Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
"అన్నయ్యా!.. నన్ను క్షమించండి. లోనికి రండి" ప్రాధేయపూర్వకంగా చెప్పింది లావణ్య. 



"అమ్మా!.. నిన్ను నేను క్షమించడమా! నీవేం తప్పు చేశావు తల్లీ. రోజు నీ స్థానంలో నేను వున్నా నీలాగే మాట్లాడేవాణ్ణి. నాకు నీమీద కోపం లేదమ్మా!.. వున్నది కేవలం మాట పట్టింపు మాత్రమే!.. అది ఇప్పుడు లేదు పద!" అన్నాడు మాధవయ్య. 



ఇరువురూ హాల్లోకి ప్రవేశించారు. ఈశ్వర్ తన గది నుండి బయటికి వచ్చాడు. దీప్తి అతన్ని సమీపించింది. 



"పెద్దల పాదాలు తాకి నమస్కరిద్దాం బావా!" మెల్లగా అతని చెవి దగ్గర నోటిని చేర్చి చెప్పింది దీప్తి. 
"అలాగే!" ప్రీతిగా దీప్తి ముఖంలోకి చూస్తూ అన్నాడు ఈశ్వర్. 



"ఏమిటా మీ గుసగుసలు!" అడిగింది లావణ్య. 



"ఏం లేదమ్మా! నీవు నాన్న ప్రక్కకు రా!.. ఊర్మిళత్తయ్యా!.. మీరు మామయ్య ప్రక్కకు రండి. " నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్. 



వారు అలాగే నిలబడ్డారు. ముందు తల్లితండ్రి తర్వాత శివరామకృష్ణ, ఊర్మిళ పాదాలను తాకి వారి ఆశీస్సులను, చివరగా మాధవయ్య పాదాలను తాకి పెద్దలందరి ఆశీర్వచనాలను స్వీకరించారు దీప్తి, ఈశ్వర్లు. 



విష్ణు, ఈశ్వర్తో కరచాలనం చేసి "బావా! అక్కా! విష్ యు బోత్ ఆల్ ది బెస్ట్" ఆనందంగా చెప్పాడు. 
"విష్ణు! రేపు ఉదయం మనం చెన్నై వెళుతున్నాము. నా ఫ్రెండ్ సాయంతో డాక్టర్ బ్రౌన్తో మాట్లాడాను. నిన్ను తీసుకొని రమ్మన్నారు" చిరునవ్వుతో చెప్పాడు ఈశ్వర్. 



"ఓకే బావా! థాంక్యూ" నవ్వుతూ చెప్పాడు విష్ణు. మాధవయ్య వచ్చిన అంబాసిడర్ కార్లో ఈశ్వర్, దీప్తి కూర్చున్నారు. 



వారి సొంతకారు వ్యాగనార్లో హరికృష్ణ, లావణ్య, శివరామకృష్ణ, ఊర్మిళ, మాధవయ్య కూర్చున్నారు. రెండు కార్లు నెల్లూరివైపు బయలుదేరాయి. విష్ణు ఇంట్లోనే వుండిపోయాడు. 
వెనుక సీట్లో ముడుచుకొని కూర్చుని వున్న దీప్తిని చూచి ఈశ్వర్ "ఏమిటా కూర్చోడం ఫ్రీగా హ్యాపీగా కూర్చో. నీ ఆశయం నెరవేరబోతూ వుందిగా!" నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్. 



దీప్తి ఈశ్వర్ ముఖంలోకి వాల్గంట చూచింది. 
"కేవలం నా ఆశయమేనా!"



"కాదు మన ఆశయం"



"ముందే మాట అని వుండవచ్చుగా!"



"అలా అని వుంటే.. అందాల ముఖంలో క్షణాల్లో మెరిసి మాయమైన అతి సుందరమైన మెరుపులను చూడలేను కదా!" కళ్ళు ఎగరేస్తూ చెప్పాడు ఈశ్వర్.
 
"ఇది వెక్కిరింపా!.. అభిమానమా!" బుంగమూతి పెట్టి అడిగింది దీప్తి. 



