Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#82
పాండవుల సేనాధిపతులలో ఒకడిగా వ్యవహరిస్తాడు. యుద్ధంలో కౌరవుల వీరులను అనేకులను సంహరిస్తాడు. కృపాచార్యుని ఓడిస్తాడు. శిఖండి అశ్వద్ధామతో యుద్ధంలో తలపడినప్పుడు ఇద్దరూ సమాన స్థాయిలో యుద్ధం చేస్తారు. ఇద్దరూ గాయపడతారు. 



కౌరవుల పక్షాన సర్వసైన్యాధ్యక్షుడై సమరం సలుపు తున్నప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో "సుయోధనా! యుద్ధంలో నా వలన నీకు మేలు జరగాలంటే యుద్ధం భూమిలో శిఖండి నాకు ఎదురు పడకుండా చూడండి. నేను ఆడవారితోను, మధ్యలో పురుషత్వం సంక్రమించిన వారితోనూ యుద్ధం చేయను. నేను వారిని చూడగానే అస్త్ర సన్యాసం చేస్తాను. శిఖండి అంగనాపూర్వుడు. కాబట్టి జాగ్రత్త పడండి. " అని చెబుతాడు.
భీష్ముడి మరణ రహస్యం భీష్ముడి ద్వారా తెలుసుకున్న పాండవులు యుద్ధం పదవరోజున భీష్ముడు అర్జునుడు ద్వంద్వ యుద్ధానికి దిగగా వారి మధ్యకు శిఖండి వచ్చి భీష్ముడిని ఎదుర్కుంటాడు. శిఖండిని చూడగానే భీష్ముడు అస్త్ర సన్యాసం చేశాడు. శిఖండి భీష్ముడి మీదకు తొలి బాణం ప్రయోగించాడు. తరువాత అర్జునుడు భీష్మునిపై అనేక బాణాలను శరపరంపరగా సంధించాడు. శరాఘాతాలకు భీష్ముడు నేలకు ఒరిగాడు. భీష్ముడు నేలపై పడకుండా అర్జునుడు శరములతో అంపశయ్య అమర్చుతాడు. అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం వరకు విశ్రాంతి తీసుకుని ఉత్తమ లోకాలకు వెళ్లిపోతాడు భీష్మ పితామహుడు. శిఖండి భీష్ముడిని సంహరిస్తానన్న శపథం నెరవేరింది. 



పద్దెనిమిదవ రోజు కౌరవుల పక్షాన అందరూ చనిపోయి అశ్వద్ధామ, కృతవర్మ, కృపాచార్యుడు మిగిలి ఉంటారు. రణభూమిలో, చీకటిలో, మృత కళేబరాల మధ్య దుర్యోధనుడు తోడలు విరిగి దీనావస్థలో పడి ఉండడం చూస్తారు ముగ్గురు. అశ్వద్ధామ సార్వభౌముడిని అట్లా దీనస్థితిలో చూడగానే ఉద్వేగానికి గురై " రాజా ఏదైనా కోరిక ఉంటే చెప్పు నెరవేరుస్తాను. " అంటాడు స్థిరచిత్తుడై. 



"అశ్వద్ధామా! పంచ పాండవులను సంహరించడమే నా కోరిక, అశ్వత్థామా! నిన్ను సర్వ సైన్యాధిపతిని చేస్తున్నాను. వారిని సంహరించి నా కోరిక తీర్చు!" అంటాడు దుర్యోధనుడు మరణిస్తూ.. 
"ఎలాగైనా పాండవులను సంహరించి దుర్యోధనుడి చివరి కోరిక తీర్చాలి" అనుకుంటాడు అశ్వద్ధామ. కృతవర్మ కృపాచార్యులతో చర్చిస్తాడు. 



"ఈరాత్రి సమయంలో పాండవులు గాడ నిద్రలో ఉంటారు. ఇప్పుడైతే వధించడం సులువు అని తలచి అశ్వద్ధామ కృతవర్మను, కృపాచార్యుడిని వెంటబెట్టుకొని పాండవుల శిబిరాలలోకి ప్రవేశించి, నిద్రిస్తున్న ఉపపాండవులను పాండవులే అని భ్రమపడి వధిస్తాడు. ప్రక్కనే ఉన్న దృష్టద్యుమ్నుడిని కూడా సంహరిస్తాడు. అదే శిబిరంలో నిద్రిస్తున్న శిఖండి అలికిడికి మేల్కొని ఆయుధం అందుకొని అశ్వద్ధామను ఎదుర్కొంటాడు. ఏమి జరుగుతుందో తెలియని అయోమయంలో ఉండడం వలన అశ్వద్ధామ ఖడ్గానికి బలై మరణిస్తాడు శిఖండి. 



 శిఖండి మరణించడంతో అతని లోని పురుషత్వం తొలగి, స్థూలకర్ణుడిని చేరుతుంది. 
***
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - జ్ఞానము నీవే వారాహీ - by k3vv3 - 15-04-2025, 01:47 PM



Users browsing this thread: