Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 19

ప్రజాపతి సెల్ మ్రోగింది. చేతికి తీసుకొని చూచాడు. ఫోన్ చేసింది పరంజ్యోతి. అతని గుండె వేగం పెరిగింది. 



"ప్రజా!.. రేపు వుదయం పదిన్నరకల్లా మేము మీ ఇంటికి వస్తున్నాము. నా కోడలిని చూచేదానికి" నవ్వుతూ చెప్పాడు పరంజ్యోతి. 



ప్రజాపతి తలపై పిడుగు పడినట్లయింది. వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. బిత్తర చూపులతో గదినంతా కలయచూచాడు. పరంజ్యోతికి విషయం తెలిస్తే ఏమంటాడో అనే భయం
వీడికి నిజం చెప్పినా సమస్యే.. అబద్ధం చెప్పినా సమస్యే ఏం చేయాలి! ఏం చేయాలి! అనుకొన్నాడు. 



"ఏరా మాట్లాడవు?" పరంజ్యోతి పలకరింపు. 



"ఆఁ.. " ఆందోళనతో అప్రయత్నంగా అన్నాడు ప్రజాపతి. "ఏరా!.. మందు మైకంలో వున్నావా!.. నేను చెప్పింది అర్థం అయిందా లేదా!"



"అయిందిరా!.. " ఆవేదనగా చెప్పాడు ప్రజాపతి. 



"దీప్తి లేచిపోయిందిరా!" గద్గద స్వరంతో చెప్పాడు ప్రజాపతి. 



"లేచిపోయిందా!" ఆశ్చర్యపోయాడు పరంజ్యోతి. 



"ఎవరితో?"



" ఈశ్వర్ గాడితో!"



"ఎప్పుడు?"



"గంటముందు"



"నీవు ఆపలేదా?"



పరంజ్యోతి ప్రశ్నకు జవాబు చెప్పలేక ప్రజాపతి మౌనంగా వుండిపోయాడు. 
"నీవు ఇంత పనికిమాలిన వాడివని నేను వూహించలేదురా!.. కన్నకూతుర్ని కంట్రోల్లో పెట్టుకోలేని నీవు మనిషివారా!.. ఛీ.. నీదీ ఒక బ్రతుకేనా!" సెల్ కట్ చేశాడు పరంజ్యోతి. 



ఆవేశం, కోపం, అవమానాలతో వణికిపోతున్న ప్రజాపతి విస్కీ బాటిల్ను చేతికి తీసుకొని త్రాగసాగాడు. 



రాత్రి ఎనిమిదిన్నర నుండి పదిగంటల వరకూ ప్రణవి కాలుకాలిన పిల్లిలా మిద్దె మెట్లు ఎక్కి దిగి.. ఎక్కి దిగి భర్తతో మాట్లాడాలని ప్రయత్నించింది. గదిలో తాగిపడి ఉన్న ప్రజాపతికి ఆమె హృదయ వేదన ఎలా అర్థం అవుతుంది?



తొమ్మిది గంటల ప్రాంతంలో లావణ్యకు ఫోన్ చేసి దీప్తిని జాగ్రత్తగా చూచుకొనవలసిందిగా వేడుకొంది. 



"వదినా!.. నీవు నిర్భయంగా వుండు. క్షణంలో దీపు ఈశ్వర్తో నా ఇంట కాలు పెట్టిందో.. క్షణం నుంచి అది నా బిడ్డ" ఎంతో అభిమానంతో చెప్పింది లావణ్య. 



పదిగంటల ప్రాంతంలో కొడుకు సీతాపతికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. అతను "అమ్మా! బాధపడకు. అక్కను ఇంటివారంతా బాగా చూచుకొంటారు. అక్కడ ఆమె ఆనందంగా ఉంటుంది. వేరే కాల్ ఏదో వస్తూ వుందమ్మా. నీవు ఇక పడుకో!" ప్రీతిగా చెప్పి సీతాపతి కాల్ కట్ చేశాడు. 
మనోవేదనతో ఏడ్చి ఏడ్చి రాత్రి ఒంటిగంట ప్రాంతంలో నిద్రపోయింది ప్రణవి. 



మరుదినం ఉదయం ఆరుగంటలకు లేచి స్నానం చేసి.. తాను నిత్యం చేసే పూజను చేసి తండ్రి జగత్ రక్షకా! నా బిడ్డను చల్లగా చూచి కాపాడు. ఆమెకు నా భర్త వలన ఎలాంటి కష్టాలు కలుగనివ్వకు దీనంగా వేడుకొంది. 



పదిగంటలకు క్రిందికి వచ్చిన ప్రజాపతి. 
"ప్రణవీ!.. " పిలిచాడు. 
భయంతో అతన్ని సమీపించింది. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 18 - by k3vv3 - 16-04-2025, 12:41 PM



Users browsing this thread: 1 Guest(s)