Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
"నీవు.. నీ కూతుర్ని సరిగ్గా పెంచలేదు. కన్నతండ్రిని నన్నే ధిక్కరించి ఈశ్వర్ గాడితో వెళ్ళిపోయింది. నాకు తెలుసు.. అది చేసిన పని నీకూ ఇష్టమేనని.. జరుగనివ్వను. దాని వివాహం బికారి నల్లకోటు వాడితో జరుగనివ్వను" ఆవేశంగా చెప్పి కార్లో కూర్చుని వెళ్ళిపోయాడు ప్రజాపతి. 
ప్రణవి బిక్కముఖంతో వెళుతున్న భర్తను చూస్తూ నిలబడిపోయింది. 
మరుదినం.. ఉదయం పదిగంటలకు శివరామకృష్ణ.. ఊర్మిళ.. విష్ణు వచ్చారు. ఇంట్లో వున్న దీప్తిని చూచి ఆశ్చర్యపోయారు. 
హరికృష్ణ, లావణ్యలు జరిగిన విషయాన్నంతా వారికి వివరంగా చెప్పారు. 
ప్రక్కనే వున్న భవంతి రంగులతో క్రొత్త అందాలను సంతరించుకొని వున్న దానికి కారణం అడిగాడు శివరామకృష్ణ. 
"మన దీపు హాస్పిటల్ను ఓపెన్ చేయబోతూ వుందిరా!" చెప్పాడు హరికృష్ణ. 



"చాలా మంచి పనిరా!" నవ్వుతూ నిలబడి వున్న దీప్తిని చూచి. 



"అమ్మా!.. నీది ఎంతో గొప్ప మనస్సు. కాలపు పిల్లల్లా నగరాల్లో డ్యూటీ టైమ్ ప్రకారం ధర్మాన్ని నిర్వహించకుండా పల్లెటూళ్ళో హాస్పిటల్ నడుపుతూ, పేదలకు సాయం చేయాలనే నీ నిర్ణయం ఎంతో గొప్పదమ్మా!.. నాకు ఎంతో ఆనందంగా వుంది" చిరునవ్వుతో చెప్పాడు శివరామకృష్ణ. 
"బాబాయ్! ఇందులో నా గొప్పతనం ఏమీలేదు. అంతా మా మామయ్య అత్తయ్య మీ అల్లుడిగారి ప్రోత్సాహం" వినయంగా చెప్పింది దీప్తి. 



ప్రజాపతి ఇరవైమంది గుంపుతో హరికృష్ణ ఇంటిముందుకు వచ్చాడు. 
"రేయ్!.. హరీ!.. ఈశ్వర్!.. బయటికి రండిరా!" పోలికేకపెట్టాడు ఆగ్రహావేశాలతో. 
హాల్లో వున్న అందరూ వరండాలోకి వచ్చారు. వాకిట్లో వున్న ప్రజాపతిని అతని అనుచరులను చూచారు. 



హరికృష్ణ, శివరామకృష్ణ, ఈశ్వర్ వీధిగేటును సమీపించారు. 
"బావా! లోనికిరా!.. కూర్చుని మాట్లాడుకొందాం!" అనునయంగా చెప్పాడు హరికృష్ణ. 



"నేను నీ కొంపలో కాలు పెడతాననుకున్నావురా!.. ఛీ.. ఛీ.. మర్యాదగా నా కూతురును నాకు అప్పగించు.. లేకపోతే!.. "



"చేయకపోతే ఏం చేస్తారు!" అడిగాడు ఈశ్వర్. 



వారిని లావణ్య, ఊర్మిళా సమీపించారు. 
"అన్నయ్యా! లోపలికిరా! వీధిలో అరుపులేంటి!"



"అవునే నేను అలాగే అరుస్తాను. నీ కొడుకు నా కూతుర్ని లాక్కునివచ్చాడు. మాటలు అనవసరం. దీపును పిలు!"



"ప్రజా! ఆవేశపడకు. వీళ్ళనందరినీ వెళ్ళిపొమ్మను. లోపలికిరా స్థిమితంగా కూర్చొని మాట్లాడుకొందాం. ఇది మన సొంత విషయం. ఊరి విషయం కాదుగా!" అభ్యర్థనగా చెప్పాడు శివరామకృష్ణ. 



"రేయ్!.. నీవు నాకు నీతులు చెప్పేవాడివా!.. విషయం నాకు వాడికి సంబంధించింది నీవు నోరుమూసుకో"



"మామయ్యా! దీపు మీతో రాదు.. పంపను. "



"నీవు ఎవడివిరా పంపేదానికి? పంపకుండా వుండేదానికి? ఇంట్లో జొరబడి లాక్కొని వెళతా!"



"ఇంట్లోకి రానన్నావుగా మామయ్యా!.. " వెటకారంగా చెప్పాడు ఈశ్వర్. 



"అన్నయ్యా!.. వాడు చెప్పింది అక్షర సత్యం. మేమంతా పిలుస్తున్నాము కదా!.. ఆవేశాన్ని అణచుకొని గౌరవంగా లోనికిరా! ప్రశాంతంగా మాట్లాడుకొందాం!" అనునయంగా చెప్పింది లావణ్య. 



"పోవే!.. మీతో నాకు మాటలేంటి?" ప్రక్కన వున్నవారిని చూచి.. 
"రేయ్! లోనికి వెళ్ళి దీప్తిని లాక్కొని రండిరా!" శాసించాడు. 

[b]వారు అతని ముఖంలోకి.. ఎదుట నిలబడి వున్న హరికృష్ణ, శివరామకృష్ణ, ఊర్మిళ, లావణ్య, ఈశ్వర్ ముఖాల్లోకి బిక్కముఖాలతో చూచారు. 
[/b]






"పోండ్రా!" గర్జించాడు ప్రజాపతి. 







పదిమంది ముందుకు జరిగారు. 

"అన్నయ్యలారా! ఆగండి. మీరు శ్రమ పడవనవసరం లేదు. దీపూను నేనే పిలిస్తాను" నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్. 






[b]వాకిట్లో జరుగుతున్న వాదప్రతివాదాలను వరండాలో నిలబడి భయంతో చూస్తూ.. వింటూ వుంది దీప్తి. [/b]

[b][b]"దీపూ! ఇలారా!" బిగ్గరగా పిలిచాడు ఈశ్వర్. 
[/b]
[/b]
దీప్తి పిలుపు విని పరుగున వచ్చి ఈశ్వర్ ప్రక్కన నిలబడింది. 

"దీపూ.. ! నీవు మీ నాన్నతో వెళతావా?" అడిగాడు ఈశ్వర్. 







"వెళ్ళను"






[b][b]"ఏయ్!.. నీవు వచ్చేదేంటే!.. " ఆమె చేతిని పట్టుకోవాలని ప్రజాపతి ముందుకు అడుగువేశాడు. ప్రజాపతి చేతిని విదిలించి తన చేతిని వెనక్కు తీసుకొంది దీప్తి. [/b][/b]
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 18 - by k3vv3 - 16-04-2025, 12:43 PM



Users browsing this thread: 1 Guest(s)