Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#81
ఆమె అక్కడ నుంచి నిష్క్రమించి తన తాత అయిన హోత్రవాహన రాజర్షి చెంతకు చేరింది. తనకు భీష్ముడి వల్ల జరిగిన అన్యాయం గురించి చెప్పింది. హోత్రవాహనుడు తన మనుమరాలికు జరిగిన అన్యాయానికి ఉగ్రుడై, తపోశక్తితో ఒక గులాబీమాలను సృష్టించి, అంబకు ఇచ్చి "అంబా! ఈమాల ఎవడు మెడలో ధరిస్తాడో, వాడి చేతిలో భీష్ముడు మరణిస్తాడు. కావున నీవు ఎవరైనా వీరుడి మెడలో వేసి యుద్ధానికి పురిగొల్పు. విజయం నీదే!" అని దీవించి పంపాడు హోత్రవాహనుడు. 



మాలను గైకొన్న అంబ దేశదేశాల రాజులను కలిసి విషయాన్ని వివరించి ఈమాలను ధరించి భీష్ముడిని సంహరించమని అర్థించింది. అందులకు రాజు సాహసించక నిరాకరించారు. చివరకు ద్రుపద మహారాజును వేడుకుంది. 



"జగదేకవీరుడైన భీష్ముడితో యుద్ధంలో గెలువడం అసాధ్యం" అని చెప్పి అంబను పంపి వేశాడు. 



అంబ నిరాశ చెంది గులాబీ మాలను కోట గుమ్మానికి తగిలించి అడవులకు వెళ్ళిపోయింది. అక్కడ భీష్ముడిని వధించడం కోసం ఈశ్వరుడిని గూర్చి తపస్సు చేసింది.



 ఈశ్వరుడు ప్రత్యక్షమై "భీష్ముడిని సంహరించడం జన్మలో నీ వలన సాధ్యపడదు. వచ్చే జన్మలో శిఖండిగా పుట్టి నీ కోరిక నెరవేర్చుకుంటావు. " అని చెప్పి అంతర్ధానమైనాడు. ఆనంతరం అంబ చితి పేర్చుకుని ఆత్మాహుతి చేసుకుంది. 



అటు కొంత కాలానికి ద్రుపదుడు తనకు సంతానం లేని కారణంగా బిడ్డల కోసం ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై " ద్రుపదా! నీ భార్యకు తొలి కాన్పులో ఆడబిడ్డ పుడుతుంది. ఆడబిడ్డను మగబిడ్డగా పెంచు. కాలక్రమంలో నీ రాకుమార్తెకు పురుషత్వం సంక్రమిస్తుంది. కావున సకల విద్యలు నేర్పు. వీరుడిగా తీర్చిదిద్దు. మరికొంత కాలానికి నీకు ఒక మగ బిడ్డ, ఒక ఆడబిడ్డ పుడుతారు. " 
వరమిచ్చాడు శివుడు. 



అచిరకాలంలోనే ఆడబిడ్డ జన్మించింది. శిఖండి అని పేరు పెట్టి, మగ దుస్తులు వేసి పెంచాడు. ద్రోణుడి దగ్గరకు పంపి సమస్త విద్యలు నేర్పించాడు. శస్త్రాస్త్రాలు అధ్యయనం చేయించాడు. వీరాధివీరుడిగా మలిచాడు. ఒకనాడు శిఖండి కోట గుమ్మానికి వ్రేలాడుతున్న గులాబీమాలను మెడలో వేసుకొనగా ద్రుపదుడు చూసి తీవ్రంగా మందలిస్తాడు. 



శిఖండికి యుక్త వయసు రాగానే, పురుషుడిగా మారక మునుపే దశార్ణ దేశపు రాజు హేమవర్మ కుమార్తె యువరాణితో వివాహం జరిపించాడు. ఆనాటి రాత్రి శోభన సమయంలో యువరాణి శిఖండి స్త్రీ అని గుర్తించి, కోపంతో బాధతో తండ్రి దగ్గరకు పోతుంది. తండ్రి, జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యంతో యుద్ధానికి బయలుదేరుతాడు. 



శిఖండి ఏమి చేయడానికి పాలుపోక చింతాక్రాంతయై  అడవిలోకి పోయింది. అడవిలో స్థూలకర్ణుడనే యక్షుడు చాల కాలంగా అక్కడే నివాసం ఉంటున్నాడు. స్థూలకర్ణుడికి భయపడి సమీపములోకి ఎవరు పోరు. యక్షుడు ఏమైనా చేయనీ అని యక్షుని ఆశ్రమ సమీపంలోనికి పోతుంది శిఖండి. 



స్థూలకర్ణుడు శిఖండిని చూసి " కుమారి! నీకు భయం లేదా? ఇక్కడిదాకా వచ్చావు " అడుగుతాడు. 



