చి. చాలా బాగుంది.బెంగుళూరు వచ్చాక జాబ్ కి అప్లై చేస్తే ఇక్కడ వచ్చింది. మంచి పొజిషన్, శాలరీ ఎక్కువ. అందుకని ఇక్కడకి వచ్చేసాను." అంది జాగృతి.



"నువ్వేమో ఇప్పుడే యూఎస్ నుండి వచ్చావ్. నేను ఇంకొన్నాళ్లలో యూఎస్ వెళ్తున్నాను " అంది రజిని. 



"ఓహ్. వావ్ . కంగ్రాట్స్. అక్కడ జాబ్ వచ్చిందా? " అంది రజిని హత్తుకుంటూ జాగృతి. 



"నాకు పెళ్లి సెటిల్ అయ్యింది. పెళ్లి తరువాత వెళ్ళిపోతున్నాను." అంది రజిని.  



మాట్లాడుతూ రూమ్ వరకు వచ్చారు ఇద్దరూ. రూమ్ చాలా చిన్నగా వుంది. అందులో నాలుగు మంచాలు. మంచాల మధ్యలో నడిచే దారి తప్ప వేరే జాగా లేదు.  విండోస్ లేవు రూమ్ కి. డోర్ లోంచి వచ్చే వెంటిలేషన్ తప్ప వేరేగా గాలి వచ్చే అవకాశం కూడా లేదు. ఖాళీగా వున్న బెడ్ చూపించి "ఇది నీ ప్లేస్. బెడ్ కింద నీ సామాన్లు పెట్టుకో " అంది రజిని. బెడ్ మీద మ్యాట్రెస్ లేదు. బెడ్ కింద సూట్ కేస్, బకెట్, మగ్,కంచం, గ్లాస్, మాసిపోయిన బట్టలు  పెట్టుకున్నారు. ఎక్కడ కబోర్డ్స్ లేవు.     



తరువాత డిన్నర్ కి తీసుకుని వెళ్ళింది. అక్కడ చాలా మంది అమ్మాయిలు వున్నారు. అందరూ ఎవరి ప్లేట్స్ వాళ్ళు తీసుకుని వచ్చి, మెట్ల మీద కూర్చుకుని తిన్నారు. ఎక్కడ డైనింగ్ టేబుల్ కనపడలేదు జాగృతి కి. తిన్నాక అందరూ ఎవరి ప్లేట్స్ వాళ్ళు లైన్ లో నించుని కడుక్కుని ఎవరి రూమ్ కి వాళ్ళు తీసుకుని వెళ్లారు. కాసేపు కాలేజీ విషయాలు మాట్లాడుకుని పడుకున్నారు. జాగృతికి నిద్ర పట్టలేదు. 



మర్నాడు ఉదయాన్నే 3 కి జాగృతి దగ్గరకి వచ్చి రజని "లే ఇంక" అని చెప్పింది. 



"అప్పుడే ఏంటి. నాకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఇప్పుడే కొంచెం పడుతోంది" అంది జాగృతి.



"ఇంకొంచెం లేట్ అయితే బాత్రూమ్స్ ముందు పెద్ద లైన్ ఉంటుంది. నీకు రోజు ఫస్ట్ డే కదా ఆఫీస్ కి. స్నానం చేసేసి పడుకో కావాలంటే" అంటూ బలవంతంగా లేపింది రజిని. 



'ఇది పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ లాగ లేదు. హాస్టల్ లాగా వుంది. ఇంక ఇక్కడే, ఇలాగే బతకాలా?' అని బాధపడింది జాగృతి.   
   
ఆఫీస్ లో , HR ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాక, హిమాని ని పరిచయం చేసారు. హిమనీ నార్త్ ఇండియన్ అమ్మాయి. ఆఫీస్ అంతా చూపిస్తూ, అందరిని పరిచయం చేసింది. ఆఫీస్ లో పెద్ద కాంటీన్, లైబ్రరీ, జిమ్, మెడిటేషన్ రూమ్, ప్లే ఏరియా లో టేబుల్ టెన్నిస్, మినీ గోల్ఫ్ ఇలా చాలా వున్నాయి. ఆఫీస్ చాలా నచ్చింది జాగృతి కి. 'ఉండడానికి కూడా సరి అయిన ప్లేస్ దొరికితే బాగుణ్ణు.' అనుకుంది మనసులో. 



"ఎక్కడ పని చేసావ్ ఇంతకు ముందు?" అడిగింది జాగృతిని హిమాని. 



"యూఎస్ లో. కొన్ని రోజుల క్రితమే వచ్చాను" చెప్పింది జాగృతి . 



"నీకు హిందీ వచ్చా". 



వచ్చంది జాగృతి.



"ఎక్కడ వుంటున్నావ్?" 



"నా కాలేజీ ఫ్రెండ్ ఉంది హాస్టల్ లో. అక్కడే ఉంటున్నాను. " 



"ఏమైనా వేరే ప్లేస్ వెతుక్కుంటున్నావా" అడిగింది హిమాని.



" నిన్నే వచ్చాను చెన్నై. నాకు ఇక్కడ ఏమి తెలియదు ఇంకా. చూద్దాం" అంది జాగృతి. 



"సరే. నీకు వేరే ప్లేస్ కావాలంటే చెప్పు. నేను పేయింగ్ గెస్ట్ గా వున్న చోట ఉండచ్చు కావాలంటే" అంది హిమాని.



"సరే. అవసరం అయితే చెపుతాను" అంది జాగృతి. 



రోజు సాయంత్రం తన రూమ్ కి వెళ్తూ, మ్యాట్రెస్ తో సహా కావాల్సిన సామాన్లు అన్ని కొనుక్కుని వెళ్ళింది హాస్టల్ కి. రోజు కూడా నిద్ర పట్టలేదు జాగృతి కి .



నెల రోజుల్లో రజిని పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోయింది. హాస్టల్ లో ఉండడం చాలా కష్టంగా వుంది జాగృతి కి . రోజూ బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లి, చట్నీ, డిన్నర్ లో బీన్స్ కూర, సాంబార్. సాంబార్ లో ఒక రోజు బల్లిని చూసింది జాగృతి. రోజు నుండి హాస్టల్ లో తినడం మానేసింది. నిద్ర సరిపోకపోవడం తో ఒక రోజు ఆఫీస్ లో మెడిటేషన్ రూమ్ లోకి వెళ్లి పడుకుంది. హిమనీ అది చూసి "చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఏమయ్యింది. అంతా ఒకే నా?" అని అడిగింది. హాస్టల్ లో తన పరిస్థితి గురించి చెప్తూ ఏడ్చేసింది జాగృతి.



మర్నాడు ఆఫీస్ లో పని చేసుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది జాగృతికి. ఫోన్లో ఎవరో పెద్దాయన పాత హిందీ పాటని ఈల వేసి " పాట ఏంటో చెప్పు" అని అడిగారు. ఆయన ఎవరో, ఎందుకు అలా అడిగారో తెలియదు కానీ అడిగిన వెంటనే పాడింది. "కరెక్ట్. నీ గొంతు బాగుంది. యు ఆర్ సెలెక్టెడ్ " అని ఫోన్ పెట్టేసారు పెద్దాయన." ఏమి అర్ధం కాలేదు జాగృతికి.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మా మనసు చెప్పిన తీర్పు 3/3 - by k3vv3 - 20-04-2025, 12:52 PM



Users browsing this thread: 1 Guest(s)