Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
సీతాపతి క్షణంసేపు హరికృష్ణ ముఖంలోకి చూచి తర్వాత "చిన్నానా! పిన్నీ విష్ణు అన్నయ్యా బాగున్నారా!" శివరామకృష్ణను, ఊర్మిళను ప్రీతిగా పలకరించాడు. 



"అందరమూ బాగున్నాము నాన్నా!" చెప్పాడు శివరామకృష్ణ. 



"సరే వినోద్ రావుగారూ! మీ పనిని మీరు ప్రారంభించండి" అన్నాడు హరికృష్ణ. 



"అలాగే సార్!"



తన స్థానంలో కూర్చొని రిజిష్టర్లో ఈశ్వర్, దీప్తీల పేర్లను, సాక్షిల పేర్లు వ్రాసి సంతకం చేయమన్నాడు వినోద్ రావు. 



"సార్!.. ఒక్కక్షణం.. " వేగంగా జేబు నుండి రెండు బంగారు ఉంగరాలను తీసి ఒకదాన్ని ఈశ్వర్ చేతికి, రెండవదాన్ని అక్క దీప్తి చేతికి ఇచ్చాడు సీతాపతి. 



"మార్చుకోండి బావా!" అన్నాడు చిరునవ్వుతో. 



ఈశ్వర్ నవ్వుతూ తన చేతిలోని వుంగరాన్ని దీప్తి వేలికి తొడిగాడు. 
దీప్తి తన చేతిలోని వుంగరాన్ని ఈశ్వర్ చేతికి తొడిగిండి నవ్వుతూ. 
ఇరువురూ రిజిష్టార్ సంతకాలు చేశారు. 



సాక్షి సంతకాలు.. శివరామకృష్ణ, మాధవయ్య, సీతపతి, అతని స్నేహితుడు ఆనందరావు చేశారు. 
పన్నీరు, పూలదండలను ఇరువురికీ అందించాడు సీతాపతి. ఈశ్వర్, దీప్తిలు దండలు మార్చుకొన్నారు. పెద్దలకు నమస్కరించారు. 



పెద్దలు వారిని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. 



సీతాపతి అందరికీ స్వీట్స్ పంచాడు. అందరూ ఆనందంగా ఆరగించారు. కూల్డ్రింక్స్ అందించాడు త్రాగారు. 



హరికృష్ణ!.. "మీ సహకారానికి నా ధన్యవాదాలు" వినోద్ రావు తనకన్నా చిన్నవాడైనా హరికృష్ణ కృతజ్ఞతా భావంతో చేతులు జోడించాడు. 



చేతులు విడదీసి.. " చేతులు నన్ను ఆశీర్వదించవలసినవి సార్!" వినయంగా చెప్పాడు వినోద్ రావు. 



"సార్! ఈశ్వర్ గారూ! మీ వివాహం అభిజిత్ లగ్నంలో శుక్రవారం నాడు ఎంతో శుభంగా జరిగింది. మీ భావిజీవితం.. మూడుపువ్వులు, ఆరుకాయలుగా ఎంతో ఆనందంగా సాగుతుంది. నేను మీకంటే పెద్దవాణ్ణి. మీకు ఇవే నా శుభాశీస్సులు" హృదయపూర్వకంగా చెప్పాడు వినోద్ రావు. 



పరీక్షల కారణంగా శార్వరి నెల్లూరుకి రాలేకపోయింది. 
అందరూ రమణ విలాస్కు వెళ్ళి భోజనం చేశారు. శ్రీరంగనాయక స్వామి ఆలయాన్ని, ధర్మరాజుల ఆలయాన్ని, జొన్నవాడ శ్రీ కామాక్షమ్మ ఆలయాన్ని దర్శించి, కానుకలు అర్పించి, తీర్దప్రసాదాలను స్వీకరించి తిరిగి నెల్లూరుకు చేరారు. 



====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 18 - by k3vv3 - 16-04-2025, 12:48 PM



Users browsing this thread: 1 Guest(s)