శిఖండి "చావడానికే వచ్చాను" అంటూ తాను ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదీ.. తన కథనంతా చెబుతుంది. శిఖండిపై జాలిపడి స్థూలకర్ణుడు "నా పురుషత్వాన్ని పది రోజుల పాటు నీకు ఇస్తాను. నీ స్త్రీత్వం నాకు ఇవ్వు. సమస్యలన్నీ పరిష్కరించుకున్నాక తిరిగి వచ్చి నా పురుషత్వం నాకు ఇచ్చి నీ స్త్రీత్వం నీవు తీసుకో" అంటాడు. 



అందులకు శిఖండి అంగీకరించి కృతజ్ఞతలు తెలుపుకొని పురుషత్వాన్ని పొంది కోటకు పోతుంది. తనకు పురుషత్వం ప్రాప్తించిన విషయం తల్లిదండ్రులకు తెలుపుతుంది. వారు మహానందపడతారు. 



తన కూతురికి అన్యాయం జరిగిందన్న ఆవేశంతో, ససైన్యంతో ద్రుపదుడిపై దండెత్తి వస్తున్న దశార్ణ దేశ ప్రభువైన హేమవర్మకు ఎదురేగి స్వాగతం పలుకుతాడు శిఖండి. ఉగ్రుడైన హేమవర్మకు తన పురుషత్వాన్ని నిరూపించుకుంటాడు శిఖండి. 



హేమవర్మ "తన తొందరపాటు చర్యకు క్షమించమ" ని ద్రుపదుణ్ణి , శిఖండిని కోరుతాడు. హేమవర్మకు, అతని సైన్యానికి వారం రోజుల పాటు గానాభజాలతో ఆతిథ్యమిచ్చి సంతృప్తిగా పంపుతాడు ద్రుపదుడు. 



కుబేరుడు స్థూలకర్ణుడు ఉన్న అడవి గుండా పుష్పవిమానములో పోతూ స్థూలకర్ణుడి ఆశ్రమంలో దిగి స్థూలకర్ణుడిని పిలుస్తాడు. స్థూలకర్ణుడు స్త్రీరూపం నందు ఉన్నందున సిగ్గుతో ఇంటి బయటికి రాలేడు. తన సహచరుడిని పంపి స్థూలకర్ణుడిని బయటికి రప్పించాడు కుబేరుడు. స్థూలకర్ణుడు స్త్రీరూపంలో ఉండడం చూసి కోపించి "ఇక నుండి స్త్రీగానే ఉండు" అని శపించాడు. 



స్థూలకర్ణుడు కుబేరుడి పాదాలపై బడి వేడుకొనగా "స్థూలకర్ణా! ఇది దైవ సంకల్పంతో జరిగినది. ద్రుపదుడు కుమారుడి కోసం ఈశ్వరుని గూర్చి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై "ద్రుపదా! కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు కాలక్రమంలో పురుషత్వం సంక్రమిస్తుంది అని వరమిచ్చాడు. అది నీ వలన జరిగింది. కావున ఇలా జరగడం దైవ సంకల్పం. శిఖండి మరణించగానే నీ పురుషత్వం నీకు వస్తుంది" అని తెలిపి కుబేరుడు అక్కడ నుండి వెళ్లిపోయాడు. 

పది దినముల తరువాత శిఖండి స్థూలకర్ణుడి దగ్గరకు వచ్చి "మహాత్మా! నీ పురుషత్వం తీసుకుని నా స్త్రీత్వం నాకు ఇవ్వు. నీ సహాయానికి కృతజ్ఞుడను మహానుభావా!" అంటాడు. 


స్థూలకర్ణుడు శిఖండికి జరిగిందంతా చెప్పి " నా పురుషత్వం జీవితాంతం నీవే ఉంచుకో" అంటాడు. శిఖండి అందులకు సంతషించి మహానందంతో స్వగృహానికి పోతాడు. 


కాలాంతరంలో ద్రుపదునికి ఒక కుమారుడు దృష్టద్యుమ్నుడు, ఒక కుమార్తె ద్రౌపది జన్మిస్తారు. కాలక్రమంలో ద్రౌపది పాండవులను పెళ్లాడుతుంది. దృష్టద్యుమ్నుడు కురుక్షేత్రం యుద్ధంలో పాండవ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడై యుద్ధభూమిలో సైన్యాన్ని నడుపుతాడు. 

కౌరవ పాండవులకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో శిఖండి పాల్గొని పాండవుల పక్షాన యుద్ధం చేస్తాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - జ్ఞానము నీవే వారాహీ - by k3vv3 - 15-04-2025, 01:45 PM



Users browsing this thread: 1 Guest(s)