ఈశ్వర్ షర్టు బటన్స్ విప్పి రెండు చేతులను ఛాతికి తాకించి.. 
" గుండె నిండా వున్న పిచ్చిప్రేమ.. అభిమానం" అందంగా నవ్వాడు ఈశ్వర్. తెల్లని అతని పళ్ళ వరసలో మెరుపు. పరవశంతో అతని ఛాతిపై వాలిపోయింది దీప్తి. 



నలభై నిముషాల్లో రెండుకార్లు రిజిష్టార్ ఆఫీసు ముందు ఆగాయి. అందరూ కార్ల నుండి దిగారు. 
గతరాత్రే అక్కడికి వచ్చి ఉదయాన్నే అన్ని ఏర్పాట్లు చేసిన సీతాపతి నవ్వుతూ వారిని సమీపించాడు. పెద్దలకు వినయంగా నమస్కరించాడు. 



తన అక్కను సమీపించి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని.. 
"అక్కా! కంగ్రాచ్యులేషన్స్. నాకు చాలా ఆనందంగా ఉంది" ముసిముసి నవ్వులతో దీప్తి తన కుడిచేతిని అతని తలపై వుంచి వేళ్ళతో జుట్టు కదిలించింది. దీప్తికి చిన్నతనం నుంచి తన తమ్ముడు ఏదైనా మంచిమాట మాట్లాడినా.. తనకు సాయం చేసినా అలా అతని తలను నిమరడం అలవాటు. 



అక్క స్పర్శకు సీతాపతి ఎంతగానో ఆనందించేవాడు. ఈనాడూ అంతే.. 
"సీతా! నేను నీకు ట్రబుల్ ఇచ్చానుగా!.. "



"ఏంది బావా ఆమాట. ఇది నా డ్యూటీ బావా!"



అటెండర్ వచ్చి సీతాపతిని సమీపించి.. 
"సార్!.. మీ వాళ్ళంతా వచ్చారా!.. అయ్యగారు మిమ్మల్ని పిలిస్తున్నారు రండి" వెనుతిరిగాడు అటెండర్. 



అందరూ అతన్ని అనుసరించి రిజిష్టార్ గారి ముందుకు హాజరైనారు. రిజిష్టార్ గారు పేరు వినోద్ రావు. 



హరికృష్ణ సాయంతో చదివి.. ఎదిగి.. పట్టభద్రుడై ఉద్యోగాన్ని ప్రతిభతో సంపాదించాడు. ఎనిమిది సంవత్సరాల సర్వీస్ కూడా ముగిసింది. 



హరికృష్ణను చూడగానే కుర్చీ దిగి.. వారిని సమీపించి వినయంగా చేతులు జోడించి.. 
"సార్!.. నేను గుర్తున్నాన్నా! వినోద్ రావును సార్.. మీ సాయంతో చదువుకొనిపైకి వచ్చిన వాణ్ణి" కృతజ్ఞతా పూర్వకంగా చెప్పాడు. 



"నాకు వయస్సు అవుతుందిగా.. చూడడంతోనే గుర్తు పట్టలేకపోయాను. ఇప్పుడు గుర్తుకు వచ్చావు. ఆఁ.. వీడు నా కొడుకు ఈశ్వర్.. ఆమె నా మేనకోడలు దీప్తి.. కొన్ని కారణాల వల్ల వీరి వివాహం మీ రిజిష్టార్ కార్యానిలయంలో జరిపించవలసి వచ్చింది. ఈమె నా భార్య లావణ్య. ఆయన మా బావగారు శివరామకృష్ణ. ఆమె నా చెల్లెలు ఊర్మిళ. వీరు మా మరో బావగారు మాధవయ్య. వాడు నా.. " హరికృష్ణ పూర్తిచేయకముందే.. 

"వారు నాకు తెలుసు సార్!.. రాత్రి నన్ను కలిసి అన్ని విషయాలు చెప్పి.. కావలసిన ఏర్పాట్లను చేసింది వారే కదా సార్. సీతాపతి వెరీ గుడ్ బాయ్. వీరి స్నేహితులు ఇద్దరు కూడా చాలా మంచివారు" నవ్వుతూ చెప్పాడు వినోద్రావు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 18 - by k3vv3 - 16-04-2025, 12:45 PM



Users browsing this thread: 1 Guest(s)